Thursday, June 23, 2016

రావా నేస్తం..,?ఎప్పుడొస్తావు నేస్తం..(నా వచన కవిత)

1--రావా నేస్తం?---27/1/2016

కటిక చీకటిలో
కరదీపిక అనుకున్నాను

వలపు కొలనులో
కలువ పూవనుకున్నాను

నా వంకర బ్రతుకుకు
ఊతం దొరికిందనుకున్నాను

క్షణికావేశంలో
కనపడకుండా పోతావనుకోలేదు,

 రావా నేస్తం  ?

*******************************
*2--కరుణించవా నేస్తం?...,28/1/2016

వినపడుతూనే ఉన్నాయ్ నీ నవ్వులు!
గలగలా ప్రవహించే గోదారి ఉరవడిలా!!

కోయిల కంఠంలా ప్రతిధ్వనిస్తూనే ఉంది!!
నీ కొంటె పిలుపు "ఓయ్ ఓయోయ్ ". కవ్విస్తూ

"లేరా చిన్నా లే"..వలపు నింపిన నీ
లాలిత్యపు పిలుపు ,నా పై అధికార మొలికిస్తూ.,!!

అయ్యో...మరచేదెలా? నేస్తం
నేను మరణించే వరకు కరుణించవా నేస్తం?!!

రావా నేస్తం!

*******************************
3--ఎక్కడున్నావు  నేస్తం----29/1/2016

నా  మనసు వీణ పై గుసగుసల
సరిగమలాలపించి ఆనందాన్ని అందించినదీ నీవే !!

నా యెద పలకము పై నాట్యమాడిన
నీ చేతి వేళ్ళస్పర్శతో అనంత తీరాలకు చేర్చినదీ నీవే !!

మమత ఉలి వలపు సుత్తీతో ఈ రాయిని
అద్భుతమైన సుందర  శిల్పంగా  మలుస్తానన్నదీ నీవే !!

వీణ మూగబోయిందే? నాట్యమాగిపోయిందే?
ఉలి పరుగు, సుత్తి దెబ్బ లేవి? అసలెక్కడున్నావు నేస్తం?

రావా నేస్తం !!

*******************************
*4--మరిచావా నేస్తం...? 30/1/2016

నీ తడబడు అడుగుల మంజీర నాధం !
నా యెద  లోతులలో నాగస్వరంలా మారుమ్రోగిందే!!

ధవళ వర్ణపు  మేలిముసుగుతో నిశరాత్రి !
నువ్వు నన్ను చేరితే శశి మబ్బుల మాటున చెరెనే!!

తడి యారని పెదవుల తహతహలతో నీవు! నాలో !
సగమైన వేళ అర్థనారీశ్వరుడే అమ్మకు కను సైగ చేసెనే!!

పొన్న చెట్టు పైన నున్న చిన్ని గువ్వలు రెండు మన!
గుసగుసలకు ముక్కులు రాసుకుంటూ కువకువ లాడెనే!!

మనోహరమైన నీ మేని సువాసనలకు మన్మధుడే !
మతి తప్పి మౌనిగా మారిన ఆ రేయి! మరిచావా నేస్తం?!!

రావా నేస్తం?
*******************************
5--తరించానన్నావుగా  నేస్తం!--?  31/1/2016

ఆ సుదినం నువ్వు "నన్నెక్కడికో " కొనిపోయావే!
ఆక్షణం నామనసు తనువూ నా అధీనం తప్పినపుడు!

నీ పెదవుల గుసగుసల ప్రతి అక్షరమూ నా మదిలో చేరి!
ఆ అక్షరాలే నా మనో ఫలకముపై అముద్రిత గ్రంధాలై!!

మన ప్రతి కదలికా రతీ మన్మధుల భంగిమలై
ప్రతి భంగిమా నాకనుపాపలలో కదలాడే వర్ణ చిత్రాలై!!

నీ నిశ్వాసలోని వేడి నిట్టూర్పులే,  మన్మధ బాణాలై
క్రీగంటి చూపులే వెన్నెల కాంతి రేఖలై నేపరవశిస్తూ!!

జుంటె తేనె కంటే తియ్యనైన నీ అధరామృత ధారలు
గ్రోలి నే విశ్రమించిన వేళ ఆదమరచి నాయెదపై వాలి !!

తరించానన్నావుగా నేస్తం!.....రావా నేస్తం?

*******************************
6--ఎలా ఉన్నావు నేస్తం....3/2/2016

ఒక్క రోజు నే కనపడకపోతే వడలిన సన్న జాజిలా!
ఒంటరి గువ్వలా , జడి వానకు వంగిన పుష్పంలా!!

ఒక్క రోజు నా స్వరం వినకపోతే తీగలుతెగిన వీణలా!
శృతి తప్పిన నాదంలా గతి తప్పిన నాట్య మయూరిలా!!

ఒక్క రోజు నా స్పర్శలేకపోతే! ముడుచుకున్న మందారంలా!
రేక లూడిన గులాబిలా !గానం మరచిన కోయిలలా మారి!!

అరక్షణం జాగుకు వేగ లేక  వేగి పోతూ క్షణక్షణం నా!
ఆలింగనం కోసం ముందా తొందర చర్య కై తపించి!!

కన్నులలో కన్నీరు.కనుపాపలలో నారూపు నింపుకొని!
చెకోరంలా ఎదురు చూచిన నువ్వు ఎలా ఉన్నావు నేస్తం!!

రావా నేస్తం?

*******************************
7--మరవాలెలా? నేస్తం..?.,4/2/2016

"నువ్వక్కడే నేనిక్కడే మరెక్కడో కలుద్దామొస్తావా"!
నిన్న మొన్న నువ్వన్న పిలుపు నన్నింకా ఊరిస్తూనే ఉంది!!

"ఒరేయ్ కన్నయ్యా-నవ్వించకురా నన్నిలా ఊఁ ..చంపుత."
నీ చిరుకోపపు చిలిపి పదం నా యెదలో మ్రోగుతూనే ఉంది!!

"ట్యాబుతెరిసి చూడు" "పిలవరా" మేఘసందేశం మేసేజ్
అడిగి మరి అల్లరి నామదినిండా అలజడి వల్లరి గిలిగింత

చీకటి మాటున చిలిపిగా నీ చీరకుచ్చిళ్ళు  చేపట్టి నేను
చిరు చెమటలతో నుదురు, నుదురుపై చెదరిన ముంగురులు!!

మేడపై నీ ముగ్ద మనోహర రూపం! రాకుమారిని బోలి
రాయంచ నడక ! ఆ నడకే నాకు రాచ బాట...మరవాలెలా నేస్తం!!

రావా నేస్తం  !!

*******************************
8--బ్రతక గలనా నేస్తం ?---5/2/2016

నక్షత్రాలు రాలినట్లుండే నీచిరుధరహాసాలకు దూరమై!
చిలక పలుకులను మరపించు నీ చిరు సవ్వడికి దూరమై!!

సుందర మృదు మనోహర నీ రూప లావణ్యం.పున్నమి!
చంద్రునికే ఈర్ష్యను కలిగించు నీముఖారవిందం చూడక!!

వెన్నెల కురిపించు నీ చల్లని చూపులకు దూరమై!
నీకరములు నా కరముతో ఆటలాడి బంధనము లేయ

అరవిరిసిన గూలాబీల సోయగాలద్దుకున్న నీ చెక్కిళ్ళపై!
చిలిపి గుర్తులు చిత్రించక.నీ చిగురు పెదవులు రుచి చూడక!!

మన్మధ ధనుసును బ్రోలు నీ నడుము ఒంపుసొంపులపై!
నా మునివేళ్ళు నాట్యమాడించక నే బ్రతుక గలనా నేస్తం  !!

నేనున్నానన్న నమ్మకమే నీ జీవిత గమనానికి చిరుదీపిక
గానెంచి అలసి సొలసిన  నన్నిడిచి నీవు ఎటో ఎగిరిపోతే

బ్రతుక గలనా నేస్తం? రావా నేస్తం.,

******************************
9--ఎప్పుడొస్తావు నేస్తం?..,6/1/2016

ఓహో ఓహో నేస్తమా! ఆహా నా ఆరాధ్య రూపమా!!
ఏమి నీ మహొజ్వల శక్తి !ఇంతటి బడబాలనమా!!

మురళీ నాదమే నీ స్వరం!మృధు మనోహరం నీ రూపం!!
జలపాతం నీ ధరహాసం! సుశోబితం నీ అభినయం!!

కంటి నిండా నీరూపమే!లేదు మరేది అంతా శూన్యమే!!
మనసు నిండా నీతలంపే! వలపుల విరులన్నియు.నీ పైనే!!

నీకైశ్రమించి తపించి పరితపించి మసిబారిన నేను
నీ యెడబాటును మోయలేక కృంగి పోయిన  నేను

ఎరుపెక్కిన కన్నులతో!  యెద సవ్వడి నిట్టూర్పులతో!!
చెట్టు పై చెకోర పక్షిలా !ఎదురు చూపులు నీకొరకే !

ఎప్పుడొస్తావు నేస్తం?------రావా నేస్తం?
*******************************
10--దయలేదా నేస్తం?--7/2/2016

మాటలతో మత్తెక్కించి!అంతలోనే అగాధంలో తోచావు!!
చేతి కందినట్లే అందావు!అందనంత దూరాన దూకావు!!

శూన్యంలో మన్యం పండించావు!చీకటిలో కరాళ నృత్యం చేయిస్తావు
వలపు రూపమే నాకు శాపమా? ఆ శాపమే నాకు మోహమా?

మురిపెము మూడు దినాలా?ముసలం ముప్పది యేండ్లా?
వడిదుడుకుల జీవితానికి  వలపు సంకెళ్ళు ఆభరణాలా?

చిరు ధరహాసాలే గురిచూసి వదిలిన శరాఘాతాలా?
నీ క్రీగంటి చూపులే యమ పాశాలా?దయలేదా నేస్తం!!

...రావా నేస్తం?
*******************************
11..ఎలా తీర్చుకోను నేస్తం.,,,?--8/2/2016

తడబడు అడుగులతో వచ్చి నీ బాహు బంధనములో చిక్కి
పరవశించి నే గోముగ నీ యెద పై వాలి దేనికో వెదకంగ

అక్కన జేర్చుకొన జక్కగా పయ్యెదమాటున జేరినే
ధారలు గ్రోలుచు..మునిపంట కొరికితే చిరుకోపముతో

చెంపపై చిటికేసి తమకంగా నావేపే చూస్తూ మైమరచి
నామోముపై ముచ్చటగొని ముద్దులిడి పరవశించితివే

తనువంతా తడిమి  ముద్దులిడుతూ జలకమాడించిన
నీ స్పర్శకు నా వడలంతా పులకరించి నే పరవశించితినే

మేడపై సన్న జాజులు సుతారంగా నువ్వు తుంచెడి వేళ
తుంచిన జాజులు మురిపంగా నీ ముని వేళ్ళు మాల కట్టు వేళ

నీ ప్రక్కన పక్కపై చేరి నే చేసిన చిలిపి అల్లరి జడలో జాజులు
నా చేతులలో పడి చిందర వందరగా రూపు మారిన వేళ

అల్లరి చేష్టలతో నీతో ఆడుకొని అలసి సొలసి నిద్రించగ
నుదురుపై ముద్దిడి చమట బిందువులద్ది అలరించిన నీ

ఋణమెలా తీర్చుకోను నేస్తం?  రావా నేస్తం?
*****************************
12--నాకు గుర్తే నేస్తం ! 9/2/2016

నల్లని నాగకన్యను బోలిన నీజడ పాయలలో తురిమి
పుడమంతా  పున్నమి వెన్నల పూసినట్లున్న మల్లెలు

ఘల్లు ఘల్లున మ్రోగు నీ కాలి గజ్జెల సవ్వడి నాకు
చెయ్యి తిరిగిన మృదంగ వాద్యకారుని నాదములా

చెదరిన ముంగురులతో ,మంచిముత్యాల వలే చిరుచెమట
బిందువుల పాలభాగాన, చక్కని సింధూరపు బిందువు తో

గలగలా పారే గోదారి వరదలా  పరుగున నన్నల్లుకు పోయి
జలజలా పారే గంగా ప్రవాహంలా నీ కంటరాలే అశృధారలు

కనినంత  నా మదిలో యెన్నెన్నో ఙ్ఞాపకాల దొంతరలు
పొర్లి పొర్లి సెలయేటి ఉరవడిలా నన్ను చుట్టు ముట్టిన వేళ

నగుమోముతో నా కరమందుకొని బంధించి  నేనున్నానన్న
రవ్వంత గర్వం నీ కనుపాపలలో కదులాడిన నారూపం

నాకు గుర్తే నేస్తం !    ----రావా నేస్తం?

******************************
13---మరలిరా నేస్తం....10/2/2016

మదిలో మెదిలిన నీ మమతానురాగాలు మహా వృక్షమై
వేళ్ళూని  నలుదిశలా విస్తరించి  నన్నూరడించిన వేళ

నీ మేని స్పర్శ  చల్లని చిరుగాలిలా నన్నాదరించి లాలించి
నీ సత్తువ నంతా నాకై రంగరించి నాపై గంధంలా చిలుకరించి

నీ గంభీర వదనారవిందంగని నే గువ్వలా ముడుచు కున్న వేళ
ఫక్కున నవ్వి నన్ను  నీ బాహు బంధనములో బంధించితివే

కను చూపులతోనే మనమిరువురం కచాలనం చేసుకుంటూ
మూగ భాషలోనే మురిపమొలుకు ముచ్చటులెన్నో కదా

నీకై ఎదురుచూపులతో నాకు తెల్లవారిన ఉషోదయాలు ఎన్నో
నా రాకకై పరితపించి నీకు ఉదయించిన చంద్రోదయాలెన్నో

వసంతాలకు వసంతాలు వస్తూ.,,పోతూనే ఉన్నాయ్
చక్రభ్రమణం ఇసుమంతైనా మనకోసం ఆగింది లేదు

మళ్ళొస్తారా నానా అన్న నీ కమనీయ కంఠం మరలా మ్రోగదే?
నీ అమృతమొలుకు చల్లని చూపుల తాకిడి తగలదే నాకు

మరలిరా నేస్తం....రావా నేస్తం?

*******************************

14--నేను నువ్వే నేస్తం,,,11/2/2016

వసంత కాలంలో మావి చిగురు తిన్న కోయిల రాగంలా
ముని వేళ్ళ తాకిడికే వీణ తంత్రులు పలికే సప్త స్వరాలలా

బారులు తీరిన మేఘాలు చూసిన నెమలి నాట్యంలా
చిరు పెదవుల చిరుగాలికి చిగురించే మురళీ నాదంలా

ఆకాశంలోని చంద్రుని చూసి కలువ భామ వికసించినట్లు
నీ పిలుపు వినగానే పరవశంతో నా మనసు వికసించింది

నువ్వు నన్ను కోరుకోవటం నేను నీకు మనసివ్వటం
నువ్వన్నట్లు మనం సగం సగం  ఈ ప్రకృతిలో చెరిసగం

నాలో నువ్వో సగం నా కలతలు పంచుకుంటూ ప్రేమగా
నీలో నేనో సగం మమతలమాధుర్యమందుకుంటూ ఆశగా

ఈ చరాచర జగతిలో నువ్వు నేను అణువంతే అయినా
మన ప్రేమ మధురిమ ఈ ప్రకృతి ధర్మంలో కలసిపోయింది

నేను నువ్వే నేస్తం...రావా నేస్తం?

*******************************
15- ఎన్నాళిలా నేస్తం? -12/2/2016

నీ చల్లని పలుకులకు వేడి నిట్టూర్పులకు పరవశించె నా
బ్రతుకో ఏకాంతం, మహా బడబాలనంతో నిండిన సంద్రం

మూగబోయిన నా మది భావాలను తట్టి లేపిన నువ్వు
ముడుచుకు పోయిన శరీర సుగంధాలను కుదిపి లేపిన నువ్వు

ఎడారి లోని ఒంటరి ఒయాసిస్సు లాంటి నా బ్రతుకు
వలపు కొలనులో కలువలు పూయించిన నీ చిరునవ్వు

నీ ఓర గంటి చూపులు వలపు బాణాలై నాహృది తాకితే
మంచు బిందువు లద్దుకున్న ముద్ద మందారంలా నేను

నీ నోటి నుండి వెలువడే ఒక్కో మాట నా చెవులకు సోకితే
అవి ఓం శబ్దంలా చర్చి గంటల్లా,అల్లాహో నమాజు నాదాలై

నిద్రకు నోచుకోని నాకళ్ళల్లో కదులాడే నీ రూపలావణ్యం
నే వ్రాసే ప్రతి అక్షరమూ నీతో గడిపిన మధుర క్షణాలై

సజీవ చిత్రాలలా నా మనోఫలకంపై చెరగని ముద్రవేసి
ఆరిపోయే దీపానికి ఆముదమందించి వెలిగిస్తూనే ఉన్నాయ్

ముసురుకొనే కారు చీకటికి చిరుదీపపు వెలుగులా
ఆరిపోయే జ్యోతికి అరచేయి అడ్డులా  ఎన్నాళిలా ప్రియా?

రావా నేస్తం?

***********************
16-- తగునా నేస్తం?--13/2/2016

కాలం మగ్గంపై నేసిన కలనేత  రంగుల చీరలోని ,పడుగూ
పేకలా మంచి చెడులను విడమర్చి చెప్పెడి ప్రియతమా!

చిరుగాలులకు నటనమాడు చిగురాకుల గుసగుసలలా
నవ యవ్వన బింభాధరాల అరుణారుణ కాంతిరేఖ శోభినీ!

చెలీ !నీ కోమల కరకంకణముల సవ్వడి ఆమని ఝుంకారములా
నవ యవ్వనికి ఝుంమ్మని రేగిన మదన కోరికల ప్రేమ లేఖలా!

ప్రియా! నీవలపు విందుకోసం తత్తరపాటుతో బిత్తర పోతూ,గాలికి
ఎండుటాకు కదిలినా నీ కాలి యందియల సవ్వడేగా నాకు!

ప్రియతమా! నిరతం నీ గాత్ర మాధుర్య లాలనా పరవశంలో
మైమరచి నీ నవ్వుల పానుపుపై హాయిగా పవళించ గోరెదనే!

నాకై విరబూసిన నీ వలపు వృక్షపు నీడలో పరుండి సేద
తీరెడి నాకు నీ మనసు సున్నితత్వం  తెలియదా?

