ఛందశ్శాస్త్రం
పరిచయము
"ఛది ఆహ్లాదనే" ....... అనే ధాతువు నుండి" ఛందస్" అనే పదం ఏర్పడింది ,ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉండే ఒకలయ కలిగింది అని అర్దం,
"ఛది సంవరణే".......సంవరణం అనగా ఆవరించటం,మనలో పుట్టే భావాలతో కూడిన అనేక వాక్యాలు ఒక విలక్షణమైన నిర్మాణము "ఛందస్సు ".
పద్యగ్రంధ రచన ఛందస్సు లేకుండా మన జాలదు.ఛంధస్సు నే "ఛందము" అని కూడ అంటారు.
భాష అక్షరాల మయం,..,,.,.కొన్ని అక్షరాల కలయకే పదం(మాట.,గణము ,,గణం).......కొన్ని పదాల కలయిక వాక్యం, ,,,,,,,,,,,వాక్యాలు ఎన్నోకలసి కావ్యం రూపుదిద్దు కుంటుంది.మహా గ్రంధం అయిన సరే...
ఈ కావ్యాలు మూడు రకాలు
1.గద్య కావ్యం ,.,,,2.పద్య కావ్యం ,,,,,3.చంపూ కావ్యం ,.,అయితే "ఛంధస్సు " అనేది పద్య,చంపూ కావ్యాలలో మాత్రమే ఉపయేగించ బడుతుంది ,మనకున్న వేనవేల పదాలను మనం అను నిత్యం పలుకుతాము,వ్రాస్తాము,చదువుతాము,మనం వాడే అక్షరాలు ఎన్నైన వాటికి ఛంధశ్శాస్త్రం లో రెండే పేర్లు కలపు అవే 1,,,,,,గురువు 2..,,,లఘువు,,,,
ఇక ఈ గురువు లఘువు లను గుర్తించడానికి ఛంధశ్శాస్త్రం లో పండితులు రెండు గుర్తులు సూచించారు అవిఇంగ్లీష్ అక్షరాలలోని U.,,,,,,,,I లను పోలి ఉంటాయి,,,,,,
ఏదైన ఒక అక్షారం పైన U గుర్తు వ్రాస్తే అది గురువు అనియు.,,,,, I గుర్తు వ్రాసినచో అది లఘువు అనియు గుర్తుంచు కోవాలి
ముందు ముందు గణ నిర్మాణము,,,,గణ విభజన చేయ వలసి ఉంటుంది కావున పైన చెప్పిన U.,,I...గుర్తులను తప్పని సరిగా గుర్తు ఉంచు కోవాలి,,, మీ ఇష్టం వచ్చిన ఏ పదమైనా సరే గురు లఘువులు సాదన చెయ్యాలి..,,
మాత్రా గణఛందస్సు
పైన తెలియచేసిన పద్దతులే కాకుండా మరొక పద్ధతి లో కూడ గణవిభజన చేయ వచ్చు , అదే "మాత్రాగణ" విభజన. ఈ పద్ధతిని సినీగీత రచన చేసేవారు,గేయ రచన చేసేవారు, వచనకవిత్వం వ్రాసేవారు విరివిగా వాడుచున్నారు. సినీగీత రచయితలలో " కీ.శే.సిరివెన్నెల సీతారామ శాస్త్రి" గారి వంటి సుకవులు ఈ పద్ధతిని ఎక్కువగా పాటించారు. సమయానుకూలముగా సినీగీత రచయితలంతా పాటిస్తూనే ఉన్నారు.
మాత్రా గణ పద్ధతి ....స్వరూప స్వభావం ,...
" ఏకమాత్రే భవేత్ హ్రస్వ
ద్విమాత్రో దీర్ఘ ఉచ్యతే
త్రిమాత్రస్తు ప్లుతో ఙ్ఞేయః
వ్యంజనం త్వర్థ మాత్రకమ్"
అనే శ్లోకం "యాఙ్ఞ వల్క్యశిక్ష" అనే గ్రధంలో వ్రాయబడింది. అనగా ఏకమాత్ర కాలంలో పలికేవి హ్రస్వాలు ,రెండు మాత్రల కాలంలో పలికేవి దీర్ఘాలు ,మూడు మాత్రల కాలంలో పలికేవి ప్లుతం.,అర్దమాత్ర కాలంలో పలికేవి వ్యజనములు అని అర్దం ,,వ్యంజనములు అనగా అచ్చు చేరని హల్లులు ,.క్ గ్ మ్ ట్ చ్ త్ న్ అని మనమింతకు పూర్వమే తెలుసుకున్నాం.
