Sunday, March 19, 2017

సంధుల విఙ్ఞానము.,15..అపదాది స్వర సంధి

5.అపదాది స్వర సంధి

"అంద్వవగాగమంబులందప్ప నపదాది స్వరంబు పరమగునప్పుడచ్చునకు సంధి యగు"

(అందు+అవక్+ ఆగమంబులు  .,అంద్వాగమంబులు)

పదము కానిది అపదము.,దానిలో నున్నఅచ్చు ఆదిస్వరము అది "అపదాదిస్వరము"
అందు అవక్ వంటి ఆగమాలు తప్పించి మిగిలిన పదాలుకాని ఆజాది ఆగమాలు ప్రత్యయాలు గాని పూర్వపదమందలి అచ్చుకు పరమైతే సంధి నిత్యముగా జరుగుతుంది.
అందు..,అవక్  వంటి పదాలు పరమైతే యధాసంభవాలుగా అంటే సంధి జరిగితే సంధి రూపము...సంధి జరగని యెడల యడాగమము వస్తుందని అర్ధము.

అంద్వాగమంబులు తప్పించి మిగిలిన పదాలకుదాహరణ
మూర+ఎడు...మూరెడు(అ+ఎ..,ఎ)
వీసె+ఎడు....వీసెడు  (ఎ+ఎ..,ఎ)
అర్ధ+ఇంచు..,అర్ధించు(అ+ఇ.,ఇ)
నిర్జి+ఇంచు...నిర్జించు(ఇ+ఇ.,,ఇ)
పై ఉదాహరణలయందు..సంధి నిత్యముగా జరిగి పరస్వరం ఆదేశమైనది.

అంద్వాగమంబులు  అయితే యథాసంభవాలు..సంధి జరగవచ్చు లేదా  యడాగమము రా వచ్చు
ఉదాహరణలు
1.రాముల+అందు...రాములందు(అ+అ,,అ)  అకార సంధి
రాములయందు....(అ+అ..య్) యడాగమమొచ్చిన రూపము

2.హరి+అందు.,హరియందు...సంధి లేదు  యడాగమమే అవశ్యం
3.తొమ్మిది+అవది..తొమ్మిదవది..(ఇ+అ,.అ)ఇకార సంధి
తొమ్మిదియవది,.,,యడాగమము వచ్చిన రూపము.

6.ద్విరుక్తటకారసంధి.

కుఱు..చిఱు...కడు...నిడు.,.నడు...శబ్దములందలి   ఱ..,డ  లకు అచ్చు పరమగునప్పుడు  ద్విరుక్త టకారంబగు

ఱ..డ   లు అనగా   బండిరాకు(శకటరేఫకు) డకారానికని అర్ధము.
ద్విరుక్త టకారమనగా  రెండుసార్లు చెప్పబడిన  టకారమని  అనగా "ట్ట"  అని అర్ధం.
కుఱు..చిఱు  అనే శబ్దాలలోని" ఱ"  (శకటరేఫ)కు కడు,,,నడు...నిడు,..శబ్దాలలోని డకారమునకు  గాని అచ్చు పరమగునప్పుడు ద్విరుక్త టకారం  (ట్ట) ఆదేశంగా వస్తుందని సూత్రార్ధము.
కుఱు+ఉసురు..,కుట్టుసురు (ఱ్+ఉ+ఉ..ట్ట్+ఉ,.ట్టు)
చిఱు+అడవి.....చిట్టడవి..(ఱ్+ఉ+అ...ట్ట్+అ...ట్ట)
కడు+ఎదురు...కట్టెదురు..(డ్+ఉ+ఎ...ట్ట్+ఎ..ట్టె)
నడు+అడవి...నట్టడవి...(డ్+ఉ+అ..,ట్ట్+అ...ట్ట)
నిడు+ఊర్పు...నిట్టూర్పు..(డ్+ఉ+ఊ...ట్ట+ఊ...ట్టూ)

పై ఉదాహరణలు గమనించినచో  ద్విరుక్త టకారము ఆదేశమైనపిమ్మట  నిత్యసంధి అయిన ఉకార సంధి ప్రతిచోట జరిగినది,,మిత్రులు గమనించ గలరు

అయితే ఈ సంధిని ఫ్రౌఢ వ్యాకరణం.."చిఱు"  అనే పదానికి బదులుగా  "చిట్టి "  అనే పదాన్ని తీసుకున్నది

చిట్టి+అడవి  చిట్టడవి,,,ఇకార సంధి
చిట్టి+ఆముదము...చిట్టాముదము
చిట్టి+ ఉడుకు..చిట్టుడుకు

కాని.,సాదారణముగా ద్విరుక్తటకార సంధికి  బాలవ్యాకరణాన్నే ప్రామాణికంగా తీసుకుంటారందరు..కుఱు చిఱు నడు నిడు సూత్రమే మిగిలిపోయింది.
ఏలననగా
చిట్టి+చాప ..చిట్టిచాప...చిటిచాప
చిట్టి+పాప  చిట్టిపాప    చిటిపాప
చిట్టి+తాళము..చిట్టితాళము...చిటితాళము  అనేరూపాలున్నాయి..హల్లుపరమైనప్పుడు  ద్విరుక్త టకారములోని ఒక ట లోపించినది....అదీ  బాల వ్యాకరణములోని "అక్కడాదులజడ్డకు లోపంబు బహుళంబుగానగు"  అనే సూత్రము వలననే సిద్దిస్తుంది.

అయితే  మనమిక్కడ గమనించ వలసిన ముఖ్యాంశమొకటున్నది..
కుఱు...,చిరు ...నడు.,,నిడు  అనే పదాలున్నాయా? లేవు కదా? కడు   అనే పదమున్నది వాటి పూర్తి రూపాలిలా ఉంటాయి
"కుఱుచ" బుద్ధి ..."చిఱుత" ప్రాయము...."నడుము"సన్నన
"నిడుద"(పొడవు)మిక్కిలి ...."కడు"సామార్ధ్యము
ఇవి అసలు శబ్దాలు   వీటిని సమానం చేసే సమయంలో ఒక్క కడ శబ్దానికి తప్ప మిగిలిన వాటికి అంత్య వర్ణం లోపిస్తుంది.అలా లోపించిన వాటినే మనం తీసుకుంటాము
అవే  కఱు..చిఱు  నడు..నిడు.....శబ్దాలు .

సశేషం   రేపుకలుద్దామా..... 
సంధుల విఙ్ఞానము.,14  ఇకార సంధి(మరికొన్ని రూపాలు)

c)"మద్యమ పురుష క్రియలయం దిత్తునకు సంధి యగు"
నీవు..,మీరు  అనేవి మద్మ పురుష వాచకాలు..కావున ఈ పురుషలలో ఉండే క్రియలు  మద్యమ పురుష క్రియలు

మద్యమ పురుషార్ధములో క్రియాపదమందిలి ఇత్తునకు(హ్రస్వ ఇకారమునకు అచ్చులు పరమయితే సంధి నిత్యముగా జరుగునని సూత్రార్ధము....,,
మనమిక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి  ఏమంటే
క్రియా పదాల హ్రస్వ ఇకారానికి సంధి "వైకల్పికం"గా వస్తుంది   కాని
మద్యమ పురుష క్రియా పదములందుదిత్తునకు సంధి "నిత్యము"
(దయచేసి తేడా గమనించగలరు)

చదివితివి+అప్పుడు(ఇ+అ--అ)...చదివితివప్పుడు
చూచితివి +ఇపుడు(ఇ+ఇ--ఇ)...చూచితివిపుడు
పోయితిరి+ఎపుడు(ఇ+ఎ--ఎ)..,పోయితిరెపుడు

"నీవు" చదివితివప్పుడు..."మీరు" పోయితిరెప్పుడు
ఇవన్నీ మద్యమ పురుష క్రియలు..

d)క్త్వార్ధంబున ఇత్తునకు సంధి లేదు

క్త్వార్ధము..అనగా భూతకాల అసమాపక క్రియ

క్త్వార్ధాన్ని ఇచ్చే క్రియా పదము చివర హ్రస్వమైన ఇకారము ఉండగా అచ్చు పరమైనచో సంధి జరుగదు అని  సూత్రార్ధము..
సంధి జరుగనిచో  యడాగమము..వచ్చును

వచ్చి+ఇచ్చెను... వచ్చియిచ్చెను.,  ఇ+ఇ సంధి లేదు  కావున యడాగమము.
"వచ్చి"..ఈ పదము  భూతకాల అసమాపక క్రియ  కావున సంధిలేదు..సంధి లేనిచోట స్వరంబుకంటె పరంబైన స్వరంబునకు యడాగమంబగు...ఈ సూత్రముచే  యడాగమము వచ్చి
వచ్చి+య్+ఇచ్చెను....వచ్చియిచ్చెను అయినది

e)" ఇఁకాదులకు దప్ప ద్రుతప్రకృతికములకు సంధి లేదు"

(ద్రుత ప్రకృతికం---నకారము చివరగల పదము)
ఇఁక.,,ఇఁగ...,ఎట్టకేలకు...,ఎట్టకేని,, ఇలాంటి వాటిని  ఇకాదులంటారు...వీటికి సంధి వైకల్పికము..మిగిలిన వాటికి  సంధిలేదు.
ప్రధమేతర అనే సూత్రములో చెప్పబడిన ద్రుత ప్రకృతికాలకు..ఇకాదులలోని ద్రుతప్రకృతికాలకు తప్పించి మిగిలిన ద్రుతప్రకృతికాలకు సంధి లేదని సూత్రార్ధము.
ఈ క్రింది ఉదాహరణలు  ఇఁకాదులు కాదు  ..కావున వీటిలోని ద్రుతానికి అచ్చు పరమైతే  లోపం రాక సంధిలేక పర అచ్చులో సంయోగమౌతాయి.

వచ్చున్+ఇప్పుడు..వచ్చునిప్పుడు..
చూడన్+అయితి.,చూడనయితి
ఉండెడిన్+అతడు..ఉఆడెడినతడు...

,ఈ మూడు ఉదా....లోకూడాసంధిలేదు  ద్రుతం పరచ్చులో కలసిపోయింది.
కావున,,ఇఁకాదులలోని ద్రుతమునకు అచ్చు పరమైనచో సంధి వికల్పము
1.ఇఁకన్+ఏమిటి.,,,ఇఁకేమిటి....(సంధి జరిగిన రూపము)
ఇఁకనేమిటి ... (ద్రుతం పరఅచ్చులో సంయోగము చెందినది)
2.ఎట్టకేలకున్+అయినది.,ఎట్టకేలకైనది(సంధి జరిగిన రూపము)
ఎట్టకేలకునయినది(ద్రుతం పరఅచ్చులో సంయోగము చెందినది)
3.ఎట్టకేనికిన్+ఇది..,ఎట్టకేనికిది(సంధి జరిగిన రూపము)
ఎట్టకేనికినిది...(ద్రుతం పరఅచ్చులో సంయోగము చెందినది)

సశేషం...రేపు కలుద్దామా?


సంధుల విఙ్ఞానము.,13. ఇకార సంధి..15/3/17

4..ఇకార సంధి

A)సూత్రము:-"ఏమ్యాదుల యిత్తునకు సంధి వైకల్పికముగానగు"

ఏమి..మఱి..కి(.షష్టీ విభక్తి)..అది..అవి.,ఇది,,ఇవి.,ఏది.,ఏవి..అనేవి ఏమ్యాదులు
"ఇత్తు " అనగా  హ్రస్వమైన ఇకారము
"వైకల్పికము"  అనగా  ఒకసారి సంధి జరుగుట ఒకసారి సంధి జరుగక పోవుట

ఏమి మొదలైన పదాల చివర నున్న హ్రస్వ ఇకారమునకు అచ్చులు పరమైనచో సంధి వికల్పముగా జరుగునని సూత్రార్ధము..సంధి జరుగని యెడల యడాగమము వస్తుంది కదా.
ఏమి+అంటివి
ఏమంటివి....(ఇ+అ---అ) సంధి జరిగిన రూపము
ఏమియంటివి..(ఇ+అ..య)  సంధి లేమి యడాగమము

మఱి+ఏమి.,,మఱేమి(ఇ+ఏ--ఏ)  సంధి జరిగిన రూపము.
మఱి+ఏమి,,మఱియేమి  (ఇ+ఎ--యే) సంధి లేమి యడాగమము

హరికిన్+ఇచ్చె
హరికిచ్చె..(కిన్+ఇ---ఇ)   సంధి జరిగిన రూపము(సంధిలో ద్రతము జారిపోయినది
హరికినిచ్చె..(న్+ఇ,,,ని)  సంధి జరుగక ద్రుతం సంయోగము

సంధి జరుగక  యడాగమము రాదు ఎందువలననగా ద్రుతం పొల్లుహల్లు కావున అచ్చుతో సంయోగము చెంది  "హరికినిచ్చె" అయినది.

B) సూత్రము:- "క్రియా పదంబులందిత్తునకు సంధి వైకల్పికముగానగు" ("క్రియ " అనగా చేసే పనిని గూర్చి తెలియ జేయు పదము )
క్రియా పదాలు హ్రస్వమైన ఇకారాంతములై వాటికి అచ్చులు పరం అయితే  సంధి వైకల్పికంగా వస్తుంది  అని సూత్రార్ధం.

వచ్చిరి+అప్పుడు
వచ్చిరప్పుడు...,,(&ఇ+అ..అ)..సంధి జరిగినది
వచ్చిరియప్పుడు.,సంధిలేక  యడాగమము వచ్చినది

వచ్చితిమి+ఇప్పుడు
వచ్చితిమిప్పుడు  (ఇ+ఇ.,ఇ  )..సంధి జరిగినది
వచ్చితిమియిప్పుడు (ఇ+ఇ--య )  సంధిలేక  యడాగమము వచ్చినది
అయితే ఈ ఇకార సంధి ప్రధమ పురుష, ఉత్తమ పురుష క్రియా పదాలలో మాత్రమే వస్తుంది.
(వాడు,,, అది..వారు  ప్రదము పురుష
నేను   .,మేము...మనము..,ఉత్తమ పురుష)

వచ్చిరి+అప్పుడ..వచ్చిరప్పుడు  "వచ్చిరి"  క్రియా పదము
"క్రియా పదంబులందిత్తునకు సంధి వైకల్పికముగానగు" ఈ సూత్రముతో సంధి జరిగినది

వచ్చిర్+అప్పుడు.,వచ్చిరప్పుడు(ర్+అ..ర) సంధి లేదు  (పొల్లు హల్లు అయిన ర్  లో అ  సంయోగము చెంది "ర" అయినది)

వచ్చిరి+అప్పుడు.,వచ్చిరి+య్+అప్పుడు.,,వచ్చిరియప్పుడు  యడాగమము వచ్చిన రూపము
***********************************************--*******
(** వసరమొచ్చింది కావున "పురుష వాచకాలు"(persons)అనగా నేవో   చూద్దాము---"పురుషలు  మూడు రకాలు
"నామ యుష్మదస్మదర్ధములందుం బ్రదమ మద్యమోత్తమంబులగు"
నామార్ధములో.,,.ప్రధమ పరుష క్రియ.,ఎక్కడో ఉన్న వారి గురించి
యుష్మదర్ధంలో...మద్యమ పురుష క్రియ..ఎదురుగా ఉన్న వారిని గురించి
అస్మదర్ధంలో...,ఉత్తమ పురుష క్రియ..తనను గురించి  తెలియచేస్తుంది
వాడు..,అది...వారు......ప్రధమ పురుష
నీవు..,మిరు..,,,,.మద్యమ పురుష
నేను  మేము   మనము....ఉత్తమ పురుష
"తానుత్తమ..ఎదుట మద్యమ...ఎక్కడో  ప్రధమ"
******************************************************-**
ఇకార సంధి రూపాలు మరికొన్ని రేపు ముచ్చటించుకుందాము

సశేషం...రేపు కలుద్దామా?





సంధుల విఙ్ఞానము.,12,అకారసంధి విశేషాలు..14/3/17

అకారసంధి(అత్వసంధి)లోమరికొన్ని విశేషాలు గమనిద్దాము

A)"బహుళ గ్రహణము చేత స్త్రీ వాచక తత్సమ సంబోధనాంతంబులకు సంధి లేదు"
బహుళము  అనే పదము వాడుట వలన "స్త్రీలను" అనే బహువచన రూపముతోననియు,తత్సమ శబ్దాలకు సంబోధన చివరగా గల శబ్దాల యందలి అచ్చులకు అచ్చులు పరమైతే సంధి జరగదు అని అర్ధం  సంధి జరుగనిచో  యడాగమం వస్తుంది కదా.

(తత్సమ శబ్దమనగా సంస్కృత శబ్దము కాదు కాని సంస్కృత శబ్దము వంటి  శబ్దమని అర్ధము)

ఉదా.,,
అమ్మ+ఇచ్చెను.,అమ్మయిచ్చెను (స్త్రీ వాచకమగుటవలన సంధి లేదు.యడాగమమొచ్చినది)

దూత+ఇతడు,,దూతయితడు  (తత్సమ శబ్దమగుటవలన సంధి లేదు.యడాగమమొచ్చినది)

చెలువుడ+ఉందము..చెలువుడయిందము("చెలువుడ" సంబోధన శబ్దమగుటవలన సంధి లేదు.యడాగమమొచ్చినది)

వీటికి సంధి జరిగినచో...
మమ్మిచ్చెను..
దూతితడు
చెలువుడిందము  అనే దుష్టరూపపదాలొస్తాయి.

B)వెలయాల్వాదుల సంధి లేమి బహుళంబుగానగు

వెల+ఆలు.,...,,అకారసంధి జరగాలి కాని బహుళముగా అకారసంధి జరుగునని చెప్పినందున బహుళములో సంధి రాకపోవటం కూడా భాగమైనందున సంధిలేక యడాగమమొచ్చి

వెల+య్+ఆలు...వెలయాలు  అయినది...

ఓకవేళ సంధి జరిగితే "వెలాలు" అనెడి అనిష్ట రూపం వస్తుంది

C)శ్రేష్టతా వాచకంబులగు "నార్యాంబాద్యర్ధక" శబ్దంబుల పరంబులగుచో ఆన్ని యచ్చులకు సంధి నిత్యము
(ఆర్య+అంబ+ఆది+అర్ధక...ఆర్యాంబాద్యర్ధక)

ఈ  సూత్రము నిత్యవిధిని తెలియజేయుచున్నది.అట్లు తెలియజేయకున్నచో  బహుళమో  వికల్పమో వచ్చినచో
రామ+అయ్య.,,రామయ్య....రామయయ్య  అనే రెండు రూపాలుగా  అవుతుంది

శ్రేష్టతా వాచకాలు:-గొప్పను సూచించే శబ్దాలు..,
శ్రేష్టత్వాన్ని సూచించే  ఆర్య అంబ  మున్నగు శబ్దాలు  అన్ని అచ్చులకు పరమైన సంధి నిత్యముగా జరుగునని అర్థము .

రామ+అయ్య..,రామయ్య(అ+అ)   అకారసంధి నిత్యము

సోమి+అయ్య.,సోమయ్య(ఇ+అ)ఇకారసంధి నిత్యము

సీత+అమ్మ.,,,.,సీతమ్మ   (అ+అ)   అకారసంధి నిత్యము

లక్ష్మి+అమ్మ...లక్ష్మమ్మ   (ఇ+అ)ఇకారసంధి నిత్యము

**ఆది శబ్దములగు అన్న,, అక్క,,,అప్ప..పరమగునప్పుడు అకార  సంధి నిత్యము
రామ+అన్న..,,రామన్న

సీత+అక్క.,,సీతక్క

వెంక+అప్ప,,,వెంకప్ప

(పాల్గొనే మిత్రులందరకు నాదో చిన్న విన్నపము..,,చదివిన వారు ప్రతి ఒక్కరూ ఒక్కో సంధికి  ఒక ఉదాహరణ వ్రాయవలసినదిగా కోరుచున్నాను)

సశేషం...రేపు కలుద్దామా?

సంధుల విఙ్ఞానము..11  యడాగమ సంధి.అకార సంధి

2.యడాగమ సంధి

సూత్రం--"సంధిలేని చోట స్వరంబుకంటె పరంబైన స్వరంబునకు యడాగమంబగు"

సంధి రెండు అచ్చుల మద్య జరగని సందర్భములో (ఎలాంటి అచ్ సంధి అయినా ఆ రెండు పదాలలో ఉండే) అచ్చుల మద్య యట్ అనేది ఆగమంగా వచ్చి చేరుతుంది  "యట్" అనేది టిత్తు కనుక పరపదములోని మొదటి అచ్చుకు వచ్చి చేరుతుంది "యట్" అనే దానిలో "య్ " అనేది మాత్రమే మిగులుతుంది .ఆగమము అనగా ఒక అక్షరం అధికంగా  వచ్చి చేరటం .