నాకు మరియొక అతివతో నేస్తమా? హాహాహా  లలనా ?
సహజమైన స్త్రీ  మనో దౌర్భల్యమునకు నీవునూ బానిసవేనా

లేక నాపైనున్న మోహామృత ధారలు నీమనసునలా
సందేహ సంశయములో వేసి వేపు చున్నవా చెలియా?

కలనైనా మరో కలికి రూపము కానని నాపై నీ కాఠిన్యమా?
ఏమి నీ వలపు వైపరీత్యము? ఔరా! ఎంతటి నెరజాణవు?

నీకిది తగునా నేస్తం,.?  రావా నేస్తం?
*****************************
17--అనుమతిస్తావా నేస్తం,.?---14/2/206

రోజు రోజుకూ నువ్వు మారతావన్న ఆశ కొడిగట్టి పోతూ ఉంటే!
కనులలో నీరూపం నింపుకొని నే జీవచ్చవంలా మారిన వేళ

భూమండలం బ్రద్ధలైనట్లూ... ఆకాశం కుప్పకూలినట్లూ!!
సూర్య చంద్రులు అపసవ్య దిశలో ఉదయించారా అన్నట్లు

కాలి క్రింద నేల కంపించి నేనగాధంలో కూరుకు పోయినట్లు
ఆకాశంలో ఇంద్ర ధనస్సు విరిగి ఏడేడు ముక్కలైనట్లు

సప్త సముద్రాలు ఒక్కసారిగా  ఇంకి పోయి నెర్రెలు వారినట్లు
చరాచర జగత్తు మొత్తం ఒకేసారిగా చలనం కోల్పోయినట్లు

నీ నోట "నిలువదురా మనబంధం" అన్న ఒకే ఒక్క మాట
నా నవనాడులూ తెంచి నాహృదిని ముక్కలు చేసింది!!

నాకే సంబధమూలేని విచిత్రమైన ఈ వైకుంటపాళి ఆటలో
నువ్వు గెలిచి ఓడావో నేను ఓడి గెలిచానో కాలమే కదా చెప్పాలి!!

అంతులేని ఈ వేదనాభరితమైన పలుకులు భరించగల శక్తి
నా సున్నితమైన మనసుకు లేదు, అంతభారం మోయనూలేదు!!

నీవు వలదన్న పిమ్మట ఈ రమణీయ మనోహర ప్రకృతి సౌంధర్యముతో నాకింకా పనేముంది. నిష్క్రమిస్తున్నా ప్రియా..!
నీవలదన్న పిమ్మట అర్హతకోల్పోయిన  ఉత్తమ ఆటగాడిగా-నాకీ విశాల ఆటస్థలంలో  పనేముంది వెళ్ళిపోతున్నా చెలీ !

ప్రేమికులంతా  ప్రేమదినోత్సవంనాడు ప్రేమసాగరంలో మునిగి తరిస్తున్న వేళ !
మరలి రాని మరోలోకాలకేగ నాకు నేనే మరణ శాసనం వ్రాసుకున్నా చెలియా!

రోధించకు ప్రియా! నీ కనులలో నీరు నే చూడలేను! ప్రియతమా
మరో జన్మంటూ ఉంటే నీ అడ్డాలలో బిడ్డగానైనా తిరిగి రావాలనుంది!

నీ కోసం మళ్ళీ మళ్ళీ పుట్టాలనుంది.. అనుమతిస్తావా నేస్తం?.మరలి రానా నేస్తం?

*******************************
18--వచ్చావా నేస్తం...15/2/2016

మరణ శయ్యపైనున్న నన్ను కనులారా చూడటానికొచ్చావా నేస్తం?
నీ కనుకొలకలనుండి జారే ప్రతి నీటి బిందువులోను నా రూపే!

బరువెక్కిన గుండెలతో బాధాతప్త హృదయంతో పరుగు పరుగునా వాయువేగంతో కదిలొచ్చావా
మమతానురాగాల మేళవింపుతో మదిలో మాలిన్యాన్ని
మచ్చుకు కూడా లేకుండా కడిగేసుకోని  మహా పునీతగా

పసిపాపగా.నవ యవ్వనిగా..చెల్లిగా, అక్కగా, అమ్మగా,
ఆలిగా ,ప్రేయసిగా, నా ఆరాద్య దేవతా మూర్తిగా, నిలవాలని

నీవేపేరులో ఉన్నా ఈ మానవాళికంతటికీ మహోన్నత
మార్గదర్శినివి మమతానురాగాలు పంచే మాతృమూర్తి నువ్వేనని

నీవు లేని నాడు ఈ సువిశాల ప్రపంచలో మానవాళికి
అవతరణేది? ఆలంబనేది ? అత్యున్నత శిఖరాలకు దారేదని?

ఒర్పు సహనం ఆభరణాలు గా అవతరించిన నీరూపం
అమృత మూర్తిగా, నీవు అవనితో సమానం కదా?ఆందుకే

నీ వనుమతించవని ,నా మరణ శాసనం రద్దు చేసుకోవాలని
ఆఖరి ఘడియలలోనైనావచ్చి ఆదుకుంటావని..నాకు తెలుసు

కరుణించిన నీ బాహుబంధాలలో బంధీనై. నీ ప్రేమామృత
దారలలో తడిచి ముద్ద కావాలని నా మనసు ఉవ్వీళ్ళూరుతుంది

వచ్చావా నేస్తం......,పయనిద్దాం పద నేస్తం.......

*******************************




వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి...76 to 104 (అచ్చంగా తెలుగు బృంద సభ్యులపై నా పద్య కవిత)

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......76--14/11/15

తే.గీ--152
శ్రీ దయానంద స్వాములన్ ప్రీతి గొల్చు
కన్నెమనసుచోరుండట వెన్న  దొంగ
పిల్ల కోతితొ పోలిక నల్లె జనుల
ఉల్లి పేరడి పాటలు యల్లె గనరె

తే.గీ--153
అంతయునునీవె యంత్ర్యామి యనును గనుము
అమ్మ ముగ్గురమ్మలయమ్మ మమ్ము గావు
నృత్య రీతి కథాకళి నిష్ట పడును
వివిధ శాస్త్రము లందున వీరు ఘనులు

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీమతి సుజల గంటి  వారికి అభినందనలు  నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం
 చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?...77----15/11/15

ఆ.వె--154
సాయి నాథు నెపుడు సరిగజూపు చునుండు
చక్కనైన ఠీవి మిక్కుటముగ
శిల్ప సంపదనిన శిరమునిడుకొనును
బందు, హితుల తోడ పొందు శుభము....

ఆ.వె--155
మంచి నీటి కొరకుమాటువేసిచిరుత
బిందె లోన మూతి బిగిసె గనరె
సంతసంబు తనకు నెంతయో మదినిండె
మురళి, రాజు తోడ ముచ్చటాడ...

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ  ప్రసాద్ అక్కిరాజు గారు వారికి అభినందనలు   నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......78--16/11/15

తే.గీ--156
సరిగ శుభరాత్రి యనెజెప్పు సాయి బంధు
అమ్మ వారిప్రతిమలద్భుతమ్ము జూపు
మూడు రంగుల జెండాకు మురిసి పోవు
మంచి వారల మాటల నెంచి చూపు......

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ  Someswara rao malyala గారు వారికి అభినందనలు   నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......79--17/11/15

తే.గీ--157
పాని పూరి లనగనెంతొ పరవశమ్ము
కబురు కాకర కాయల గుబులు రేపు
రవ్వ దోశల కొచ్చెగ రంగు రూపు
రాయ గలరెన్నొముచ్చట్లు హాయి గొలుప

తే.గీ----158
తీపి గురుతులు మదినిండ తీసిచూపు
పప్పు గింజల కొరకు తానప్పుగోరె
ఓటు వేయుట పప్పుల రేటు గనుము
మంచి గుమ్మడి కళలందు నెంచి చెప్పు


నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ  Sagar Lanka గారు వారికి అభినందనలు   నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......80--18/11/15

తే.గీ--159
తెల్వ రస్సేను హుస్సేను, తెలుసు నాకు
పీర్ల పండుగ దరువుల పిలుపు లపుడు
కవిత లూయల కమ్మని కవిత లల్లు
తెల్ల మైదానమెరుపెక్కె కలము వలన

తే.గీ---160
వెలుగు చాటున చీకట్లొ నలిగె నెన్నొ
కాలె కాగడా వెలుగులోకనర యనెను
మసక చీకటి లోపల మనసు ఘోష
సీటు మిచ్చరు పంచెను లేటు గపుడు

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ  Rayachoti Krishnamurty గారు వారికి అభినందనలు   నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి


వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......81--19/11/15

తే.గీ---161
వివర మిచ్చెనవార్డుల విషయమందు
రెండు బంగారు నాణాల మెండు గనరె
హనుమ చాలీస పుట్టుక యసలు కథను
శుద్దమగురీతి పలుకును శుభము లెన్నొ

తే.గీ--162
గట్టి మహిమతొ జూపెను మట్టి చిప్ప
అబ్దులయ్యకు నివ్వాళి యద్భుతమ్ము
ఙ్ఞాన సంపద సంద్రము ఙ్ఞాన శీలి
మంత్ర మహిమను గట్టిగ మనకు దెలిపె

తే.గీ-163
పెండ్లి రోజును పోల్చెను ప్రేమ తనము
చంద్ర గ్రహణము తీరును జదువ వలెను
మంచి విషయము లొదలక నెంచి చూపు
చదివె సంస్కృతాంధ్రములను సరిగ జూడ


నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ  Krishna Mani గారు వారికి అభినందనలు   నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......82--20/11/15
తే.గీ---164
మంచి పద్యాల నెప్పుడు యెంచి చూపు
కొత్త మేళము వీణను కొసరి జూపె
రాగ శృతుల సరిగమల రంజు యెరుక
తెలుగు వాచక గుర్తులు తెలిపె మనకు

తే.గీ--165
అడిగె వామనగుంటల యాటనెంచి
యస్వి రంగని నటనలొ యశము జూపె
గుడులు జూపును, దేవత గోపురములు
పంచె కట్టుట యెటులనొ పట్టి జూపె

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ  శ్రీనివాస ప్రసాద్ శుద్దపల్లి గారు వారికి అభినందనలు   నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......83--21/11/15

తే.గీ--166
ఊసు లల్లును మేజాకు లేసు లవియె
కాలి మువ్వల సవ్వడి కాగితములు
పాకులాడకు కనరాదు పాడు మనసు
నిన్ను వెంటాడు నీయాత్మ నీడ యనును

తే.గీ--167
మనము పండినా మొలకెత్తు మట్టిలోన
కాయ గలమను చెట్టుకు కాలమైన
నింగి కంపును కాయము నీది కడకు
చెట్లు నరకొద్దు నీకెంతొ చేటు యనును

తే.గీ--168
కలల యౌషద లేపనం కాటి కెడలె
మనసు కైవల్య మొందాక మాట వినదు,
నీడ పట్టున పెరిగిన నీది తనువు
మండి బూడిద యగునట మర్మ మిడెను


తే.గీ--169
చదువ నెంచిన కలుగును సంత సంబు
చిన్నపలుకులు చిక్కని వెన్న రీతి
తినిన మీగడ తరకల తియ్య దనము
నాకు మిక్కిలి మోదము నామవరపు


నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ  దేవరకొండ సుబ్రహమణ్యం...    గారు వారికి అభినందనలు   నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......84--22/11/15

తే.గీ--170
సరస సంగీత సాహిత్య చదువు లమ్మ
సకల విషయములందున శాంబవీమె
రమయె రచనలు సాగించు రత్న గర్భ
మనిషి నెమ్మది గనినంత మనసు వెన్న

తే.గీ--171
ఖండ ఖండాంత రాలలో కాంతి పిలుపు
ముద్దు రచనలు పిన్నీసు, మూగ మనసు
కనుము బియ్యములోరాళ్ళు కంటికింపు
అచ్చ తెలుగున కథలల్లు యద్భుతముగ

49.నేటి గుమ్మడి పండు:
కం:పెయ్యేటి వారె గుమ్మడి
     యయ్యేరని దల్చు చుంటి  హర్షము తోడన్
      బియ్యములో రాళ్ళనుచును
       తియ్యని కథలను సతతము తీరుగ చెప్పున్.
2.ఆ.వె:పతియు వ్రాయు చుండ సతియగు శ్రీదేవి
      పాడుచుండు తాను వరుసగట్టి
      చక్కని కథలెన్నొ  సమయానుకూలంగ
       కౌశలంబు తోడ కమ్మగాను
3.ఆ.వె:రంగని సతి యీమె రమణీయముగ వ్రాయ
            మరలమరల కథలు మరువ కచదు
         వంగ మోజు కల్గు పాఠకులకు నెల్ల
         లక్ష్మిపూజ చేయు లలన యెపుడు.
  నాసమాధానము:శ్రీమతి పెయ్యేటి శ్రీదేవి గారు.
(ప్రాస ,యతుల కోసం దంపతులను ఏకవచనంలో  వ్రాశాను.మన్నించండి.)
అన్నయ్యా సవరణలుండటంతో మళ్ళీ పంపాను.

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ  Sateesh Namavarapu   గారు వారికి అభినందనలు   నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......85--23/11/15
తే.గీ..172
గంగ కాలుచున్నది నేల కాలుమోప
నాల్గు పాదాల నడకయానంద మొసగు
కుక్కవలె కుక్కవలె పోయి కూర్చొన వలె
పూరణములకు జక్కని భోధనిడును

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ  pyyeti Srideviగారు వారికి అభినందనలు   నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి


వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......86--24/11/15

తే.గీ..,173
పద్య రచన లందునగల పట్టు గనుము
కలవు వ్రాసినవెన్నియొ తెలుగు గజలు
కలము నిండుగ కలవేమొ కవిత లిడను
అర్ధ వంతము పూరణలద్భుతమ్ము

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ  ధనికొండ రవిప్రసాద్  గారు వారికి అభినందనలు   నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి


వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......87--25/11/15
ఆ.వె--174
మనసు యంత నీవె నాయక మాన్యుడు
బుల్లి తెరల పైన యల్ల రదిగొ
మంచి మాట లిడును మంచోడె యబ్బాయి
తెలిసి నంత మీరు దీవెనిడరె

ఆ.వె....175
మైకు ముందు గళము మనసంత నటనపై
మంచి సరస మిడను మరువ డెపుడు
మనసు దోచె నాది మక్కువ  తోడను
సేవ జేయు నితడు శుభము లిడరె

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ  విరించి గారు వారికి అభినందనలు   నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......88--26/11/15

ఆ.వె--176
నిమ్మ నీటి లోని కమ్మదనము నింక
క్రమము తప్పరెపుడు వ్రాయు గనుము
నొప్పి తగ్గు కిటుకు తప్పక తెల్పును
బరువు తగ్గు విధము బహుగ చూపె

ఆ.వె--177
ఆద రించు నెప్పుడాకాశమేహద్దు
మంచి వారి గళము నెంచి వినుము
ఆలకించమనుచు నాకాశ వీధిలో
తెలుగు భాష కున్న తెగువ దెలుపు

ఆద రించు నెప్పుడక్షరమేహద్దు
మంచి వారి గ్రీవ నెంచి వినుము
ఆలకించమనుచు నధ్వము వీడలో
తెలుగు భాష కున్న తెగువ దెలుపు

ఆ.వె--178
గీత సారమిడును గేయములతొగూడి
తల్లి కథల నెంచి తనుజ తెలుపు
పెరిగె నిచట తాను పెయ్యేటి వారింట
దూర దేశమందు తోరి వినుము

అక్షరము=ఆకాశము(ఆకాశమే హద్దు)
గ్రీవ=గళము.....
నధ్వము=ఆకాశము....వీడ=వీధి(ఆకాశ వీధిలో)

ఆ.వె--177
ఆద రించు నెప్పుడాకాశమేహద్దు
మంచి వారి గళము నెంచి వినుము
ఆలకించమనుచు నాకాశ వీధిలో
తెలుగు భాష కున్న తెగువ దెలుపు

ముందు వ్రాసుకున్న పద్యం ఇది   అయితే నేను శ్రీ  rangarao  గారి ఇంటికి వెళ్ళిన సందర్భములో  vijaya గారు వారమ్మాయి అని తెలిసి నేనీ పద్యాలు చదివి వినిపించటము వారుషరికార్డుచేసి వెనువెంటనే ఆస్ట్రేలియా పంపటం జరిగిపోయాయి నాకు  తెలియకుండానే ......ఆకారణంచేత అర్ధం చెడకుండా పదాలు మార్చాను రెండవ పద్యం......