"మాత్ర" అంటే చిటికె వేసే కాలము అనికూడా ఇంతకు ముందే మనం నేర్చు కున్నాము.
ఈ మాత్రాగణ పద్ధతిలో ఉపయోగించే గణాలకు నామకరణం చేయడం జరిగింది ,ఏకమాత్ర,,ద్విమాత్రలకు వస్తుతః నడక లేదు కావున వీటిని వదలి మిగిలిన వాటికి నామకరణం చేసారు
1.మూడు మాత్రల గణం,,,....త్రిస్రము
2.నాలుగు మాత్రల గణం చతురస్రము
3.అయిదు మాత్రల గణం . ...ఖండము
4.ఏడు మాత్రల గణం ...మిశ్రమము
5.తొమ్మిది మాత్రల గణం .....సంకీర్ణము
అని పేర్లు కలవు. ఈ పేర్లు మనకు ఎక్కువగా సంగీత శాస్త్రంలో వినిపిస్తుంటాయి.
మాత్రాగణ ఛందస్సులో గురులఘువులకు U I గుర్తులుకాకుండా ఆ గుర్తులకు బదులుగా గురువుకు 2 (ద్విమాత్రలు) లఘువుకు 1 (ఏకమాత్ర) ఇలా మాత్రల రూపములో అంకెలు కేటాయిస్తారు ఇలా 2-1 అంకెలు కేటాయించి ఒక క్రమపద్దతిలో గేయములు, వచన కవితలు వ్రాస్తారు. దీనినే "మాత్రాగణ ఛందస్సు"అంటారు.
ఉదా;
2 1 2 1 2 1 2 - 2 1 2 1 2 1 2-ఈమాత్రలన్నీ 22-14 అక్షరములు
ముద్దబంతి పువ్వులో - మూగకళ్ళ ఊసులూ
1 1 1 2 1 2 1 2 - 2 1 1 2 1 1 1 2-ఈమాత్రలన్నీ 22-14 అక్షరములు
యెనక జన్మ బాసలూ -యెందరికీ తెలుసులే
పైన వ్రాయబడిన ఉదాహరణ మనం గమనించిన యెడల క్రింది విషయాలు తెలుస్తాయి. గురులఘువులకు మనకు తెలిసిన U I గుర్తులకు బదులుగా 2-- 1 అంకెలను వాడినాము. ప్రతి వరుసలో మొత్తము పదునాలుగు అక్షరములున్నాయి. 22 మాత్రలు ఉన్నాయి. ఒక్కో పాదామును రెండు సమ భాగాలుగా విడగొట్టి చూస్తే ప్రతి భాగము 11 మాత్రలతో వ్రాయబడి ఉంది. అలా రెండు పాదములు 11 మాత్రలతో రెండేసి సమభాగములుగా విడగొట్టబడి సమ తూకముగా నడిచింది. ఒక్కో పాదము కొన్ని మాత్రల తరువాత ఆగి మరల ప్రారంభించ బడింది. అలా ఆగిన చోట ఒక లయ ఏర్పడింది, మాత్రలు ఒకే రకముగా తీసుకోవటం వలన సమతూకంతో లయ ఏర్పడి గేయం మనోహరముగా ఉంది,
మరో ఉదా//
1 2 1 2 11 2 1 1 1 2 1 1 2-ఈమాత్రలన్నీ 19-13 అక్షరములు.
విరించినై విరచించితిని ఈ కవనం
1 2 1 2 11 2 1 1 1 2 2 2-ఈమాత్రలన్నీ 19-13 అక్షరములు.
విపంచినై వినిపించితిని ఈ గీ తం
ఈ ఉదాహరణ కూడ సమాక్షరములతో ( 13) సమ మాత్రలతో (18) కూడి అతః ప్రాస అంత్య ప్రాస కలిగి మనోహరముగా వ్రాయబడి శ్రోతల హృదయాలలో నిలిచింది. ఒక్కో పాదము కొన్ని మాత్రల తరువాత ఆగి మరల ప్రారంభించ బడింది. అలా ఆగిన చోట ఒక లయ ఏర్పడింది,మాత్రాగణ పద్దతిలో మాత్రలు లెక్కించు నప్పుడు గణం ప్రాముఖ్యం పొందదు. కేవలము మాత్రలను మాత్రమే పరిగణనలోకి తీసుకోబడి మాత్రా గణ సహాయంతో లయ బద్దంగా వ్రాయబడతాయి. సినీ గీతాలు,గేయ రచనలు,వచన కవితలు, మున్నగునవి వ్రాయడానికి ఈ మాత్రాగణ విభజన పద్దతి అధిక ప్రాధాన్యం కలిగి ఉంది.
