సంధుల విఙ్ఞానము.,1 పరిచయం
"అచ్చంగా తెలుగు" బృంద సబ్యులకు నమస్కారం !!
ఈ రోజు నుండి "సంధుల విఙ్ఞానము " [సంధి పరిఛ్ఛేదము] గురించి వివరించాలి అనుకున్నాను.అందరూ విద్యావంతులే కావున ముఖ్యమైన విషయాలు మాత్రమే సరళంగా తెలిపే ప్రయత్నం. నేను అతి సూక్ష్మంగా విషయ వివరణ చేయ దలచినాను.కావున మిత్రులు అర్దం చేసుకోగలరు. పండితులు,విద్వాంసులు, గ్రంధ కర్తలు,కవివరేణ్యులు ఏదేని పొరపాటు గ్రహించినచో తెలిపిన యెడల సరిదిద్దు కోగలను,నేను పండితుడనో విద్వాంసుడనో కాను కనీసం తెలుగు ఉపాధ్యాయుడను కూడా కాను. కాని తెలుగు భాషాభిమానిని మనమిత్రులందరకు ,పద్య .,గద్య కవిమిత్రులకు ఎంతో కొంత ఉపయుక్తముగానుండునని యెంచియే ఇట్టి సాహసమునకుపక్రమించితిని మిత్రులందరమూ కలసి ప్రతిరోజు చర్చించు కుందాము రండు...మీ మీ అభిప్రాయాలను వెల్లడించటం ద్వారా నన్నాదరించండి, మీఆశీస్సులందించండి,.... ధన్యోస్మి..
పరిచయం.......
రెండు పదాలు ఒకదానితో మరొకటి కలసిపోయి ఒకే పదముగా మిగిలిపోతాయి అలా కలసినప్పుడు మొదటి పదం చివరలోగాని రెండవపదం మొదటలోగాని మార్పులు సంభవించటం జరుగుతుంది అనగా అక్కడ ఉన్న అక్షరాలు దీర్ఘాలుగా మారటం ..ఉన్నఅక్షరాలు పోవటం .,లేదా వేరే క్రొత్త అక్షరాలు వచ్చి చేరటం జరుగుతుంది ఇలా ఎందుకు జరిగింది అని మనకు మనం ప్రశ్నించుకుంటే వచ్చే జవాబే "సంధి జరిగింది".,అనేది. ఎలా జరుగుతుందో తెలియ చేసేదే ఈ "సంధుల విజ్ఞానము" లేదా "సంధి పరిచ్ఛేదనము"
మనం ఉదా హరణకు ఒక వాక్యం తీసుకుందాము
"లోకేశ్వరుడు ,రంగాచార్యులు ,భ్రమరాంభిక అయిదేండ్ళు నుండి మిత్రులు.ప్రతిరోజు శివాలయము దర్శిస్తారు"
ఇప్పుడు పైవాక్యం పరిశీలిద్దాము..
"లోక"..."ఈశ్వరుడు" .,,ఇవి రెండు పదాలు..,,ఈ రెండు పదాలు కలిసి పోయి "లోకేశ్వరుడు" అనే ఒకటే పదం ఏర్పడింది
"రంగ",,,"ఆచార్యులు"...ఇవి రెండుపదాలు...."రంగాచార్యులు" అనే ఒకే పదం ఏర్పడింది
"భ్రమర"...."అంబిక"----- భ్రరమరాంబిక
"శివ"...,"ఆలయము"------శివాలయము ఇలా రెండు మూడు పదాలు కలిసి ఏక పదముగా ఏర్పడటాన్ని సంధి జరిగిన రూపము అంటారు
ఇలా సంధి జరిగినప్పుడు లేదా ఈ సంధుల పరిఙ్ఞానం మనం విశ్లేషించి చెప్పుకునే సందర్భాలలో వచ్చే కొన్ని అతి ముఖ్యమైన పదాలను గురించి ముందుగా తెలుసు కుందాము
1)సరళములు..
తేలికగా పలకబడేవి సరళములు..తేలిక అనగా కొంచం ప్రయత్నముతో అని భావము.,వీటికి "నాదములు" అనే పేరుకూడా కలదు.
గ..,జ..,డ.,ద...బ
2)పరుషములు
కఠినముగా పలుకబడే వాటిని పరుషములందురు..,కఠినమనగా గట్టి ప్రయత్నం ...వీటికి "శ్వాసములు" అనే పేరు కూడా కలదు.
క..,చ...ట...త...ప
3)వర్గయుక్కులు
"యుక్కు" అనగా జత వర్గాక్షరాలలో 2---4 అక్షరాలు
ఖ..,ఘ...ఛ...ఝ..,ఠ...,ఢ...థ...ధ....ఫ..,భ....ఇవి మొత్తము 10 అక్షరాలు
4)అనునాసికములు
నాసిక అనగా ముక్కు ముక్కు సహాయముతో పలుకబడును కావున అనునాసికములైనవి
ఙ...ఞ.,,ణ...న.,,మ...ఇవి 5 అక్షరములు
5)ద్రుతం
ద్రుతమనగా న కారము...అవసరములేనిచోట జారిపోవునదని అర్ధము
6)ద్రుత ప్రకృతికము
ద్రుతము చివరన గల పదాలను ద్రుతప్రకృతికములు అంటారు
అనెన్.,,,కనెన్....వినెన్...తినెన్... మున్నగునవి .
సశేషం.....మళ్ళీ కలుద్దాం..

This comment has been removed by the author.
ReplyDeleteWhy have u removed that comment
Delete