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ  Rjvj వేణువు గారు వారికి అభినందనలు   నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి


వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......89--27/11/15

తే.గీ--179
కంద మందున జక్కని యంద మదిగొ
బాహుబలిని పోల్చె గనుము భారతముతొ
అలసి సొలసిన వారికి హాయి యనుచు
ఇంగులీషుకు సరిపుచ్చె డింగుటకలు

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ  Vijaya gollapudi గారు వారికి అభినందనలు   నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......90--28/11/15

ఆ.వె--180
ఎన్న దగిన వితని వెన్నెన్నొ పలుకులు
అన్ని విషయములలొ యన్న మిన్న
అన్న కున్న పటిమ యెన్నదగినదన్న
చిన్న చిన్న వైన మిన్న రన్న

ఆ.వె--181
ఊరు, నీరు, పేరు కోరును మరిమరి
కోరి కోరి మనకు కొసరి జెప్పు
పుట్టి పెరిగె నచట బుద్దిగా చదివెను
మంచి పటిమ కలిగి మాట వ్రాయు

తే,గీ--182
కనుము మాటలగారడి కమ్మదనము
కథలు గాయము గమ్యము గగనములను
కుందనపు బొమ్మ మాలిని కూర్పు జూడు
చిన్న జియ్యరు స్వాముల వన్నె తెలిపె

ఆ.వె--183
సేద తీర్చు మనకు సీలేరు యందాలు
డొంక రాయి సొగసు వంక వాగు
వాగు లురక గనము  వంకల సెలయేరు
అడవి బిడ్డ లనిన యాదరమ్ము

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ  శ్రీనివాస్ యనమండ్ర గారు వారికి అభినందనలు   నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి


వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......91--29/11/15

తే.గీ--184
నాటి బతుకమ్మ ముచ్చట్లునయముతోడ
జమ్మి పాలపిట్టలజూపి జయము తెలిపె
రవిక సొగసుచూడతరమ రంజు గనుము
హస్త కళలను జూపెను యద్భుతమ్ము

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ  గౌతమ్ కశ్యప్    గారు వారికి అభినందనలు నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......92--30/11/15

తే.గీ--185
అన్ని పండుగలసరళి మిన్నగిడెను
నింగి కెగసెను సంద్రము తొంగి జూసె
కరుణ రంజిల్లు నవలోక కర్మచారి
కబ్బ సంద్రము కనువిప్పు గనుము రీతి

తే.గీ--186
కోరి వల్లకాడనినిడె ఊరి పేరు
అమ్మ ప్రేమను గనవలె కమ్మదనము
శాంతి కోరెను ప్రతిదినం కాంతి రేఖ
అచ్చ తెలుగును మెచ్చెను సొచ్చ మనియు

తే.గి--187
కడుపులోమంట విడమర్చె కడుపు మంట
శివుడు గనుమనంతలయుడు చెప్పె మనకు
యువత మేలుకో తెలుసుకోభవిత యనెను
అబ్దులయ్యను తలపోసె నద్భుతముగా


నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీమతి Usharani nutulapati గారు వారికి అభినందనలు   నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి


వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......93--1/11/15

తే.గీ--188
పుష్ప ధరహాసమునుగాంచి ముచ్చటించె
దేశ భక్తి గీతాలను దిద్ద వలయు
తెలిపె జాతీయ జండాను తెలుసు కొనరె
మంచి విషయాలు చిత్రసీమ వెంచి చూపు

తే.గీ--189
కనుము శతకమద్భుతములె కబ్బ చపల
సిక్క రంగారి చెట్టును చక్క దనము
చూపెనిట గుల్బి సామెత  చూడవలయు
మహిషి జింజిరి పాటయు మహిని వెలసె


నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ Pavani Suresh Chandra గారు వారికి అభినందనలు   నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి


వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......94--2/12/15

తే.గీ--190
తోడు రారటనెవ్వరు తుదకు నెపుడు
నీదు కష్టము సుఖములు నీకు తోడు
మట్టి గణపతి పూజల మహిమ దెలిపె
తెలిపె చట్టము చుట్టము తీరు తెన్ను

తే.గీ--191
పెరటి సురసతొ పోలిక గురుతుచేసి
మనకు కనువిప్పు సేయగ  మనవి చేసె
మంచి నాయకుడెటులౌనొ యెంచి జూపె
మద్య తరగతి జీవుల మిద్య దెలిపె

తే.గీ--192
కులము గోత్రములిచ్చట కూడ దనును
తరచి చూచిన లోతైన తత్వ మొసగు
నాటి నేతల చావులు నెట్టు లనెను
లేత పలుకుల తీరుండు లోతు మిన్న

తే,గీ--193
ఓడి ఓటమి పాలాయె నొక్కరోజు
చీదరించె సంవేదక సేవ గనియు
కోరె చాగంటి సూక్తుల గొప్ప దనము
పాల మీగడ తరకలే పదును మిన్న

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ Gorthy Venkata Somanadha Sastry గారు వారికి అభినందనలు   నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......95--3/12/15

తే.గీ--194
చిన్న కవులను మెచ్చుట యెన్న దగును
ఆలకించును జక్కగ హాయి నొసగు
మంచి విషయము లెప్పుడు యెంచి చూపు
చదివి తీరవలయు వీరినెదికి మనము

ఆ,వె--195
ముందుమాట నిడెను బుధజని "వాళ్ళు"కు
నువ్వె నేను నేను నువ్వె గనుము
చరిత్ర లోప్రభందపరమేశ్వరుండుని
కనుము వ్రాసె నెన్నొ కథలు వీరు

తే.గీ--196
బుద్ది గలిగిన సుకుమారి,భువనచంద్ర
సుభద్ర ,సుందరి, సమ్మెట,సుజలగంటి
నళిని,వలభోజు, మంతెన,నాగలక్ష్మి
ఆదరించగా గనవలె నక్కరీతి

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ Shyamala Kondapalli గారు వారికి అభినందనలు   నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......96--4/12/15

తే.గీ--197
జలము వాడండి తక్కువ జనులు మీరు
పలుకుమెప్పుడు యెక్కువ తెలుగు యనెను
పోక మానదు దేహము పోషణెంత
తెలిపె జీవిత సత్యము తెలియనగును

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీమతి  Bhanumati Mantha గారు వారికి అభినందనలు   నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......97--5/12/15

తే.గీ--198
ఇంటి పేరులు కులగోత్ర వంటి వెంచి
మతము భాషకు సంధియ కతను తెలిపె
అర్ధ భావము లిచ్చును యద్భుతమ్ము
సరళ మైనభాష తనది సరిగ జూడ

తే.గీ--199
చూపె యోగము చిత్తము రూపు గనుము
లోతు మిక్కిలి పదముల లోతు తెలుపు
వివరమిచ్చుట యందున వీరె మిన్న
మంచి యాచార్య వీరల నెంచి గనుము

తే,గీ--200
చెలిమి సంస్కృతం తోనట చేరి వినుము
జంట పదముల యమరిక కంట గనుము
తెలుగు నుడి పలుకుబడిని తెలుసు గొనరె
తెలుగు సామెతలర్ధము తెలియ జేయు

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ GdiyaramVenkatarangaSai  గారు వారికి అభినందనలు   నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......98--6/12/15

తే.గితి--201
అరుణ జననమ్ము గుండెలో యద్భుతమ్ము
మంచి ఉద్వేగ ఙ్ఞాపకం యెంచి కనుము
కాదు బ్రతకట మంటేను కథలు యనును
వాడు  రావద్దు వెలువల వ్రాసె కనుము

తే,గీ--202
పడతి జాతీయ సమగ్రత పథకమొందె
భరత మహిళాశిరోమణి పథకమొందె
కలదు కవితల సంపుటి కథలు గనరె
నవల వ్రాయుటయందున నలువరాణి

తే.గీ--203
ఎందరున్నారుయిలనట యందముగను
మౌన రాగము కనవలె మాలికందు
కనుము యెనిమిదోయడుగును మిన్న గుండు
చేసె సన్మానము సినారె చేయితోడ


నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ Vvs Sarma  గారు వారికి అభినందనలు   నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?....99--7/12/15

తే,గీ--204
శివుని నీదయ యనుచును చేరి పిలుచు
శివుని నామమె సతతము కవనమగును
శివుని కన్నీట మున్నీట సేయు జపము
శివుని రూపము నామము శివుని మయమె

ఆ.వె
చిన్న మాట లందు మిన్నగిడెనుగను
భగ్న మైన మనసు పడెడు బాధ
కనికరంబులేని కనరాని కనలేని
మనసు లోతు నెంచి మనకు దెలిపె

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీమతి Angaluri Anjanadevi  గారు వారికి అభినందనలు   నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?....100--8/12/15

తే.గీ--205
చక్క చక్కని చిక్కని సుక్కలెక్క,
కక్కు మిక్కిలి నిక్కము జెక్కుపదము
చిక్కె సక్కున గ్రక్కును నిక్కవంబు
లెక్కలెక్కన తక్కువ నిక్కులించు

తే.గీ--206
గట్టి, గట్టివ,గట్టుల గట్లసూడు
కట్టు కట్టడ కట్టాణి కట్టిపెట్టు
జట్టు గట్టిగాచేష్టితో చెట్టగొనును
పుట్ట పుట్టువే పొట్టెముబట్టి చూడ

తే.గీ--207
అంబజోదర, అజగుడు,ఆత్మ భవుడు
అజుడు, అంబుజనాభుడు, అగ్నిజుండు
అక్షధరుడును,అజయుడు, అమర ప్రభువు
అబ్దశయునుడు, అనతుడు, అచ్యతుండు

తే.గీ--208
కంబమయ్య,కంబుభృతుడు,కైటబారి
కపిలుడు కడారిపటుడును కంబపాణి
క్రతువు,కపి,కఱివేలుపు,త్రివిక్రముండు
జన్మకీలుడు, జహ్నవు, జలశయనుడు

తే.గీ--209
పాలమున్నీటియల్లుడు,పావనుండు
పుష్కరాక్షుడు, పురుహలి,పురుషవరుడు
ప్రభువు,పుష్కరనాభుడు,ప్రాగ్వఁశుండు
శేషశయునుడు, శంద్రుడు, శేషశాయి

తే.గీ--210
వీరి జనకుల నెంచెద కోరి నేను
కనుము మీరలు నెంతయొ కమ్మదనము
చిత్ర సీమకు వీరెంతొ సేవజేసె.
ప్రముఖ ప్రముఖాంధ్ర లోకాన పరుగు లిడును

తే.గీ--211
చేరె పసిప్రాయ మందున చెన్ననగరి
పట్టు పట్టితానెదిగెను పట్టుదలతొ
పొందె బిరుదములెన్నియొ పుడమి పైన
చేరి మ్రొక్కెద వారికి  శిరము నొంచి

తే.గీ--212
తేట తెల్లము ఘనమంత తెలుగు నందు
సహస్ర చంద్రుల గన్నట్టి సహన శీలి
చేసె తెలుగునకెంతయో సేవ వీరు
పాదపద్మముల్ వీరివి పసిడి నాకు

మొదటి పద్యం మొదటి పాదం విడ మరచి చెప్పనవసరం లేదురెండవ పాదం...
కక్కు=రపంము వంటి వాటికుండే పల్లు....పదును
నిక్కము.=,సత్యము.....
చెక్కు (జెక్కు)=పెట్టు,,,(దోపు, ఖండించు అనే అర్దాలు కూడ ఉన్నాయి)
చిక్కె=దొరికిన చో
టక్కున
గ్రక్కును
నిక్కవము
లెక్క..........నిక్కిలించు--టపాలన్నీ ఒక లెక్కసరిగా చాటభారతంలేకుండా చెప్పవలసినదేదో సూటిగా  ఉంటాయి అని నాభావయు
నిక్కిలించు=లేపు...నిగిడించు
-------------------------------+++++++++++++++++౭++++++
శ్రీ రామచంద్ర రాజు కలిదిండి

ఆ.వె. అరవదేశమందు ఆంద్రులకండగా
బ్రహ్మ జ్ఞాని యతడు బ్రాహ్మణుండు
కల్లనెరుగనోడు కార్యధక్షుండయా
కుమరుడయ్యెనేటి గుమ్మడిగను

ఆ.వె. తండ్రిమాటయన్న తామ్రశాసనమెగా
ధార్మికుండితనికి దార బలము
పారు దార వోలె పలుకుసౌమ్యముగాను
అన్యదేశమందు అన్నఘనుడు

+++++++++++++++++++++++++++++++++++++++
సోదరులు, ఆత్మీయులు, అన్నగారు శ్రీ గోటేటి వేంకటేశ్వర రావు గారికి, సోదరి ఓలేటి శశికళ, అభిమానంతో, అభినందనలతో రాసిన ఆటవెలదులు.
-ఆ.వె-------------------
1.పాలకొల్లు నుండి ప్రవసింప మదరాసు,
తరలి వెళ్ళె తెలుగు తరము యొకటి.
నాటి, నేటి, మేటి చాటేటి గోటేటి.
తెలుగు వనమున విరి తేరు, మేరు.
-ఆ.వె-------------------
2. పాండితీ ప్రకర్ష పారంపరిక మయ్యె.
పాత్రికేయు లయ్యె ప్రవృతి రీత్య.
సహస్ర పూర్ణ చంద్ర సందర్శితులు కాగ,
వేంక టేశుని గన్న వేల్పు వారు.
-ఆ.వె-------------------
3. అమ్మ,యతివ లనిన యపు రూప గౌరవం,
లలిత కేలు బట్టె, లక్ష్మి మెట్టె.
శ్రీలు చిందు ముఖపు శ్రేయ దివ్యల జూడ,
దర్ప పరవశ మగు దండ్రి మనసు.
---ఆ.వె-----------------
4. నమ్ము నిజము తాను నడుచు నిజము నమ్మి,
నెగ్గు వాడు, తగ్గి నిలుచు వాడు.
నవ్వు విలువ దెలుసు నలుగు రున్న హితుడు,
తెరచి జూపు బ్రతుకు తెలియ తెగువ.
ఆ.వె--------------------
5. ముఖ్య కార్య దర్శి, సఖ్య తెంచెడి నేత,
మాతృ భాష ప్రియుడు మాన ధనుడు.
దేశ రాజకీయ తెగులు వెలుగు దెచ్చు,
జనని, జన్మ భూమి స్వర్గ మనును.
-ఆ.వె------------------
6. తన్మ యమున మురిసి దసర, దీపావళి,
సంబరాలు మనకు సందడించు.
కొండ రాయు మనువు కోరి కూరిమి జేసె,
అయ్య అండ దండ అన్న కుండ.
-ఆ.వె------------------
7. చెన్న పట్నమంత చెదర వరదలకు,
కష్ట నష్టములను గాంచి నోర్చె.
దేవు ననుగ్ర హమున ధీమంతు, శ్రీమంతు
నాదరించు సాయి న్యాయ మీయ.
-ఆ.వె-------------=----
8. ఆవకాయ లేమి యసలు సైపని వాడు.
స్వ,పర ధర్మ ములను సరిగ నెఱుపు.
హిందు ధర్మ విధులు యెందున్న మరువరు,
ప్రవచనములు యన్న ప్రాణ సమము.
-ఆ.వె--------=---------
9. సంఘ మన్న తనదు సంసార మన్నను,
బాధ్యతెరిగి మెలుగు బాగు కోరు.
మంచి మిత్రుడు యెంచు మంచి విలువలను,
తలయివారు ఠీవి తలచి మురియు.
-ఆ.వె------------------
10. తిరుపతయ్య రక్ష తీరుగా గోటేటి,
వెంకటన్న వెనుకె వెంట నుండ,
వరద రాజు గాచు వరద నష్టము నుండి,
కోట్లు పడగ లెత్త కోరు చుంటి.
--------------------
8-12-2015.....శ్రీమతి sasikala Volety
+++++++++++++++++++++++++++++//////+++++++
శ్రీ  గోపీనాథ్ పిన్నలి

ఆ.వె. విత్తు వొక్కటైన వేరు వృక్షము రాదు
మంచి యేదొ వారె యెంచ గలరు
సీమ నైన నేమి చెలగి సంఘమునందు
చెడుగు చెరగుటందు శిష్టులనరె...

తే.గీ.
అవును, గోటేటి వారెగా యర్హులెపుడు
పద్య మందలి పదములా ప్రముఖులైన
తండ్రి దనయుల కెప్పుడొ దఖలు పడియె
దండమిడుదు దాశరథి వెంకన్నలకును

సీ.
ప్రముఖాంధ్ర తెచ్చిరీ ప్రముఖులిద్దరు చేరి ... పొగడ నాకును లేదె పూర్తి పటిమ
గోటేటి రామన్న గూర్మితో వెంకన్న ... సాయంబుతో సాగు సారథిగను
వ్యాపార మది గాదు వ్యాపకమే యదీ ... వెఱ్ఱి తనమనగ వెఱ్ఱి గాదె
జనని గొప్పలనెల్ల జగతిని వ్యాపింప ... తప్పు పట్టగ రాదు తరతరములు
ఆ.వె.
పట్టుబట్టి వారు ప్రముఖుల చరితలూ
తెలుపు చుండె మనమె తెలియ వలయు
మంచి యేర్చి కూర్చి మనలకందించేటి
ధన్యులాయె తండ్రి తనయు లహహ...


ఆ.వె.
సంప్రదాయమునకు సరి యింకొ చిరునామ
గోటెటన్నె యందు గూర్మితోడ
ఆధునికతను మనము నాచరించగలము
రీతి వదల రాదు నీతి యదియె

(ఆ కుటుంబం ఆధునికతను కాదనకుండానే సంప్రదాయానికి పెద్ద పీట వేస్తుంది. మనం నేర్వవలసినదీ అదేనని నా బావన)

ఆ.వె. నాదు శంక దీర్చు నాద్యాత్మ గ్రంథమే
రామ చరిత మనగ రహియె కలుగు
అన్న ప్రేమతోటి యందించె నాకది
ధన్యుడనుగ నేను నన్య మెరుగ !!