ఉదాహరణ
మా+అమ్మ...మాయమ్మ...అకారసంధి జరగలేదు
మీ+ ఇల్లు  .,మీయిల్లు...ఇకార సంధి జరగలేదు
మా+ఊరు....మాయూరు   అకార సంధి జరగలేదు

వివరణ ...
మూడు ఉదాహరణలలోను పూర్వపదం చివర ఆ..,ఈ...ఆ అనే అచ్చులు ధీర్ఘములుగానున్నవి. అందువలన సంధి జరగలేదు.హ్రస్వ అకారమునకు మాత్రమే అకారసంధిలో అచ్చు పరమైతే సంధి జరుగుతుంది  ..సంధి జరగలేదుకావున యడాగమము వచ్చినది
యడాగమము రానిచో అర్ధాలు సరిగానుండవు
మమ్మ..మిల్లు..మూరు  అవుతాయి  ఇవి అర్ధరహితము కదా..
అకార..ఇకార..,ఉకార సంధులలో పూర్వ పదం చివర ధీర్ఘాచ్చులు ఉన్నయెడల సాదారణముగా సంధి జరగదు..హ్రస్వాచ్చులు ఉన్నా కొండొకచో సంధి జరగదు..యడాగమం రావటానికి  సంధి జరిగినదా లేదా అనేది గమనించ వలసిన విషయము.

3.అకార సంధి (అత్త్వసంధి)

సూత్రం...."అత్తునకు సంధి బహుళముగానగు"

"అత్తు" అనగా హ్రస్వ అకారము.,బహుళమనగా ఒకసారి సంధి జరగటం ఒకసారి సంధి జరగక పోవటం ఒకసారి విభాషగా సంధి జరగటం..ఒకసారి మరోరకముగా జరగటం
ఉదా..,,
మేన+అల్లుడు...మేనల్లుడు...సంధి జరిగిన రూపము
మేనయల్లుడు..,యడాగమము వచ్చిన రూపము

పుట్టిన+ఇల్లు .,,పుట్టినిల్లు  సంధి జరిగిన రూపము
పుట్టినయిల్లు..యడాగమము వచ్చిన రూపము

చూడక+ఉండెను..చూడకుండెను..సంధి జరిగిన రూపము
చూడకయుండెను...యడాగమము వచ్చిన రూపము
-------------------------------------------------------------------------------
అయితే  "చూడకుండెను"....."చూడక యుండెను" అనే రెండు పదములను గైకొని మనమిక్కడ కాసేపాగి గణముల గురించి ముచ్చటించు కుందాము...."
చూడకుం/డెను  ----- UIU/II ---ర గణము /లల  (లా)
చూడక /యుండెను-UII/UII..భ గణము/భ గణము

మాతయు /"చూడకుం/డెను"గ/ మన్నుతి/నంగను/వెన్నదొం/గ, నే
మాతయు/ నొర్చునా/సుతుడు/------/-------/--------/----

చోరుడు/మన్నుయున్/తినగ /"చూడక /యుండెను"/వెన్నదొం/గ, నే
మారిచి/మాతకున్/----------/--------/--------/------/---

పైన ఉదహరించిన ఉత్పలమాల పద్య పాదాలు రెండు గమనించినచో...

--------/"చూడకుం/డెను"గ /-------/------/-------/---
ర గణము మరియు రెండు లఘువులకు ఒక అక్షరం  చేర్చి  న గణము గాను(రెండు పదాల మద్యన సంధి కూర్చి)

------/--------/------/"చూడక/యుండెను"/------/---
రెండు భ గణాలుగా(రెండు పదాల మద్యన యడాగమము చేర్చి)      రెండు పద్య పాదాలలోను ఒకే అర్ధమున్న  పదాన్ని వాడుకోవటం జరిగినది

కవి మిత్రులకు పద్యరచనా సమయంలో  సంధుల విఙ్ఞానము ఏవిధంగా ఉపయోగపడునో తెలియ చేయుటకే పై ఉదాహరణలు చూపటం జరిగినది గమనించ గలరు.
----------------------------------------------------------------------------------

(పాల్గొనే మిత్రులందరకు నాదో చిన్న విన్నపము..,,చదివిన వారు ప్రతి ఒక్కరూ ఒక్కో సంధికి  ఒక ఉదాహరణ వ్రాయవలసినదిగా కోరుచున్నాను)

సశేషం.....రేపు కలుద్దామా?


సంధుల విఙ్ఞానము,,10  ఉకార సంధి(ఉత్వసంధి)

1.ఉకారసంధి(ఉత్వసంధి)
సూత్రము --"ఉత్తునకచ్చు పరమగునప్పుడు సంధియగు"
హ్రస్వమగు ఉకారానికి అచ్చు పరమైనప్పుడు అక్కడ సంధి జరుగుతుంది అని సూత్రార్ధము.

"ఉత్తు" అని తపకరణము  చేయుటవలన  హ్రస్వ " ఉ" కారము మాత్రమేనని  ధీర్ఘమైన "ఊ"  ఉండకూడదని భావింపవలయును.  అలాగే  పరపదమునందు అచ్చు అన్నప్పుడు..హ్రస్వ అచ్చైనా  లేదా ధీర్ఘ అచ్చైనా  ఉండ వచ్చు..
ఉదా...,
రాజు+అతడు....రాజతడ  (ఉ+అ=అ)
సోముడు+ఇతడు,,సోముడితడు  (ఉ+ఇ=ఇ)
మనము+ఉంటిమి,,మనముంటిమి (ఉ+ఉ=ఉ)
వాడు+ఎక్కడ ...,వాడెక్కడ..(ఉ+ఎ=ఎ)
ఇతడు+ ఒకడు.,,ఇతడొకడు  (ఉ+ఒ=ఒ
మనసు+ఐన..,మనసైన  ( ఉ+ఐ=ఐ)
సులభము+ ఔను  .,,సులభమౌను  (ఉ+ఔ=ఔ)

ఋ  అనే అక్షరాలు  ర...ల  అనే హల్లుల సమములని బాలవ్యాకరణం చెబుతున్నందున ఇవి పరాలగునప్పుడు సంది జరుగదు(ఉన్నవి ఉన్నటులే ఉఉండును)

అతడు+ఋషి...అతడుఋషి(సంధి జరుగలేదు యధాతధంగా ఉన్నది.)

A).ఉకార వికల్ప సంధి
సూత్రము..."ప్రథమేతర విభక్తి శత్రర్ధ చు వర్ణబులందున్న యు కారమునకు సంధి వైకల్పికముగానగు"

ప్రథమేతర విభక్తులనగా  ప్రథమా విభక్తి కాని ద్వితీయ తృతీయా మొదలైన విభక్తులు ..,ఇవి చాలా వరకు దృతంతాలు
శత్రర్ధ చువర్ణమనగా సంస్కృతం లో "శతృ" ప్రత్యయము వచ్చే చోట్ల  తెలుగులో  చు అనే వర్ణం వస్తుంది. వర్తమాన కాలములోని క్రియా విశేషణార్ధములో ధాతువుకు చు అనే అక్షరం  వస్తుంది .ఇది దృతాంతము  "చూచు" ధాతువు  చు వర్ణము చేరినందన "చూచుచు"...దృతాంతము కనుక  "చూచుచున్"..కావున
ప్రథమా విభక్తి కాక మిగిలిన విభక్తులలో పూర్వపదాంతములోని ఉకారమునకు శత్రర్ధములో వచ్చు  "చు" అనే అక్షరానికి పరపదములో అచ్చు పరమైనచో సంధి వికల్పంగా జరుగుతుంది అని సూత్రార్ధము.

(వికల్పము  లేదా వైకల్పికమనగా ఒకసారి చెప్పిన అంశము జరుగుట లేదా జరుగక పోవుట అని మనము ఇంతకు పూర్వమే తెలుసుకొనినాము)

ఉదాహరణలు

క్రింది ఉదాహరణలలో  ఉకారము మీద ఉన్న ద్రుతము అచ్చు పరమైనప్పుడు సంధి జరిగినచో లోపిస్తుంది అనియు,,సంధి జరుగని యెడల పరపదం అచ్చుతో కలసిపోతున్నదని మనం గ్రహించ వలెను

నన్నున్+అడిగె....నన్నడిగె,,(సంధి జరిగిన రూపం)
నన్నునడిగె(ద్వితీయా విభక్తి...ద్రుతం పర అచ్చుతో కలసింది)

నాకొరకున్+ఇచ్చె..నాకొరకిచ్చె...(సంధి జరిగింది )
నాకొరకునిచ్చె..(చదుర్ధీ విభక్తి.,ద్రుతం పరఅచ్చుతో....)

నాకున్+ఆదరువు...నాకాదరువు.......(సంధి)
నాకునాదరువు......(షష్టీ విభక్తి..ద్రుతం పర అచ్చుతో)

నాయందున్+ఆశ...నాయందాశ...(సంధి)
నాయందునాశ......సప్తమీ....(ద్రుతం పర అచ్చుతో)

వచ్చుచున్ +ఉండును..వచ్చుచుండెను(సంధి)
వచ్చుచునుండెను.....(శత్రర్ధక చు వర్ణము)

చూచుచున్+ఏగెను...., చూచుచేగెను..(సంధి)
చూచుచునేగెను....(శత్రర్ధక చు వర్ణము)

(పాల్గొనే మిత్రులందరకు నాదో చిన్న విన్నపము..,,చదివిన వారు ప్రతి ఒక్కరూ ఒక్కో సంధికి  ఒక ఉదాహరణ వ్రాయవలసినదిగా కోరుచున్నాను)

సశేషం......రేపుకలుద్దామా?

సంధుల విఙ్ఞానము.,9  తెలుగు సంధులు

తెలుగు సంధులు

"పూర్వ పర స్వరంబులకు పర స్వరంబేకాదేశంబగుట సంధి యనంబడు"

పూర్వ పదం చివర ఉన్న అచ్చుకు పర పదము మొదటనున్న అచ్చు పరమైనప్పుడు ఆ రెంటిలోను పరపదము యెక్క అచ్చు ఒక్కటే ఆదేశమగుటను సంధి  అని అంటారని అర్థం .

ఉదా..,
రాముడతడు....రాముడు+ అతడు..(విడదీసిన రూపము)  ఉ+అ.,,అ   (సంధిలో వచ్చిన మార్పు)
రాముడు   పూర్వపదము   అతడు  పరపదము  పూర్వపదము చివరి అక్షరం "డు"  డ్+ఉ=డు.,,డులో ఉన్న ఉ అనేదానిని డ కారోత్తర వర్తి అంటారు.,.,అతడు అనేది పరపదము
పూర్వపదములోని చివరనున్న "ఉ"  అనే అచ్చుకు "అతడు" అనే పరపదములోని "అ "  అనే అచ్చు పరంగానున్నది రెండుపదములలోని అచ్చులు పోయి రెండవపదములోని మొదటి అచ్చు ఒక్కటే ఆదేశముగా రావటమే తెలుగు సంధి లక్షణము..కావున
రాముడ్+ఉ+అతడు........రాముడ్ +(ఉ)+అ+తడు..రాముడ్+అ+తడు....రాముడతడు  అనే రూపము వచ్చినది ఇదియే సఁధి కార్యము

తెలుగులో  అచ్చులకు సంబంధించిన విధానమిలాఉంటూ  ఒక్కో అచ్చుకు సంబంధించి ఒక్కో సంధి ప్రారంభమైనది
తెలుగులో సంధులు  అచ్ సంధులు  హల్ సంధులు అని వ్యాకరణ కర్తలు విడదీయలేదు కాని  మనమలానే అలవాటు పడిపోయినాము.

సంధులలో  బాహ్య సంధులు  అంతర సంధులు అని రెండు రకాలున్నాయి.. వాక్యం లోని పదాలకు మద్య జరుగునవి బాహ్య సంధులు...ఏక పదములో ప్రకృతి  ప్రత్యయాలకు మద్య సమాసగత పదాలకు మద్య జరిగే సంధులను అంతర సంధులు అంటారు
ఉకార సంధుల వంటివి బాహ్య సంధులు  అయితే  స్వర సంధి...టుగాగమసంది అపదాది సంధులు అంతర సంధులు ..సాదారణముగా పదాల కలయికలో ఏదేని మార్పును గమనించినయెడల సంధి జరిగినది,సంధి పొసగినది.. అంటాము  ఎందుచేతననగా "దృత ప్రకృతికాలకు సంధి లేదు" ఏలననగా దృత ప్రకృతికం తరువాత అచ్చుతో కలసిపోతుంది. మార్పు ఉండదుకదా..
కొనెన్+ఇప్పుడు...కొనెనిప్పుడు.,,మార్పులేదు ,అనగా సంధి పొసగ లేదని తెలుసుకోవాలి.

తెలుగు సంధులు
1.ఉకార సంధి........
2.యడాగమ సంధి
3.అకారసంధి          
4.ఇకారసంధి
5.అపదాది స్వరసంధి
6.ద్విరుక్తటకార సంధి
7.టుగాగమ సంధి      
8రుగాగమ సంధి
9.గ స డ ద వాదేశ సంధి
10. ద్రుత-సరళాదేశ సంధి
11.పుంప్వాదేశ సంధి    
12.పుగాగమ సంధి
13.ప్రాతాది సంధి            
14.నుగాగమ సంధి
15.ఇత్వాదేశ సంధి
16.పెన్వాది సంధి
17.ఆమ్రేడిత సంధి
18.ము వర్ణలోప సంధి
19.పడ్వాది సంధి
20.అలిగాగమ సంధి
21.అనుకరణ సంధి
22.వి సంధి
23.పజ్పవర్షాదేష సంధి
24.త్రిక సంధి
25.లు..ల..న..ల సంధి
26.దుగాగమ సంధి
27.అల్లోప సంధి
28.మి కార లోప సంధి

సశేషం.....,రేపు కలుద్దామా?
సంధుల విఙ్ఞానము.,8..విసర్గ సంధి...

7) విసర్గ సంధి
(ఈ సంధి వలన ఏర్పడిన పదములనేకము మనము అనునిత్యము వాడుతుంటాము కావున ప్రత్యేకమైన శ్రద్ధ తో గమనించ వలసినదిగా మిత్రులకు నా విన్నపము)

గమనిక.....సంస్కృతమునందు "స"కారాంత పదములు కలవు అవి సంధి జరుగు సమయమున విసర్గ గానే కాక మరికొన్ని విధములుగా మారును.

a)స కారాంత పదములకు చ..,.ఛ....శ అను వర్ణములు పరమైనప్పుడు స కారం శవర్ణముగా మారును

ఉదా..
మనస్+ శాంతి...మనశ్శాంతి
తపస్+చర్య......తపశ్చర్య
దుస్+చరితము..దుశ్చరితము.,,మున్నగునవి

b)స కారాంత పదములకు.క   ఖ   ప   ఫ  అను వర్ణములు పరమగు నప్పుడు   స కారము విసర్గ ః   గామారును

ఉదా....
ప్రాతస్+కాలము...,ప్రాతఃకాలము
మనస్+ఖేదము....మనఃఖేదము
తేజస్+ పుంజము..తేజఃపుంజము
తపస్+ఫలము.......తపఃఫలము........,మొదలైనవి

c) ఇస్.,,ఉస్ అంతమందు గల ఉపసర్గలు మరియు శబ్దములయెక్క స కారములకు క   ఖ   ప   ఫ   వర్ణములు పరములగు నప్పుడు,,షకారము వచ్చును

ఉదా.,,
నిస్+కారణము....నిష్కారణము
దుస్+కార్యము....దుష్కార్యము
ధనుస్+ఖండము..ధనుష్ఖండము
చతుస్+పదము....చతుష్పదము........మొదలైనవి

d)స కారమునకు "ట" వర్ణము పరమగునప్పుడు షత్వమును షకారము పరమగునప్పుడు షత్వ  మరియు విసర్గలు వచ్చును

ఉదా...
ధనుస్+ టంకారము....ధనుష్టంకారము
చతుస్+షష్టి........,,..,,చతుష్షష్టి

e)అస్ అంతముగా గల పదములకు  క   ఖ   చ  ఛ   ట   ఠ   త   థ   ప   ఫ   శ   ష   స  కాక తక్కిన హల్లులేవేని పరమైనప్పుడు అస్ స్థానమునకు  ఓ కారము వచ్చును

ఉదా...
మనస్+గతి....మనోగతి
తపస్+బలము..,తపోబలము
మనస్+వేదన...,మనోవేదన
మనస్+ రధము..మనోరధము..,,,మున్నగునవి

f)ఇకారాద్యచ్చులు పూర్వమందుగల సకారమునకు  క   ఖ   చ  ఛ   ట   ఠ   త   థ   ప   ఫ   శ   ష   స వర్ణములు తప్ప తక్కిన హల్లులు   అచ్చులేవేని పరమైనప్పుడు రేఫము  వచ్చును

ఉదా..,
బహిస్+అంగము.....బహిరంగము
ఆశీస్+వదము......ఆశీర్వాదము
దుస్+అంతము..,.దురంతము
విస్+ధనులు.......విర్ధనులు
దోస్+బలము......దోర్బలము........మున్నగునవి

సంస్కృత సంధులలో మరెన్నో సంధులు కలవు కాని నేను వాటిని ప్రస్తావించటంలేదు  సామాన్యముగా మనకు కావలసినవనుకున్న అతిముఖ్యమైన వాటినే  ముచ్చటించటం జరిగినది కావున మిత్రులు గమనించ గలరు..

రేపటినుండి  తెలుగు సంధుల ప్రకరణము

(పాల్గొనే మిత్రులందరకు నాదో చిన్న విన్నపము..,,చదివిన వారు ప్రతి ఒక్కరూ ఒక్కో సంధికి   ఉదాహరణలు వ్రాయవలసినదిగా కోరుచున్నాను)

సశేషం... రేపు కలుద్దామా?

సంధుల విఙ్ఞానము..,7.,యణాదేశ, వృద్ధి  సంధులు

3)యణాదేశ సంధి

య,,,వ.....ర   లకు యణ్ణులని పేరు..ఈ యణ్ణులు ఆదేశమగుటవలన దీనికి యణాదేశ సంధి అని పేరువచ్చినది

సూత్రము--"ఇ...ఊ..,ఋ   లకు అసవర్ణములైన అచ్చులు  (అసమాన అచ్చులు) పరమైనప్పుడు  క్రమముగా య  వ   ర   లు  ఏకాదేశమగును"

ఇ.,ఉ  ఋ  అనేవి  ఇక్కులు
య,,,వ.....ర   లకు యణ్ణులని పేరు
అసమాన అచ్చులు పరమైతే
ఇ కారమునకు  య  కారము
ఉ కారమునకు వ కారము
ఋ  కారమునకు  రకారము
----    కారమునకు  ల కారము ఆదేశముగా వస్తాయి అనునది సూత్రార్ధము.

(----  టైపు వసతిలేక అక్షరమాలలోని ఋ ౠ ల తదుపరి వచ్చు "అలు అలూ" వ్రాయలేక పోయినందులకు చింతిస్తున్నాను  మిత్రులు గమనించ గలరు)


ఉదా...
అతి+అంతము..........అత్యంతము   (ఇ+అ...య)
దేవీ+ఆలయము......,,,దేవ్యాలయము(ఈ+ఆ.,,య)
మను+అంతరము.......మన్వంతరము(ఉ+అ..,వ)
వధూ+ఆనందము.,....,వధ్వానందము(ఊ+ఆ,,,,వ)
ధాతృ+అంశము...........ధాత్రంశము   (ఋ+అ...ర)
పితృ+ఆఙ్ఞ...................పిత్రాఙ్ఞ          (ఋ+ఆ.,.,,ర)

4)వృద్ధి సంధి.

ఐ ఔ లకు వృధ్ధులని పేరు ఈ వృధ్ధులు ఆదేశముగా వచ్చుటవలన వృధ్ధి సంధి అని పేరు వచ్చినది

సూత్రము--"అకారమునకు ఏ   ఐ  లు పరమగు నప్పుడు "ఐ" కారమును  ఓ    ఔ   పరమగునప్పుడు  " ఔ"  కారమును ఏకాదేశములగును"
అకారాంత..ఆ కారాంత శబ్దాలకు(అ  ఆ  లకు) ఏ ఐ పరమైనప్పుడు  ఐ  కారమును .ఒ   ఔ   లు పరమైనప్పుడు  ఔ  కారమును  ఏకాదేశముగా వచ్చుటను వృద్ధి సంధి అందురు అని సూత్రార్ధము.

ఉదా....
భీష్మ+ఏకాదశి.....భీష్మైకాదశి            (అ+ఏ...ఐ)
మహా+ఐశ్వర్యము....మహైశ్వర్యము(ఆ+ఐ....ఐ)
వన+ఓషధి..,.,వనౌషధి                     (అ+ఓ.....ఔ)
మహా+ఔషధము.....మహౌషధము    (ఆ+ఔ....ఔ)

5.యన్తాదేశ సంధి
6.వాంతాదేశ సంధి
ఇవి పూర్తిగా సంస్కృతమునకు సంబంధించినవి..
పూర్వ పదము చివర     ఏ   ఓ    ఐ   ఔ  లు ఉండి  విటికి అచ్చులు పరమగునప్పుడు   అయ్.,,ఆయ్..,,అవ్   ఆవ్  అనునవి ఆదేశములుగా వచ్చును

హరే+ ఏ.,,హరయే
విష్ణో+ఏ....,విష్ణవే

(పాల్గొనే మిత్రులందరకు నాదో చిన్న విన్నపము..,,చదివిన వారు ప్రతి ఒక్కరూ ఒక్కో సంధికి  ఒక ఉదాహరణ వ్రాయవలసినదిగా కోరుచున్నాను)


సశేషం రేపు కలుద్దాం




సంధుల విఙ్ఞానము...6.,సవర్ణ ధీర్ఘ, గుణ  సంధులు

తిరిగి  సంధుల విఙ్ఞానములోనికి వద్దాము....

