సంధుల విఙ్ఞానము,,,4--4/3/2017---,విభక్తులు
4)చతుర్ధీ విభక్తి !
కొఱకున్ (కొరకు), కై--- చతుర్ధీ విభక్తి.
"సంప్రదానంబునకుంజతుర్ధి యగు"
త్యాగోద్దేశ్యము గా ఉన్నప్పుడు చతుర్ధీ విభక్తి వస్తుంది. త్యాగము అంటే ఇవ్వడం.
ఉదా: జనకుడు రాముని కొరకు కన్యనిచ్చెను.
కన్యను తిరిగి పుచ్చుకొనే ఉద్దేశం లేదు.
ఒకవేళ ఆ ఉద్దేశం ఉన్నా అవుతుంది,
ఉదా.ప్రధమ స్థానము కొరకు ప్రయత్నించ వలెను..ఇది ఉద్దేశమే కదా
కొఱకు+న్ = కొఱకున్. ద్రుతలోపమున కొఱకు అని నిలిచినది.ఇది కొఱ=ప్రయోజనము, కు=నకు అను అర్ధమున నిలిచినట్లుగ కనబడుతున్నది.అలాగే "కయి' వర్ణకముసైతము క+అయి అనుదాని విపర్యరూపము.ఇందు అయి అనునది అగు ధాతువు క్త్వార్ధకరూపము.
ఉదా.., గోపి కై రాము వేచి యుండెను
5)పంచమీ విభక్తి !
వలనన్, కంటెన్, పట్టి--- పంచమీ విభక్తి.
అపాయ, భయ, జుగుప్సా, పరాజయ, ప్రమాద, గ్రహణ, భవన, త్రాణ, విరామ, అంతర్థ, వారణంబులు అనేవి వేటివలన జరుగుతాయో ఆ పదాలకు పంచమీ విభక్తి వస్తుంది. అందులోనూ 'వలన' అనే ప్రత్యయం వస్తుంది.
ఉదా:
అతివేగము వలన ప్రమాదము జరిగెను(అపాయ)
దొంగ వలన భయము కలిగెను (భయము)
పాపము వలన ఏవగింపు కలిగెను (జుగుప్స)
నిర్లక్ష్యం వలన జారిపడెను ( ప్రమాదము.)
భార్య వలన ధనము కలిగెను(గ్రహణము=కొనుట ,,ఎరుగుట.వినుట)
అపరిశుబ్రత వలన వ్యాధులు వచ్చును (భవనము..పుట్టుక)
పంటను పక్షుల వలన కాచెను(త్రాణము.కాచుట)
రోగముల వలన మానుకొనెను(విరామము)
చోరుడు శునకము వలన దాగెను(అంతర్ధి-దాగు మాయమగు...మఱగు)
శోకము వలన వారించె(వారణము-వారించుట)
ఆ)"కంటె వర్ణకంబు అన్యార్ధాది యోగజంబగు పంచమికగు"
అన్యార్థంలో చెప్పేటప్పుడు 'కంటె' అనే వర్ణకం వస్తుంది.
అనగా అన్య, ఇతరము, పూర్వము, పరము, ఉత్తరము అనే పదాలతో అన్యము ఉంటే 'కంటె' వస్తుంది.
ఉదా: రాముని "కంటె" నన్యుండు దానుష్కుండు లేడు.
కర్ణుని "కంటె" నన్యుడు దానశీలి లేడు
ఇ)నిర్ధారణ పంచమిలో కూడ కంటె ప్రత్యయం వస్తుంది.
జాతి మొదలగు వాటితో నిర్ధారించేటప్పుడు పచమీ విభక్తి వస్తుంది దానిని నిర్ధారణ పంచమి అంటారు ఆ పంచమికి "కంటె" వస్తుంది
ఉదా:
ఆటవికులకంటే నాగరికులు వివేకులు (ఆటవికులు నిర్ధారకులు)
గ్రుడ్డి కంటె మెల్ల మేలు: ఇక్కడ ('గ్రుడ్డి నిర్ధారణము)
ఈ)'పట్టి' అనేది హేతువులయిన గుణక్రియలకు వస్తుంది. హేతువు అంటే కారణం. గుణం హేతువు కావాలి, క్రియ కూడా హేతువు కావాలి.
గుణము అంటే స్వభావం క్రియ అంటే పని
ఉదా: "చదువును బట్టి యోగ్యుడగు. "
యోగ్యుడవడానికి కారణము చదువు
వలనన్ అనునది వలను+అన్ శబ్దముయొక్క సప్తమ్యంత రూపముగ నెన్నదగుచున్నది.ఇక కంటె అను వర్ణకము కు+అంటె అను పద విభాగమున కల్గినరూపముగ తెలియును. పట్టి అను వర్ణకము 'పట్టుధాత్వర్ధక క్త్వార్ధక రూపము'.
6)షష్ఠీ విభక్తి !
కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్--- షష్ఠీ విభక్తి.
అ)శేషం అంటే సంబంధం. సంబంధం కనిపించినప్పుడు 'యొక్క' అనే విభక్తి వస్తుంది.
ఉదా: నా యొక్క పుత్రుడు; వాని యొక్క తమ్ముడు.
ఆ)నిర్ధారణ షష్ఠికి 'లోపల' వర్ణకం వస్తుంది.
జాతి, గుణ, క్రియ, సంజ్ఞల చేత - ఒక గుంపు నుండి ఒకదాన్ని విడదీయడాన్ని నిర్ధారణ అంటారు.
ఉదా: పశువుల లోపల గోవు శ్రేష్టమైనది.
షష్ఠీ విభక్తిలోని 'ఒక్క' శబ్దము 'ఒ' యను ప్రణష్టధాతువుయొక్క ధాతుజన్య విశేషణము. ఇక్కడ ఒ = కూడు, లేక చేరు అని తెలుపును
సశేషం--- రేపు కలుద్దామా?

No comments:
Post a Comment