సంధుల విఙ్ఞానము..,7.,యణాదేశ, వృద్ధి సంధులు
3)యణాదేశ సంధి
య,,,వ.....ర లకు యణ్ణులని పేరు..ఈ యణ్ణులు ఆదేశమగుటవలన దీనికి యణాదేశ సంధి అని పేరువచ్చినది
సూత్రము--"ఇ...ఊ..,ఋ లకు అసవర్ణములైన అచ్చులు (అసమాన అచ్చులు) పరమైనప్పుడు క్రమముగా య వ ర లు ఏకాదేశమగును"
ఇ.,ఉ ఋ అనేవి ఇక్కులు
య,,,వ.....ర లకు యణ్ణులని పేరు
అసమాన అచ్చులు పరమైతే
ఇ కారమునకు య కారము
ఉ కారమునకు వ కారము
ఋ కారమునకు రకారము
---- కారమునకు ల కారము ఆదేశముగా వస్తాయి అనునది సూత్రార్ధము.
(---- టైపు వసతిలేక అక్షరమాలలోని ఋ ౠ ల తదుపరి వచ్చు "అలు అలూ" వ్రాయలేక పోయినందులకు చింతిస్తున్నాను మిత్రులు గమనించ గలరు)
ఉదా...
అతి+అంతము..........అత్యంతము (ఇ+అ...య)
దేవీ+ఆలయము......,,,దేవ్యాలయము(ఈ+ఆ.,,య)
మను+అంతరము.......మన్వంతరము(ఉ+అ..,వ)
వధూ+ఆనందము.,....,వధ్వానందము(ఊ+ఆ,,,,వ)
ధాతృ+అంశము...........ధాత్రంశము (ఋ+అ...ర)
పితృ+ఆఙ్ఞ...................పిత్రాఙ్ఞ (ఋ+ఆ.,.,,ర)
4)వృద్ధి సంధి.
ఐ ఔ లకు వృధ్ధులని పేరు ఈ వృధ్ధులు ఆదేశముగా వచ్చుటవలన వృధ్ధి సంధి అని పేరు వచ్చినది
సూత్రము--"అకారమునకు ఏ ఐ లు పరమగు నప్పుడు "ఐ" కారమును ఓ ఔ పరమగునప్పుడు " ఔ" కారమును ఏకాదేశములగును"
అకారాంత..ఆ కారాంత శబ్దాలకు(అ ఆ లకు) ఏ ఐ పరమైనప్పుడు ఐ కారమును .ఒ ఔ లు పరమైనప్పుడు ఔ కారమును ఏకాదేశముగా వచ్చుటను వృద్ధి సంధి అందురు అని సూత్రార్ధము.
ఉదా....
భీష్మ+ఏకాదశి.....భీష్మైకాదశి (అ+ఏ...ఐ)
మహా+ఐశ్వర్యము....మహైశ్వర్యము(ఆ+ఐ....ఐ)
వన+ఓషధి..,.,వనౌషధి (అ+ఓ.....ఔ)
మహా+ఔషధము.....మహౌషధము (ఆ+ఔ....ఔ)
5.యన్తాదేశ సంధి
6.వాంతాదేశ సంధి
ఇవి పూర్తిగా సంస్కృతమునకు సంబంధించినవి..
పూర్వ పదము చివర ఏ ఓ ఐ ఔ లు ఉండి విటికి అచ్చులు పరమగునప్పుడు అయ్.,,ఆయ్..,,అవ్ ఆవ్ అనునవి ఆదేశములుగా వచ్చును
హరే+ ఏ.,,హరయే
విష్ణో+ఏ....,విష్ణవే
(పాల్గొనే మిత్రులందరకు నాదో చిన్న విన్నపము..,,చదివిన వారు ప్రతి ఒక్కరూ ఒక్కో సంధికి ఒక ఉదాహరణ వ్రాయవలసినదిగా కోరుచున్నాను)
సశేషం రేపు కలుద్దాం

No comments:
Post a Comment