(రహి అంటే ప్రేమయే కదా.... ఇహ సంగతేమంటే........ గోటేటన్న నాకు అచ్చంగా తెలుగు వెబ్ పత్రిక రచనకు గాను పెద్దాయన రాసిన ఆద్యాత్మ రామాయణం పంపాడు. అంతకు ముందు నాకున్న కొన్ని సందేహాలను ఆ గ్రందం నివృతి చేసింది. అది చూడనంతవరకూ నాకు ఇంకోటి తెలియదు కనుక ధన్యుడనైతి ననుకుంటూ ఉంటాను.)గోపీనాథ్ పిన్నలి
++++++++++++++++++++++++++++++++++++++++
smt.Umadevi Balluri

నేటి గుమ్మడిపండు:
1.ఆ.వె:వధువులకు వరులకు పరిచయ వేదికన్
             చక్క గాను కూర్చి సలుపు చుండు
            కార్య దీక్ష బూని కఠినమౌ పనులను
            సులభతరము చేసి చూపు చుండు.
2.ఆ.వె:జీవితమును గూర్చి చెప్పేరుచక్కగా
             తెలుగు భాష గరిమ తెలియ చేయు
           కర్మయోగి తీరు కమ్మగా వివరించు
           ఆడ దన్న తాను యమ్మ యనును.
3.ఆ.వె:మాతృభాష గూర్చి మధురముగా దెల్పు
            తీపి కబురు లెన్నొ తెలుపు;తెలుగు
            తనకు తెలియ దనుట దౌర్భాగ్య మే యంచు
          తెలుపు చుండు వారు తేట గాను.
4.ఆ.వె:రాగి నాణెమందు రామచంద్రుని జూపు
           పాత నాణెములను పంచు నిచట(Share)
          మితముగ తినమనుచమిత మగు తిండిని
        చూపు చుండు నితడు చోద్యముగను.
5.ఆ.వె:పింగళి కవి గూర్చి భేషుగా తెలిపేను
             ద్వ్యర్థి కావ్యములను దర్శింప జేసేను
           ప్రముఖ యాంధ్ర లోని ప్రతిభ గనిన చాలు
         వెంకటేశ్వ రుండె  వినుడు మీరు.
 నాసమాధానము:  శ్రీ గోటేటి వెంకటేశ్వరరావుగారు.
++++++++++++++++++++++++++++++++++++++/+
నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ Svds Sarma  గారు వారికి అభినందనలు   నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?....101--9/12/15

తే.గీ--213
ఇందువారపు పూజల పొందు మహిమ
నేటి గురువులకొందనం మేటిగనును
చింత చితులలోజూడగ చితియె మిన్న
పాల కడలికి ముద్దుల పట్టి తాను

తే.గీ--214
లిబ్బిగుబ్బెత సింధుజ లిబ్బుపడతి
ఇంది ఇందిర ఈశ్వర ఇందువదన
చపల గోమిని జలధిజ జగముతల్లి
తమ్మియింటిగరిత ఋద్ది తల్లితల్లి

నిన్నటి నా పద్యములో విరిసిన గుమ్మడి..మిత్రులు...
శ్రీ Venkateswara rao Goteti గారు వారికి అభినందనలు   నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?....102--10/12/15

ఆ.వె--215
కుంచె కున్న దెంతొ కులుకుజూడవలయు
కలము కున్న పదును ఘనము గాద
నృత్య బాలెలుబహు కృతులు వ్రాసినిడెను
బాపు రమణ లితని భ్రాత లేమొ

తే.గీ--216
కోటి కొక్కరు జూడగ ధీటు గనుము
కాళి దాసుని తీరుగ కలదు వరము
కలదు సాహిత్య సంపద కమ్మ దనము
చిన్న పెద్దలు మెచ్చును మిన్న గెపుడు

తే.గీ--217
పూత రేకుల పుడమిన పుట్టె తాను
తల్లి నేర్పిన విద్యయే దన్ను తనకు
చిన్న పెద్దలకత్యంత చెలిమి బంచు
గీత రాతల యందున మోత గనుము

ఆ.వె--218
చేరె ప్రేమ లేఖ సీతరు యంపెను
కంట నీరు పొర్లె కనిన యంత
బాపు నుండి వచ్చె పసిడి పలుకు లేఖ
నంది బహుమతులను పొందె గనుము

నిన్నటి నా పద్యములో విరిసిన గుమ్మడి..మిత్రులు...
శ్రీ మతి Lakshmi Gundugola గారు వారికి అభినందనలు   నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?....103--11/12/15

తే.గీ--219
చదువు, సంస్కృతి,సంగీత, సకల మెపుడు
నీతి, స్నేహము, శుభములు, ప్రీతి మీర
చరిత,గణితము,ఛందస్సు చక్క దనము
లెక్క లేనన్ని  వ్యాక్యలు మిక్కుటంబు

తే.గీ--220
చక్కచక్కని పద్యాలు పెక్కు కథలు
చతుర, భాష ,కవిత లింక,సరస హాస్య
నిత్య సాహిత్య సంపద తద్య మెపుడు
తెలుగు పరిమళ గంధాలు తెలుపు చుండు

తే.గీ--221
తెలుగు భాషకు కలిగిన తెగువ జూడు
మంచి వారల నెవ్వరు మరువ రనును
సరస సల్లాప సాహిత్య చర్చ గనరె
గట్టి వారికి పట్టము గలదు నిజము

తే.గీ--222
వాడు కొననెంచి నెవ్వురు కూడిరేని
కన్న బిడ్డల రీతిగ కలుపు కొనును
నీకు స్వార్ధము పెరిగిన నీవె మునుగు
మగువ "తామర తంపర" తెగువ గనుము

(తామర తంపర=పద్మిని)

తే.గీ--223
ఒకరి నొక్కరు నెప్పుడు  నొక్క రీతి
అక్కునందున జేర్చుక యాదరించు
స్వార్ధ చింతన తలపరు సకలురెపుడు
పక్కు పక్కున నవ్వుచు పలుకరించు


తే.గీ--224
జగతి నంతట వసియించు జనుల నెంచు
మంచి యాచార మలవాట్ల నెంచి జూపు
బహుగ పండిత పాండిత్య పటిమగనుము
వేదముపనిషత్తులసార వేదభూమి


తే.గీ--225
కులము,మతము,జాతి,ధనిక గొప్ప చిన్న
వయసు భేదము లెంచక, వచ్చి రాక
సాహితీ సాగు సేయగ సంచరించు
పక్షు లన్నింటి కావాస వృక్ష మిదియె

తే.గీ--226
అచ్చ తెలుగున మిక్కిలి యాదరంబు
కమ్మ నైనది తెలుపరె గుమ్మడెవరొ
నూట మూడవ గుమ్మడి వేట కొరకు
చిట్ట చివరిగ నొసగెను "కట్టుపల్లి"


నిన్నటి నా పద్యములో విరిసిన గుమ్మడి..మిత్రులు...
శ్రీ బ్నిం  బ్నిం గారు వారికి అభినందనలు   నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరు "కట్టుపల్లి"..104--12/12/15

తే.గీ--228
సుబ్బ రావు సోమమ్మల సుతుడు,నీతి
తప్ప డెపుడు పొగరుబోతు, తప్పు మాట
లనిన చెవియెగ్గ డెప్పుడు, కన్న వారి
ప్రేమ నొందెను మెండుగ ప్రేమ మూర్తి

ఆ.వె--229
"బువ్వ లేదు కొడుక బుద్ది మంతుడవీవు
చల్ల త్రాగి పోయి చదువు కొనుము"
తల్లి మాట మీరి తానెరుగడెపుడు
కష్ట పడుట యనిన నిష్ట మనును

తే,గీ--230
విజయ లక్ష్మితో  బెండిలి విధిగ జరిగె
మానస, మనీష, క్రాంతి,యు మాకు సంతు
కనగ భక్త కన్నప్పగ కన్నడాయె
నేడు నరువదియున్ నాలుగేండ్లు జొచ్చె

తే.గీ..231
పెద్దలందరి దీవెనల్ ప్రీతి మీర
పిన్నలందరి శుభములు పెచ్చు మీర
కోరి నిలిచితినిచ్చట కొమరు నేను
ఇచ్చి పంపరె మీరలు యిచ్చరీతి

తే,గీ--232
మంచి వారల ప్రతిభను నెంచి చూప
యెంచె గుమ్మడి నీరీతి కొంచమిటుల
గుర్తు యుంచుక దీవించ గుమ్మడాట
వేడు చుంటిని మిమ్ముల వెడల దలచి

తే.గీ--233
చిన్న పెద్దల నెవ్వరి నైన నేమి
మరచి తినియోమొ పండిత మాన్యులార
తప్పుయెన్నక మీరలు యొప్పుమనుచు
చేరి మ్రొక్కెద  మీకిట  చేతు లెత్తి

తే.గీ--234
అచ్చ తెలుగుయె వేదికై యాదరించ
గుమ్మడాడిరి మీరెంతొ కమ్మదనము
మంచి వారలు మనతోడ యెంచి మురువ
చిన్న పెద్దకు వందనం శిరము నొంచి

తే.గీ--235
కూడి వేడుక సల్పగ గుమ్మడాట
గుమ్మడాటకు వ్యాఖ్యలు గుమ్మరించె
గుమ్మరించిన వారలు గొప్ప జనులు
గొప్ప జనులకు ప్రణతులు జెప్పు చుంటి

(ముక్త పదగ్రస్థాలంకారము)


సీ.--236
పద్మిని, శారద,  భారతి, మంతెన
          వెంకోర, సుందరీ, వేదవాణి !
శశికళా వోలేటి,సంధ్యమ్మ, మాసీత
          యలవర్తి, కొల్లురు,హంస గీతి !
కలిదిండి, వేదుల,భల్లూరి, పెయ్యేటి
            గోటేటి, శ్రీస్వామి, గోపినాథ !
ఆచార్య, మంత్రాల, ఆండర లలితమ్మ
            విద్యమ్మ ,లక్ష్మమ్మ,,విశ్వనాథ !
ఆ.వె
బొగ్గ వరపు, బాల, పూర్ణమ్మ,, మల్యాల
సుబ్బ లక్ష్మి ,మూర్తి ,సుజల గంటి
గుమ్మడాట మీరు కమ్మదనముగాడ
వందనములు మీకు వంద వేలు

నిన్నటి నా పద్యములలో విరిసిన గుమ్మడి "అచ్చంగ తెలుగు " బృందం ...,,., బృంద నిర్వాహకులకు బృంద సభ్యులకు అభినందనలు  ,,  ఈ ""అచ్చంగా తెలుగు"" బృందము ఇలాగే నిత్యమూ వెలుగొందాలని, సాహితీ సాహిత్య కిరణాలు అనునిత్యం వెదజల్లుతుండాలని అభిలషిస్తూ...శుభాశిస్సులతో......  ప్రసాద్ కట్టుపల్లి.......

నేటి గుమ్మడి నేనే...,,మీ రందరు

అ"ల్లరిచేయండి........
ఆ"శీర్వదించండి.....
ఇ"ష్టపడండి
ఈ"ర్ష్య పడకండి
ఉ"పయోగించుకోండి
ఊ"హలలో విహరించండి
ఋ"షిలా జీవించండి
ౠ"బులకాశించకండి
ఎ"వరినీ తూలనాడకండి
ఏ"మరపాటు పొరపాటండి
ఐ"క్యమత్యమేబలమండి
ఒ"క్కటిగా మెలగండి
ఓ"ర్పుతోబ్రతకండి
ఔ"న్నత్యంచాటండి
అం"దరు కలిసుండండి
ఆః" అని ఆనందించండి

క"లలు కనండి
ఖ"చ్చితత్వం పాటించండి
గ"ట్టి పట్టు పట్టి గెలవండి
ఘ"రానా వద్దండి,వదలండి
ఙ్ఞా"న సముపార్జన చేయండి

చ"దవండి చదివించండి
ఛం"ధశ్శాస్త్రం నేర్వడి
జ"యము మీదేనండి
ఝ"గితి స్పందించండి(ఝగితి=వెంటనే)
ఙ్ఞానం పదిమందికి పంచండి

ట"కటొంకు మాటలు వినకండి(టకటొంకు=మాయావి)
ఠ"వఠవ చేసిబ్రతకండి..(శ్రమ)
డ"బడబ వలదండి(గర్వము),
ఢ"కేలు చేయకండి .,వీ (తల తాకుట..మొట్టుట)
ణ" ధ్వనిలా మాటలాడండి

త"ల్లిదండ్రుల ప్రేమించండి,  క
థ" లు కవిత్వం  వ్రాయండి
ద"గదగా ప్రకాశించండి
ధ"ర్మం చేయండి
న"వ్వులపాలు కాకండి

ప"సివారిని రక్షించండి
ఫ"లితమాశించక ధర్మం చేయండి
బయళ్ళు పచ్చదనంతో నింపండి
భ"యమొలదండి
మ"నసెరిగి మాటండి

య"శస్సునార్జించండి
ర"చనలు చేయండి
ల"గువుతో బ్రతకండి(గౌరవము)
వ"నములు పెంచండి
శ"మము నేర్వండి(ఇంద్రియ నిగ్రహము)
ష"ష్టిహాయనము వలే(ఏనుగు వలె)
స"ర్వకాల సర్వావస్థలందు
హా"యిగా బ్రతకండి .హే
ళ"న ఎవరిని చేయకండి
క్ష"మాగుణము మంచిదండి
ఱ"వఱవలు  విడవండి,.,(స్పర్ధ,,కోపము)

తెలుగు అక్షరమాలను చూడండి....

"సర్వే జనా సుజనోభవంతు
సర్వే సుజనా సుఖినోభ వంతు"










వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి...1 to 75(అచ్చంగా తెలుగు బృంద సభ్యులపై నా పద్య కవిత)

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?..1--25/8/15

ఆ,వె....1
చూచి నేర్చి నట్లు కాచి విడిచినట్టు
సరస భాషణములు నెరపు చుండు
పసిడి  గీత,  తెలుగు, పత్రికల విలువలు,
తరచి చెప్పు చుండు తనివి తీర!
###################################
నా పద్యంలో విరిసిన అచ్చంగా తెలుగు బృందం లోని మన మిత్రుడెవరో  చెప్పండి బహుమతి గెలవండి,...నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?..2----26/8/15
ఆ.వె..---2
వేష మేసి చూపు ,వూసుల మృతముయే,
రమ్య మైన పలుకు రాయు నెపుడు
చేయు బహుగ నితడు చికిలిగ వేదిక,
తురము నేర్చు తెలుగు,  తూణ నితడు

(చికిలి-శోభ,మెరయు)(తురము-వేగము)(తూణ -అమ్ముల పొది)

నిన్నటి నా పద్యములో విరిసిన  మిత్రులు....
శ్రీ గోపినాథ్ పిన్నలి,,,. గారు ..నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి,.. నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి.

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?..3----27/8/15
ఆ.వె,.----3
భార్య మీదె నెపుడు బాణాలు విసరును
వదల డేది నితడు వరుస లోన
పిడుగు మిరప వీరి ప్రియమగు నేస్తాలు
పేరు లిడుట యందు పెద్ద యన్నె

నిన్నటి నా పద్యములో విరిసిన  మిత్రులు....
శ్రీ వెంకోరా..గారు...నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి ...నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి...

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?..4 ----28/8/15
ఆ.వె..,----4
మొక్క.చెట్టు లనిన  మోహంబు నిండుగ
మాట లేమొ గాని మనసు వెన్న
వదిన ముచ్చ టలతొ కదిలించె మనలను
అసమ పెళ్ళి జేసె నాదరమున..

ఆ.వె----5
ఈమె మాత జనియె యీశ్వరాఙ్ఞగొనియు
అవయవముల దాన యాన తొసగి
దాన మిడిన మీరు  ధన్యులైరి గదమ్మ
వేద నిడువు మమ్మ వేడు చుంటి

నిన్నటి నా పద్యములో విరిసిన  మిత్రులు....
శ్రీ Rv Prabhu.గారు...నేడు రెండు పద్యములలోనున్నది శ్రీమతి సంధ్య గొల్లముడి గారు.,వీరి జనని శివైఖ్యం చెంది నందున వారికి  శ్రద్దాంజలి ఘటించి  వీరిని పరామర్శించ వలసినదిగా కోరు చున్నాను.అందరికి * ఇవ్వ బడును(23/8/15...సంధ్య గొల్లముడి గారి టపా చూడండి..,వారి మాతృమూర్తి కోరిక మేరకు వారి కుటుంబ సభ్యులు అవయవ దానము చేసినారు ,చాలా గొప్ప విషయం)

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?..5---29/8/15

రావాడ కుమార స్వామి
S/O సీతన్న,
ఇంటి.నెం. 2-62,  ఇండుగపల్లి,
ఇండుగపల్లి పోస్ట్,
కోటనందూరు మండలం,
తూర్పుగోదావరి జిల్లా,
ఆంధ్రప్రదేశ్, 533401.
ఫోన్: 8106639115

గత రెండు సంవత్సరాలుగా కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాను. చిత్రలేఖనం, ఛాయాచిత్రసంగ్రహణం, కవితలు రాయటం, నా అలవాటులు.


ఆ.వె..---6
వయసు చిన్న దైన  వడిగల యశ్వమే
చంద మనిన నితని డెంద మరయు
పలుకు పరుల తోడ తెలుగు భాష విరియ
వడిగ పూరణములు నింపు వాడి శరము

నిన్నటి నా పద్యములో విరిసిన  మిత్రులు....తెలిసినదే
శ్రీమతి  సంధ్య గొల్లముడి గారు...నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి..... నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి...

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?..6----30/8/15
అ,వె.----7
పాత వస్తు వేది పనికి రాదనుడుగ!
పట్టు పట్టి సేయు గట్టి పనులు!
అమిత మైన కీర్తి యందె నలుదిశల!
సతియు గూడ నెంతొ సాయ మొసగు!

నిన్నటి నా పద్యములో విరిసిన  మిత్రులు....
శ్రీ  స్వామి.. గారు .నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి...... నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి...

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?..7---31/8/15
ఆ,వె..---8
కంచు రవళి నొసగు కంఠమి తనిదట
పెక్కు భాష లందు నిక్కవముగ
రంగ రంగ యనుచు రంజిల్లు వేదిక
సాటి రారు యెవరు మేటి నితడు

నిన్నటి నా పద్యములో విరిసిన  మిత్రులు....
శ్రీ TVLN MURTHY.గారు...నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి .....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి...

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?..8---1/9/15
ఆ,వె..---9
తెలియ జేయు మనకు తెలుగు సినీసీమ ,
సకల నటుల నెంచి సవివరముగ!
చక్క నైన జోకు నిక్కవముగజూపు!
నవ్వు రాని వాడు నవని గలడె?

నిన్నటి నా పద్యములో విరిసిన  మిత్రులు....
శ్రీ Manohar Borancha.గారు...నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.... నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి...

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?..9---2/9/15
ఆ.వె----10
"గుంట" లన్న చాల గుబులు రేగితనికి
గుంటల కొర కెంతొ మంట గలుపు
గుంట కనుల బడితె గంట మోగినటులె
గుంట పోయె నేని మంట తగ్గు..

ఆ.వె.---11
చెప్ప తరమ నాకు చేసెడి ఘనములు!
గుంట చూచె నేని కంట తడియె
దారి బాగు సేయ తగునియమముగొని ,
సకల సంప దంత దకలు పరచు!

నిన్నటి నా పద్యములో విరిసిన  మిత్రులు....
శ్రీ Vinjamuri Venkatappa Rao. గారు ....నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి ....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి...

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?..10----3/9/15
ఆ.వె----12
గల్లి నుండి మొదలు  ఢిల్లి వరకునైన
రాష్ట్ర, దేశ, సకల రాజ్యములను
భాష, మతము లింక భారత సంస్కృతి
సకల విషయములను సరిగ దెల్పు

ఆ,వె.----13
కొదువ లేదు పలుకు కోటిముచ్చటలైన
సకల శాస్త్ర ములను చదివె నేమొ
తెలుగు వారి కున్న తెగువ జూడగనొచ్చు
వీరి పలుకు లందు విషయ ముండు

నిన్నటి నా పద్యములో విరిసిన  మిత్రులు....
శ్రీ Gangadhar Tilak Katnam. గారు ....నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి ....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి...

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?..11---4/9/15
తే,గీ.---14
శుభము పలికెడి వేకువ సూర్యు డితడు !
మధుర పలుకులు పలికెడి మాధవుండు
దేవి దేవుని పటముతో తీరు నిలచి,
మంచి పద్యము గైకొని మించి గొలుచు!

నిన్నటి నా పద్యములో విరిసిన  మిత్రులు....
శ్రీ కొండూరు వాసుదేవ రావు గారు ..(వీరిTime line చూడండి) ..నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి .....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి...