అయితే  సంస్కృత వ్యాకరణం,తెలుగు వ్యాకరణం వాటి వాటి భాషా మరియాదలను బట్టి  నిర్వచనాలు చెప్పబడ్డాయి....ఇలా చెప్పుకున్న సంధులలో అనేక రకాలున్నప్పటికి ముఖ్యంగా "అచ్ సంధులు" "హల్ సంధులు " అనేవి ముఖ్యమైనవి ...వీటిలో తిరిగి అనేకరకాలుగా వ్యాకరణ కర్తలు శలవిచ్చారు. మనం వాడే తెలుగు భాషలో అనేకమైన సంస్కృత పదాలు ఎంతగానో కలిసి ఇమిడి ఉన్నాయి కావున ముందుగా సంస్కృత సంధులు గురించి తెలుసుకుందాము......

........సంస్కృత సంధులు......

వర్ణాలు గాని పదాలు గాని కలియుటయే సంధి ఇలా కలిసిన సమయంలో అక్షర లోపము  ఆగమము ఆదేశము  మొదలగు వాని వలన  జరిగే మార్పులు  సంధులౌతాయి ఇలా జరిగే సందులు పదాల మద్య సంహిత ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది . సంహిత అనగా అక్షరాల మద్య అర్ధమాత్రా వ్యవధానం కంటే ఎక్కువ వ్యవధానం లేకుండా ఉండే స్థితి ..వ్యవధానమనగా రెండు పదాల మద్య మరొకటేది లేకుండుట,

ఈ సంధులు సంస్కృతం లో స్థూలంగా 3 రకాలు..1)ఆగమ సంధులు...2)ఆదేశ సంధులు...3)ఏకాదేశ సంధులు ...అని మూడు రకాలుగా ఉంటాయి.....

తెలుగు భాషకు సంస్కృత సాంగత్యమధికముగా నుండుటవలన సంస్కృతమునందలి సంధులనేకము తెలుగు భాషలోనికొచ్చినవి..అవి

సవర్ణధీర్ఘ సంధి
గుణ సంధి
యణాదేశసంధి
వృధ్ధిసంధి
అనునాసిక సంధి
విసర్గ సంధి
శ్చుత్వ సంధి
జస్త్వ సంధి .........మున్నగునవి

1) సవర్ణధీర్ఘ సంధి
సవర్ణమనగా సమానమైన అచ్చు అని అర్ధము  సవర్ణమైన అచ్చు ధీర్ఘముగా వచ్చుట వలన దీనికి ఆ పేరు  వచ్చినది

"సూత్రము:-  అ ఇ ఉ ఋ లను అక్షరములకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు క్రమముగా ధీర్గము ఏకాదేశమగును",,,,,అనగా
అ  ఆ   లకు  అ  ఆ  లు  పరమైతే....ఆ కారము
ఇ.,,ఈ లకు  ఇ  ఈ  లు  పరమైతే....ఈ కారము
ఉ,,ఊ   లకు  ఉ  ఊ   లు  పరమైతే..ఊ  కారము
ఋ  ౠ  లకు  ఋ  ౠ  లు  పరమైతే.ౠ కారము
నైన సవర్ణ ధీర్ఘాలు  ఆదేశమగునని సూత్రార్ధము
ఉదా..,
శత+ అబ్దము....,.......శతాబ్దము       (అ+అ..ఆ)
మహా+ఆనందము......మహానందము(ఆ+ఆ..ఆ)
ముని+ఇంద్రుడు.... ....మునీంద్రుడు  (ఇ+ఇ..ఈ)
గౌరీ+ఈషుడు............గౌరీశుడు     (ఈ+ఈ.,ఈ)
భాను+ఉదయము... ..భానూదయము(ఉ+ఉ.,ఊ)
పితృ+ఋణము...... ..పితౄణము (ఋ+ఋ..ౠ)

2) గుణ సంధి
ఏ ఓ ఆర్  లకు గుణములను సఙ్ఞ కలదు  ఈ గుణములు ఏకాదేశమగుటవలన దీనికి గుణ సంధి అనే పేరుకలిగినది

సూత్రము--"అ  ఆ అను స్వరంబులకు అసవర్ణములైన ఇ  ఉ,,ఋ   లుపరమగు నప్పుడు క్రమముగా ఏ..,ఓ...ఆర్....లు ఏకాదేశంబగు"  అనగా
అ  ఆ   లకు  ఇ   ఈ  లు  పరమైతే....ఏ కారము
అ   ఆ లకు  ఉ,,ఊ  లు  పరమైతే....ఓ కారము
అ  ఆ     లకు  ఋ ౠ  లు  పరమైతే..ఆర్  అనేవి  ఏకాదేశమగును  అని సూత్రార్ధము

ఉదా..,
దేవ+ఇంద్రుడు..........దేవేంద్రుడు  (అ+ఇ..,ఏ)
మహా+ఈశుడు.........మహేశుడు(ఆ+ఈ....ఏ)
సూర్య+ఉదయము...సూర్యోదయము(అ+ఉ..,ఓ)
గంగా+ఊర్మి.............గంగోర్మి    (ఆ+ఊ.....ఓ)
దేవ+ఋషి...............దేవర్షి     (అ+ఋ....ఆర్)

(పాల్గొనే మిత్రులందరకు నాదో చిన్న విన్నపము..,,చదివిన వారు ప్రతి ఒక్కరూ ఒక్కో సంధికి  ఒక ఉదాహరణ వ్రాయవలసినదిగా కోరుచున్నాను)

సశేషం....రేపుకలుద్దామా!.

సంధుల విఙ్ఞానము.,5...విభక్తులు

7)సప్తమీ విభక్తి !
అందున్, నన్--- సప్తమీ విభక్తి.
అధికరణములో  సప్తమీ విభక్తి వచ్చును.,అధికరణమనగా ఆధారము ఈ ఆధారము 3 విధములుగా నుండును

వైషయికము.,,,,అనగా  విషయ సంభంధం
అభివ్యాపకము,,అనగా అంతటా వ్యాపించటం
ఔపశ్లేషికం....,అనగా సమీప సంబంధం

అధికరణంలో సప్తమీ విభక్తి వస్తుంది. అధికరణం అంటే ఆధారం. ఈ ఆధారం 3 విధాలుగా ఉంటుంది. ఔపశ్లేషికం, వైషయికం, అభివ్యాపకం. 'అందు' అనేది మాత్రం వస్తుంది.

వైషయికం అంటే విషయ సంబంధం.
ఉదా: మోక్షమందు ఇచ్ఛ కలదు.

అభివ్యాపకం అంటే అంతటా వ్యాపించడం.
ఉదా: అన్నింటియందీశ్వరుడు కలడు.

ఔపశ్లేషికం..,అనగా సమీప సంబంధం
ఉకారాంత జడానికి 'న' వర్ణకం వస్తుంది. జడం అంటే అచేతన పదార్ధం.
ఉదా: ఘటంబున జలం ఉంది.

8)సంబోధనా ప్రథమా విభక్తి !
ఓ, ఓరీ, ఓయీ, ఓసీ--- సంబోధనా ప్రథమా విభక్తి.

ఆమంత్రణం అంటే పిలవడం, సంబోధించడం. ఇది ఎవరినయితే సంబోధించడం జరుగుతుందో - ఆ శబ్దానికి 'ఓ' అనేది వస్తుంది.
ఉదా: ఓ రాముడా - ఓ రాములార

ఓ శబ్దానికి పురుషుని సంబోధించేటప్పుడు 'యి' అనేది, నీచ పురుషుని సంబోధించినప్పుడు 'రి' అనేది, నీచస్త్రీని సంబోధించినప్పుడు 'సి' అనేది అంతాగమాలుగా విభాషగా వస్తాయి.
ఉదా: ఓయి రాముడా! ఓరి దుష్టుడా! ఓసి దుర్మార్గురాలా!
యి  రాని ఎడల  ఓ  రాముడు  ....ఓ దుష్టుడు....
*****ఓరీ...,.ఓసీ  అనేవి మైత్రిని తెలియజేయు ఆ మంత్రణం లోకూడా వస్తాయి..

ఓరి ముద్దు కృష్ణా....పురుష సంబోధనం

ఓసి ముద్దు పాప...స్త్రీ సంభోధనం
**ఓయి.... ఓరి ....ఓసీ  అనే వాటికి ధీర్ఘాలు కూడా ఉన్నాయి

ఓయీ....మూర్ఖ మానవా

ఓరీ......దుష్ట మానవా
ఓసీ.....ఎందు బోతివి.....మున్నగునవి

ఔప విభక్తికాలు

ఇ   టి  తి  ఔపవిభక్తికంబులు
"విభక్తి నిమిత్తకంబులై యాదేశాగమాత్మకాలైన "ఇ..,టి...తి" వర్ణంబులు ఔపవిభక్తికంబులనంబడు"
ఊరు+ని....ఊరిని
మ్రాను+ని...,.మ్రానిని

నోరు+ను...నోటిని
కాడు+ను..,కాటిని

ఏటిని....పగటి....మొదటి.....రెంటిని......మూటిని.....
కంటి.,,,ఇంటి...,మింటి...,పంటి

మున్నగు పదాలు  ఓప విభక్తికాలైన  ఇ.,టి...ని   అనే వర్ణాలు  ఆగమ..ఆదేశాలు గా   రావటం వలన ఏర్పడిన పదాలే...

తిరిగి సంధుల పరిఙ్ఞానములోకి వద్దాము..

సశేషము...రేపు కలుద్దామా?

సంధుల విఙ్ఞానము,,,4--4/3/2017---,విభక్తులు

4)చతుర్ధీ విభక్తి !
కొఱకున్ (కొరకు), కై--- చతుర్ధీ విభక్తి.
"సంప్రదానంబునకుంజతుర్ధి యగు"

త్యాగోద్దేశ్యము గా ఉన్నప్పుడు చతుర్ధీ విభక్తి వస్తుంది. త్యాగము అంటే ఇవ్వడం.
ఉదా: జనకుడు రాముని కొరకు కన్యనిచ్చెను.
కన్యను తిరిగి పుచ్చుకొనే ఉద్దేశం  లేదు.
ఒకవేళ ఆ ఉద్దేశం  ఉన్నా అవుతుంది,
ఉదా.ప్రధమ స్థానము కొరకు ప్రయత్నించ వలెను..ఇది ఉద్దేశమే కదా

కొఱకు+న్ = కొఱకున్. ద్రుతలోపమున కొఱకు అని నిలిచినది.ఇది కొఱ=ప్రయోజనము, కు=నకు అను అర్ధమున నిలిచినట్లుగ కనబడుతున్నది.అలాగే  "కయి' వర్ణకముసైతము క+అయి అనుదాని విపర్యరూపము.ఇందు అయి అనునది అగు ధాతువు క్త్వార్ధకరూపము.

ఉదా..,  గోపి కై రాము వేచి యుండెను

5)పంచమీ విభక్తి !
వలనన్, కంటెన్, పట్టి--- పంచమీ విభక్తి.

అపాయ, భయ, జుగుప్సా, పరాజయ, ప్రమాద, గ్రహణ, భవన, త్రాణ, విరామ, అంతర్థ, వారణంబులు అనేవి వేటివలన జరుగుతాయో ఆ పదాలకు పంచమీ విభక్తి వస్తుంది. అందులోనూ 'వలన' అనే ప్రత్యయం వస్తుంది.
ఉదా:
అతివేగము వలన ప్రమాదము జరిగెను(అపాయ)
దొంగ వలన భయము కలిగెను  (భయము)
పాపము వలన ఏవగింపు కలిగెను (జుగుప్స)
నిర్లక్ష్యం వలన జారిపడెను ( ప్రమాదము.)
భార్య వలన ధనము కలిగెను(గ్రహణము=కొనుట ,,ఎరుగుట.వినుట)
అపరిశుబ్రత వలన వ్యాధులు వచ్చును (భవనము..పుట్టుక)
పంటను పక్షుల వలన కాచెను(త్రాణము.కాచుట)
రోగముల వలన మానుకొనెను(విరామము)
చోరుడు శునకము వలన దాగెను(అంతర్ధి-దాగు  మాయమగు...మఱగు)
శోకము వలన వారించె(వారణము-వారించుట)

ఆ)"కంటె వర్ణకంబు అన్యార్ధాది యోగజంబగు పంచమికగు"

అన్యార్థంలో చెప్పేటప్పుడు 'కంటె' అనే వర్ణకం వస్తుంది.
అనగా అన్య, ఇతరము, పూర్వము, పరము, ఉత్తరము అనే పదాలతో అన్యము ఉంటే 'కంటె' వస్తుంది.
ఉదా: రాముని "కంటె" నన్యుండు దానుష్కుండు లేడు.
          కర్ణుని "కంటె" నన్యుడు దానశీలి లేడు

ఇ)నిర్ధారణ పంచమిలో కూడ కంటె ప్రత్యయం వస్తుంది.
జాతి మొదలగు వాటితో నిర్ధారించేటప్పుడు పచమీ విభక్తి వస్తుంది దానిని నిర్ధారణ పంచమి అంటారు ఆ పంచమికి "కంటె" వస్తుంది

ఉదా:
ఆటవికులకంటే  నాగరికులు వివేకులు (ఆటవికులు నిర్ధారకులు)
 గ్రుడ్డి కంటె మెల్ల మేలు: ఇక్కడ ('గ్రుడ్డి నిర్ధారణము)

ఈ)'పట్టి' అనేది హేతువులయిన గుణక్రియలకు వస్తుంది. హేతువు అంటే కారణం. గుణం హేతువు కావాలి, క్రియ కూడా హేతువు కావాలి.
గుణము అంటే స్వభావం క్రియ అంటే పని
ఉదా: "చదువును బట్టి యోగ్యుడగు. "
యోగ్యుడవడానికి కారణము చదువు

వలనన్ అనునది వలను+అన్ శబ్దముయొక్క సప్తమ్యంత రూపముగ నెన్నదగుచున్నది.ఇక కంటె అను వర్ణకము కు+అంటె అను పద విభాగమున కల్గినరూపముగ తెలియును. పట్టి అను వర్ణకము 'పట్టుధాత్వర్ధక క్త్వార్ధక రూపము'.


6)షష్ఠీ విభక్తి  !
కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్--- షష్ఠీ విభక్తి.

అ)శేషం అంటే సంబంధం. సంబంధం కనిపించినప్పుడు 'యొక్క' అనే విభక్తి వస్తుంది.
ఉదా: నా యొక్క పుత్రుడు; వాని యొక్క తమ్ముడు.

ఆ)నిర్ధారణ షష్ఠికి 'లోపల' వర్ణకం వస్తుంది.
 జాతి, గుణ, క్రియ, సంజ్ఞల చేత - ఒక గుంపు నుండి ఒకదాన్ని విడదీయడాన్ని నిర్ధారణ అంటారు.
ఉదా: పశువుల లోపల గోవు శ్రేష్టమైనది.

షష్ఠీ విభక్తిలోని 'ఒక్క' శబ్దము 'ఒ' యను ప్రణష్టధాతువుయొక్క ధాతుజన్య విశేషణము. ఇక్కడ ఒ = కూడు, లేక చేరు అని తెలుపును


సశేషం--- రేపు కలుద్దామా?

సంధుల విఙ్ఞానము..,3..విభక్తులు

విభక్తులు

విభక్తులు వాక్యములోని వేర్వేరు పదములకు అన్వయము కలిగించు ప్రత్యయములను, పదములను విభక్తులందురు. ఇవి రెండు పదముల మధ్య సంబంధము కలిగించును. వీటినే విభక్తి ప్రత్యయాలు అని కూడా అంటారు. విభక్తులు ఏడురకములు  సంబోధనా ప్రధమా విభక్తితో కలసి ఎనిమిది అయినాయి ద్రుతాంతములైన విభక్తులను ద్రుతాంతములుగా చెప్పుటయే భాషా మరియాద. ఈ విభక్తులు (ప్రత్యయాలు) నామవాచకము సర్వ నామముల తరువాతనే ప్రయోగింప బడతాయి..
రాముని"చేత" -----సీత "వలన"----రాణి"కి"చ్చాను  అంటూ ప్రయోగింప బడతాయి.

ఈ విభక్తులు

ప్రత్యయాలు విభక్తి పేరు

1. డు, ము, వు, లు--- ప్రథమా విభక్తి.

2. నిన్, నున్, లన్, గూర్చి, గురించి--- ద్వితీయా విభక్తి.

3. చేతన్, చేన్, తోడన్, తోన్--- తృతీయా విభక్తి.

4. కొఱకున్ (కొరకు), కై--- చతుర్ధీ విభక్తి.

5.వలనన్, కంటెన్, పట్టి--- పంచమీ విభక్తి.

6. కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్--- షష్ఠీ విభక్తి.

7.అందున్, నన్--- సప్తమీ విభక్తి.

8.ఓ, ఓరీ, ఓయీ, ఓసీ--- సంబోధనా ప్రథమా విభక్తి.

వివరంగా చూద్దాము

1) ప్రథమా విభక్తి !
డు, ము, వు, లు -- ప్రథమా విభక్తి.

పుంలింగాలయిన, మహద్వాచకాలయిన శబ్దాలకు "డు" వస్తుంది.
ఉదా: రాముడు, కృష్ణుడు

అమహన్నపుంసకములకు, అదంత శబ్దాలకు "ము" వస్తుంది.
ఉదా: వృక్షము, దైవము

ఉకారాంత శబ్దాలకు, గోశబ్దానికి "వు" వస్తుంది.
ఉదా: తరువు, ధేనువు, మధువు, గోవు

బహువచనంలో అన్ని శబ్దాలకు ప్రథమా విభక్త్యర్థంలో "లు" వస్తుంది.
ఉదా:  పుస్తకములు....కలములు......నదులు....కొండలు  గోవులు

2)ద్వితీయా విభక్తి !
నిన్, నున్, లన్, గూర్చి, గురించి--- ద్వితీయా విభక్తి

కర్మార్థంలో ద్వితీయా విభక్తి వస్తుంది. కర్మ యొక్క ఫలాన్ని ఎవడైతే అనుభవిస్తాడో వాడ్నితెలియజేసే పదం 'కర్మ'.

ఉదా: అతడు వంటకము"ను" వండెను.

వండెను అనేదానికి  వంట చేసెను అని అర్ధం..,,
వంట ఫలం..,,చేయుట వ్యాపారం(వ్యాపారం  అనగా పని చేయటం)

కూర్చి, గురుంచి ప్రయోజన నిమిత్తములైన పదములకు వచ్చును.
రావణుడు శివుని "గూర్చి" తపస్సు చేసెను
నీవు ఎందు "గురించి" యోచించు చుంటివి?

పై రెండు వాక్యాలు ఏదో ప్రయోజనమాశించి చేసినవిగా నున్నవి కదా.

3)తృతీయ విభక్తి  !
చేతన్, చేన్, తోడన్, తోన్--- తృతీయా విభక్తి.
క్రియ యెక్క వ్యాపారానికి(పనికి)ఎవరైతే ఆశ్రయం అవుతారో వారు కర్త.
కర్తార్థంలో తృతీయా విభక్తి వస్తుంది.

ఉదా: భీముని చేత వంటకము వండబడెను.

"వండబడెను"  అంటె వంట చేయబడింది అని అర్ధమే కదా?.చేయటం అనే పనికి (వ్యాపారానికి ) ఆశ్రయము
భీముడు ఈ విక్యములో  అనుకర్త కావున భీముని "చేత" అని వాక్యనిర్మాణం చేయబడింది.

అ)కరణ,,సహార్ధ..తుల్యార్ధాల యోగంలోను " తోడ"అనే ప్రత్యయం వస్తుంది."
కరణం..(సాధనం) కోల "తోడ" కూల వేసె
సహార్ధం.,(కూడా) అతడు మంది "తోడ" వచ్చెను
తుల్యార్ధయోగం.,(సమానార్ధం)
**రాముని తోడ హరి మిత్రుడు

ఆ)వచ్యర్ధ అముఖ్య కర్మకు తోడ వర్ణకం వచ్చును
అముఖ్య కర్మ అనగా ముఖ్యము కాని కర్మవాచకం
వచ్యర్ధం అనగా వంచించు...పలుకు.,,అను.,,చెప్పు..,అనేవి వచ్యర్ధాలు.,ఇఈ అర్ధాలలో యోగం ఉన్నప్పుడు అముఖ్య కర్మకు "తోడ" వస్తుంది.
**రాము  హరి "తోడ" యిట్లనెను.

ఇ)"ఉపయోగంబునందాఖ్యాతకు తొడవర్ణకంబగు"
ఆఖ్యాత..అనగా చెప్పేవాడు.,
చెప్పే వానికి తో అనే ప్రత్యయం వస్తుంది

రామ, హరి .. కృష్ణుని "తొడ"  వేదములు చదివిరి..
కృష్ణుడు  ఆఖ్యాత  .కృష్ణుడు కూడా చదువుకున్నాడని అర్ధం కాదు. కృష్ణుని వద్ద చదువు కున్నారని అర్ధం..


సశేషం...రేపు కలుద్దామా?

సంధుల విఙ్ఞానము...,2..సంధికార్యమునవచ్చు పదములు

సంధి కార్యమునందు వచ్చే మరి కొన్ని ముఖ్యమైన  పదాలను గురించి తెలుసుకుందాము..