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?..12----5/9/15

తే.గీ..---15
పద్య పూరణ సేయును తద్య ముగను
మెచ్చగ సకల సభ్యులు నచ్చ తెలుగు
బెత్త ముండదు చేతిన బెదురు నంత
మనసు దొడ్డది తరగతి మాత నియమె

నిన్నటి నా పద్యములో విరిసిన  మిత్రులు....
శ్రీ Krishna Prasad Aluri గారు....నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి .....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి...

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?..13----6/9/15
ఆ.వె.----16
అల్ల రన్నను ముదమాశ గోళీలన్న,!
గొడవ బడును బడిలొ గోపి తోడ!
జామి మామి యనుచు జాగుసేయు బడికి!
సకల రుచుల జూపి సంత సించు!

నిన్నటి నా పద్యములో విరిసిన  మిత్రులు....
శ్రీమతి   ఉమా దేవి భల్లూరి గారు....నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి...

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?..14----7/9/15
ఆ.వె..---17
మాట లందు పొదుపు మంత్రమేసినటుల
తెలుగు రచన లెన్నొ  తేట పరచు
వివర ణిచ్చు మంచి విషయముతోగూడి
కవుల లోన నెంతొ కలదు పట్టు

ఆ.వె----18
నడక యందు జూడ నాజూకు తనమెంతొ
మాటలందు గనిన మనసు వెన్న
రాత జూసెనేని రాయంచ పలుకులు
మేరు పర్వతమునె మెలత మగడు

ఆ.వె----19
పతిని గొలుచు నామె పసిడితీరుగెపుడు
నన్ను యెంచు నామె యన్న తీరు
మాటలాడు మంచి యాటలాడినటుల
తెలుప గలర? మీరు కలికి పేరు

నిన్నటి నా పద్యములో విరిసిన  మిత్రులు....
శ్రీ మతి హంసగీతి గారు....నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి..

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?..15----8/9/15
ఆ,వె..,,20
తల్లి,దండ్రులకును తగినగౌరవమిచ్చు!
రాయు నెపుడు కృష్ణ రాధ గొలిచి!
మగువ దెల్పెమనకు మకరసంక్రాంతిని!
హనుమ మహిమ వ్రాయ హాయి కలిగె!

ఆ.వె---21
కెలికె చంద మనుచు, కలిగెనా మదిలోన!
విరిసె మాతరగతి కురిసె చదువు!
వికట కవిని బోలి వెలది ముచ్చట్లాడు!
గీత దాటి తేనె రాత మార్చు!

నిన్నటి నా పద్యములో విరిసిన  మిత్రులు....
శ్రీమతి ఝాన్సి మంతెన గారు....నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి..

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?..16----9/9/15
ఆ,వె,.,---22
అంబుజాక్షి కనగ యంబుజాసననీమె
అంబుపాతములునెయంబ రచన
అంబు లంటి మాటలంబుజుడిని తాకు
అంబురాసి వంటి యంబ నెవరు?

ఆ.వె---23
కుంకుమాద్రినీమె కుంగదెపుడుజూడ
కుంకుమముయె మరియు కుంజరముయె
కుక్షి గాంచి కుడుపు,కులముతోపనిలేని
కుందనమ్ము, నెవరు కుంచఫలము?

ఆ.వె----24
కులము వలదు మనకు కూడొసగ దనును
గురువు గొలుచు నెపుడు, చరుము నీమె
కుడుపు నొసగు పడతి కడుపేద వారికి
పరమ ప్రేమ తోడ గురుని దలచి
(చరుము-హోమమునకై వండిన పవిత్రమైన అన్నము)
ఆ.వె---25
సకల కళల యందు శక్రధనువుగనగ,
బుడిగి ముచ్చటలిడు, భూరి కథల
హాస్య మిడును, మంచి లాస్యము సేయును,
కష్ట పడెడు మంచి నిష్ట కలదు

(శక్రధనువు-ఇంద్రధనుసు)(లాస్యము-నృత్యము)
ఆ.వె---26
తెలుగు వారలంత తెగమురిసికులుకన్
"అచ్చ తెలుగు"మనకు నిచ్చె కలువ
తండ్రి పేరునె పినతండ్రి నైతి గనగ
పొగడ తగదు చాల మగువ నెంచి

నిన్నటి నా పద్యములో విరిసిన  మిత్రులు....
శ్రీమతి నాగజ్యోతి రమణ సుసర్ల .. గారు .నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?..17----10/9/15
ఆ.వె----27
అంక విద్య నందు యారితేరియుగూడ
అంకురించె నెంతొ యంగ విద్య
అంచ గఱల పాన్పుయడగబోరు ధనము
అగడు లెరుగ రెపుడు యదిరి పడరు

తే,గీ.---28
గణన గణముల నినమోజు గుణగణముల
గణన సేయవలయునెంచి గణనయందు
తొణుకు బెణుకు వణుకులేక చెణుకు లిసురు
కణుకు యణుకవల పొణిక, కణుజు వైరి!
(కణుకు-అగ్ని...నిప్పు)

ఆ.వె----29
మెలత రచన వ్రాయ మేనంత పులకింత
ముదియ మాటలు విని మురిసె మగడు
సరస మాడ నాకు సరియైన జతగాడు
యెన్న తిరుగు లేదు మిన్న యతడు

నిన్నటి నా పద్యములో విరిసిన  మిత్రులు....
శ్రీమతి పద్మిని ప్రియ దర్శిని .. గారు .నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?..18----11/9/15
ఆ.వె.,----30
చాల యిష్ట మనును చాగంటి సూక్తులు
హిందు ధర్మ మనిన యెంతొ ప్రేమ
విద్య నెంతొ నేర్చి యేదేశమందున్న
తెలుగు యనిన బ్రీతి తొలగ లేదు

నిన్నటి నా పద్యములో విరిసిన  మిత్రులు....
శ్రీమతి నండూరి సుందరి నాగమణి .. గారు .నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?..19----12/9/15
ఆ.వె----31
కాళి దాసు చరిత కమనీయగదెలిపె,
కృష్ణ మురళి గాన తృష్ణ దీర,
భారతీయ ఙ్ఞానభాండములుదెలిపె
గీత, దౌమ్య ,నీతి కతలు దెలిపె

తే.గీ---32
నిత్య నూతన మేథస్సు తద్యముగనె
మూడు భాష లందునెపుడు దండి సూక్తి
నవ్వు కొనరెమీరేమియునివ్వ వలదు
తెలుపు యోగుల చరితము కలుగ భక్తి

నిన్నటి నా పద్యములో విరిసిన  మిత్రులు....
శ్రీ శ్రీనివాస్ వల్లభనేని.. గారు నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?..20----13/9/15
తే.గీ----33
పదవినోద మిడు బహుపసందుగాను
వాక్య మడుగునింక మనని వాటి తోడ
పువ్వు లనిన ప్రేమ, పుడమి పూజ సలుపు
చేయ రధిక భాషణములు,వ్రాయు నెంచి

నిన్నటి నా పద్యములో విరిసిన  మిత్రులు....
శ్రీి CHERUKU RAMOHANA RAO. గారు .నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?..21----14/9/15
ఆ,వె---34
నొక్కి పక్కు చెక్కు  నిక్కచ్చి మిక్కిలి
నిక్కుదక్క పెక్కు నిక్కులించు
చక్క నక్క దక్కె నిక్కపు టాలుగా
రిక్కదక్కునొక్క లెక్క జెక్కు

ఆ.వె---35
కమ్మ కమ్మ నమ్మ గమ్మన ఘుమ్ముము
అమ్మ తమ్మ కమ్మ కమ్మ గుండు
దమ్ము నిమ్ము మమ్మ తమ్మళ నేనంచు
నమ్మ కమ్ము కమ్మ కమ్మ నుమ్ము

తే.గీ---36
స్థాన మొసగు నందరికినితాను జూసి
లక్ష్మి దేవికి పతియట లక్షణముగ
సరస సంభాషణలు సరసముగ సల్పు
నవ్వు మోమున నందరి నాద రించు

ఆ.వె----37
"ఆత్మ హంస" నేమి "యమ్మ కళ్ళు"గనరె
చక్కనైన భాష చిక్కు నెపుడు
అంతు లేని పటిమ యచ్చంగ తెలుగున
పిన్ను తోడ మనల నెన్ను నెపుడు

నిన్నటి నా పద్యములో విరిసిన  మిత్రులు....
శ్రీమతి Jyoti Bathini  గారు..నే డెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?..22----15/9/15

తే.గీ,,,38
పరుల దేశము నందున పాద మిడియు
మరువలేదు కనగ మన మాతృ భాష
తెలుగు విద్య నేర్పు నచట తేనె లొలుక
మాతృ భూమి జూడ నెపుడు మదిని దలచు

నిన్నటి నా పద్యములో విరిసిన  మిత్రులు....
శ్రీ రంగారావు పెయ్యేటి గారు .నే డెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?..23----16/9/15

ఆ.వె,..--39
మైకు ముందు గళము మనసంత చదువుపై
కవిత లనిన బ్రీతి కలదు మెండు
మదిని మెదులు చుండు పదివేల పదములు
కలిపి కవిత వ్రాయి కలత పడకు

నిన్నటి నా పద్యములో విరిసిన  మిత్రులు....
శ్రీ Siva Jasthi...గారు......,నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?..24----17/9/15

తే,గీ---40
కట్టె కొట్టె పట్టె గణుతి బెట్టి నట్టి
చెట్టు పుట్ట మట్టిన్ బట్టి,కట్టు కైత
మేటి గట్టివ జట్టున పట్టె పెట్ట
రట్టు చట్టు కట్టాణి యె,పెట్టుజెట్టు

(గణుతి-లెక్క)(గట్టివ-మాటకారి)(పట్టె-అభిషేకం సమయాన నొసటిపెట్టునది)(రట్టు-తెగువ)(కట్టాణి-గుండ్రని ముత్యము)(పెట్టు జెట్టు-కల్పవృక్షము)

కం.---41
లెక్కకు మిక్కిలి  జక్కగ
చెక్కును యక్కర లొలుకగ చిక్కని రచనల్!
సుక్కల లెక్కన దక్కును
నిక్కము టక్కున జదివిన నిక్కుడు చేరున్!!

(నిక్కము-సత్యము)(నిక్కుడు-పైకి లేచు,ఉచ్చస్తితి జేరు)

ఆ.వె.,,.42
వీరి బుడుగు దెలుపు విషయములెన్నెన్నొ
చంద మనిన నితని డెంద మరయు
పద్య మల్లగలడు పర భాష నందైన
శివుని గొల్చు నితడు శిరము నొంచి

తే.గీ---43
లలిత నామము సహస్రము కలిపి వ్రాయు
బుడుగు శతకము నందున బుద్ధి నేర్పు
రామ నామము గొనినంత రామకథను
ఆట వెలదిలొ వ్రాయును నీటు గెపుడు

తే.గి--44
ఈర్ష్య కనరాదు గాలించినితని లోన
ఎల్ల వేళలొ పలుకులు చల్ల గుండు
అతివ లందరు జక్కగ అక్కలేగ
అచ్చ తెలుగున యితనిని మెచ్చ వలయు

ఆ.వె---45
పద్య రచనలనిన పరమ బ్రీతి కలదు
చక్క నైన పటిమ చంద మందు
నీతి పలుకు లెపుడు నిర్భయముగనుండు
చెడును గనిన చాలు చీరు నితడు

ఆ.వె---46
చదివి తెలుసుకొనరె సకలసజ్జనులార
సరళ మైన భాష సరిగ నుడివె
బుడుగు శతక మందు భూరిపలుకులెన్నొ
పొందుపరచె రామ చంద్ర రాజు

నిన్నటి నా పద్యములో విరిసిన  మిత్రులు....
శ్రీ  విద్య RJ(రేడియో జాకి)గారు..నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?..25----18/9/15
ఆ.వె.,,,47
గూగులమ్మతోడ కూరిమధికమేమొ
అడిగి నంత నెమన కంద జేయు
సకలవిషయమందు శారద కొమరిత
నేత చీర లెపుడు నాతి గట్టు

నిన్నటి నా పద్యములోవిరిసిన. మిత్రులు....
.శ్రీ  Rama chandra Raju Kalidindi,,.గారు..నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి
వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?..26----19/9/15

ఆ,వె,,,48
పంచ దార గలిపి పంచామృతమనియె
పాలు గాయ మరచి పాల  కోవ
మతి మరుప? యనంగ మగనితో జగడమే
లొల్లి జేయు నీమె నుల్లి పైన

 నిన్నటి నా పద్యములోవిరిసిన. మిత్రులు....
శ్రీమతి Durga bhamidipati..గారు..నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?..27----20/9/15

తే.గీ....,49
శుభ సమయమని జెప్పిన జూడ వలయు
బడుగు బ్రతుకులు కెంతయొ బతక నేర్పు
కథల నల్లుట యందున కరము తిరెగె
రేల పువ్వులు రాల్చగ నేల మురిసె

నిన్నటి నా పద్యములో విరిసిన. మిత్రులు....
శ్రీమతి వేదవాణి మామిళ్ళపల్లి..గారు...నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?..28----21/9/15

తే.గీ...50
చిన్న విసురుల వియె జూడ చెడును గూర్చి
కొసరి చెప్పును నింకను కొండ లవియె
సరస సంభాషణములను తరచి చేయు
మురిసి పోవుట మనవంతు ముదము మీర

ఆ.వె---51
ఙ్ఞాన ఖడ్గ మనుచు ఙ్ఞానమున్ బెంచును !
బ్రతుకు కళలొ మంచి భాగ స్వామి !
కోల కథనురాసి కోరెవ్యధనటగ !
బాల మురళి కృష్ణ భామ గురువు !!

నిన్నటి  నా పద్యములో విరిసిన. మిత్రులు....
శ్రీమతి Sammeta Umadevi..గారు..నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?..29----22/9/15

తే.గీ....52
విరులు చూపుట నందేమి వింత లేమి !
పసిడి బాలల బొమ్మలు బహుగ నిడును !
మంచి మాటల నెప్పుడు నెంచి పలుకు  !
చూడ వలయును తప్పక జోల పాటె  !!

ఆ.వె----53
రంగు రంగు పూలు రంగేళి జాబిలి
ప్రకృతనంగ  బ్రీతి పడతి కెపుడు
ఙ్ఞాన సంపదంత ఙ్ఞాతి చెంతన జేరె
అడిగి నంత జాలు వడిగ దెలుపు

ఆ.వె---54
మగని చెంత జేరి మగువెంతొ కులుకును
తనయ జూసు కొనియు తాను మురియు
చిన్న కాపు రంబు చింతేమి లేదునా
యల్లుడనగ నతడె యంద గాడు

Smt.umadevi balluri రచనలలో
1.ఆ.వె:
రంగు రంగు పూల రమణీయముగ నుంచి
సుప్రభాత వేళ శుభము పలుకు
సంజ సమయ మందు జాబిల్లితో నూసు
లాడు చుండు నతివ లహరి తోడ.
2.ఆ.వె:
వింత కాంతి చిమ్ము విరుల నిడుచు నుండ
స్నేహ హస్త మూచి  చెలిమిచేయు
పసిడి కాంతు లీను పాపల నగవుతో
పరవశించు చుండు పడతి విజయ.

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీమతి.Sarojanidevi Balusu..గారు..నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?..30----23/9/15

తే.గీ....55
పద్య వివరణ సేయును నిత్య మెపుడు  !
నలుడు దమయంతి, ప్రాచీన తెలుగు కవుల.
రావణ హనుమ హాస్యము రణము నందు
వెంకటకవుల పద్యాలు విశద పరచు  !!

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీమతి.కొల్లురు విజయా శర్మ..గారు.నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?..31----24/9/15

ఆ.వె---56
కాకి రాజమనుచు కమ్మని ముచ్చట
కడుపు నిండు గాను కథలు దెలుపు!
పచ్చి పులుసు జేయు, పంచు నీతి పలుకు
లలిత గీత ములన లాలనెంతొ!!


నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ SATYANARAYANA PISKA..గారు.నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?..32----25/9/15

ఆ.వె.,,,,57
చంద మందు జూడ సరియగు కవితలే
మంచి పూరణ లను నెంచి నింపు  !
వసుద తోడ మంచి భహుమానమొందెను
శటల పద్య ములతొ జతను గూడి  !!

(శట-జడ)

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ Sahana meenakshi..గారు.నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి


వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?..33----26/9/15

ఆ,వె---58
భజన సేయు నెంతొ భక్తజనులగూడి
నీతి పరుల మెచ్చి నిచ్చు విలువ  !
గాడ్పు పట్టి పాట నేర్పుగా పాడును
మంచి మంచి సేవ నెంచి చేయు  !!

(ఎలమి-భజన).......(గాడ్పు పట్టి-హనుమంతుడు)


నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ Siva Rama Krishna Prasad..గారు.నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?..34----27/9/15

ఆ,వె..59
అమ్మ విలువ తెలిపె నధికము నెంతయొ
తండ్రి కిచ్చు ప్రేమ తనది నెపుడు  !
భావి పౌరు లకును బాధ్యత లెరిగించు
పద్య కవిత లనిన పరమ  ప్రీతి  !!

ఆ.వె----60
ఇల్లు జూడు మరియునిల్లాలిజూడని
చూడ జక్కనిల్లు జూడ వలయు   !
అన్ని యున్న యాకుయణిగియున్నట్టుల
యెంచ తరమ నీమె మంచి తనము  !!


ఆ.వె
పేరులోన గలదు పేర్మి యంత తనకు
మంచి స్నేహ శీలి మగువ తాను
అన్నపూర్ణ వోలె యాతిథ్య మొసగేటి
చేడె యెవ్వరనగ చెలియ హేమ...(ఉమా దేవి గారి పద్యం...)

నిన్నటి  నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ Chandrakala Yalmarty..గారు.నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?..35----1/10/15

తే.గీ---61
వార వారములశుభమువారమిడరు
అన్నమయ్యకీర్తనలనుయెన్నగిడును
కృష్ణ సదనము గాంచియు తృష్ణ దీర్చు
ఙ్ఞాపకములదొంతరలెన్నొ ఙ్ఞాతి నిడును.


నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీమతి Hema Rao Nagulapally..గారు.నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?..36----2/10/15

తే.గీ...62
హితులకు శుభోదయమను స్నేహితులకైన
వందె మాతరంయీతరం బహుగ యనును
చిన్న కవితలె విరబూసి మిన్న గుండు
తీరు తెన్నులు దెల్పును నేరు గాను

ఆ.వె---63
"బ్రతుకు బాటసారి బాధల సంసారి"
"కంటికి కనబడని క్రాంతి  వీవు"
"నమ్మినందుకేగ నట్టేట ముంచావు"
పాండు రంగ శరణు పాహి పాహి

(శ్రీ  రామ చంద్ర రాజు కలిడిండి పద్యము)
ఆ,వె
పాండురంగడతడు పరమభక్తిపరుడు
వినయమెక్కువండి విద్య గలదు
పెద్ద లంటె తనకు పెనుగౌరవముగాద
గుమ్మడంటెయతడె గుర్తెరుగుడు

(Umadevi Balluri గారి పద్యం)
ఆ.వె:
 సులలితముగ తాను శుభము పల్కుచు నుండు
 నెల్ల వేళ లందు నియమముగను
 అందమైన కవిత లల్లుచు మురిపించు
 పాండురంగ డనగ పరగు వారు.

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ మతి Pnnada Lakshmi.గారు.నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి  పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?..37---3/10/15

ఆ,వె..,.64
ముక్కు ముక్కె రిచ్చె చక్క దనమునెంతొ
ఒక్క పడతి సైన్య మొసగె బిరుదు
నుడివె నధమ,మధ్య,నుత్తము లెవరని
సేవ జేయు మంచి స్నేహ శీలి

ఆ.వె---65
హస్త కళల లోన యందె వేసిన చెయ్యి
అన్ని కళల యందు యారి తేరె
ఆడ సింహమీమె పాటపాడు,కనుము
ఇంటి గోడపైన యింతి పటిమ

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ Parameswaruni krupa..గారు.నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?..38----4/10/15
తే.గీ....66
హరహరశివ యానంద లహరి యనుచును
జరుగు జరగబో యెడుమన జాతకమిడు
రవి బుద దశ ఫలములను సవివరమిడు
ప్రతి దినంబున పంచాగ ఫలము లిడును

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ PRATIMA RAPARTI .గారు.నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?..39----5/10/15

ఆ,వె..,67
చతుర భాషణ లిడు జనమంత మురియగ!
పుష్కరముల స్నాన పూజ తెలిపె!
అమ్మ నువ్వు లేవె అందరు కలరను!
ఆలి కిచ్చు, విలువ నమ్మ సమము!

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ Gumma Ramalinga swamy .గారు.నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?..40----6/10/15

తే.గీ....68
నాకు తెలిసిన  స్తోత్రము వేకు వనిడు!
అక్షరజనని ప్రతిమల నధిక మిడును!
పట్టు కలిగి యుండె పరుల భాష పైన
సరస సంగీత సాహిత్య సాగ రంబు

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ షణ్ముఖ ఆచార్యులు.గారు.నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి.

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......41--7/10/15

ఆ.వె---69
అబ్బ హాస్య  లాస్య  కానంద భరితము
శుభము దెల్పు నెపుడు సూర్యు నోలె
అప్ప నిజమరీషు యతివ శిరీషకు
మంచి విషయములన, యెంచి చూపు


ఆ.వె:70
హరి సిరులకు నితడు నాప్యాయతను పంచు
హాస్య లాస్య లకును నజ్జ యితడె
పుష్కర సమ యాన పూర్తిజాగ్రత దెల్పె
పూర్ణ చంద్రు డితడె పూజ్యు లార!
(Smt.Umadevi Balluri గారి పద్యం)

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...జ
శ్రీ మతి రాజవరం ఉష  గారు.నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి.

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......42--8/10/15

ఆ.వె---71
అంద మైన పలుకు యమ్మమ్మ జెప్పిన
ఆది శంకరులిడి నసలు మాట
దేశ ప్రగతి దెల్పు దేవ దేవేరుల
సకల విషయములను దకలు పర్చు

ఆ.వె--72
కంటి రమణ ఋషుల కౌపీన దారణ
మంచి తెలుగు పదము లెంచి తెలుపు
బయలు వెడలి నేని భక్తితో గావగ
కృష్ణ కొలుచు నెపుడు కృపను చూప

తే.గీ---73
నాల్గు వేదము లంతయు నమిలి నటుల
దేవ భాషనందు పటిమ తీరు గనుము
ఎవ్వరడిగిన వివరము లివ్వ గలరు
గురు శివానందమూర్తుల కూడి గొలుచు

తే.గీ--74
ఉన్న వటువనంగదెలిపె యన్న కనుము
వంశ నామము గనినంత వదల మెపుడు
స్వామి నాగేశ్వరులయంశ వారి కిడెను
మిణుగు పురుగును నేనెంత మణులు వారు

(ఈ పద్యంలో వారి పేరు ఇంటీ పేరుతో సహా ఉంది కనిపెట్టండి)


నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ పూర్ణ చంద్రరావు మంత్రాల గారు.నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం
 చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......43--9/10/15

తే.గి----75
చదివె నాదిభట్లను చినసత్య చండ్ర
పౌర బృందము నందున పౌరు లైరి
లెఫ్టు రచనల కవివరు లెల్ల  గనగ
ఆద రింతురెపుడు నెంతొ హాయి గొలుప

తే.గీ---76
వీర చలసాని వరవర విమల లేమి
విశ్వ నాథుడు కొనకంచి విశ్వ మెరుక
బడుగు బతుకుల కండగా బ్రతుక నెంచె
పోరు బాటకు బాసట  తీరు గనుము

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ వున్నవ నాగేశ్వరరావు గారు.నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం
 చూడండి


వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......44--10/10/15

తే.గీ---77
ఘాటు మిరప యనుచుసూటిపోటువేయు
చిన్న పలుకుల తోడనె వెన్నె లొలుకు
కూరిమి గలమాటల తోడ నేర్పు కూర్చి
అందరిని యలరించునీ చంద మామ

ఆ.వె---78
పంట ఒక్క టేసి బాదపడకనును
మద్యపానమింక మాన మనును
రాలు గాయి కాదు రైతుభాందవుడుగ
చిన్న వయసు నందె వన్నె లెన్నొ

ఆ.వె---79
ములగ చెట్టు విలువ కలదంటపదివేలు
దొండ సాగు తోటి పండ గటగ
నిప్పు లోన నిలువుతప్పుచేయనపుడు
ఎంచి పలుకు నెపుడు మంచి మాట


 నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ Rajendra Prasad yalavarty గారు.నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......45--11/10/15

తే.గీ---80
వీడె నెవరునో తెలియదు వీరి తరము
ఆంధ్ర మాత యనిన చాలు నాద రించు
తెలుగు భాషయనిననెంతొ కలుగు ప్రేమ
పలుకు పరభాష లేకుండ తెలుగు భాష

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ ప్రవీణ్ చిన్ని గారు.నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం
 చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......46--12/10/15

ఆ.వె---81
తెలిపె జీవితముల తీపి తత్వముజూడ
గౌరి పూజ సల్పు ఘనము గాను
నీతి పలుకు లెన్నొనీటుగా బలుకును
హితుల బలకరించు హిమము గాను

తే.గీ---82
గ్రామ దేవత పూజలు ఘనము గుండు
సాయి నాధుని సన్నిధి సరిగ వ్రాసె
గుమ్ము గుమ్మని పాటలు కమ్మ దనము
తాత కూతురు కొడుకుతో తమరి కేమి

తే.గీ---83
సాదు జనులనుబ్రోవగ సాయి రమ్ము
నీదు నిలయము జగతిలోనీతి నొసగు
తొలుత శ్రావణ వారపు పలుకులివిగొ
మంచి ముద్రలెన్నొచేయుట నెంచి చూపు

(సీతా లక్ష్మి పత్రి  అక్కయ్యోయ్  నీకోసమే  రాసిన  పద్యాలు
ఆటవెలది
మంచి మాటకారి మమతల నెలవేను
కలము పట్టెనేని కవిత  జల్లు
వెన్న వంటి మనసు వెన్నెల చూపులు
శుభము కలుగు నీకు సుఖము శాంతి

రాదు రాదనుచును  రాసేను గేయాలు
శుభము పలుకు నుదయ సంధ్య లందు
సీతకున్న వోర్పు సిరుల తూగు నమ్మహా
లక్ష్మి వలెనె దోచు లక్షణముగ)

jhansi mantena గారు వ్రాసిన పద్యాలు...,.,



నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ నరసింహ అప్పడు  గారు.నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం
 చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......47--13/10/15

ఆ.వె---84
అశ్వ మెక్కి తిరుగు విశ్వము గాంచును
వివిధ రీతు లందు విషయ మెరుక
ఆలయమును గాచు నాద్యాత్మికత మిన్న
సత్పురుషుల గూడి సాము జేయు


ఆ.వె:
భాగ్య నగరి నుండు బాలభాస్కరునకు
ఆంజ నేయుడన్న నమిత భక్తి
గుఱ్ఱ మెక్కుచుండు గురుబోధనలవిను
శబరి నాథు గొల్చి శరణు గోరు.
(Umadevi Balluru గారి జవాబు)

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీమతి సీత లక్ష్మి పత్రి గారు  నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం
 చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......48--14/10/15

ఆ.వె---85
లేటు నైటు వైటు  లేడీసు వైటింగు
జల్ది గోపికప్పు జాము రూటు
పుడమి నొక్కరుండు పూబోడి కనరండు
సుదతి పలుకు లెపుడు సూటిగుండు

(పూబోడి-అందమైన స్త్రీ )(సుదతి-చక్కని పలువరస గల స్త్రీ )

ఆ.వె---86
కంటి చూపు కొరకు కష్టాలు కడగండ్లు
బూబు యాక లనిన బువ్వ నొసగు
శర్మి విజయ మాయ శశిరేఖ రోజయు
లలిత పార్వతింక లక్ష్మి రాజి

ఆ.వె---87
మాలికందు జూడ మంచి కథ నుడివె
పదుల కంఠ ములను పలుకు సరిగ
మంచి మాండలికములెంచి యడుగుచుండు
ఎన్న దగిన యతివ మిన్న గెపుడు

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ చివుకుల భాల భాస్కర్ గారు.నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం
 చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......49--15/10/15

ఆ.వె---88
చల్ల జిలుకు వేళ చక్కన్నిపాటతో
అమ్మ యమ్మ దలచె నమ్మ బలికె
ఆరొ ప్రాణ మనుచు నాలిని చూపును
మంత్ర మేసి నటుల మాట లుండు


ఆ.వె:
రోగములను బాపి రుజలను తొలగించు
బొగ్గవరపు వారు భూమి యందు
ఆలి యన్న తనకు ఆరవ ప్రాణమే
యనెడి మల్లికార్జునార్యు డితడు
(Umadevi Balluri)

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీమతి వసంత లక్ష్మి అయ్యగారి గారు.నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం
 చూడండి


వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......50--16/10/15

ఆ.వె--89
సీత రామ పురము గౌతమి తీరము
సరిగ వసతి లేని  యూరి లోన
పురుడు బోసు కొనియె పుణ్య శీలొకయమ్మ
పచ్చ వనము గొనియె పసిడి కాంతి

ఆ.వె---90
పొన్న పూల నడుమ యెన్నియో నడకలు
గీత కొరకు వ్రాసె చేతి వ్రాత
కమ్మ నైన భాష కడలి తీరము వోలె
గ్రామ సీమ, తోట, కబురు లిడును

ఆ.వె---91
కోరె కనుము తల్లి గోదారి గట్టెంట
ఇసుక తిన్నె లవియు యిసిరి నట్టు
రెల్లు గడ్డి తోడ యల్లికుటీరము
చంద మామ తోడు పొంద గోరె

తే.గీ---92
అడిగె రైతన్న నేతన్న యందు రెపుడు
కనగ రైతక్క నేతక్క యనరు యేల?
చూపె నతివల శ్రమనెంచి చూడ మనము
చదివి మారితీరవలయు జనులు గొంత

తే.గీ----93
సేవ యనినంత మాధవ  సేవ యనరు
చేసి చూపును మానవ సేవ గనరె
ప్రముఖ స్త్రీవాద రచయిత్రి ప్రతిభ మెండు
వదిలె కొలువును, మహిళను చదివె నెంతొ

తే,గీ---94
గరికపాటి కటువుమాట, కత్తి దూసె
కనరె కలిసిరమ్మనె మిమ్ము కడుపు మండి
మనకు తెలియని కోణాలు మనలొనుండు
ననియె,గిరిజన వసతిల్లు కనియె నీమె

తే.గీ---95
బడుగు బతుకుల కెంతయో బాసటగును
సకల సంపద ట్రస్టుకే దకలు పరచె
సరిగ దేశము నంతయు సంచ రించు
కోటి కొక్కరు ధరణిలో మేటి గనరె

తే.గీ---96
భూమి కయిననేమి.బడుగుబుడతలేమి
బడులు,,నల్లమల వనము, బండ లేమి
వింత యాచారములనిన విసురులేమి
ఇంటి మగవార లైననీ యింతి  కేమి

ఆ.వె---97
చెంచు పెంట లెంట మించెను ఘనకీర్తి
మైన పొత్తి వంటి మగువ నీమె
జ్యేష్ట పౌరులకును జేజమ్మ మాయమ్మ
చేరి కొలుతు మిమ్ము చేతు లెత్తి...
వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?..26----19/9/15

ఆ,వె,,,48
పంచ దార గలిపి పంచామృతమనియె
పాలు గాయ మరచి పాల  కోవ
మతి మరుప? యనంగ మగనితో జగడమే
లొల్లి జేయు నీమె నుల్లి పైన

 నిన్నటి నా పద్యములోవిరిసిన. మిత్రులు....
శ్రీమతి Durga bhamidipati..గారు..నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?..27----20/9/15

తే.గీ....,49
శుభ సమయమని జెప్పిన జూడ వలయు
బడుగు బ్రతుకులు కెంతయొ బతక నేర్పు
కథల నల్లుట యందున కరము తిరెగె
రేల పువ్వులు రాల్చగ నేల మురిసె

నిన్నటి నా పద్యములో విరిసిన. మిత్రులు....
శ్రీమతి వేదవాణి మామిళ్ళపల్లి..గారు...నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?..28----21/9/15

తే.గీ...50
చిన్న విసురుల వియె జూడ చెడును గూర్చి
కొసరి చెప్పును నింకను కొండ లవియె
సరస సంభాషణములను తరచి చేయు
మురిసి పోవుట మనవంతు ముదము మీర

ఆ.వె---51
ఙ్ఞాన ఖడ్గ మనుచు ఙ్ఞానమున్ బెంచును !
బ్రతుకు కళలొ మంచి భాగ స్వామి !
కోల కథనురాసి కోరెవ్యధనటగ !
బాల మురళి కృష్ణ భామ గురువు !!

నిన్నటి  నా పద్యములో విరిసిన. మిత్రులు....
శ్రీమతి Sammeta Umadevi..గారు..నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?..29----22/9/15

తే.గీ....52
విరులు చూపుట నందేమి వింత లేమి !
పసిడి బాలల బొమ్మలు బహుగ నిడును !
మంచి మాటల నెప్పుడు నెంచి పలుకు  !
చూడ వలయును తప్పక జోల పాటె  !!

ఆ.వె----53
రంగు రంగు పూలు రంగేళి జాబిలి
ప్రకృతనంగ  బ్రీతి పడతి కెపుడు
ఙ్ఞాన సంపదంత ఙ్ఞాతి చెంతన జేరె
అడిగి నంత జాలు వడిగ దెలుపు

ఆ.వె---54
మగని చెంత జేరి మగువెంతొ కులుకును
తనయ జూసు కొనియు తాను మురియు
చిన్న కాపు రంబు చింతేమి లేదునా
యల్లుడనగ నతడె యంద గాడు

Smt.umadevi balluri రచనలలో
1.ఆ.వె:
రంగు రంగు పూల రమణీయముగ నుంచి
సుప్రభాత వేళ శుభము పలుకు
సంజ సమయ మందు జాబిల్లితో నూసు
లాడు చుండు నతివ లహరి తోడ.
2.ఆ.వె:
వింత కాంతి చిమ్ము విరుల నిడుచు నుండ
స్నేహ హస్త మూచి  చెలిమిచేయు
పసిడి కాంతు లీను పాపల నగవుతో
పరవశించు చుండు పడతి విజయ.

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీమతి.Sarojanidevi Balusu..గారు..నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?..30----23/9/15

తే.గీ....55
పద్య వివరణ సేయును నిత్య మెపుడు  !
నలుడు దమయంతి, ప్రాచీన తెలుగు కవుల.
రావణ హనుమ హాస్యము రణము నందు
వెంకటకవుల పద్యాలు విశద పరచు  !!

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీమతి.కొల్లురు విజయా శర్మ..గారు.నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?..31----24/9/15

ఆ.వె---56
కాకి రాజమనుచు కమ్మని ముచ్చట
కడుపు నిండు గాను కథలు దెలుపు!
పచ్చి పులుసు జేయు, పంచు నీతి పలుకు
లలిత గీత ములన లాలనెంతొ!!


నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ SATYANARAYANA PISKA..గారు.నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?..32----25/9/15

ఆ.వె.,,,,57
చంద మందు జూడ సరియగు కవితలే
మంచి పూరణ లను నెంచి నింపు  !
వసుద తోడ మంచి భహుమానమొందెను
శటల పద్య ములతొ జతను గూడి  !!

(శట-జడ)

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ Sahana meenakshi..గారు.నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి


వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?..33----26/9/15

ఆ,వె---58
భజన సేయు నెంతొ భక్తజనులగూడి
నీతి పరుల మెచ్చి నిచ్చు విలువ  !
గాడ్పు పట్టి పాట నేర్పుగా పాడును
మంచి మంచి సేవ నెంచి చేయు  !!

(ఎలమి-భజన).......(గాడ్పు పట్టి-హనుమంతుడు)


నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ Siva Rama Krishna Prasad..గారు.నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?..34----27/9/15

ఆ,వె..59
అమ్మ విలువ తెలిపె నధికము నెంతయొ
తండ్రి కిచ్చు ప్రేమ తనది నెపుడు  !
భావి పౌరు లకును బాధ్యత లెరిగించు
పద్య కవిత లనిన పరమ  ప్రీతి  !!

ఆ.వె----60
ఇల్లు జూడు మరియునిల్లాలిజూడని
చూడ జక్కనిల్లు జూడ వలయు   !
అన్ని యున్న యాకుయణిగియున్నట్టుల
యెంచ తరమ నీమె మంచి తనము  !!