7)పూర్వ పదము...
సంధి జరిగిన రెండు పదములలోని మొదటి పదమును పూర్వపదమందురు
శివ+ ఆలయము....శివాలయము
ఇందు " శివ"  అను పదము పూర్వ పదము

8)పరపదము....
సంధి జరిగిన రెండు పదములలోని రెండవ పదమును పరపదమందురు
శివ+ ఆలయము....శివాలయము
ఇందు " ఆలయము"  అను పదము పర పదము

9)ఆదేశము(శతృవదాదేశః)
రెండు పదముల మధ్య  సంధి జరుగు నప్పుడు ఒక అక్షరమును తొలగించి మరో అక్షరము  శతృవు వలే వచ్చి చేరుటను "ఆదేశము" అందురు
సరసము+మాట....సరసపుమాట..,ము అనే అక్షరం స్థానములో   పు  వచ్చి  చేరినది

10)ఆగమము(మిత్రవదాగమః)
రెండు పదముల మధ్య  సంధి జరుగు నప్పుడు మిత్రుని వలే మరో అక్షరము అదనముగా వచ్చి చేరుటను ఆగమము అందురు
మా+అమ్మ....మాయమ్మ...య్  అనేది ఆగమముగా చేరినది

11)ఏకాదేశము
రెండు పదముల మధ్య  సంధి జరుగు నప్పుడు పూర్వపదము చివర ఉండే అక్షరం గాని పరపదము లోని మొదటి అక్షరం గాని  ఈ రెంటిలో ఒకదానిని గాని రెంటినీ గాని తొలగించి మరొక అక్షరం  ఒక్కటే  వచ్చి చేరటాన్ని  ఏకాదేశము అంటారు
రామ+ఆలయము..రామాలయము
శిల+అభిషేకము...శిలాభిషేకము
(హహ్రస్వ అకారములు  ధీర్ఘములైనవి)

12)నిత్యము
విధించిన సంధి కార్యము తప్పని సరిగా జరుగుటను  నిత్యము అంటారు
సోముడు+ఇతడు...సోముడితడు....తప్పనిసరిగా సోముడితడు అనిమాత్రమే పలుక వలెను
సోముడు ఇతడు అనరాదు.

13)విభాష(వైకల్పికము)
విధించిన సంధి కార్యము ఒక సారి జరుగుట ఒకసారి జరుగకపోవుటను  విభాష.  లేక వైకల్పికము అందురు

14)బహుళము
విధించిన సంధి కార్యము  నిత్యము,నిషేధ,వికల్ప.లేదా అన్యవిధములుగా జరుగుటను బహుళము అందురు

15)ద్విరుక్తము
ఒకే పదము రెండు సార్లు చెప్పబడినచో ద్విరుక్తము
(ఔర+ఔర)

16) సంశ్లేష
సంశ్లేష అనేదానికి మీది హల్లుతో కూడుకొనుట "బాగా కలియుట" అని అర్ధము  ఒక పొల్లు హల్లు మీది హల్లుతో కలియుట
పూచెను+కలువలు...,పూచెన్గలువలు   ఇది సంశ్లేష రూపము

17)ఆమ్రేడితము
  ఒకపదము రెండు సార్లు చెప్పబడినప్పుడు  రెండవసారి చెప్పబడిన పదము ఆమ్రేడితమనబడును..

18)తపరకరణము
అత్తు,ఇత్తు,ఉత్తు  అని ఇలా చెప్పటాన్ని తపరకరణము అంటారు  ఇలా తపరకరణము చేసి చెబితే అది హ్రస్వమైన అక్షరాలను మాత్రమే నిర్ధేశిస్తుంది అని అర్ధము
అత్తు.......అ
ఇత్తు.......,ఇ

19)భృశార్ధం
 మిక్కిలి  చెప్పడానికి భృశార్ధం అంటారు

20)రేఫ....
ర అనే అక్షరాన్ని చెప్పవలసి వచ్చినప్పుడు  రేఫ  అంటారు
ఱ (బండిరాని)  శకట రేఫ అంటారు   రకారము ఱకారము   అనరాదు

21) అవసానము
"అవసానము"  అనగా చివర  అని అర్ధము వాక్యానికి గాని పదానికి గాని చివర అని అర్ధము..
"వాక్యావసానంబున సంధిలేమి దోషముగాదని ఆర్యులందురు"
అనగా ఒక వాక్యము పూర్తి అయినపిదప మరొక వాక్యము ప్రారంభిచుటకుముందు సంధి లేకపోయినను దోషము కాదు.అని అర్ధము.

22)తత్సమ శబ్దము
సంస్కృత శబ్దము కాదు కాని సంస్కృత శబ్దము వలెనుండునవి తత్సమ శబ్దములు.సంస్కృత పదములకు ప్రత్యయములు(విభక్తులు)చేరుట వలన వచ్చిన పదాలు
దూత..,,రాముడు..,కృష్ణుడు ..

అయితే మనం సంధుల విఙ్ఞానమును చర్చించుకునే సమయంలో విభక్తులను గూర్చి తెలుసుకోవలసిన ఆవశ్యకత ఎంతైననూ గలదు కావున  సూక్ష్మముగా వాటిని గూర్చికూడా తెలుసు కుందాము.

సశేషం....  రేపు కలుద్దామా?

తెలుగు వ్యాకరణం సంధుల విఙ్ఞానము..పరిచ్ఛేదము

సంధుల విఙ్ఞానము.,1  పరిచయం
           
"అచ్చంగా తెలుగు" బృంద సబ్యులకు నమస్కారం !!

ఈ రోజు నుండి "సంధుల విఙ్ఞానము " [సంధి పరిఛ్ఛేదము]  గురించి వివరించాలి అనుకున్నాను.అందరూ విద్యావంతులే కావున ముఖ్యమైన విషయాలు మాత్రమే సరళంగా తెలిపే ప్రయత్నం. నేను అతి సూక్ష్మంగా  విషయ వివరణ చేయ దలచినాను.కావున మిత్రులు అర్దం చేసుకోగలరు. పండితులు,విద్వాంసులు,  గ్రంధ కర్తలు,కవివరేణ్యులు ఏదేని పొరపాటు గ్రహించినచో తెలిపిన యెడల సరిదిద్దు కోగలను,నేను పండితుడనో విద్వాంసుడనో కాను కనీసం తెలుగు ఉపాధ్యాయుడను కూడా కాను. కాని తెలుగు భాషాభిమానిని మనమిత్రులందరకు ,పద్య .,గద్య కవిమిత్రులకు ఎంతో కొంత ఉపయుక్తముగానుండునని యెంచియే ఇట్టి సాహసమునకుపక్రమించితిని మిత్రులందరమూ కలసి ప్రతిరోజు చర్చించు కుందాము రండు...మీ మీ అభిప్రాయాలను వెల్లడించటం ద్వారా నన్నాదరించండి, మీఆశీస్సులందించండి,.... ధన్యోస్మి..

పరిచయం.......

రెండు పదాలు ఒకదానితో మరొకటి కలసిపోయి ఒకే పదముగా మిగిలిపోతాయి అలా కలసినప్పుడు మొదటి పదం చివరలోగాని రెండవపదం మొదటలోగాని మార్పులు సంభవించటం జరుగుతుంది అనగా అక్కడ ఉన్న అక్షరాలు దీర్ఘాలుగా మారటం ..ఉన్నఅక్షరాలు పోవటం .,లేదా వేరే క్రొత్త అక్షరాలు వచ్చి చేరటం జరుగుతుంది  ఇలా ఎందుకు జరిగింది అని మనకు మనం ప్రశ్నించుకుంటే వచ్చే జవాబే "సంధి జరిగింది".,అనేది.  ఎలా జరుగుతుందో తెలియ చేసేదే  ఈ "సంధుల విజ్ఞానము"   లేదా "సంధి పరిచ్ఛేదనము"
 
మనం ఉదా హరణకు ఒక వాక్యం తీసుకుందాము
"లోకేశ్వరుడు ,రంగాచార్యులు ,భ్రమరాంభిక  అయిదేండ్ళు నుండి మిత్రులు.ప్రతిరోజు శివాలయము దర్శిస్తారు"

ఇప్పుడు పైవాక్యం పరిశీలిద్దాము..
"లోక"..."ఈశ్వరుడు" .,,ఇవి రెండు పదాలు..,,ఈ రెండు పదాలు కలిసి పోయి "లోకేశ్వరుడు" అనే ఒకటే పదం ఏర్పడింది
"రంగ",,,"ఆచార్యులు"...ఇవి రెండుపదాలు...."రంగాచార్యులు"   అనే ఒకే పదం ఏర్పడింది
"భ్రమర"...."అంబిక"-----  భ్రరమరాంబిక
"శివ"...,"ఆలయము"------శివాలయము  ఇలా రెండు మూడు పదాలు కలిసి ఏక పదముగా ఏర్పడటాన్ని సంధి జరిగిన రూపము అంటారు

ఇలా సంధి జరిగినప్పుడు  లేదా ఈ సంధుల పరిఙ్ఞానం మనం విశ్లేషించి చెప్పుకునే సందర్భాలలో  వచ్చే కొన్ని అతి ముఖ్యమైన  పదాలను గురించి ముందుగా తెలుసు కుందాము

1)సరళములు..
తేలికగా పలకబడేవి సరళములు..తేలిక అనగా  కొంచం ప్రయత్నముతో అని భావము.,వీటికి  "నాదములు"  అనే పేరుకూడా కలదు.
గ..,జ..,డ.,ద...బ

2)పరుషములు
కఠినముగా పలుకబడే వాటిని పరుషములందురు..,కఠినమనగా గట్టి ప్రయత్నం ...వీటికి  "శ్వాసములు" అనే పేరు కూడా కలదు.
క..,చ...ట...త...ప

3)వర్గయుక్కులు
"యుక్కు"  అనగా జత వర్గాక్షరాలలో  2---4   అక్షరాలు
ఖ..,ఘ...ఛ...ఝ..,ఠ...,ఢ...థ...ధ....ఫ..,భ....ఇవి మొత్తము 10 అక్షరాలు

4)అనునాసికములు
నాసిక  అనగా ముక్కు ముక్కు సహాయముతో పలుకబడును కావున అనునాసికములైనవి
ఙ...ఞ.,,ణ...న.,,మ...ఇవి 5 అక్షరములు

5)ద్రుతం
ద్రుతమనగా  న కారము...అవసరములేనిచోట జారిపోవునదని అర్ధము

6)ద్రుత ప్రకృతికము
ద్రుతము చివరన గల పదాలను  ద్రుతప్రకృతికములు అంటారు
అనెన్.,,,కనెన్....వినెన్...తినెన్...  మున్నగునవి .


సశేషం.....మళ్ళీ కలుద్దాం..



Thursday, November 17, 2016

తెలుగు సామెతలు

తెలుగు   సామెతలు.1


**ఆడ పిల్ల సిగ్గు బిల్ల పలువురిలో కనిపించ రాదు,
**ఆడ బోయిన తీర్థం ఎదురైనట్టు ,,,
**ఆడదాని వయసు మగవాని సాంపాదన అడగ  కూడదట
**ఆడ లేక మద్దెల ఒడన్నట్లు
**ఆడ వారికి బట్టతల రాదేమండి,,బెట్టుదల ఎక్కువ గనుక
**ఆది లోనే హంస పాదు,,
**ఆడి తప్పరాదు పలికి బొంకరాదు
**ఆకాశానికి హద్దు లేదు..ఆకలి రుచి ఎరుగదు,,
నిద్ర సుఖమెరుగదు వలపు సిగ్గెరుగదు

**ఆకలి వేస్తే రోకలి మింగమన్నాడట
**ఆకు ఎగిరి ముల్లు మీద పడ్డా ముల్లు వచ్చి ఆకు మీద పడ్డా చిరిగేది ఆకే
**ఆలస్యం అమృతం విషం
**ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరుఱా సోమలింగం అన్నట్టు
**ఆరె దీపానికి వెలుగెక్కువట
**ఆరోగ్యమే మహా భాగ్యము
**ఆస్తి మూరెడు ఆశ బారెడు
**ఆత్రగానికి బుధ్ధి  మాంద్యము
**ఆవులింతకు అన్న వున్నాడు గాని తుమ్ముకు తమ్ముడు లేడట,,

**ఆవులిస్తే పేగులు లెక్క పెట్టినట్లు
**ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?
**ఆయనే వుంటే మంగలితో ఏమి పని,
 **అబద్దమాడినా అతికినట్లుండాలి,,,
**అబ్యాసం కూసు విద్య,,
**అచ్చగాడి పెళ్ళిలో బుచ్చి గాడికొక జంజపు పోగు,,
**అడగనిదే అమ్మైన పెట్టదు,,
**ఆడవారి మాటలకు అర్ధాలు వెరులె,,
**అడవి గాచిన వెన్నెల,,,
**అడవిలో పెళ్ళికి జంతువులే పురోహితులు,,

**ఆసలు బాబు కన్నా...గుడ్డి బాబు మేలు అన్నట్టు
**అసలు కంటే వడ్డీ అంటే ప్రీతి అట
**అసమర్దుడికి అవకాశమివ్వనేల
**అశపోతుబ్రహ్మడు లేసిపోతూ పప్పుఅడిగాడట
**అతి రహస్యం బట్ట బయలు
**అత్త లేని కోడలుత్తమురాలు కోడలు లేని అత్త  గుణవంతురాలు
**అయిన వారికి ఆకులలో కాని వారికి  కంచాలల్లో  వడ్డించినట్లు
**అయ్య వచ్చె వరకు అమావాశ్య ఆగుతుందా?
**భార్య రూపవతి శత్రుః…

**భక్తి లేని పూజకి పత్రి చేటు
**అయ్యకు లేక అడుక్కు తింటుంటే
కొడుకు వచ్చి కొడి పలావ్ అడిగాడట,
**అయ్యవారిని చెయ్యబొతే కొతి అయినట్లు
**బంతిలో బలపక్షం,,
**బ్రకతలేని వాడు బడి పతులట,,
**బతికుంటే బలుశాకు తినవచ్చు
**బెల్లం చుట్టు ఈగల్ల

**బెల్లం కొట్టిన రాయిల,,
**బావి లొ కప్పలా..
**అంత్య నిష్టూరం కన్న ఆది నిశ్టూరం మేలు
**అనుమానం పెనుభూతం
**అప్పిచ్చువాడు వైద్యుడు అంటారు
**అప్పు చేసి పప్పు  కూడు
**అర్ధరాత్రి మద్దెల దరువు  అన్నట్లు
**అసలే లేదంటే పెసరపప్పు వండమన్నట్టు
**అన్ని దానములలో విద్య దానం గొప్పది
**అన్ని ఉన్న అల్లుని నోట్లో శని వుంది అన్నట్లు

**అంతట బావే కాని వంగ తోట కాదు,,
** చచ్చిన వాడి పెళ్ళికి ఒచ్చినదే కట్నం
**చద్ది కూడు తిన్నమ్మ మొగుడాకలి ఎరగదట
**చదువవేస్తే ఉన్నమతి పోయినదట
**విద్య లేని  వాడు వింత పశువు
**చేతకానమ్మకే చేష్టలు ఎక్కువ
**చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు
**చక్కనమ్మ చిక్కినా అందమే
**చల్ల కొచ్చి  ముంత దాచినట్లు

**చంక లొ పిల్లాడిని పెట్టుకుని ఊరంతా తిరిగిందట
**చస్తుంటే సంధ్యా మంత్రమన్నాడట ఒకడు
**చెడపకురా చెడేవు
**చీకటి కొన్నాళ్ళు వెలుగు కొన్నాళ్లు
**చెముడాఅంటే మొగుడా అన్నట్టు
**చెప్పే వాడికి వినే వాడు లోకువ
**చిల్లర దేవుళ్ళకు చేరువయితే అసలు దేవుడికి దురమౌతావు
**చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి
**చింత చచ్చినా పులుపు చావదు,
** చెప్పేవన్నీ శ్రీరంగనీతులు  దూరేవన్నీ దొమ్మరి
   గుడిసెలు

**చెరపకురా చెడిదెవు, ఉరకకురా పడెదవు
**చెరువుకి నీటి ఆస నీటికి చెరువు ఆశ
**చెట్టు పేరుచెప్పి కాయలమ్ము కున్నట్లు
**చెవిటి వాడి చెవిలో శంఖం ఊదినట్లు
**చేవిటోడి  పెళ్ళికి మూగోడి కచేరి
**చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే
అవంకర టింకరవి ఏమి కాయలని అడుగుతున్ధట
**చిత్తం శివుని పైన భక్తీ చెప్పుల పైన
 **చివికి చివికి గాలివాన అయినట్లు
**చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్టు            
**దాసుని తప్పు దండము తో సరి

**డబ్బేమన్నా చెట్టుకి కాస్తుందా
**డబ్బివ్వని వాడు పడవ ముందు ఎక్కాడట
**డబ్బూ పోయే శని పట్టే                
**డబ్బుకు లోకం దాసోహం
**దేవుడు వరం ఇచ్చిన పూజారి వర మివ్వడు
**దమ్మిడి మున్డకు ఏగాని సవరం అన్నట్లు
**దంచినమ్మకు బొక్కిందే కూలట
**దండం దాస గుణం భవేత్
**దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన
**దయ గల మొగుడు తలుపు దగ్గరకు వేసి కొట్టాడట
**దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి

**దేముడికి దక్షిణ ఎందుకు వెయ్యాలి అంటే ఉత్తరం  వేస్తే వెళ్ళదు గనుక
**దేవుడు గుడి లోనే పదిలం
**దెయ్యలు వేదాలు వల్లించినట్లు
**దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు
**దిన దిన గండం దీర్ఘాయిశ్హు
**దొంగ చేతికి తాళాలు ఇట్చినట్లు
**దొంగకు దొంగ బుద్ధి దొరకు దొర బుద్ది
**దొంగకు తేలు కుట్టినట్లు

**దూరపు కొండలు నునుపు
**దొరికితేనే దొంగలు  దొరక్క పోతే దొరలూ
**దున్నపోతు మీద వర్షం కురిసినట్లు
**దురాశ దుఖ్ఖమునకు చేటు
**దూరపు కొండలు నునుపు
**గాడిద సంగీతానికి ఒంటే ఆశ్చర్యపడితే ఒంటే
అందానికి గాడిద మూర్చ పోయిందట
**గాజుల బేరము భోజనాననికి సరీ
**గాలి లో దీపం పెట్టి  దేవుడా నీదే భారం అన్నట్టు
**గాలికి పొయే దానిని గుండుకి చుట్టుకున్నట్లు

**గంతకు తగ్గ బొంత
**గతి లేనమ్మకు గంజే పానకము
**గోరు చుట్టూ మీద రోకలి పోటు
**గోడ మీద రేపు
**గోడ మీది పిల్లి
**గోడలకు చెవులుంటాయి
**గోడ్డుని చూసి గడ్డి  వెయ్యాలి
**గోముఖ  వ్యాఘ్రం
**గొంత్తెమ్మ  కోరికలు
**గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది
**గోచికెక్కువ  ఉత్తరియానికి తక్కువన్నట్లు
**గోలెందుకు gopi అంటే గోడ కుర్చీ వేసేందుకు kpఅన్నాడట.,
(హహహ ఇది మన తరగతి గదికి సంభందించినది)

**గ్రుడ్డి  కన్న మెల్ల మేలని
**గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు  
**గుడ్డి  కన్నుమోసినా ఒకటె తెరిచినా  ఒకటే నట
**గుడిని మింగే  వాడికి నంది పిండి మిరియమట
**గుడిని గుడిలో లింగాన్ని మింగి నట్లు      
**గుంబనం గునపం లాంటిదైతే,ఆడంబరం అరిటాకు లాంటిదట,
**రావు గారెన్ని రంకెలేసినా నాయుడుగారు నాకేం లెక్కన్నాడట..
**ఎక్కుబెట్టురా ఇనకుల సోమా అంటే ఇరగదీశా చూడు విశ్వామిత్రా అన్నట్టు..


**గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నాడట
**గుఱ్ఱము గ్రుడ్డి దైనా దానాలో  తక్కువ లేదు
**గురువుకు పంగనామాలు  పెట్టినట్లు
**గురువును మించిన శిష్యుడుఛె
**ఇంట గెలిచి రచ్చ గెలువు
**ఇంట తిని ఇంటి వాసాలు లేక్కపెట్టినట్లు
**ఇంటి దొంగను  ఈశ్వరుడైనా పట్టలేడు,.