ఆ.వె
పేరులోన గలదు పేర్మి యంత తనకు
మంచి స్నేహ శీలి మగువ తాను
అన్నపూర్ణ వోలె యాతిథ్య మొసగేటి
చేడె యెవ్వరనగ చెలియ హేమ...(ఉమా దేవి గారి పద్యం...)

నిన్నటి  నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ Chandrakala Yalmarty..గారు.నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?..35----1/10/15

తే.గీ---61
వార వారములశుభమువారమిడరు
అన్నమయ్యకీర్తనలనుయెన్నగిడును
కృష్ణ సదనము గాంచియు తృష్ణ దీర్చు
ఙ్ఞాపకములదొంతరలెన్నొ ఙ్ఞాతి నిడును.


నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీమతి Hema Rao Nagulapally..గారు.నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?..36----2/10/15

తే.గీ...62
హితులకు శుభోదయమను స్నేహితులకైన
వందె మాతరంయీతరం బహుగ యనును
చిన్న కవితలె విరబూసి మిన్న గుండు
తీరు తెన్నులు దెల్పును నేరు గాను

ఆ.వె---63
"బ్రతుకు బాటసారి బాధల సంసారి"
"కంటికి కనబడని క్రాంతి  వీవు"
"నమ్మినందుకేగ నట్టేట ముంచావు"
పాండు రంగ శరణు పాహి పాహి

(శ్రీ  రామ చంద్ర రాజు కలిడిండి పద్యము)
ఆ,వె
పాండురంగడతడు పరమభక్తిపరుడు
వినయమెక్కువండి విద్య గలదు
పెద్ద లంటె తనకు పెనుగౌరవముగాద
గుమ్మడంటెయతడె గుర్తెరుగుడు

(Umadevi Balluri గారి పద్యం)
ఆ.వె:
 సులలితముగ తాను శుభము పల్కుచు నుండు
 నెల్ల వేళ లందు నియమముగను
 అందమైన కవిత లల్లుచు మురిపించు
 పాండురంగ డనగ పరగు వారు.

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ మతి Pnnada Lakshmi.గారు.నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి  పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?..37---3/10/15

ఆ,వె..,.64
ముక్కు ముక్కె రిచ్చె చక్క దనమునెంతొ
ఒక్క పడతి సైన్య మొసగె బిరుదు
నుడివె నధమ,మధ్య,నుత్తము లెవరని
సేవ జేయు మంచి స్నేహ శీలి

ఆ.వె---65
హస్త కళల లోన యందె వేసిన చెయ్యి
అన్ని కళల యందు యారి తేరె
ఆడ సింహమీమె పాటపాడు,కనుము
ఇంటి గోడపైన యింతి పటిమ

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ Parameswaruni krupa..గారు.నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?..38----4/10/15
తే.గీ....66
హరహరశివ యానంద లహరి యనుచును
జరుగు జరగబో యెడుమన జాతకమిడు
రవి బుద దశ ఫలములను సవివరమిడు
ప్రతి దినంబున పంచాగ ఫలము లిడును

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ PRATIMA RAPARTI .గారు.నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?..39----5/10/15

ఆ,వె..,67
చతుర భాషణ లిడు జనమంత మురియగ!
పుష్కరముల స్నాన పూజ తెలిపె!
అమ్మ నువ్వు లేవె అందరు కలరను!
ఆలి కిచ్చు, విలువ నమ్మ సమము!

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ Gumma Ramalinga swamy .గారు.నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?..40----6/10/15

తే.గీ....68
నాకు తెలిసిన  స్తోత్రము వేకు వనిడు!
అక్షరజనని ప్రతిమల నధిక మిడును!
పట్టు కలిగి యుండె పరుల భాష పైన
సరస సంగీత సాహిత్య సాగ రంబు

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ షణ్ముఖ ఆచార్యులు.గారు.నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి.

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......41--7/10/15

ఆ.వె---69
అబ్బ హాస్య  లాస్య  కానంద భరితము
శుభము దెల్పు నెపుడు సూర్యు నోలె
అప్ప నిజమరీషు యతివ శిరీషకు
మంచి విషయములన, యెంచి చూపు


ఆ.వె:70
హరి సిరులకు నితడు నాప్యాయతను పంచు
హాస్య లాస్య లకును నజ్జ యితడె
పుష్కర సమ యాన పూర్తిజాగ్రత దెల్పె
పూర్ణ చంద్రు డితడె పూజ్యు లార!
(Smt.Umadevi Balluri గారి పద్యం)

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...జ
శ్రీ మతి రాజవరం ఉష  గారు.నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి.

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......42--8/10/15

ఆ.వె---71
అంద మైన పలుకు యమ్మమ్మ జెప్పిన
ఆది శంకరులిడి నసలు మాట
దేశ ప్రగతి దెల్పు దేవ దేవేరుల
సకల విషయములను దకలు పర్చు

ఆ.వె--72
కంటి రమణ ఋషుల కౌపీన దారణ
మంచి తెలుగు పదము లెంచి తెలుపు
బయలు వెడలి నేని భక్తితో గావగ
కృష్ణ కొలుచు నెపుడు కృపను చూప

తే.గీ---73
నాల్గు వేదము లంతయు నమిలి నటుల
దేవ భాషనందు పటిమ తీరు గనుము
ఎవ్వరడిగిన వివరము లివ్వ గలరు
గురు శివానందమూర్తుల కూడి గొలుచు

తే.గీ--74
ఉన్న వటువనంగదెలిపె యన్న కనుము
వంశ నామము గనినంత వదల మెపుడు
స్వామి నాగేశ్వరులయంశ వారి కిడెను
మిణుగు పురుగును నేనెంత మణులు వారు

(ఈ పద్యంలో వారి పేరు ఇంటీ పేరుతో సహా ఉంది కనిపెట్టండి)


నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ పూర్ణ చంద్రరావు మంత్రాల గారు.నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం
 చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......43--9/10/15

తే.గి----75
చదివె నాదిభట్లను చినసత్య చండ్ర
పౌర బృందము నందున పౌరు లైరి
లెఫ్టు రచనల కవివరు లెల్ల  గనగ
ఆద రింతురెపుడు నెంతొ హాయి గొలుప

తే.గీ---76
వీర చలసాని వరవర విమల లేమి
విశ్వ నాథుడు కొనకంచి విశ్వ మెరుక
బడుగు బతుకుల కండగా బ్రతుక నెంచె
పోరు బాటకు బాసట  తీరు గనుము

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ వున్నవ నాగేశ్వరరావు గారు.నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం
 చూడండి


వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......44--10/10/15

తే.గీ---77
ఘాటు మిరప యనుచుసూటిపోటువేయు
చిన్న పలుకుల తోడనె వెన్నె లొలుకు
కూరిమి గలమాటల తోడ నేర్పు కూర్చి
అందరిని యలరించునీ చంద మామ

ఆ.వె---78
పంట ఒక్క టేసి బాదపడకనును
మద్యపానమింక మాన మనును
రాలు గాయి కాదు రైతుభాందవుడుగ
చిన్న వయసు నందె వన్నె లెన్నొ

ఆ.వె---79
ములగ చెట్టు విలువ కలదంటపదివేలు
దొండ సాగు తోటి పండ గటగ
నిప్పు లోన నిలువుతప్పుచేయనపుడు
ఎంచి పలుకు నెపుడు మంచి మాట


 నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ Rajendra Prasad yalavarty గారు.నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......45--11/10/15

తే.గీ---80
వీడె నెవరునో తెలియదు వీరి తరము
ఆంధ్ర మాత యనిన చాలు నాద రించు
తెలుగు భాషయనిననెంతొ కలుగు ప్రేమ
పలుకు పరభాష లేకుండ తెలుగు భాష

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ ప్రవీణ్ చిన్ని గారు.నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం
 చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......46--12/10/15

ఆ.వె---81
తెలిపె జీవితముల తీపి తత్వముజూడ
గౌరి పూజ సల్పు ఘనము గాను
నీతి పలుకు లెన్నొనీటుగా బలుకును
హితుల బలకరించు హిమము గాను

తే.గీ---82
గ్రామ దేవత పూజలు ఘనము గుండు
సాయి నాధుని సన్నిధి సరిగ వ్రాసె
గుమ్ము గుమ్మని పాటలు కమ్మ దనము
తాత కూతురు కొడుకుతో తమరి కేమి

తే.గీ---83
సాదు జనులనుబ్రోవగ సాయి రమ్ము
నీదు నిలయము జగతిలోనీతి నొసగు
తొలుత శ్రావణ వారపు పలుకులివిగొ
మంచి ముద్రలెన్నొచేయుట నెంచి చూపు

(సీతా లక్ష్మి పత్రి  అక్కయ్యోయ్  నీకోసమే  రాసిన  పద్యాలు
ఆటవెలది
మంచి మాటకారి మమతల నెలవేను
కలము పట్టెనేని కవిత  జల్లు
వెన్న వంటి మనసు వెన్నెల చూపులు
శుభము కలుగు నీకు సుఖము శాంతి

రాదు రాదనుచును  రాసేను గేయాలు
శుభము పలుకు నుదయ సంధ్య లందు
సీతకున్న వోర్పు సిరుల తూగు నమ్మహా
లక్ష్మి వలెనె దోచు లక్షణముగ)

jhansi mantena గారు వ్రాసిన పద్యాలు...,.,



నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ నరసింహ అప్పడు  గారు.నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం
 చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......47--13/10/15

ఆ.వె---84
అశ్వ మెక్కి తిరుగు విశ్వము గాంచును
వివిధ రీతు లందు విషయ మెరుక
ఆలయమును గాచు నాద్యాత్మికత మిన్న
సత్పురుషుల గూడి సాము జేయు


ఆ.వె:
భాగ్య నగరి నుండు బాలభాస్కరునకు
ఆంజ నేయుడన్న నమిత భక్తి
గుఱ్ఱ మెక్కుచుండు గురుబోధనలవిను
శబరి నాథు గొల్చి శరణు గోరు.
(Umadevi Balluru గారి జవాబు)

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీమతి సీత లక్ష్మి పత్రి గారు  నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం
 చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......48--14/10/15

ఆ.వె---85
లేటు నైటు వైటు  లేడీసు వైటింగు
జల్ది గోపికప్పు జాము రూటు
పుడమి నొక్కరుండు పూబోడి కనరండు
సుదతి పలుకు లెపుడు సూటిగుండు

(పూబోడి-అందమైన స్త్రీ )(సుదతి-చక్కని పలువరస గల స్త్రీ )

ఆ.వె---86
కంటి చూపు కొరకు కష్టాలు కడగండ్లు
బూబు యాక లనిన బువ్వ నొసగు
శర్మి విజయ మాయ శశిరేఖ రోజయు
లలిత పార్వతింక లక్ష్మి రాజి

ఆ.వె---87
మాలికందు జూడ మంచి కథ నుడివె
పదుల కంఠ ములను పలుకు సరిగ
మంచి మాండలికములెంచి యడుగుచుండు
ఎన్న దగిన యతివ మిన్న గెపుడు

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ చివుకుల భాల భాస్కర్ గారు.నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం
 చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......49--15/10/15

ఆ.వె---88
చల్ల జిలుకు వేళ చక్కన్నిపాటతో
అమ్మ యమ్మ దలచె నమ్మ బలికె
ఆరొ ప్రాణ మనుచు నాలిని చూపును
మంత్ర మేసి నటుల మాట లుండు


ఆ.వె:
రోగములను బాపి రుజలను తొలగించు
బొగ్గవరపు వారు భూమి యందు
ఆలి యన్న తనకు ఆరవ ప్రాణమే
యనెడి మల్లికార్జునార్యు డితడు
(Umadevi Balluri)

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీమతి వసంత లక్ష్మి అయ్యగారి గారు.నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం
 చూడండి


వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......50--16/10/15

ఆ.వె--89
సీత రామ పురము గౌతమి తీరము
సరిగ వసతి లేని  యూరి లోన
పురుడు బోసు కొనియె పుణ్య శీలొకయమ్మ
పచ్చ వనము గొనియె పసిడి కాంతి

ఆ.వె---90
పొన్న పూల నడుమ యెన్నియో నడకలు
గీత కొరకు వ్రాసె చేతి వ్రాత
కమ్మ నైన భాష కడలి తీరము వోలె
గ్రామ సీమ, తోట, కబురు లిడును

ఆ.వె---91
కోరె కనుము తల్లి గోదారి గట్టెంట
ఇసుక తిన్నె లవియు యిసిరి నట్టు
రెల్లు గడ్డి తోడ యల్లికుటీరము
చంద మామ తోడు పొంద గోరె

తే.గీ---92
అడిగె రైతన్న నేతన్న యందు రెపుడు
కనగ రైతక్క నేతక్క యనరు యేల?
చూపె నతివల శ్రమనెంచి చూడ మనము
చదివి మారితీరవలయు జనులు గొంత

తే.గీ----93
సేవ యనినంత మాధవ  సేవ యనరు
చేసి చూపును మానవ సేవ గనరె
ప్రముఖ స్త్రీవాద రచయిత్రి ప్రతిభ మెండు
వదిలె కొలువును, మహిళను చదివె నెంతొ

తే,గీ---94
గరికపాటి కటువుమాట, కత్తి దూసె
కనరె కలిసిరమ్మనె మిమ్ము కడుపు మండి
మనకు తెలియని కోణాలు మనలొనుండు
ననియె,గిరిజన వసతిల్లు కనియె నీమె

తే.గీ---95
బడుగు బతుకుల కెంతయో బాసటగును
సకల సంపద ట్రస్టుకే దకలు పరచె
సరిగ దేశము నంతయు సంచ రించు
కోటి కొక్కరు ధరణిలో మేటి గనరె

తే.గీ---96
భూమి కయిననేమి.బడుగుబుడతలేమి
బడులు,,నల్లమల వనము, బండ లేమి
వింత యాచారములనిన విసురులేమి
ఇంటి మగవార లైననీ యింతి  కేమి

ఆ.వె---97
చెంచు పెంట లెంట మించెను ఘనకీర్తి
మైన పొత్తి వంటి మగువ నీమె
జ్యేష్ట పౌరులకును జేజమ్మ మాయమ్మ
చేరి కొలుతు మిమ్ము చేతు లెత్తి...

వీరి వీరి గుమ్మడి పండువీరిపేరేమి?..51-18/10/15

తే.గీ...98
చంద మందున జక్కని సుందరమ్మ
కనుము సీసమాటవెలది గాలి చూలి
సీస మందున సీధువు  సేరి గొలుచు
చక్క నైన పలుకులిడు నిక్కవముగ

తే.గీ---99
పూవిలాసంబునుగనరే పూల నెంచి
మంచి పద్యముగనినేని యెంచి చూపు
తల్లి ప్రేమను గుర్తించె ధరణి పైన
ఘనత గోమాత కొసగెను గాంచ రండి

తే.గీ--100
రూపు జక్కన, మాటల రోష మెపుడు
గనుము సీతాయణమనుచు కవితనిడును
సీస తరళము కందము వ్రాసి చూపు
నేటి తరమున జూసిన మేటి నెవరు?

ఆ.వె
జాతి, వృత్తము లుపజాతిపద్యములైన
వ్రాయగలరు మంచి పటిమ తోడ
ఛందమేది యైన చందముగా కూర్చు
వారు యిరగవరము వారు గాదె
(Umadevi Balluri...గారి పద్యం.)


నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీమతి సత్యవతి కొండవీటి గారు.నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......52--19/10/15
తే.గీ--101
పాట కామాక్షి తోగూడి పాడి మురియు
జనని జానకికిన్ బెండ్లి జరుపు నెపుడు
గుంపు లోపల గోవింద గుద్ది యడుగు
మంచి మాటలు యచ్చంగ మనకు దెలుపు..

తే.గీ---102
పిలక పాటి యశ్వారావు ప్రేమ లేఖ
ఏటి లోపలికెరటము లేరు విడిచి
పోవు,యద్భుతముగనరె పుష్కరముల
మంచి మాటలు,ప్రతిమలు యెంచి నిడును

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ Jagannath Iragavaram గారు.నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరిగుమ్మడిపండువీరిపేరేమి?....53--20/10/15
తే,గీ---103
తెలుపుశుభమ నుచున్బుద్ధి పలుకునొకటి
వ్రాయు బుద్దుడు ,పంతులు,రమణ వాణి
చిన్న పలుకులే జూడగ చింత దీర్చు
ఎన్న నచ్చతెలుంగున మిన్న నెవరు?

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ Malladi Venkata Gopala Krishna గారు.నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......54--21/10/15
ఆ.వె---104
రచ్చ రచ్చ చేయు రహదారులందున
అధిక శబ్ధ ములతొ హారనినిన
ప్రకృతి యన్న పశువుపక్ష్యాదు లన్నను
పచ్చదనము యనినబహుగ ప్రేమ

ఆ.వె---105
అమర శిల్పి యేమొ యవతార మూర్తియొ
కుంచె చేత నున్న యెంచి యడుగు
సంఘ మందు చెడును చక్కగా దెలుపుచూ
నాగు బాము రీతి నాట్య మాడు.

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ Ksn Mrthy గారు.నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి


వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......55-22/10/15
ఆ.వె--106
శుభము నిడుచు తెలుపు సూచన నొక్కటి
మంచి సంగతులను యెంచి జూపు
కనిషికుండు యన్న కలదెంతొ ప్రేమయు
పంచు కొనునిరువురు మంచి నెపుడు

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ Nagendra Babu B V గారు.నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి


వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......56--23/10/15
ఆ.వె---107
చంద మందు గలదు అందమైనపటిమ
నిండు కుండ తీరు నెపుడు జూడ
ఎంచి చూపు పాత వెన్నెన్నొ సినిమాలు
మంచి విషయ పటిమ నెంచి గనుము..

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ Potluri Pardha Saradhi గారు.నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......57--24/10/15
ఆ,వె.,---108
కొదువ లేదు మనకు కుదురుగదెల్పును
సకల విషయ ములను సరస ముగనె
చిన్న పెద్ద వ్యాక్య చిరునగవునెజూపు
తరచి చూచి నంత తలకు నెక్కు....