**ఇంట్లో చూరు కింద నీళ్ళు తాగి
బయటకోచ్చి చల్ల తాగమని చెప్పుకుంటారు
**ఇంట్లో  ఈగల మోత బైట పల్లకి మోత
**ఇస్తే హిరణ్య దానం ఇవ్వక పొతే కన్యా దానం
**ఇసుక తక్కెడ  పేడ తక్కెడ
**జోగి-జోగి రాసుకుంటే రాలేది బూడిదే
**జుట్టు వున్నా అమ్మ ఏ కొప్పు ఐన పెడుతుంది
**కొత్త పండక్కి కూడ పాత మొగుడేనన్నట్లు
 **కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు,,


**కాగల కార్యము గంధర్వులే తీర్చి నట్టు
**కురూపీ, కురూపీ ఎందుకు పుట్టేవే?' అంటే
చక్కనోళ్ళ స్వరూపాలెంచటానికి అందిట.
**కాకి ముక్కుకు దొండ పండు
**కాకి పిల్ల కాకికి ముద్దు
**కాకిలా  కలకాలం బ్రతికేకన్న హంసలా ఆరు నెలలు బ్రతికితే చాలు
**కాలం కలిసి రాక పొతే కర్రె  పామై  కాటు  వేస్తుందిట
**కాలికెస్తె మెడకి మెడకేస్తే  కాలికి  అన్నట్లు
** కాసులుంటే కేసులొక లెఖ్ఖా అన్నట్టు..
** కాలుకు  బలపం కట్టుకు తిరిగి నట్టు...
** కాంత చక్కదనం కడప (గడప) చెబుతుందట,,,


**కాలు జారితే తీసుకోగలము కాని నోరు జారితె తీసుకోగలమా?
**కాషాయం కట్టిన వాళ్ళందరు సన్యాసులు కారు ఖద్దరు కట్టిన వాళ్ళంతా దేశభక్తులు గారు
**కషాయం మింగిన వాళ్లందరికీ కఫం కరగదు
**కాసు ఉంటే చాలు మార్గముంటుది
**కాయా పండా
**కథ కంచికి మనమింటికి
**కడుపా కల్లేపల్లి చేరువా?
**కడుపు చించుకుంటే కాళ్లపై పడ్డట్లు

**కీడెంచి మేలెంచమన్నారు
**కొడితే ఏనుగు కుంభస్థలం మీద కొట్టాలి
**కొంప కొల్లేరు అయ్యింది
**కోనబోతే కొరవి అమ్మబోతే ఆడవి
**కొండ నాలిక కు మందేస్తే ఉన్న నాలిక
ఊడిపోయిందట
**కొండల్లే  వచ్చిన  ఆపద  కూడ  మంచువలే   కరిగినట్లు
**కొండను  తొవ్వి  యెలుకను  పట్టినట్లు

తెలుగు సామెతలు.,2

**కొందరికి  గొప్పవాళ్ళయ్యాక  చిన్నతనం  చెప్పుకోవడం  చిన్నతనం
*కొన్న  దగ్గిర  కొసరు  గాని కోరిన దగ్గర కొసురా
**కూర్చుని తింటే కొండలైనా కరుగుతాయి
**కూసే గాడిద వచ్చి మెసె గాడిదను చెరచిందట
**కూసింత కూతురుంటే అన్నీ మంచం మీదికే కూడునట
**కూటి  కోసం  కోటి  విద్యలు .
**కొప్పున్నమ్మ కొటి  ముడులు  వేస్తుంది .

**కొరకరాని  కొయ్యలా .
**కొరివితో  తల  గోక్కున్నట్లు .
**కోతి  పుండు  బ్రహ్మ  రాక్షసి .
**కోతికి  కొబ్బరికాయ దొరికినట్టు
**కొత్తొక  వింత -పాతొక  రోత .
**కొత్త  అప్పుకు  పొతే  పాత  అప్పు  బయటపడ్డదట
**కొత్త  భిచ్చగాడు  పొద్దు  ఎరగడన్నట్టు .
**కృషితొ  నాస్తి  దుర్భిక్షం
**క్షేత్ర  మెరిగి  విత్తనము పాత్ర  మెరిగి  దానము  .
**కుడుము  చేతికిస్తే  పండగ  అనేవాడు .

**కుక్క  కాటుకు  చెప్పు  దెబ్బ .
**కుక్కవస్తె రాయి దొరకదు రాయి దొరికితే కుక్క  రాదు .  
**కుక్షిలొ అక్షరం ముక్క లేదు కానీ కూర్పు బాగనేఅని
**కుళ్ళు  పిల్లకి   అల్లం  పచ్చడి  అన్నట్టు  
**లో గుట్టు  పెరుమాళ్ళ కెరుకట
**కూటికి పేదైనా గుణానికి పేదను కాదని
**విస్తర్లు తీయరా అబ్బాయి అంటే జనాభా లెక్కేసాడట
** కాశికెళ్ళినా శనీశ్వరం తప్పనట్లు...
** కాలే కడుపుకు కలిగంజే పరమాన్నమట,,
** కాడు రమ్మంటూంది  ఊరు పొమ్మాంటుదని.,,

**మా  తాతలు  నేతులు  తాగారు మా మూతులు
వాసన చూడండి అన్నట్టు,
**మాటలు  చూస్తే  కోతలు  దాటుతాయి .
**మాటలు  నేర్చిన  కుక్క ఉస్కో  అంటే  ఉసుకో
 ఉసకో  అందట .
**మంచమున్నంత  వరకు  కాళ్ళు  చాపుకో
**మంచి  వాడు , మంచి  వాడు  అంటే ...మంచమెక్కి  గంతులేసాడట .
**మంచికి  పొతే  చేడెదురైనట్లు .

** మనిషికొక   తెగులు  మహిలో  వేమ  అన్నారు .
** మనిషొకటి  తలిస్తే , దైవమొకటి  తలిచాడట
** మంత్రాలకు  చింతకాయలు  రాలతాయా? .
** మంత్రాలు  ఎక్కువ . తుంపర్లు  తక్కువ .
** మీ  బోడి  సంపాదనకు  ఇద్దరు  పెళ్ళాల  ?
** మేక  వన్నె  పులి .
** మెత్తగా  ఉంటె  మొత్త  బుద్ది  అయ్యిందట .
** మింగ  మెతుకులేదు  మీసాలకు  సంపెంగ నూనె!

** మొదటికే  మోసం
** మొదట  భోగట , భోగాలేక్కువై  రోగట , రోగాలు   భరించలేక  యోగట .
** మొగుడ్ని   తన్ని  మొర  పెట్టుకుందిట .
** మొగుడు  కొట్టినందుకు  కాదు , తోడి  కోడలు  దేప్పినందుకు  .
** మొహమాటానికి పొతే  కడుపు  అయ్యిందట
**మొక్కై  వంగనిది  మానై  వంగునా  ?
**మోటు మొగునిది నాటు సరసం అన్నట్టు,,,

**మోట గొట్టవే మరదలా అంటే
మొగం అద్దంలో చూసుకొస్తా బావా అందిట,
** మొండి  వాడు  రాజు  కన్నా బలవంతుడుట
** మూల  విగ్రహానికి  లేక  ముష్టి  ఎత్తుతుంటే ,
వుస్త్సవ  విగ్రహాలు  వచ్చి  ఊరేగింపు  ఎప్పుడు అన్నవట
** మూలిగే  నక్క  మీడ  తాటికాయ  పడ్డట్లు .
** మూన్నాళ్ళ  ముచ్చట .

** మొరటి  వాడికి  మొగలి  పువ్వు  ఇస్తే
మడిచి  ఎక్కడో  పెట్టుకున్నాడట .
** మొరిగే  కుక్క  కరవదు .
** మొసేవానికి  తెలుసు  కావడి  బరువు .
** ముడ్డి  మీడ  తంతే  మూతి  పళ్ళు  రాలినట్టు .
** ముక్కట్టుకోమంటే  బ్రహ్మాణుది  ముక్కు     పట్టుకున్నాడట .
** ముక్కు  మీద  కొపం మొదటికే మోసం .

** ముక్కుకు  సూటిగా  పోవడం .        
** ముళ్ళ కంప  మీడ  పడిన  గుడ్డలా …
** ముల్లును  ముల్లుతోనే  తీయాలి , వజ్రాన్ని  వజ్రం తోనే కోయాలట
* ముండా  కాదు , ముత్తైదువా  కాదని .
** ముండా  కాదు , ముత్తైదువా  కాదని .
** ముందర  కాళ్ళకి  బంధాలు  వేసినట్లు .
** ముందుకు  పొతే  గొయ్యి -వెనుకకు  పొతే  నుయ్యి .

** ముందు  వచ్చిన  చెవుల  కంటే  ...
.వెనకొచ్చిన  కొమ్ములు  వాడన్నట్టు .
**ముందుంది  ముసళ్ళ  పండగ .  
** ముంజేతి  కంకణమునకు  అద్దము  ఎందుకు ?
** ముసలోడికి  దసరా  పండగన్నట్లు .
** నారు  పోసిన  వాడు  నీరు  పోయాడా  ?
** నడుమంత్రపు  సిరి , నరాల  మీద  పుండట
** నక్కకి   నాగలోకానికి  ఉన్నంత  తేడా .
** నాట్యం  చేయవే  రంగసాని  అంటె  నేల  వంకర  అందట .

** నవ్వే  ఆడదాన్ని , ఏడ్చే  మగవాడిని  నమ్మ  కూడదు  !
** నవ్విన  నాప  చేనే పండుతుందని
** అగ్గి లేనిదే పొగ రాదు, నిప్పు  ముట్టనిదే  చేయి  కాలదు
** నూరు  గొడ్లు  తిన్న  రాబందుకైన  ఒకటే  గాలిపెట్టు .
** నూరు  గుర్రాలకు  అధికారి , ఇంట  భార్యకు  యెండు  పూరి .
** నోరు  మంచిదైతే ....ఊరు  మంచిది .

** నువ్వు  ఎక్కాల్సిన  రైలు  ఇప్పుడు  ఒక  
జీవితకాలం  లేటు , అది  దేవుడు  ని జీవితంపై  వేసిన వేటు .
** నువ్వు  మేకని  కొంటే , నేను  పులిని  కొని  నీ మేకని  చంపిస్తా  అన్నదట .
** ఓడ  ఎక్కే  దాకా  ఓడ  మల్లన్న ....
ఓడ  దిగిన  తరవాత  బొడి  మల్లన్న  అన్నట్టు
** ఒక  వోరలో  రెండు  కత్తులు  ఇమడవు .
**  అదృష్టం  కలిసి  వొచ్చి  స్వర్గానికి  వెళ్తే ,
రంభ  ముట్టై  మూల  కూర్చుందట .

** ఓలి  తక్కువని  గుడ్డిదాన్ని  పెళ్ళాడితే కుండలన్నీపగలగొట్టిదట  .
** పుండు  మీడ  కారం  చల్లినట్లు .
** పుణ్యం  కొద్ది  పురుషుడు , దానం  కొద్ది  బిడ్డలు .
** పువ్వు  పుట్టగానే  పరిమళించును .
** కుక్క పెత్తనం గాడిద తీసుకున్నట్టు
** రాజుని  చూసిన  కళ్ళకి , మొగుడ్ని  చూస్తే , మొత్తు  కొవలనిపించిధిట

** రామాయణములో  పిడకల  వేట .
** రాత రాళ్ళ  పాలు  ఐతే , మొగుడు  ముండ  పాలు  అయ్యాడట .
** రాజు  గారి  రెండవ  భార్య  మంచిది అన్నట్లు…
** బతకడం  కొసం  తిను తినడం కోసం బ్రతకకు
** తిండికి  తిమ్మరాజు  ....పనికి  పోతరాజు .
** తింటే  గారెలు  తినాలి , వింటే  భారతం  వినాలి

** తియ్యటి  తేన నిండిన నోటితోనే తేనటీగా  కుట్టేది
** పిల్లికి  ఎలుక  సాక్ష్యం అన్నట్టు
** పిండి  కొద్ది  రొట్టెట . టపా కొద్దీ కామెంట్లట
**పిట్ట  కొంచెము  కూత  ఘనమట .
** పోరు  నష్టము  పొందు  లాభమని .
** పూస  గుచ్చినట్టు  చెప్పడం .
** పోరాని చోట్లకు పొతే  రారాని మాటలు రాకపోవు
** పొర్లించి  పొర్లించి  కొట్టిన  మీసాలకు  మన్ను కాలేదన్నాడట .

** పొరుగింటి  పుల్ల  కూర  రుచిట .
** పొట్ట  కొస్తే  అక్షరం ముక్క  లెదు  అన్నట్లు .
** పొట్టి  వానికి  పుట్టెడు  బుద్ధులు .
** పోటుగాడు  పందిరి  వేస్తే  పిచ్చికలు  వచ్చి  కూల  దోసాయట .
** పౌరుషం  పుంల్లింగం , సహనం  స్త్రీ  లింగమట .
** పులిని  చూసి  నక్క  వాత పెట్టు కున్నట్లు
** మొదలు  చెడ్డ  బేరము .

** తంతే గారెల  బుట్టలో  పడ్డట్లు .
** తను చేస్తే  శృంగారం, పరులు చేస్తే వ్యభిచారం .
** తను వలచింది  రంభ,తను మునిగింది  గంగట .
** తప్పులు  వెదికే  వాడు, తనతప్పు లెరుగడట..
** తప్పించుకు తిరుగు వాడు ధన్యుడు సుమతీ అని
** తీగ  లాగితే  దొంక  అంతా  కదిలినట్లు .
** తెగే దాక  లాగకురా తాండవ శాస్రీ అని

** తేనె  పూసిన  కత్తి.
** తిక్కలోడు  తిరనాళ్ళకు  వెళితే  ఎక్క  దిగా  సరిపోయిన్దందట
**తినే  ముందు  రుచి  అడుగకు , వినే  ముందు  కథ  అడుగకు .
** తినగా తినగా  గారెలు  చేదట .
** తిండి  కొసం  బ్రతక్కు బ్రతకటం కోసం తిను.
** ఊపకారానికి  పోతే  అపకారమెదురైనట్లు .

** ఉరుము  ఉరుమి  మంగళం  మీద  పడ్డట్లు.
**దేవుని పెళ్ళికి ఊరంతా పెద్దలేనట
**పంతులు గారి పెళ్ళికి సాయిబు గారి మంత్రాలట
**ఏడ్చే దాని మగడొస్తే నామగడు రాడా అని.
** ఉపాయం లేనోడిని ఊర్లో ఉంచొద్దట,,,
**తా దూర కంత లేదు మెడకో డోలని
** తాతకు దగ్గులు నేర్పినట్టు.,,

**కాటికి కాళ్ళు చాపుకున్నా కన్నె పడుచు కావాలన్నాడట,,
** ఉట్టికెక్కలేనమ్మ  స్వర్గానికేక్కున ???
** వాడే  ఉంటె  వైధవ్యం  యెందుకు , గుండు  యెందుకు
** వాపును  చూశి  బలపు  అనుకున్నాడట .
**వడ్డించే  వాడు  మన వాడైతే , ఎ  పంక్తి  లొ  వుంటే  ఏం  ?
** వడ్ల  గింజలో  బియ్యపు  గింజె రహస్యం .
** వండుకున్న  అమ్మ  కన్నా  దండు  కున్న  అమ్మ  గొప్ప .

** వీపుమీద  కొట్టవచ్చు  కాని  కడుపు  మీద  కొట్టరాదు .
** వెన్నతో  పెట్టిన  విద్య .
**ఎర్రి  వెయ్యి  విధాలు .
** వెయ్యి  అబద్దాలాడైనా  ఒక  పెళ్లి  చేయ్యమన్నట్లు
** వినాశ కాలే  విపరీత  బుద్ది .
** వినేవాడు  వెర్రి  వెంగలప్ప  అయితే  చెప్పే  వాడు  వేదాంతి ట .

** వినే  వాడు వుంటే, అరవం  (tamil) లో హరికథ
చెప్పుతాడట నీలాంటి వాడు
** విశ్వేస్వరుడికి  లెక  విభూది  నాకుతూ  ఉంటె ,
నందీశ్వరుడు వచ్చి నాకేది నారికేళం అన్నాడట .
** ఏ  ఎండకు  ఆ  గొడుగు .
** ఆడ లేక మద్దెల ఓడందిట .
** ఎద్దు  పండు  కాకికి  ముద్దా ?

** ఎగిరే  గాలిపటానికి  దారం  ఆధారం .
** చూపులకు గుఱ్ఱమే కాని సుఖపెట్టే గుఱ్ఱం కాదని
** యేకులు  మేకులయ్యయట .
** ఎలుక  తోలును  తీసి  తేడాది  రుద్దిన
నలుపు  నలుపే  కాని తెలుపు రాదని …
** ఎండా  కాలంలో  తిరిగి  తిరిగి  రెక్కలు
పడిపోతున్నాయి  బాబు అనుకుందట  ఫ్యాన్ .
** ఏనుగు బతికినా వెయ్యే చచ్చిన వెయ్యె అని

 **గొడ్డు బర్రె ఈనాలెపుడు చిల్లు కుండ నిండాలెపుడని,
** ఎవరు  తీసిన  గోతిలో  వారే  పడతారు .
**తా  చెడ్డ  కోతి  వనమెల్లా  చెరిచిందట
**ఉత్తరలో ఊడ్పుకన్నా ఒడ్డున కూర్చొని ఏడ్పు మేలట
** తాడి  తన్ను  వాని  తల  తన్ను  వారు  ఉండును
** తాళిబొట్టు  బలము  వాళ్ళ  తలంబ్రాల  వరకు  బతికాడు .

** తాను  పట్టిన కుందేలుకు  మూడే  కాళ్ళని .
** తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు  బెదురునా ?
** తేలుకు  పెత్తనమిస్తే  తెల్లవార్లూ  కుట్టిందట .
** తల్లి  పిల్లల  అరుగుదల (digestion) చూస్తుంది ,
తండ్రి  పిల్లల  పెరుగుదల  (growth in education etc.) చూస్తాడట .
** తన  కోపమే  తన  శత్రువు .
** తనకు మాలిన ధర్మం  మొదలు చెడ్డ బేరం.

** సత్రం  భోజనం  మఠం  నిద్ర .
** సీత  కస్టాలు  సీతవి, పీత  కస్టాలు పీతవని .
** సిగ్గు  విడిస్తే సింగారం లజ్జ విడిస్తే బంగారం
** సిరి గలమ్మ చీర కూడ బరువందట.,,
 ** సింగడు  అద్దంకి  పోను  పొయ్యాడు  రాను వచ్చాడు .
** శివుని  ఆజ్ఞ  లేఖ  చీమైనా  కుట్టదు .
** సొమ్మొకడిది  సోకొకడిది
** శుభం పలకరా  పెళ్ళికోడక  అంటె  పెళ్ళి
కూతురు  ముండ  ఎక్కడ  చచ్చింది  అని అడిగాడట

** శ్వాస  ఉండేవరకు  ఆశ  ఉంటుంది .
** తడి  గుడ్డతో  గొంతులు  కోసినట్లు .
** తమ్ముడు  తమ్ముడే , పేకాట  పేకాటేనట !
** ఇహము పరము లేని మొగుడు ఇంటి నిండా.,
రుచీ పచీ లేని కూర చట్టి నిండాఅని
** నాజూకు నడకేమే నాంచారి అంటే
నైటీ వేసుకున్నాగా నాయుడు బావ అందిట..

**పదుగురాడింది మాట నలుగురు నడిచింది బాటట
**మూరెడు పద్యానికి బారెడు రాగమని..
** ఇంగువ కట్టిన బట్టకు వాసన పోదని
**ఇంట్లో ఈగల మోతబయట పల్లకీ మోతని
** అసలు లేదురా మగడా అంటే
పెసర పప్పు వండవేపెళ్ళామా అన్నాడట
**ఇంట్లో ఇత్తు లేదు నేనిల్లాలిని దొడ్లొ కడి లేదు నేదొరసానినందట
** తిన మరిగిన కోడి ఇల్లెక్కి కూసిందట

Thursday, June 23, 2016

రావా నేస్తం..,?ఎప్పుడొస్తావు నేస్తం..(నా వచన కవిత)

1--రావా నేస్తం?---27/1/2016

కటిక చీకటిలో
కరదీపిక అనుకున్నాను

వలపు కొలనులో
కలువ పూవనుకున్నాను

నా వంకర బ్రతుకుకు
ఊతం దొరికిందనుకున్నాను

క్షణికావేశంలో
కనపడకుండా పోతావనుకోలేదు,

 రావా నేస్తం  ?

*******************************
*2--కరుణించవా నేస్తం?...,28/1/2016

వినపడుతూనే ఉన్నాయ్ నీ నవ్వులు!
గలగలా ప్రవహించే గోదారి ఉరవడిలా!!

కోయిల కంఠంలా ప్రతిధ్వనిస్తూనే ఉంది!!
నీ కొంటె పిలుపు "ఓయ్ ఓయోయ్ ". కవ్విస్తూ

"లేరా చిన్నా లే"..వలపు నింపిన నీ
లాలిత్యపు పిలుపు ,నా పై అధికార మొలికిస్తూ.,!!

అయ్యో...మరచేదెలా? నేస్తం
నేను మరణించే వరకు కరుణించవా నేస్తం?!!

రావా నేస్తం!

*******************************
3--ఎక్కడున్నావు  నేస్తం----29/1/2016

నా  మనసు వీణ పై గుసగుసల
సరిగమలాలపించి ఆనందాన్ని అందించినదీ నీవే !!

నా యెద పలకము పై నాట్యమాడిన
నీ చేతి వేళ్ళస్పర్శతో అనంత తీరాలకు చేర్చినదీ నీవే !!

మమత ఉలి వలపు సుత్తీతో ఈ రాయిని
అద్భుతమైన సుందర  శిల్పంగా  మలుస్తానన్నదీ నీవే !!

వీణ మూగబోయిందే? నాట్యమాగిపోయిందే?
ఉలి పరుగు, సుత్తి దెబ్బ లేవి? అసలెక్కడున్నావు నేస్తం?

రావా నేస్తం !!

*******************************
*4--మరిచావా నేస్తం...? 30/1/2016

నీ తడబడు అడుగుల మంజీర నాధం !
నా యెద  లోతులలో నాగస్వరంలా మారుమ్రోగిందే!!