ఆ.వె---109
మూడు నామములును ముచ్చట గొలుపగ
కొత్త పల్లి వార్ని కోరి కొలుచు
తెగువ మిన్న కలదు తెలగాణ మన్నను
చిరునగవులు లేని చిత్రము లేదు

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ Sridhar Muppiralaగారు.నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి


వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......58--25/10/15
తే.గీ--110
రాగసుధదార ,నాచెలి సిగలొయనును
పున్న మొచ్చిన యేల వ్రాసె నెలవంక
ఊపిరవ్వాల వయ్యారియూహ, కనగ
వివిద విషయమ్ము లెన్నియొ విశద పరచు

ఆ.వె---111
"చెమట చిందె నేని చేకూరు సంపద"
"ఆడు బిడ్డ గూడ యమ్మ యేగ"
"తప్పు లెన్ను వాడు తప్పు సేయక బోడు"
యనుచు దెలుపు మనకు  మిన్న నెవరు?

తే.గీ--112
ఎంకి పాటలు వ్రాసిన యెన్న తగును
పుడమి నందున సంపూర్ణ పురుషు డితడు
నింగి నేలను తాకెడి నిజములెన్నొ
విశద పరచెడు సుకవియీ వెంకటన్న

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ చౌడారపు రామకృష్ణ గారు.నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......59--26/10/15
ఆ.వె--113
స్వాతి  నందుజూడు స్పరిశియా వర్ధతే
దిగెను కౌముదందుదృశ్య కవిత
కొత్త వంటకములు కోరిచూపునెపుడు
పట్టు చీర లేమొ పట్టి చూపు

తే.గీ--114
మనకు గణపతి పూజలు మనుగడంట
వ్రాసె యగ్రహార కథలెన్నొ వాసి మిన్న
"మాటలమిఠారి నీవట మనవి వినవె"
చేరె శతకము రచనలు శీలవతివి

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ VijayaVenkataKrishna SubbaRao Ponnada గారు.నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......60--27/10/15
ఆ,వె---115
ఆడ వారి కనుచు యందమైనకవిత
సంసృతమున గలదు సరిగ పట్టు
అమ్మ నామ మహిమలద్భుతముగ జెప్పు
మంచి తనము కెపుడు మారు పేరు.

తే.గీ---116
అంబ వందనములు జగదంబ మీకు
వేదములనుగనిన తల్లి వేన వేలు
భాల త్రిపురసుందరిదేవి కాల మహిమ
ముక్కుపుడకతనకెపుడు మురిపెమనును

ఆ.వె--117
మాట లింక, వ్రాయు మహిమలైనకనుము
చూడ చక్కదనము చూపు కథలు
విషయ మేదియైన వివరమివ్వగలరు
ఎంచ గలమ వీరి మంచి పటిమ

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీమతి Subhadra Vedula గారు.నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......61--28/10/15

తే.గీ---118
గురువు శ్రీధర సన్నిధి కోరి గొలుచు
భరత ప్రాచీన గుడులన్ని బహుగ జూపు
ప్రతిమలు గనుము గణపతి పంచ దశము
గురుని పద్మినమ్మతొగూడి  గొలుచు నెపుడు


నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీమతి  శారద పోలంరాజు గారు.వారికి  మనందరి తరపున అభినందనలు   నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......62--29/10/15

ఆ.వె--119
అతడు పెండ్లి జేసె యాలితోడగలసి
యఙ్ఞ యాగములను హాయి గొలుప
సర్వ మతములనిన సాదరమ్ముగలదు
శాంత రూపు గనుము కాంతి రేఖ...

తే,గీ---120
కూర్చె నాదిదంపతులోలె గుణము గనరె
ఆలు మగలిద్దరు జనుల నాదుకొనును
గుండె దిటవుతోడనెరపు మెండు పనులు
మనము నేర్వవలయు వీరి మనసు నెరిగి

తే.గీ---121
కాని పనులుగనినచాలు కడుపు మండు
అన్న దానమిడెనుగను యాశ్రమమున
కష్ట మందున యిరువురు కలత పడరు
సరసి సౌభాగ్యవతిచిక్కె నరసపురము


నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ వడ్డాది సత్యన్నారాయణ మూర్తి గారు వారికి  మనందరి తరపున అభినందనలు నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......63--30/10/15

తే.గీ--122
అక్షర జనని శల్లాకు యంతె జాలు
సకల పరిలేఖనంబులు సరిగ జూపు
చూచి తీర వలయునంతె చోద్య  ముగను
విస్తు పోవుట మన వంతు విరివి గానె.

తే.గీ----123
ఆలుమగలిరువురుయందమైనవారె
చూడ జక్కని జోడియె చూచిరేని
ఒకరు గీతలందునమేటి యెకరు వ్రాత
లందు,కనరెవీరలప్రఙ్ఞ డెంద మరయ

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ శాంతా రామ్ గొల్లముడి గారు.   వారికి  మనందరి తరపున అభినందనలు నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

నేటి గుమ్మడిపండు:--
1 .ఆ.వె:
ఆర్కె లక్మణైన అబ్దుల్ కలామైన
కుంచె లోనె బాగ కుదురు కొనును
తనయ తోడ నున్న తండ్రిని చిత్రించు
చిత్రకళను జూడ చిత్త మలరు.

2.ఆ.వె:
మాత పాల నొసగి మమతతో గాంచును
ముద్దు బిడ్డ మోము మురిపె మొప్ప
చిత్రికరణ చేసి మంత్రము గ్ధుల చేయు
మూర్తిగారి కిపుడు మోడ్పు లిడుదు.

3.ఆ.వె:
అక్షరాలు నేర్పు నమ్మ చిత్రమునెంతొ
చక్కగాను గీయు చతురుడితడు
బాపు శైలిలోన భామను చిత్రించు
సఖియ జడను తాకి సఖుడు ముర్తి

(Umadevi Balluri గారి పద్యాలు)

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......64--31/10/15
ఆ,వె---124
చూడ చక్కదనము సొట్ట బుగ్గలతోడు
అణువు విస్పొటనము యగ్ని మండు
చదివె నేమొ కనగ సంఘము నంతయు
కలము కుంది పదును ఖడ్గ మోలె

తే.గీ--125
చిన్న కవితలెకనరండు మిన్నగెపుడు
"అమ్మ చిరిగిన రవికకు యడ్డు చేయి"
చెప్ప దలచిన యంతట చెప్పి తీరు
మరఫిరంగులమోతెలే మనసు నిండ

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ Pvr Murthy గారు.  వారికి  మనందరి తరపున అభినందనలు  నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......65--1/11/15

ఆ.వె---126
చదివి తీర వలయు సక్కని ముచ్చట్లు
అన్ని పనులు నెంతొ హాయిగొలుపు
పురము లోన జూడ నెరపు ఘనములెన్నొ
నవ్య రీతి కనరె సవ్య సాచి

తే.గీ---127
చదువు, సంగీత, సాహిత్య, సభలు గాని
బాపు, ఆరుద్ర, వేమన, భరదవాజ
విశ్వ నాధుడు, కాళోజి ,విశద పరచు
మంచి రచనలు కవితలు యెంచి చూపు

తే,గీ--128
కనుము "కాలము దాటని కబురు "లింక
"జమిలి గానము" పాటలు చదువు సంద్య
కనుల చూపెను వేమన, ఘనము "మెరుపు"
"తెలుగు సాహితీ వేదిక" తెలియ నగును

తే.గీ--129
ఘనము కావలి ముచ్చట్లు "గంజి బువ్వ"
గుడి "ముందర పొట్టెమ్మ"  గూడె హితుల
పుట్టె నిన్నటి రోజున పుడమి పైన
అక్కలందరి తమ్ముడు చక్క నయ్య

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ Vineel Kranthi Kumar(శతఘ్ని) గారు. వారికి  మనందరి తరపున అభినందనలు   నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......66--2/11/15
ఆ.వె---130
లలిత గీతములనినుల్లాసమున్ జూపు
రాగసుదలు జూపు రాయప్రోలు
పుడమి పైన పూజ పుణ్యఫలముగాద
మంచి వీడియోలనెంచి చూపు

తేగీ--131
రాదు రాదను రాగాల రమణి తానె
హితుల నందరి నెంచెను యతివ కవిత
ఆట వెలదుల యందున యద్భుతమ్ము
మంచి పదములు ధీటుగ యెంచివ్రాసె

తే.గీ--132
గోపి నాథుని పలుకులు గోవుపాలు
సంద్య చందనపు మనసు చక్కదనము
సంతసమ్మున మెరిసెను శారదమ్మ
కల్పనా వృక్షమై నిలచెగ కట్టుపల్లి

తే.గీ---133
ఆయుధ పూజలద్భుతముగ హాయి గొలుప
సరస సల్లాపములతోడ నెరపు ముదము
నాలుకాయుదము గనుము నాగ కన్య
కాదు, నవ్వినవ్వి పగిలె నాదు కడుపు

.నేటి గుమ్మడిపండు:--
1.ఆ.వె: ఉక్కు పట్టణాన యువిద తా నివసించు
          ఆటవెలదు లెన్నొ అంబ పైన
         నల్లు చుండు నతివ నలవోకగా తాను
         మల్లె దండ లల్లె మాల గాను.
2.ఆ.వె: హృదయ దినము గూర్చి హృద్యముగా దెల్పు
           మంచి కథలు వ్రాయు మనసు తోడ
         దృశ్యమాలికలను దృష్టి ముందుకు దెచ్చు
       దరహసించు చుండు తరుణి యెపుడు.
3.ఆ.వె: పేరు లోన దాగె వెండి వెన్నెల యంత
            మాటలోన గలదు మార్దవమ్ము
          నిత్య క్లిన్న కథను నిత్యనూతనముగ
         తెలుపు చుండు గాదె తెలుగు లోన.
నా సమాధానము: శ్రీమతి శశికళ ఓలేటి గారు.

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ బెహార లక్ష్మి నారాయణ  గారు.  వారికి  మనందరి తరపున అభినందనలు నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......67--3/11/15

తే.గీ---134
అనుదినము తెల్పు నాడునేడంచు మనకు
ప్రతిభ గలవారలందరి ప్రతిమ లిడును
దేశ చరితము,తీరగు దీరు లేమి
ధీటుగ దెలుపు సకలము మేటి నెవరు

అన్నయ్యా శుభోదయం.
అక్కడ గ్రూప్ లో పోస్ట్ చేయడం వద్దుకదా నేటి గుమ్మడిపండు:-
1.ఆ.వె :తెలుగు రథము ద్వార తెలుగు వెల్గును పంచి
           జాతి ఘనత పెంచు ఘనుల గూర్చి
            బాగుగ వివ రించి భావి తరములకు
           ఘన నివాళులిడుచు ఘనత కెక్కె.
2.ఆ.వె : భరత జాతి చరిత భవ్యమౌ రీతిలో
            నాడు నేడు యనుచు నంద చేసి
           గుర్తు చేయు చుంద్రు కొంపెల్ల వారిట
           ప్రతిభ యున్న వారి పటము లుంచి.
3.ఆ.వె :నడత పెంచు నదియు నడకయే ననుచుతా
             నవ్య శైలి లోన నడక తీరు
             తెలిపె,తీయ నైన తెలుగుభాష రుచిని
            చక్కగా నిడిరిట  శర్మ గారు.
నా సమాధానము: శ్రీ కొంపెల్ల శర్మ గారు.
Umadevi Balluri)


నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీమతి Sasikala Volety గారు.  వారికి  మనందరి తరపున అభినందనలు నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......68--5/11/15
తే.గీ---135
బ్రహ్మ కమలము సొగసుల కమ్మ దనము
తెలుగు తల్లిని గొలిచెడి మల్లె దండ
అచ్చ తెలుగు మాసపత్రిక నంత చదువు
మంచి విషయాలు షేరున యెంచి చూపు

తే.గీ---136

అచ్చ తెలుగులో విరిసెను ,అంకురంబు
క్రమము తప్పరు గుమ్మడి కాయ కెపుడుl
నిండు మనసుతోడ వడిగ నిడును పేరు
రిక్కనిచ్చి తీరెద నేను చక్కదనము

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ Kompelli Sharma గారు. వారికి  మనందరి తరపున అభినందనలు  నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......69--6/11/15

ఆ.వె---137
ఏక వాక్య కవిత లేలుటలోదిట్ట
అందు కొనియె నెన్నొ యందలములు
ఆంధ్రు లందరకును నానంద మనుచుండు
తెలుగు తేజ మనియు తెలియ నగును

నేటి గుమ్మడిపండు:-
ఆ.వె
నేడు రేపు కగును నిన్న యనుచు నతి
కమ్మగా నుడివిన కవి వరేణ్య
ఏకవాక్య కవిత లేక పదకవిత
లల్లి యశము నంది నారు తమరు


నా సమాధానము: శ్రీరోచిష్మాన్ గారు.
(Umadevi Balluri)


నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీమతి అAndra Lalithaగారు. వారికి  మనందరి తరపున అభినందనలు నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......70--7/11/15
తే.గీ---138
మంచి పెంచ మనుచునింక పంచ మనును
సేవ చేయుటయందున చేయి ఘనము
నీదు లోపము శాపము నీకు కాదు
కాంతియందునె కనవలె శాంతి దూత

తే.గీ--139
మంచి పనులెన్నొ మనసున నెంచి సేయు
పేద వారి చదువుకెంతొ సేద తీర్చు
కాంతి చేదోడు వాదోడు శాంతి పంచు
చిన్న వార ెమొక్కెద నేను చేతు లెత్తి


నేటి గుమ్మడిపండు:-
ఆ.వె:నూటి కొక్కరున్న నూ(ఊ)రు బాగుపడును
        కందుకూరు రాము కాంతి సంస్థ
      ద్వార నంద చేయు తాను మంచి పుస్తకములు
      మంచి చేయు చుండు మంచి పెంచు.
     2.ఆ.వె:   హితుల గూర్చి దెలుపు హితవాక్యములను
                      ఆదరించి తాను యాచరించు
                      మాట మీద నున్న మంచి యెంతొ జరుగు
                   నదియె పదియు వేలు ననుచు నుండు.
3.ఆ.వె: గాంధి గారి సూక్తి గౌరవముగ దెల్పు
               వాస్తవంబు లవియె వసుధ యందు
               పాత సామెతలకు కొత్తరూ పొసగేను
                ఎదిగి యున్న తాను యొదగి యుండు.
నా సమాధానము: శ్రీ కందుకూరు రాము గార
నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
(umadevi balluri)

శ్రీ Rochish Mon గారు.  వారికి  మనందరి తరపున అభినందనలు నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......71--8/11/15
తే.గీ---140
పెరటి కామవల్లభములు సరిగ జూపు
కనుము చదువుల పులుగును, కంటి మంచి
ఎండ కాలము నెంతయె మండుననుచు
పగటి దొరను గూర్చి దెలిపె సొగసు గనరె

తే.గి---141
మొక్కలనినబ్రీతినెపుడు నిక్కవమ్ము
వచ్చి నేనిగనుమురెండు యిచ్చి వెడలు
ముదము తోడతానిప్పుడు చదువ నెంచె
ముదిమి తనువుకొచ్చుననును మదికి గాదు

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ Kandukuri Ramu గారు.   వారికి  మనందరి తరపున అభినందనలు నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......72--9/11/15
తే.గీ---142
గురువు శంకరుడెటులనొ యెరుక పరచు
కర్మ నాలుగు తీరులు కనుడు యనును
జన్మ రాహిత్యమెటులొందు నిర్మలముగ
భరత మాతను గొల్చును సరిగ జూడ

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ Subbalakshmi Machikanti గారు. వారికి  మనందరి తరపున అభినందనలు  నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి

వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......73--10/11/15
తే.గీ---143
హిందు థర్మము సంస్కృతి యందముగను
చతుర భాషణములతోడ హితము దెల్పు
భూత భౌష్యత్తు వర్తమాన భువిని దెల్పు
తెలుపు సత్సంగ నిత్సంగ తీరు తెన్ను

తే.గీ---144
ఎల్ల విషయములన్నింట చెల్లు ఘనత
చదివి తీరవలయునంత సరస వ్యాక్య
విశద పరచుట నందున వీరి శైలి
కోప తాపములుండవు కూరిమేగ

తే.గీ---145
జాతి పితనైన ,ఫేస్బుక్కు, చంద్రుడైన
గురువు శిష్యుల,పాంచాలి, గురుతు సేయు
భీష్మమరణము,కురుసేన,పేరు లవిగొ
వేద వేదాంగ విషయము లెరుక పరచు


నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీమతి Bharati Vs గారు.  వారికి  మనందరి తరపున అభినందనలు నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి


వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......74--12/11/15
ఆ.వె--146
ప్రణయి తూర్పు కొండ పాలేటి రాచూలి
లేదు చిరునగవులు లేని ప్రతిమ
ఙ్ఞాన మిచ్చు నట్టి నాతిని కనరండు
పరుల భాష నందు పసిడి పలుకు..

తే.గీ---147
చేరి సామాన్య ప్రఙ్ఞను కోరి చూపు
అంతు చిక్కని చక్కని బంతు లవియె
విద్య పద్మము తోడుగ వినయ మెంతొ
మామ మల్లికి కోడలు మరువ మెవరు


నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీ Vijay Lenka గారు.   వారికి  మనందరి తరపున అభినందనలు నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి
లు
వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?......75--13/11/15
తే.గీ--148
వెలసె నయ్యలసోమయాజులకులమున,
గంటి వారింట నడుగిడి ఘనుతి కెక్కె
సున్ని తత్వము వీరిది చూడనగును
చేయి తిరిగిన రచయిత్రి  చెలిమి మెండు

ఆ.వె----149
గడుసు వార లంట కడుగంటి వారలు
పదియు రెండు సంతు పల్లవోష్టి
సాగు చేయు నెపుడు సాహిత్య వనములో
సుజల ధార గురియు సుమతి కలము

తే.గీ---150
కథలు వ్రాయుట యందున కలదు పట్టు
వీరి కొట్టెక్క బుట్టలు చేరి కనుము
పుష్కరముల యాత్రదెలిపె పుష్కలమ్ము
సుజల మధుర ఫలము సుజను లార

ఆ,వె---151
నాన్న మనసు వెన్న కనుము మాలికనందు
నేను యన్న భావ మెన్న కనును
అమ్మ యన్న మాటె యమృతమ్ము యనగంటి
సుజల జలపాతమేకన్న సుదతి రచన

నిన్నటి నా పద్యములో విరిసిన..మిత్రులు...
శ్రీమతి Purna Tangirala గారు.  వారికి  మనందరి తరపున అభినందనలు నేడెవరో చెప్పండి బహుమతి గెలవండి.....నా జవాబు కోసం రేపటి పద్యం చూడండి