ధవళ వర్ణపు  మేలిముసుగుతో నిశరాత్రి !
నువ్వు నన్ను చేరితే శశి మబ్బుల మాటున చెరెనే!!

తడి యారని పెదవుల తహతహలతో నీవు! నాలో !
సగమైన వేళ అర్థనారీశ్వరుడే అమ్మకు కను సైగ చేసెనే!!

పొన్న చెట్టు పైన నున్న చిన్ని గువ్వలు రెండు మన!
గుసగుసలకు ముక్కులు రాసుకుంటూ కువకువ లాడెనే!!

మనోహరమైన నీ మేని సువాసనలకు మన్మధుడే !
మతి తప్పి మౌనిగా మారిన ఆ రేయి! మరిచావా నేస్తం?!!

రావా నేస్తం?
*******************************
5--తరించానన్నావుగా  నేస్తం!--?  31/1/2016

ఆ సుదినం నువ్వు "నన్నెక్కడికో " కొనిపోయావే!
ఆక్షణం నామనసు తనువూ నా అధీనం తప్పినపుడు!

నీ పెదవుల గుసగుసల ప్రతి అక్షరమూ నా మదిలో చేరి!
ఆ అక్షరాలే నా మనో ఫలకముపై అముద్రిత గ్రంధాలై!!

మన ప్రతి కదలికా రతీ మన్మధుల భంగిమలై
ప్రతి భంగిమా నాకనుపాపలలో కదలాడే వర్ణ చిత్రాలై!!

నీ నిశ్వాసలోని వేడి నిట్టూర్పులే,  మన్మధ బాణాలై
క్రీగంటి చూపులే వెన్నెల కాంతి రేఖలై నేపరవశిస్తూ!!

జుంటె తేనె కంటే తియ్యనైన నీ అధరామృత ధారలు
గ్రోలి నే విశ్రమించిన వేళ ఆదమరచి నాయెదపై వాలి !!

తరించానన్నావుగా నేస్తం!.....రావా నేస్తం?

*******************************
6--ఎలా ఉన్నావు నేస్తం....3/2/2016

ఒక్క రోజు నే కనపడకపోతే వడలిన సన్న జాజిలా!
ఒంటరి గువ్వలా , జడి వానకు వంగిన పుష్పంలా!!

ఒక్క రోజు నా స్వరం వినకపోతే తీగలుతెగిన వీణలా!
శృతి తప్పిన నాదంలా గతి తప్పిన నాట్య మయూరిలా!!

ఒక్క రోజు నా స్పర్శలేకపోతే! ముడుచుకున్న మందారంలా!
రేక లూడిన గులాబిలా !గానం మరచిన కోయిలలా మారి!!

అరక్షణం జాగుకు వేగ లేక  వేగి పోతూ క్షణక్షణం నా!
ఆలింగనం కోసం ముందా తొందర చర్య కై తపించి!!

కన్నులలో కన్నీరు.కనుపాపలలో నారూపు నింపుకొని!
చెకోరంలా ఎదురు చూచిన నువ్వు ఎలా ఉన్నావు నేస్తం!!

రావా నేస్తం?

*******************************
7--మరవాలెలా? నేస్తం..?.,4/2/2016

"నువ్వక్కడే నేనిక్కడే మరెక్కడో కలుద్దామొస్తావా"!
నిన్న మొన్న నువ్వన్న పిలుపు నన్నింకా ఊరిస్తూనే ఉంది!!

"ఒరేయ్ కన్నయ్యా-నవ్వించకురా నన్నిలా ఊఁ ..చంపుత."
నీ చిరుకోపపు చిలిపి పదం నా యెదలో మ్రోగుతూనే ఉంది!!

"ట్యాబుతెరిసి చూడు" "పిలవరా" మేఘసందేశం మేసేజ్
అడిగి మరి అల్లరి నామదినిండా అలజడి వల్లరి గిలిగింత

చీకటి మాటున చిలిపిగా నీ చీరకుచ్చిళ్ళు  చేపట్టి నేను
చిరు చెమటలతో నుదురు, నుదురుపై చెదరిన ముంగురులు!!

మేడపై నీ ముగ్ద మనోహర రూపం! రాకుమారిని బోలి
రాయంచ నడక ! ఆ నడకే నాకు రాచ బాట...మరవాలెలా నేస్తం!!

రావా నేస్తం  !!

*******************************
8--బ్రతక గలనా నేస్తం ?---5/2/2016

నక్షత్రాలు రాలినట్లుండే నీచిరుధరహాసాలకు దూరమై!
చిలక పలుకులను మరపించు నీ చిరు సవ్వడికి దూరమై!!

సుందర మృదు మనోహర నీ రూప లావణ్యం.పున్నమి!
చంద్రునికే ఈర్ష్యను కలిగించు నీముఖారవిందం చూడక!!

వెన్నెల కురిపించు నీ చల్లని చూపులకు దూరమై!
నీకరములు నా కరముతో ఆటలాడి బంధనము లేయ

అరవిరిసిన గూలాబీల సోయగాలద్దుకున్న నీ చెక్కిళ్ళపై!
చిలిపి గుర్తులు చిత్రించక.నీ చిగురు పెదవులు రుచి చూడక!!

మన్మధ ధనుసును బ్రోలు నీ నడుము ఒంపుసొంపులపై!
నా మునివేళ్ళు నాట్యమాడించక నే బ్రతుక గలనా నేస్తం  !!

నేనున్నానన్న నమ్మకమే నీ జీవిత గమనానికి చిరుదీపిక
గానెంచి అలసి సొలసిన  నన్నిడిచి నీవు ఎటో ఎగిరిపోతే

బ్రతుక గలనా నేస్తం? రావా నేస్తం.,

******************************
9--ఎప్పుడొస్తావు నేస్తం?..,6/1/2016

ఓహో ఓహో నేస్తమా! ఆహా నా ఆరాధ్య రూపమా!!
ఏమి నీ మహొజ్వల శక్తి !ఇంతటి బడబాలనమా!!

మురళీ నాదమే నీ స్వరం!మృధు మనోహరం నీ రూపం!!
జలపాతం నీ ధరహాసం! సుశోబితం నీ అభినయం!!

కంటి నిండా నీరూపమే!లేదు మరేది అంతా శూన్యమే!!
మనసు నిండా నీతలంపే! వలపుల విరులన్నియు.నీ పైనే!!

నీకైశ్రమించి తపించి పరితపించి మసిబారిన నేను
నీ యెడబాటును మోయలేక కృంగి పోయిన  నేను

ఎరుపెక్కిన కన్నులతో!  యెద సవ్వడి నిట్టూర్పులతో!!
చెట్టు పై చెకోర పక్షిలా !ఎదురు చూపులు నీకొరకే !

ఎప్పుడొస్తావు నేస్తం?------రావా నేస్తం?
*******************************
10--దయలేదా నేస్తం?--7/2/2016

మాటలతో మత్తెక్కించి!అంతలోనే అగాధంలో తోచావు!!
చేతి కందినట్లే అందావు!అందనంత దూరాన దూకావు!!

శూన్యంలో మన్యం పండించావు!చీకటిలో కరాళ నృత్యం చేయిస్తావు
వలపు రూపమే నాకు శాపమా? ఆ శాపమే నాకు మోహమా?

మురిపెము మూడు దినాలా?ముసలం ముప్పది యేండ్లా?
వడిదుడుకుల జీవితానికి  వలపు సంకెళ్ళు ఆభరణాలా?

చిరు ధరహాసాలే గురిచూసి వదిలిన శరాఘాతాలా?
నీ క్రీగంటి చూపులే యమ పాశాలా?దయలేదా నేస్తం!!

...రావా నేస్తం?
*******************************
11..ఎలా తీర్చుకోను నేస్తం.,,,?--8/2/2016

తడబడు అడుగులతో వచ్చి నీ బాహు బంధనములో చిక్కి
పరవశించి నే గోముగ నీ యెద పై వాలి దేనికో వెదకంగ

అక్కన జేర్చుకొన జక్కగా పయ్యెదమాటున జేరినే
ధారలు గ్రోలుచు..మునిపంట కొరికితే చిరుకోపముతో

చెంపపై చిటికేసి తమకంగా నావేపే చూస్తూ మైమరచి
నామోముపై ముచ్చటగొని ముద్దులిడి పరవశించితివే

తనువంతా తడిమి  ముద్దులిడుతూ జలకమాడించిన
నీ స్పర్శకు నా వడలంతా పులకరించి నే పరవశించితినే

మేడపై సన్న జాజులు సుతారంగా నువ్వు తుంచెడి వేళ
తుంచిన జాజులు మురిపంగా నీ ముని వేళ్ళు మాల కట్టు వేళ

నీ ప్రక్కన పక్కపై చేరి నే చేసిన చిలిపి అల్లరి జడలో జాజులు
నా చేతులలో పడి చిందర వందరగా రూపు మారిన వేళ

అల్లరి చేష్టలతో నీతో ఆడుకొని అలసి సొలసి నిద్రించగ
నుదురుపై ముద్దిడి చమట బిందువులద్ది అలరించిన నీ

ఋణమెలా తీర్చుకోను నేస్తం?  రావా నేస్తం?
*****************************
12--నాకు గుర్తే నేస్తం ! 9/2/2016

నల్లని నాగకన్యను బోలిన నీజడ పాయలలో తురిమి
పుడమంతా  పున్నమి వెన్నల పూసినట్లున్న మల్లెలు

ఘల్లు ఘల్లున మ్రోగు నీ కాలి గజ్జెల సవ్వడి నాకు
చెయ్యి తిరిగిన మృదంగ వాద్యకారుని నాదములా

చెదరిన ముంగురులతో ,మంచిముత్యాల వలే చిరుచెమట
బిందువుల పాలభాగాన, చక్కని సింధూరపు బిందువు తో

గలగలా పారే గోదారి వరదలా  పరుగున నన్నల్లుకు పోయి
జలజలా పారే గంగా ప్రవాహంలా నీ కంటరాలే అశృధారలు

కనినంత  నా మదిలో యెన్నెన్నో ఙ్ఞాపకాల దొంతరలు
పొర్లి పొర్లి సెలయేటి ఉరవడిలా నన్ను చుట్టు ముట్టిన వేళ

నగుమోముతో నా కరమందుకొని బంధించి  నేనున్నానన్న
రవ్వంత గర్వం నీ కనుపాపలలో కదులాడిన నారూపం

నాకు గుర్తే నేస్తం !    ----రావా నేస్తం?

******************************
13---మరలిరా నేస్తం....10/2/2016

మదిలో మెదిలిన నీ మమతానురాగాలు మహా వృక్షమై
వేళ్ళూని  నలుదిశలా విస్తరించి  నన్నూరడించిన వేళ

నీ మేని స్పర్శ  చల్లని చిరుగాలిలా నన్నాదరించి లాలించి
నీ సత్తువ నంతా నాకై రంగరించి నాపై గంధంలా చిలుకరించి

నీ గంభీర వదనారవిందంగని నే గువ్వలా ముడుచు కున్న వేళ
ఫక్కున నవ్వి నన్ను  నీ బాహు బంధనములో బంధించితివే

కను చూపులతోనే మనమిరువురం కచాలనం చేసుకుంటూ
మూగ భాషలోనే మురిపమొలుకు ముచ్చటులెన్నో కదా

నీకై ఎదురుచూపులతో నాకు తెల్లవారిన ఉషోదయాలు ఎన్నో
నా రాకకై పరితపించి నీకు ఉదయించిన చంద్రోదయాలెన్నో

వసంతాలకు వసంతాలు వస్తూ.,,పోతూనే ఉన్నాయ్
చక్రభ్రమణం ఇసుమంతైనా మనకోసం ఆగింది లేదు

మళ్ళొస్తారా నానా అన్న నీ కమనీయ కంఠం మరలా మ్రోగదే?
నీ అమృతమొలుకు చల్లని చూపుల తాకిడి తగలదే నాకు

మరలిరా నేస్తం....రావా నేస్తం?

*******************************

14--నేను నువ్వే నేస్తం,,,11/2/2016

వసంత కాలంలో మావి చిగురు తిన్న కోయిల రాగంలా
ముని వేళ్ళ తాకిడికే వీణ తంత్రులు పలికే సప్త స్వరాలలా

బారులు తీరిన మేఘాలు చూసిన నెమలి నాట్యంలా
చిరు పెదవుల చిరుగాలికి చిగురించే మురళీ నాదంలా

ఆకాశంలోని చంద్రుని చూసి కలువ భామ వికసించినట్లు
నీ పిలుపు వినగానే పరవశంతో నా మనసు వికసించింది

నువ్వు నన్ను కోరుకోవటం నేను నీకు మనసివ్వటం
నువ్వన్నట్లు మనం సగం సగం  ఈ ప్రకృతిలో చెరిసగం

నాలో నువ్వో సగం నా కలతలు పంచుకుంటూ ప్రేమగా
నీలో నేనో సగం మమతలమాధుర్యమందుకుంటూ ఆశగా

ఈ చరాచర జగతిలో నువ్వు నేను అణువంతే అయినా
మన ప్రేమ మధురిమ ఈ ప్రకృతి ధర్మంలో కలసిపోయింది

నేను నువ్వే నేస్తం...రావా నేస్తం?

*******************************
15- ఎన్నాళిలా నేస్తం? -12/2/2016

నీ చల్లని పలుకులకు వేడి నిట్టూర్పులకు పరవశించె నా
బ్రతుకో ఏకాంతం, మహా బడబాలనంతో నిండిన సంద్రం

మూగబోయిన నా మది భావాలను తట్టి లేపిన నువ్వు
ముడుచుకు పోయిన శరీర సుగంధాలను కుదిపి లేపిన నువ్వు

ఎడారి లోని ఒంటరి ఒయాసిస్సు లాంటి నా బ్రతుకు
వలపు కొలనులో కలువలు పూయించిన నీ చిరునవ్వు

నీ ఓర గంటి చూపులు వలపు బాణాలై నాహృది తాకితే
మంచు బిందువు లద్దుకున్న ముద్ద మందారంలా నేను

నీ నోటి నుండి వెలువడే ఒక్కో మాట నా చెవులకు సోకితే
అవి ఓం శబ్దంలా చర్చి గంటల్లా,అల్లాహో నమాజు నాదాలై

నిద్రకు నోచుకోని నాకళ్ళల్లో కదులాడే నీ రూపలావణ్యం
నే వ్రాసే ప్రతి అక్షరమూ నీతో గడిపిన మధుర క్షణాలై

సజీవ చిత్రాలలా నా మనోఫలకంపై చెరగని ముద్రవేసి
ఆరిపోయే దీపానికి ఆముదమందించి వెలిగిస్తూనే ఉన్నాయ్

ముసురుకొనే కారు చీకటికి చిరుదీపపు వెలుగులా
ఆరిపోయే జ్యోతికి అరచేయి అడ్డులా  ఎన్నాళిలా ప్రియా?

రావా నేస్తం?

***********************
16-- తగునా నేస్తం?--13/2/2016

కాలం మగ్గంపై నేసిన కలనేత  రంగుల చీరలోని ,పడుగూ
పేకలా మంచి చెడులను విడమర్చి చెప్పెడి ప్రియతమా!

చిరుగాలులకు నటనమాడు చిగురాకుల గుసగుసలలా
నవ యవ్వన బింభాధరాల అరుణారుణ కాంతిరేఖ శోభినీ!

చెలీ !నీ కోమల కరకంకణముల సవ్వడి ఆమని ఝుంకారములా
నవ యవ్వనికి ఝుంమ్మని రేగిన మదన కోరికల ప్రేమ లేఖలా!

ప్రియా! నీవలపు విందుకోసం తత్తరపాటుతో బిత్తర పోతూ,గాలికి
ఎండుటాకు కదిలినా నీ కాలి యందియల సవ్వడేగా నాకు!

ప్రియతమా! నిరతం నీ గాత్ర మాధుర్య లాలనా పరవశంలో
మైమరచి నీ నవ్వుల పానుపుపై హాయిగా పవళించ గోరెదనే!

నాకై విరబూసిన నీ వలపు వృక్షపు నీడలో పరుండి సేద
తీరెడి నాకు నీ మనసు సున్నితత్వం  తెలియదా?

నాకు మరియొక అతివతో నేస్తమా? హాహాహా  లలనా ?
సహజమైన స్త్రీ  మనో దౌర్భల్యమునకు నీవునూ బానిసవేనా

లేక నాపైనున్న మోహామృత ధారలు నీమనసునలా
సందేహ సంశయములో వేసి వేపు చున్నవా చెలియా?

కలనైనా మరో కలికి రూపము కానని నాపై నీ కాఠిన్యమా?
ఏమి నీ వలపు వైపరీత్యము? ఔరా! ఎంతటి నెరజాణవు?

నీకిది తగునా నేస్తం,.?  రావా నేస్తం?
*****************************
17--అనుమతిస్తావా నేస్తం,.?---14/2/206

రోజు రోజుకూ నువ్వు మారతావన్న ఆశ కొడిగట్టి పోతూ ఉంటే!
కనులలో నీరూపం నింపుకొని నే జీవచ్చవంలా మారిన వేళ

భూమండలం బ్రద్ధలైనట్లూ... ఆకాశం కుప్పకూలినట్లూ!!
సూర్య చంద్రులు అపసవ్య దిశలో ఉదయించారా అన్నట్లు

కాలి క్రింద నేల కంపించి నేనగాధంలో కూరుకు పోయినట్లు
ఆకాశంలో ఇంద్ర ధనస్సు విరిగి ఏడేడు ముక్కలైనట్లు

సప్త సముద్రాలు ఒక్కసారిగా  ఇంకి పోయి నెర్రెలు వారినట్లు
చరాచర జగత్తు మొత్తం ఒకేసారిగా చలనం కోల్పోయినట్లు

నీ నోట "నిలువదురా మనబంధం" అన్న ఒకే ఒక్క మాట
నా నవనాడులూ తెంచి నాహృదిని ముక్కలు చేసింది!!

నాకే సంబధమూలేని విచిత్రమైన ఈ వైకుంటపాళి ఆటలో
నువ్వు గెలిచి ఓడావో నేను ఓడి గెలిచానో కాలమే కదా చెప్పాలి!!

అంతులేని ఈ వేదనాభరితమైన పలుకులు భరించగల శక్తి
నా సున్నితమైన మనసుకు లేదు, అంతభారం మోయనూలేదు!!

నీవు వలదన్న పిమ్మట ఈ రమణీయ మనోహర ప్రకృతి సౌంధర్యముతో నాకింకా పనేముంది. నిష్క్రమిస్తున్నా ప్రియా..!
నీవలదన్న పిమ్మట అర్హతకోల్పోయిన  ఉత్తమ ఆటగాడిగా-నాకీ విశాల ఆటస్థలంలో  పనేముంది వెళ్ళిపోతున్నా చెలీ !

ప్రేమికులంతా  ప్రేమదినోత్సవంనాడు ప్రేమసాగరంలో మునిగి తరిస్తున్న వేళ !
మరలి రాని మరోలోకాలకేగ నాకు నేనే మరణ శాసనం వ్రాసుకున్నా చెలియా!

రోధించకు ప్రియా! నీ కనులలో నీరు నే చూడలేను! ప్రియతమా
మరో జన్మంటూ ఉంటే నీ అడ్డాలలో బిడ్డగానైనా తిరిగి రావాలనుంది!

నీ కోసం మళ్ళీ మళ్ళీ పుట్టాలనుంది.. అనుమతిస్తావా నేస్తం?.మరలి రానా నేస్తం?

*******************************
18--వచ్చావా నేస్తం...15/2/2016

మరణ శయ్యపైనున్న నన్ను కనులారా చూడటానికొచ్చావా నేస్తం?
నీ కనుకొలకలనుండి జారే ప్రతి నీటి బిందువులోను నా రూపే!

బరువెక్కిన గుండెలతో బాధాతప్త హృదయంతో పరుగు పరుగునా వాయువేగంతో కదిలొచ్చావా
మమతానురాగాల మేళవింపుతో మదిలో మాలిన్యాన్ని
మచ్చుకు కూడా లేకుండా కడిగేసుకోని  మహా పునీతగా

పసిపాపగా.నవ యవ్వనిగా..చెల్లిగా, అక్కగా, అమ్మగా,
ఆలిగా ,ప్రేయసిగా, నా ఆరాద్య దేవతా మూర్తిగా, నిలవాలని

నీవేపేరులో ఉన్నా ఈ మానవాళికంతటికీ మహోన్నత
మార్గదర్శినివి మమతానురాగాలు పంచే మాతృమూర్తి నువ్వేనని

నీవు లేని నాడు ఈ సువిశాల ప్రపంచలో మానవాళికి
అవతరణేది? ఆలంబనేది ? అత్యున్నత శిఖరాలకు దారేదని?

ఒర్పు సహనం ఆభరణాలు గా అవతరించిన నీరూపం
అమృత మూర్తిగా, నీవు అవనితో సమానం కదా?ఆందుకే

నీ వనుమతించవని ,నా మరణ శాసనం రద్దు చేసుకోవాలని
ఆఖరి ఘడియలలోనైనావచ్చి ఆదుకుంటావని..నాకు తెలుసు

కరుణించిన నీ బాహుబంధాలలో బంధీనై. నీ ప్రేమామృత
దారలలో తడిచి ముద్ద కావాలని నా మనసు ఉవ్వీళ్ళూరుతుంది

వచ్చావా నేస్తం......,పయనిద్దాం పద నేస్తం.......

*******************************




వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి...76 to 104 (అచ్చంగా తెలుగు బృంద సభ్యులపై నా పద్య కవిత)

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......76--14/11/15

తే.గీ--152
శ్రీ దయానంద స్వాములన్ ప్రీతి గొల్చు
కన్నెమనసుచోరుండట వెన్న  దొంగ
పిల్ల కోతితొ పోలిక నల్లె జనుల
ఉల్లి పేరడి పాటలు యల్లె గనరె

తే.గీ--153
అంతయునునీవె యంత్ర్యామి యనును గనుము
అమ్మ ముగ్గురమ్మలయమ్మ మమ్ము గావు
నృత్య రీతి కథాకళి నిష్ట పడును
వివిధ శాస్త్రము లందున వీరు ఘనులు

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీమతి సుజల గంటి  వారికి అభినందనలు  నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం
 చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?...77----15/11/15

ఆ.వె--154
సాయి నాథు నెపుడు సరిగజూపు చునుండు
చక్కనైన ఠీవి మిక్కుటముగ
శిల్ప సంపదనిన శిరమునిడుకొనును
బందు, హితుల తోడ పొందు శుభము....

ఆ.వె--155
మంచి నీటి కొరకుమాటువేసిచిరుత
బిందె లోన మూతి బిగిసె గనరె
సంతసంబు తనకు నెంతయో మదినిండె
మురళి, రాజు తోడ ముచ్చటాడ...

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ  ప్రసాద్ అక్కిరాజు గారు వారికి అభినందనలు   నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......78--16/11/15

తే.గీ--156
సరిగ శుభరాత్రి యనెజెప్పు సాయి బంధు
అమ్మ వారిప్రతిమలద్భుతమ్ము జూపు
మూడు రంగుల జెండాకు మురిసి పోవు
మంచి వారల మాటల నెంచి చూపు......

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ  Someswara rao malyala గారు వారికి అభినందనలు   నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......79--17/11/15

తే.గీ--157
పాని పూరి లనగనెంతొ పరవశమ్ము
కబురు కాకర కాయల గుబులు రేపు
రవ్వ దోశల కొచ్చెగ రంగు రూపు
రాయ గలరెన్నొముచ్చట్లు హాయి గొలుప

తే.గీ----158
తీపి గురుతులు మదినిండ తీసిచూపు
పప్పు గింజల కొరకు తానప్పుగోరె
ఓటు వేయుట పప్పుల రేటు గనుము
మంచి గుమ్మడి కళలందు నెంచి చెప్పు


నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ  Sagar Lanka గారు వారికి అభినందనలు   నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......80--18/11/15

తే.గీ--159
తెల్వ రస్సేను హుస్సేను, తెలుసు నాకు
పీర్ల పండుగ దరువుల పిలుపు లపుడు
కవిత లూయల కమ్మని కవిత లల్లు
తెల్ల మైదానమెరుపెక్కె కలము వలన

తే.గీ---160
వెలుగు చాటున చీకట్లొ నలిగె నెన్నొ
కాలె కాగడా వెలుగులోకనర యనెను
మసక చీకటి లోపల మనసు ఘోష
సీటు మిచ్చరు పంచెను లేటు గపుడు

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ  Rayachoti Krishnamurty గారు వారికి అభినందనలు   నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి


వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......81--19/11/15

తే.గీ---161
వివర మిచ్చెనవార్డుల విషయమందు
రెండు బంగారు నాణాల మెండు గనరె
హనుమ చాలీస పుట్టుక యసలు కథను
శుద్దమగురీతి పలుకును శుభము లెన్నొ

తే.గీ--162
గట్టి మహిమతొ జూపెను మట్టి చిప్ప
అబ్దులయ్యకు నివ్వాళి యద్భుతమ్ము
ఙ్ఞాన సంపద సంద్రము ఙ్ఞాన శీలి
మంత్ర మహిమను గట్టిగ మనకు దెలిపె

తే.గీ-163
పెండ్లి రోజును పోల్చెను ప్రేమ తనము
చంద్ర గ్రహణము తీరును జదువ వలెను
మంచి విషయము లొదలక నెంచి చూపు
చదివె సంస్కృతాంధ్రములను సరిగ జూడ


నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ  Krishna Mani గారు వారికి అభినందనలు   నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......82--20/11/15
తే.గీ---164
మంచి పద్యాల నెప్పుడు యెంచి చూపు
కొత్త మేళము వీణను కొసరి జూపె
రాగ శృతుల సరిగమల రంజు యెరుక
తెలుగు వాచక గుర్తులు తెలిపె మనకు

తే.గీ--165
అడిగె వామనగుంటల యాటనెంచి
యస్వి రంగని నటనలొ యశము జూపె
గుడులు జూపును, దేవత గోపురములు
పంచె కట్టుట యెటులనొ పట్టి జూపె

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ  శ్రీనివాస ప్రసాద్ శుద్దపల్లి గారు వారికి అభినందనలు   నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......83--21/11/15

తే.గీ--166
ఊసు లల్లును మేజాకు లేసు లవియె
కాలి మువ్వల సవ్వడి కాగితములు
పాకులాడకు కనరాదు పాడు మనసు
నిన్ను వెంటాడు నీయాత్మ నీడ యనును

తే.గీ--167
మనము పండినా మొలకెత్తు మట్టిలోన
కాయ గలమను చెట్టుకు కాలమైన
నింగి కంపును కాయము నీది కడకు
చెట్లు నరకొద్దు నీకెంతొ చేటు యనును

తే.గీ--168
కలల యౌషద లేపనం కాటి కెడలె
మనసు కైవల్య మొందాక మాట వినదు,
నీడ పట్టున పెరిగిన నీది తనువు
మండి బూడిద యగునట మర్మ మిడెను


తే.గీ--169
చదువ నెంచిన కలుగును సంత సంబు
చిన్నపలుకులు చిక్కని వెన్న రీతి
తినిన మీగడ తరకల తియ్య దనము
నాకు మిక్కిలి మోదము నామవరపు


నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ  దేవరకొండ సుబ్రహమణ్యం...    గారు వారికి అభినందనలు   నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......84--22/11/15

తే.గీ--170
సరస సంగీత సాహిత్య చదువు లమ్మ
సకల విషయములందున శాంబవీమె
రమయె రచనలు సాగించు రత్న గర్భ
మనిషి నెమ్మది గనినంత మనసు వెన్న

తే.గీ--171
ఖండ ఖండాంత రాలలో కాంతి పిలుపు
ముద్దు రచనలు పిన్నీసు, మూగ మనసు
కనుము బియ్యములోరాళ్ళు కంటికింపు
అచ్చ తెలుగున కథలల్లు యద్భుతముగ

49.నేటి గుమ్మడి పండు:
కం:పెయ్యేటి వారె గుమ్మడి
     యయ్యేరని దల్చు చుంటి  హర్షము తోడన్
      బియ్యములో రాళ్ళనుచును
       తియ్యని కథలను సతతము తీరుగ చెప్పున్.
2.ఆ.వె:పతియు వ్రాయు చుండ సతియగు శ్రీదేవి
      పాడుచుండు తాను వరుసగట్టి
      చక్కని కథలెన్నొ  సమయానుకూలంగ
       కౌశలంబు తోడ కమ్మగాను
3.ఆ.వె:రంగని సతి యీమె రమణీయముగ వ్రాయ
            మరలమరల కథలు మరువ కచదు
         వంగ మోజు కల్గు పాఠకులకు నెల్ల
         లక్ష్మిపూజ చేయు లలన యెపుడు.
  నాసమాధానము:శ్రీమతి పెయ్యేటి శ్రీదేవి గారు.
(ప్రాస ,యతుల కోసం దంపతులను ఏకవచనంలో  వ్రాశాను.మన్నించండి.)
అన్నయ్యా సవరణలుండటంతో మళ్ళీ పంపాను.

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ  Sateesh Namavarapu   గారు వారికి అభినందనలు   నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......85--23/11/15
తే.గీ..172
గంగ కాలుచున్నది నేల కాలుమోప
నాల్గు పాదాల నడకయానంద మొసగు
కుక్కవలె కుక్కవలె పోయి కూర్చొన వలె
పూరణములకు జక్కని భోధనిడును

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ  pyyeti Srideviగారు వారికి అభినందనలు   నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి


వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......86--24/11/15

తే.గీ..,173
పద్య రచన లందునగల పట్టు గనుము
కలవు వ్రాసినవెన్నియొ తెలుగు గజలు
కలము నిండుగ కలవేమొ కవిత లిడను
అర్ధ వంతము పూరణలద్భుతమ్ము

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ  ధనికొండ రవిప్రసాద్  గారు వారికి అభినందనలు   నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి


వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......87--25/11/15
ఆ.వె--174
మనసు యంత నీవె నాయక మాన్యుడు
బుల్లి తెరల పైన యల్ల రదిగొ
మంచి మాట లిడును మంచోడె యబ్బాయి
తెలిసి నంత మీరు దీవెనిడరె

ఆ.వె....175
మైకు ముందు గళము మనసంత నటనపై
మంచి సరస మిడను మరువ డెపుడు
మనసు దోచె నాది మక్కువ  తోడను
సేవ జేయు నితడు శుభము లిడరె

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ  విరించి గారు వారికి అభినందనలు   నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......88--26/11/15

ఆ.వె--176
నిమ్మ నీటి లోని కమ్మదనము నింక
క్రమము తప్పరెపుడు వ్రాయు గనుము
నొప్పి తగ్గు కిటుకు తప్పక తెల్పును
బరువు తగ్గు విధము బహుగ చూపె

ఆ.వె--177
ఆద రించు నెప్పుడాకాశమేహద్దు
మంచి వారి గళము నెంచి వినుము
ఆలకించమనుచు నాకాశ వీధిలో
తెలుగు భాష కున్న తెగువ దెలుపు

ఆద రించు నెప్పుడక్షరమేహద్దు
మంచి వారి గ్రీవ నెంచి వినుము
ఆలకించమనుచు నధ్వము వీడలో
తెలుగు భాష కున్న తెగువ దెలుపు

ఆ.వె--178
గీత సారమిడును గేయములతొగూడి
తల్లి కథల నెంచి తనుజ తెలుపు
పెరిగె నిచట తాను పెయ్యేటి వారింట
దూర దేశమందు తోరి వినుము

అక్షరము=ఆకాశము(ఆకాశమే హద్దు)
గ్రీవ=గళము.....
నధ్వము=ఆకాశము....వీడ=వీధి(ఆకాశ వీధిలో)

ఆ.వె--177
ఆద రించు నెప్పుడాకాశమేహద్దు
మంచి వారి గళము నెంచి వినుము
ఆలకించమనుచు నాకాశ వీధిలో
తెలుగు భాష కున్న తెగువ దెలుపు

ముందు వ్రాసుకున్న పద్యం ఇది   అయితే నేను శ్రీ  rangarao  గారి ఇంటికి వెళ్ళిన సందర్భములో  vijaya గారు వారమ్మాయి అని తెలిసి నేనీ పద్యాలు చదివి వినిపించటము వారుషరికార్డుచేసి వెనువెంటనే ఆస్ట్రేలియా పంపటం జరిగిపోయాయి నాకు  తెలియకుండానే ......ఆకారణంచేత అర్ధం చెడకుండా పదాలు మార్చాను రెండవ పద్యం......

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ  Rjvj వేణువు గారు వారికి అభినందనలు   నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి


వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......89--27/11/15

తే.గీ--179
కంద మందున జక్కని యంద మదిగొ
బాహుబలిని పోల్చె గనుము భారతముతొ
అలసి సొలసిన వారికి హాయి యనుచు
ఇంగులీషుకు సరిపుచ్చె డింగుటకలు

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ  Vijaya gollapudi గారు వారికి అభినందనలు   నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......90--28/11/15

ఆ.వె--180
ఎన్న దగిన వితని వెన్నెన్నొ పలుకులు
అన్ని విషయములలొ యన్న మిన్న
అన్న కున్న పటిమ యెన్నదగినదన్న
చిన్న చిన్న వైన మిన్న రన్న

ఆ.వె--181
ఊరు, నీరు, పేరు కోరును మరిమరి
కోరి కోరి మనకు కొసరి జెప్పు
పుట్టి పెరిగె నచట బుద్దిగా చదివెను
మంచి పటిమ కలిగి మాట వ్రాయు

తే,గీ--182
కనుము మాటలగారడి కమ్మదనము
కథలు గాయము గమ్యము గగనములను
కుందనపు బొమ్మ మాలిని కూర్పు జూడు
చిన్న జియ్యరు స్వాముల వన్నె తెలిపె

ఆ.వె--183
సేద తీర్చు మనకు సీలేరు యందాలు
డొంక రాయి సొగసు వంక వాగు
వాగు లురక గనము  వంకల సెలయేరు
అడవి బిడ్డ లనిన యాదరమ్ము

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ  శ్రీనివాస్ యనమండ్ర గారు వారికి అభినందనలు   నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి


వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......91--29/11/15

తే.గీ--184
నాటి బతుకమ్మ ముచ్చట్లునయముతోడ
జమ్మి పాలపిట్టలజూపి జయము తెలిపె
రవిక సొగసుచూడతరమ రంజు గనుము
హస్త కళలను జూపెను యద్భుతమ్ము

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ  గౌతమ్ కశ్యప్    గారు వారికి అభినందనలు నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......92--30/11/15

తే.గీ--185
అన్ని పండుగలసరళి మిన్నగిడెను
నింగి కెగసెను సంద్రము తొంగి జూసె
కరుణ రంజిల్లు నవలోక కర్మచారి
కబ్బ సంద్రము కనువిప్పు గనుము రీతి

తే.గీ--186
కోరి వల్లకాడనినిడె ఊరి పేరు
అమ్మ ప్రేమను గనవలె కమ్మదనము
శాంతి కోరెను ప్రతిదినం కాంతి రేఖ
అచ్చ తెలుగును మెచ్చెను సొచ్చ మనియు

తే.గి--187
కడుపులోమంట విడమర్చె కడుపు మంట
శివుడు గనుమనంతలయుడు చెప్పె మనకు
యువత మేలుకో తెలుసుకోభవిత యనెను
అబ్దులయ్యను తలపోసె నద్భుతముగా


నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీమతి Usharani nutulapati గారు వారికి అభినందనలు   నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి


వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......93--1/11/15

తే.గీ--188
పుష్ప ధరహాసమునుగాంచి ముచ్చటించె
దేశ భక్తి గీతాలను దిద్ద వలయు
తెలిపె జాతీయ జండాను తెలుసు కొనరె
మంచి విషయాలు చిత్రసీమ వెంచి చూపు

తే.గీ--189
కనుము శతకమద్భుతములె కబ్బ చపల
సిక్క రంగారి చెట్టును చక్క దనము
చూపెనిట గుల్బి సామెత  చూడవలయు
మహిషి జింజిరి పాటయు మహిని వెలసె


నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ Pavani Suresh Chandra గారు వారికి అభినందనలు   నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి


వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......94--2/12/15

తే.గీ--190
తోడు రారటనెవ్వరు తుదకు నెపుడు
నీదు కష్టము సుఖములు నీకు తోడు
మట్టి గణపతి పూజల మహిమ దెలిపె
తెలిపె చట్టము చుట్టము తీరు తెన్ను

తే.గీ--191
పెరటి సురసతొ పోలిక గురుతుచేసి
మనకు కనువిప్పు సేయగ  మనవి చేసె
మంచి నాయకుడెటులౌనొ యెంచి జూపె
మద్య తరగతి జీవుల మిద్య దెలిపె

తే.గీ--192
కులము గోత్రములిచ్చట కూడ దనును
తరచి చూచిన లోతైన తత్వ మొసగు
నాటి నేతల చావులు నెట్టు లనెను
లేత పలుకుల తీరుండు లోతు మిన్న

తే,గీ--193
ఓడి ఓటమి పాలాయె నొక్కరోజు
చీదరించె సంవేదక సేవ గనియు
కోరె చాగంటి సూక్తుల గొప్ప దనము
పాల మీగడ తరకలే పదును మిన్న

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ Gorthy Venkata Somanadha Sastry గారు వారికి అభినందనలు   నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......95--3/12/15

తే.గీ--194
చిన్న కవులను మెచ్చుట యెన్న దగును
ఆలకించును జక్కగ హాయి నొసగు
మంచి విషయము లెప్పుడు యెంచి చూపు
చదివి తీరవలయు వీరినెదికి మనము

ఆ,వె--195
ముందుమాట నిడెను బుధజని "వాళ్ళు"కు
నువ్వె నేను నేను నువ్వె గనుము
చరిత్ర లోప్రభందపరమేశ్వరుండుని
కనుము వ్రాసె నెన్నొ కథలు వీరు

తే.గీ--196
బుద్ది గలిగిన సుకుమారి,భువనచంద్ర
సుభద్ర ,సుందరి, సమ్మెట,సుజలగంటి
నళిని,వలభోజు, మంతెన,నాగలక్ష్మి
ఆదరించగా గనవలె నక్కరీతి

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ Shyamala Kondapalli గారు వారికి అభినందనలు   నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......96--4/12/15

తే.గీ--197
జలము వాడండి తక్కువ జనులు మీరు
పలుకుమెప్పుడు యెక్కువ తెలుగు యనెను
పోక మానదు దేహము పోషణెంత
తెలిపె జీవిత సత్యము తెలియనగును

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీమతి  Bhanumati Mantha గారు వారికి అభినందనలు   నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......97--5/12/15

తే.గీ--198
ఇంటి పేరులు కులగోత్ర వంటి వెంచి
మతము భాషకు సంధియ కతను తెలిపె
అర్ధ భావము లిచ్చును యద్భుతమ్ము
సరళ మైనభాష తనది సరిగ జూడ

తే.గీ--199
చూపె యోగము చిత్తము రూపు గనుము
లోతు మిక్కిలి పదముల లోతు తెలుపు
వివరమిచ్చుట యందున వీరె మిన్న
మంచి యాచార్య వీరల నెంచి గనుము

తే,గీ--200
చెలిమి సంస్కృతం తోనట చేరి వినుము
జంట పదముల యమరిక కంట గనుము
తెలుగు నుడి పలుకుబడిని తెలుసు గొనరె
తెలుగు సామెతలర్ధము తెలియ జేయు

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ GdiyaramVenkatarangaSai  గారు వారికి అభినందనలు   నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......98--6/12/15

తే.గితి--201
అరుణ జననమ్ము గుండెలో యద్భుతమ్ము
మంచి ఉద్వేగ ఙ్ఞాపకం యెంచి కనుము
కాదు బ్రతకట మంటేను కథలు యనును
వాడు  రావద్దు వెలువల వ్రాసె కనుము

తే,గీ--202
పడతి జాతీయ సమగ్రత పథకమొందె
భరత మహిళాశిరోమణి పథకమొందె
కలదు కవితల సంపుటి కథలు గనరె
నవల వ్రాయుటయందున నలువరాణి

తే.గీ--203
ఎందరున్నారుయిలనట యందముగను
మౌన రాగము కనవలె మాలికందు
కనుము యెనిమిదోయడుగును మిన్న గుండు
చేసె సన్మానము సినారె చేయితోడ


నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ Vvs Sarma  గారు వారికి అభినందనలు   నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?....99--7/12/15

తే,గీ--204
శివుని నీదయ యనుచును చేరి పిలుచు
శివుని నామమె సతతము కవనమగును
శివుని కన్నీట మున్నీట సేయు జపము
శివుని రూపము నామము శివుని మయమె

ఆ.వె
చిన్న మాట లందు మిన్నగిడెనుగను
భగ్న మైన మనసు పడెడు బాధ
కనికరంబులేని కనరాని కనలేని
మనసు లోతు నెంచి మనకు దెలిపె

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీమతి Angaluri Anjanadevi  గారు వారికి అభినందనలు   నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?....100--8/12/15

తే.గీ--205
చక్క చక్కని చిక్కని సుక్కలెక్క,
కక్కు మిక్కిలి నిక్కము జెక్కుపదము
చిక్కె సక్కున గ్రక్కును నిక్కవంబు
లెక్కలెక్కన తక్కువ నిక్కులించు

తే.గీ--206
గట్టి, గట్టివ,గట్టుల గట్లసూడు
కట్టు కట్టడ కట్టాణి కట్టిపెట్టు
జట్టు గట్టిగాచేష్టితో చెట్టగొనును
పుట్ట పుట్టువే పొట్టెముబట్టి చూడ

తే.గీ--207
అంబజోదర, అజగుడు,ఆత్మ భవుడు
అజుడు, అంబుజనాభుడు, అగ్నిజుండు
అక్షధరుడును,అజయుడు, అమర ప్రభువు
అబ్దశయునుడు, అనతుడు, అచ్యతుండు

తే.గీ--208
కంబమయ్య,కంబుభృతుడు,కైటబారి
కపిలుడు కడారిపటుడును కంబపాణి
క్రతువు,కపి,కఱివేలుపు,త్రివిక్రముండు
జన్మకీలుడు, జహ్నవు, జలశయనుడు

తే.గీ--209
పాలమున్నీటియల్లుడు,పావనుండు
పుష్కరాక్షుడు, పురుహలి,పురుషవరుడు
ప్రభువు,పుష్కరనాభుడు,ప్రాగ్వఁశుండు
శేషశయునుడు, శంద్రుడు, శేషశాయి

తే.గీ--210
వీరి జనకుల నెంచెద కోరి నేను
కనుము మీరలు నెంతయొ కమ్మదనము
చిత్ర సీమకు వీరెంతొ సేవజేసె.
ప్రముఖ ప్రముఖాంధ్ర లోకాన పరుగు లిడును

తే.గీ--211
చేరె పసిప్రాయ మందున చెన్ననగరి
పట్టు పట్టితానెదిగెను పట్టుదలతొ
పొందె బిరుదములెన్నియొ పుడమి పైన
చేరి మ్రొక్కెద వారికి  శిరము నొంచి

తే.గీ--212
తేట తెల్లము ఘనమంత తెలుగు నందు
సహస్ర చంద్రుల గన్నట్టి సహన శీలి
చేసె తెలుగునకెంతయో సేవ వీరు
పాదపద్మముల్ వీరివి పసిడి నాకు

మొదటి పద్యం మొదటి పాదం విడ మరచి చెప్పనవసరం లేదురెండవ పాదం...
కక్కు=రపంము వంటి వాటికుండే పల్లు....పదును
నిక్కము.=,సత్యము.....
చెక్కు (జెక్కు)=పెట్టు,,,(దోపు, ఖండించు అనే అర్దాలు కూడ ఉన్నాయి)
చిక్కె=దొరికిన చో
టక్కున
గ్రక్కును
నిక్కవము
లెక్క..........నిక్కిలించు--టపాలన్నీ ఒక లెక్కసరిగా చాటభారతంలేకుండా చెప్పవలసినదేదో సూటిగా  ఉంటాయి అని నాభావయు
నిక్కిలించు=లేపు...నిగిడించు
-------------------------------+++++++++++++++++౭++++++
శ్రీ రామచంద్ర రాజు కలిదిండి

ఆ.వె. అరవదేశమందు ఆంద్రులకండగా
బ్రహ్మ జ్ఞాని యతడు బ్రాహ్మణుండు
కల్లనెరుగనోడు కార్యధక్షుండయా
కుమరుడయ్యెనేటి గుమ్మడిగను

ఆ.వె. తండ్రిమాటయన్న తామ్రశాసనమెగా
ధార్మికుండితనికి దార బలము
పారు దార వోలె పలుకుసౌమ్యముగాను
అన్యదేశమందు అన్నఘనుడు

+++++++++++++++++++++++++++++++++++++++
సోదరులు, ఆత్మీయులు, అన్నగారు శ్రీ గోటేటి వేంకటేశ్వర రావు గారికి, సోదరి ఓలేటి శశికళ, అభిమానంతో, అభినందనలతో రాసిన ఆటవెలదులు.
-ఆ.వె-------------------
1.పాలకొల్లు నుండి ప్రవసింప మదరాసు,
తరలి వెళ్ళె తెలుగు తరము యొకటి.
నాటి, నేటి, మేటి చాటేటి గోటేటి.
తెలుగు వనమున విరి తేరు, మేరు.
-ఆ.వె-------------------
2. పాండితీ ప్రకర్ష పారంపరిక మయ్యె.
పాత్రికేయు లయ్యె ప్రవృతి రీత్య.
సహస్ర పూర్ణ చంద్ర సందర్శితులు కాగ,
వేంక టేశుని గన్న వేల్పు వారు.
-ఆ.వె-------------------
3. అమ్మ,యతివ లనిన యపు రూప గౌరవం,
లలిత కేలు బట్టె, లక్ష్మి మెట్టె.
శ్రీలు చిందు ముఖపు శ్రేయ దివ్యల జూడ,
దర్ప పరవశ మగు దండ్రి మనసు.
---ఆ.వె-----------------
4. నమ్ము నిజము తాను నడుచు నిజము నమ్మి,
నెగ్గు వాడు, తగ్గి నిలుచు వాడు.
నవ్వు విలువ దెలుసు నలుగు రున్న హితుడు,
తెరచి జూపు బ్రతుకు తెలియ తెగువ.
ఆ.వె--------------------
5. ముఖ్య కార్య దర్శి, సఖ్య తెంచెడి నేత,
మాతృ భాష ప్రియుడు మాన ధనుడు.
దేశ రాజకీయ తెగులు వెలుగు దెచ్చు,
జనని, జన్మ భూమి స్వర్గ మనును.
-ఆ.వె------------------
6. తన్మ యమున మురిసి దసర, దీపావళి,
సంబరాలు మనకు సందడించు.
కొండ రాయు మనువు కోరి కూరిమి జేసె,
అయ్య అండ దండ అన్న కుండ.
-ఆ.వె------------------
7. చెన్న పట్నమంత చెదర వరదలకు,
కష్ట నష్టములను గాంచి నోర్చె.
దేవు ననుగ్ర హమున ధీమంతు, శ్రీమంతు
నాదరించు సాయి న్యాయ మీయ.
-ఆ.వె-------------=----
8. ఆవకాయ లేమి యసలు సైపని వాడు.
స్వ,పర ధర్మ ములను సరిగ నెఱుపు.
హిందు ధర్మ విధులు యెందున్న మరువరు,
ప్రవచనములు యన్న ప్రాణ సమము.
-ఆ.వె--------=---------
9. సంఘ మన్న తనదు సంసార మన్నను,
బాధ్యతెరిగి మెలుగు బాగు కోరు.
మంచి మిత్రుడు యెంచు మంచి విలువలను,
తలయివారు ఠీవి తలచి మురియు.
-ఆ.వె------------------
10. తిరుపతయ్య రక్ష తీరుగా గోటేటి,
వెంకటన్న వెనుకె వెంట నుండ,
వరద రాజు గాచు వరద నష్టము నుండి,
కోట్లు పడగ లెత్త కోరు చుంటి.
--------------------
8-12-2015.....శ్రీమతి sasikala Volety
+++++++++++++++++++++++++++++//////+++++++
శ్రీ  గోపీనాథ్ పిన్నలి

ఆ.వె. విత్తు వొక్కటైన వేరు వృక్షము రాదు
మంచి యేదొ వారె యెంచ గలరు
సీమ నైన నేమి చెలగి సంఘమునందు
చెడుగు చెరగుటందు శిష్టులనరె...

తే.గీ.
అవును, గోటేటి వారెగా యర్హులెపుడు
పద్య మందలి పదములా ప్రముఖులైన
తండ్రి దనయుల కెప్పుడొ దఖలు పడియె
దండమిడుదు దాశరథి వెంకన్నలకును

సీ.
ప్రముఖాంధ్ర తెచ్చిరీ ప్రముఖులిద్దరు చేరి ... పొగడ నాకును లేదె పూర్తి పటిమ
గోటేటి రామన్న గూర్మితో వెంకన్న ... సాయంబుతో సాగు సారథిగను
వ్యాపార మది గాదు వ్యాపకమే యదీ ... వెఱ్ఱి తనమనగ వెఱ్ఱి గాదె
జనని గొప్పలనెల్ల జగతిని వ్యాపింప ... తప్పు పట్టగ రాదు తరతరములు
ఆ.వె.
పట్టుబట్టి వారు ప్రముఖుల చరితలూ
తెలుపు చుండె మనమె తెలియ వలయు
మంచి యేర్చి కూర్చి మనలకందించేటి
ధన్యులాయె తండ్రి తనయు లహహ...


ఆ.వె.
సంప్రదాయమునకు సరి యింకొ చిరునామ
గోటెటన్నె యందు గూర్మితోడ
ఆధునికతను మనము నాచరించగలము
రీతి వదల రాదు నీతి యదియె

(ఆ కుటుంబం ఆధునికతను కాదనకుండానే సంప్రదాయానికి పెద్ద పీట వేస్తుంది. మనం నేర్వవలసినదీ అదేనని నా బావన)

ఆ.వె. నాదు శంక దీర్చు నాద్యాత్మ గ్రంథమే
రామ చరిత మనగ రహియె కలుగు
అన్న ప్రేమతోటి యందించె నాకది
ధన్యుడనుగ నేను నన్య మెరుగ !!

(రహి అంటే ప్రేమయే కదా.... ఇహ సంగతేమంటే........ గోటేటన్న నాకు అచ్చంగా తెలుగు వెబ్ పత్రిక రచనకు గాను పెద్దాయన రాసిన ఆద్యాత్మ రామాయణం పంపాడు. అంతకు ముందు నాకున్న కొన్ని సందేహాలను ఆ గ్రందం నివృతి చేసింది. అది చూడనంతవరకూ నాకు ఇంకోటి తెలియదు కనుక ధన్యుడనైతి ననుకుంటూ ఉంటాను.)గోపీనాథ్ పిన్నలి
++++++++++++++++++++++++++++++++++++++++
smt.Umadevi Balluri

నేటి గుమ్మడిపండు:
1.ఆ.వె:వధువులకు వరులకు పరిచయ వేదికన్
             చక్క గాను కూర్చి సలుపు చుండు
            కార్య దీక్ష బూని కఠినమౌ పనులను
            సులభతరము చేసి చూపు చుండు.
2.ఆ.వె:జీవితమును గూర్చి చెప్పేరుచక్కగా
             తెలుగు భాష గరిమ తెలియ చేయు
           కర్మయోగి తీరు కమ్మగా వివరించు
           ఆడ దన్న తాను యమ్మ యనును.
3.ఆ.వె:మాతృభాష గూర్చి మధురముగా దెల్పు
            తీపి కబురు లెన్నొ తెలుపు;తెలుగు
            తనకు తెలియ దనుట దౌర్భాగ్య మే యంచు
          తెలుపు చుండు వారు తేట గాను.
4.ఆ.వె:రాగి నాణెమందు రామచంద్రుని జూపు
           పాత నాణెములను పంచు నిచట(Share)
          మితముగ తినమనుచమిత మగు తిండిని
        చూపు చుండు నితడు చోద్యముగను.
5.ఆ.వె:పింగళి కవి గూర్చి భేషుగా తెలిపేను
             ద్వ్యర్థి కావ్యములను దర్శింప జేసేను
           ప్రముఖ యాంధ్ర లోని ప్రతిభ గనిన చాలు
         వెంకటేశ్వ రుండె  వినుడు మీరు.
 నాసమాధానము:  శ్రీ గోటేటి వెంకటేశ్వరరావుగారు.
++++++++++++++++++++++++++++++++++++++/+
నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ Svds Sarma  గారు వారికి అభినందనలు   నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?....101--9/12/15

తే.గీ--213
ఇందువారపు పూజల పొందు మహిమ
నేటి గురువులకొందనం మేటిగనును
చింత చితులలోజూడగ చితియె మిన్న
పాల కడలికి ముద్దుల పట్టి తాను

తే.గీ--214
లిబ్బిగుబ్బెత సింధుజ లిబ్బుపడతి
ఇంది ఇందిర ఈశ్వర ఇందువదన
చపల గోమిని జలధిజ జగముతల్లి
తమ్మియింటిగరిత ఋద్ది తల్లితల్లి

నిన్నటి నా పద్యములో విరిసిన గుమ్మడి..మిత్రులు...
శ్రీ Venkateswara rao Goteti గారు వారికి అభినందనలు   నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?....102--10/12/15

ఆ.వె--215
కుంచె కున్న దెంతొ కులుకుజూడవలయు
కలము కున్న పదును ఘనము గాద
నృత్య బాలెలుబహు కృతులు వ్రాసినిడెను
బాపు రమణ లితని భ్రాత లేమొ

తే.గీ--216
కోటి కొక్కరు జూడగ ధీటు గనుము
కాళి దాసుని తీరుగ కలదు వరము
కలదు సాహిత్య సంపద కమ్మ దనము
చిన్న పెద్దలు మెచ్చును మిన్న గెపుడు

తే.గీ--217
పూత రేకుల పుడమిన పుట్టె తాను
తల్లి నేర్పిన విద్యయే దన్ను తనకు
చిన్న పెద్దలకత్యంత చెలిమి బంచు
గీత రాతల యందున మోత గనుము

ఆ.వె--218
చేరె ప్రేమ లేఖ సీతరు యంపెను
కంట నీరు పొర్లె కనిన యంత
బాపు నుండి వచ్చె పసిడి పలుకు లేఖ
నంది బహుమతులను పొందె గనుము

నిన్నటి నా పద్యములో విరిసిన గుమ్మడి..మిత్రులు...
శ్రీ మతి Lakshmi Gundugola గారు వారికి అభినందనలు   నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?....103--11/12/15

తే.గీ--219
చదువు, సంస్కృతి,సంగీత, సకల మెపుడు
నీతి, స్నేహము, శుభములు, ప్రీతి మీర
చరిత,గణితము,ఛందస్సు చక్క దనము
లెక్క లేనన్ని  వ్యాక్యలు మిక్కుటంబు

తే.గీ--220
చక్కచక్కని పద్యాలు పెక్కు కథలు
చతుర, భాష ,కవిత లింక,సరస హాస్య
నిత్య సాహిత్య సంపద తద్య మెపుడు
తెలుగు పరిమళ గంధాలు తెలుపు చుండు

తే.గీ--221
తెలుగు భాషకు కలిగిన తెగువ జూడు
మంచి వారల నెవ్వరు మరువ రనును
సరస సల్లాప సాహిత్య చర్చ గనరె
గట్టి వారికి పట్టము గలదు నిజము

తే.గీ--222
వాడు కొననెంచి నెవ్వురు కూడిరేని
కన్న బిడ్డల రీతిగ కలుపు కొనును
నీకు స్వార్ధము పెరిగిన నీవె మునుగు
మగువ "తామర తంపర" తెగువ గనుము

(తామర తంపర=పద్మిని)

తే.గీ--223
ఒకరి నొక్కరు నెప్పుడు  నొక్క రీతి
అక్కునందున జేర్చుక యాదరించు
స్వార్ధ చింతన తలపరు సకలురెపుడు
పక్కు పక్కున నవ్వుచు పలుకరించు


తే.గీ--224
జగతి నంతట వసియించు జనుల నెంచు
మంచి యాచార మలవాట్ల నెంచి జూపు
బహుగ పండిత పాండిత్య పటిమగనుము
వేదముపనిషత్తులసార వేదభూమి


తే.గీ--225
కులము,మతము,జాతి,ధనిక గొప్ప చిన్న
వయసు భేదము లెంచక, వచ్చి రాక
సాహితీ సాగు సేయగ సంచరించు
పక్షు లన్నింటి కావాస వృక్ష మిదియె

తే.గీ--226
అచ్చ తెలుగున మిక్కిలి యాదరంబు
కమ్మ నైనది తెలుపరె గుమ్మడెవరొ
నూట మూడవ గుమ్మడి వేట కొరకు
చిట్ట చివరిగ నొసగెను "కట్టుపల్లి"


నిన్నటి నా పద్యములో విరిసిన గుమ్మడి..మిత్రులు...
శ్రీ బ్నిం  బ్నిం గారు వారికి అభినందనలు   నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరు "కట్టుపల్లి"..104--12/12/15

తే.గీ--228
సుబ్బ రావు సోమమ్మల సుతుడు,నీతి
తప్ప డెపుడు పొగరుబోతు, తప్పు మాట
లనిన చెవియెగ్గ డెప్పుడు, కన్న వారి
ప్రేమ నొందెను మెండుగ ప్రేమ మూర్తి

ఆ.వె--229
"బువ్వ లేదు కొడుక బుద్ది మంతుడవీవు
చల్ల త్రాగి పోయి చదువు కొనుము"
తల్లి మాట మీరి తానెరుగడెపుడు
కష్ట పడుట యనిన నిష్ట మనును

తే,గీ--230
విజయ లక్ష్మితో  బెండిలి విధిగ జరిగె
మానస, మనీష, క్రాంతి,యు మాకు సంతు
కనగ భక్త కన్నప్పగ కన్నడాయె
నేడు నరువదియున్ నాలుగేండ్లు జొచ్చె

తే.గీ..231
పెద్దలందరి దీవెనల్ ప్రీతి మీర
పిన్నలందరి శుభములు పెచ్చు మీర
కోరి నిలిచితినిచ్చట కొమరు నేను
ఇచ్చి పంపరె మీరలు యిచ్చరీతి

తే,గీ--232
మంచి వారల ప్రతిభను నెంచి చూప
యెంచె గుమ్మడి నీరీతి కొంచమిటుల
గుర్తు యుంచుక దీవించ గుమ్మడాట
వేడు చుంటిని మిమ్ముల వెడల దలచి

తే.గీ--233
చిన్న పెద్దల నెవ్వరి నైన నేమి
మరచి తినియోమొ పండిత మాన్యులార
తప్పుయెన్నక మీరలు యొప్పుమనుచు
చేరి మ్రొక్కెద  మీకిట  చేతు లెత్తి

తే.గీ--234
అచ్చ తెలుగుయె వేదికై యాదరించ
గుమ్మడాడిరి మీరెంతొ కమ్మదనము
మంచి వారలు మనతోడ యెంచి మురువ
చిన్న పెద్దకు వందనం శిరము నొంచి

తే.గీ--235
కూడి వేడుక సల్పగ గుమ్మడాట
గుమ్మడాటకు వ్యాఖ్యలు గుమ్మరించె
గుమ్మరించిన వారలు గొప్ప జనులు
గొప్ప జనులకు ప్రణతులు జెప్పు చుంటి

(ముక్త పదగ్రస్థాలంకారము)


సీ.--236
పద్మిని, శారద,  భారతి, మంతెన
          వెంకోర, సుందరీ, వేదవాణి !
శశికళా వోలేటి,సంధ్యమ్మ, మాసీత
          యలవర్తి, కొల్లురు,హంస గీతి !
కలిదిండి, వేదుల,భల్లూరి, పెయ్యేటి
            గోటేటి, శ్రీస్వామి, గోపినాథ !
ఆచార్య, మంత్రాల, ఆండర లలితమ్మ
            విద్యమ్మ ,లక్ష్మమ్మ,,విశ్వనాథ !
ఆ.వె
బొగ్గ వరపు, బాల, పూర్ణమ్మ,, మల్యాల
సుబ్బ లక్ష్మి ,మూర్తి ,సుజల గంటి
గుమ్మడాట మీరు కమ్మదనముగాడ
వందనములు మీకు వంద వేలు

నిన్నటి నా పద్యములలో విరిసిన గుమ్మడి "అచ్చంగ తెలుగు " బృందం ...,,., బృంద నిర్వాహకులకు బృంద సభ్యులకు అభినందనలు  ,,  ఈ ""అచ్చంగా తెలుగు"" బృందము ఇలాగే నిత్యమూ వెలుగొందాలని, సాహితీ సాహిత్య కిరణాలు అనునిత్యం వెదజల్లుతుండాలని అభిలషిస్తూ...శుభాశిస్సులతో......  ప్రసాద్ కట్టుపల్లి.......

నేటి గుమ్మడి నేనే...,,మీ రందరు

అ"ల్లరిచేయండి........
ఆ"శీర్వదించండి.....
ఇ"ష్టపడండి
ఈ"ర్ష్య పడకండి
ఉ"పయోగించుకోండి
ఊ"హలలో విహరించండి
ఋ"షిలా జీవించండి
ౠ"బులకాశించకండి
ఎ"వరినీ తూలనాడకండి
ఏ"మరపాటు పొరపాటండి
ఐ"క్యమత్యమేబలమండి
ఒ"క్కటిగా మెలగండి
ఓ"ర్పుతోబ్రతకండి
ఔ"న్నత్యంచాటండి
అం"దరు కలిసుండండి
ఆః" అని ఆనందించండి

క"లలు కనండి
ఖ"చ్చితత్వం పాటించండి
గ"ట్టి పట్టు పట్టి గెలవండి
ఘ"రానా వద్దండి,వదలండి
ఙ్ఞా"న సముపార్జన చేయండి

చ"దవండి చదివించండి
ఛం"ధశ్శాస్త్రం నేర్వడి
జ"యము మీదేనండి
ఝ"గితి స్పందించండి(ఝగితి=వెంటనే)
ఙ్ఞానం పదిమందికి పంచండి

ట"కటొంకు మాటలు వినకండి(టకటొంకు=మాయావి)
ఠ"వఠవ చేసిబ్రతకండి..(శ్రమ)
డ"బడబ వలదండి(గర్వము),
ఢ"కేలు చేయకండి .,వీ (తల తాకుట..మొట్టుట)
ణ" ధ్వనిలా మాటలాడండి

త"ల్లిదండ్రుల ప్రేమించండి,  క
థ" లు కవిత్వం  వ్రాయండి
ద"గదగా ప్రకాశించండి
ధ"ర్మం చేయండి
న"వ్వులపాలు కాకండి

ప"సివారిని రక్షించండి
ఫ"లితమాశించక ధర్మం చేయండి
బయళ్ళు పచ్చదనంతో నింపండి
భ"యమొలదండి
మ"నసెరిగి మాటండి

య"శస్సునార్జించండి
ర"చనలు చేయండి
ల"గువుతో బ్రతకండి(గౌరవము)
వ"నములు పెంచండి
శ"మము నేర్వండి(ఇంద్రియ నిగ్రహము)
ష"ష్టిహాయనము వలే(ఏనుగు వలె)
స"ర్వకాల సర్వావస్థలందు
హా"యిగా బ్రతకండి .హే
ళ"న ఎవరిని చేయకండి
క్ష"మాగుణము మంచిదండి
ఱ"వఱవలు  విడవండి,.,(స్పర్ధ,,కోపము)

తెలుగు అక్షరమాలను చూడండి....

"సర్వే జనా సుజనోభవంతు
సర్వే సుజనా సుఖినోభ వంతు"