మీరుకూడా ఈ మాత్రాగణ ఛందస్సునుపయోగించి గేయరచన చేయుట సాధన చేయదగును.
ఒక వాక్యాన్ని గాని ,పద్య పాదాన్ని గాని తీసుకొని మూడక్షరాల గాను నాలుగు అక్షరాలు గాను విడగొట్టి గురులఘువుల ను గుర్తించడం సాదన చెయ్యాలి, ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది చందస్సుకు పునాది వంటిది.
పద్యాలు, దండకములు,గేయాలు,వచన కవితల వంటి కళా ప్రతిమలు తయారు చేసే ముడి సరుకు మన వద్ద ఉంది.మిగిలిన రంగులు,వస్త్రాలు ఆభరణాల వంటి "యతి" "ప్రాస" "ప్రాసయతి" "అలంకారము"ల వంటివాటిని గురించి ముందు ముందు పాఠాలలో చర్చించుకుంటూ తెలుసు కుందాము .
యతి అందలిరకములు
పద్య పాదంలోని మొదటి అక్షరానికి యతి అని పేరు.ఈ యతి ప్రతిపద్యానికి దాని స్వభావాన్ని బట్టి ప్రతిపాదానికి ఏర్పాటుచేయటం జరుగుతుంది.
కం;
చరణ చరణమున కాద్య
క్షరములు వళులయ్యె,నవియెక్రమ్మఱఁదత్త
చ్చరణములలోనఁ జెప్పిన
యిరవులఁ బొందింపవలయు నెల్ల కృతులలోన్
ప్రతి పాదములోని మొదటి అక్షరం వళులని అవి తిరిగి ఆయాపాదాలలో నియమిత స్థానంలో నిలపాలనీ భావం,అయితే యతి అనే పదానికిఇంకా చాలా పేర్లు ఛందశ్శాస్త్రం లో పెద్దలచే చూచించ బడ్డాయి.
1.విరతి
2.విశ్రాంతి
3.విశ్రామ,
4.విశ్రమము
5.శ్రాంతి,,
6.విరమణ,
7.విరమ,
8.విరామ,
9.వళి...
ఇవన్ని యతి కి పర్యాయ పదాలుగా ఛందశ్శాస్త్రంలో తెలుప బడింది. మనం వాడుకలో "యతి" అనే పదాన్నే ఏక్కువగా ఉపయోగిస్తాము. యతి ఎన్ని రకాలు, వాటికి ఏపేర్లు కలవు, వాటి స్వభావం ఏమిటి. ఎ అక్షరానికి ఏ అక్షరంతో యతి కుదురుతుంది అనే విషయాలు తెలుసు కుందాము.
అయితే ఇప్పుడు మనం అభ్యసించబోయే యతి సంబంధితాంశము కొంచం కష్టతరమైనది. ఇది చాలా రకాలుగా ఉన్నది. ప్రతి పద్య పాదములోని మొదటి అక్షరం యతి అయినప్పుడు దానికి సరిపడు విధముగా నియమిత స్థానములో అదే అక్షరం గాని దాని మిత్రాక్షరం గాని నిలపటాన్నే యతి వేయటం, యతిమైత్రి, యతి చెల్లటం అంటాము. ఇవి చాలా రకాలుగా ఉన్నాయి. అచ్చుల ద్వార, హల్లుల ద్వార, వర్గాక్షరముల ద్వార, సంధుల ద్వార, సమాసముల ద్వార కొన్ని ప్రత్యేకమైన అక్షరముల ద్వార, ప్రత్యేక పదముల ద్వార, అలాగే అచ్చులు హల్లుల ద్వార, విభక్తుల ద్వార మరియు అనునాసికాక్షరములద్వార ఇలా వివిధ రకములుగా యతి మైత్రి చెల్లించ వచ్చు. ఈ పూర్తి సమాచారాన్ని అందించే ఈ అధ్యాయము క్షుణ్ణంగా మనం అభ్యసించినచో పద్య రచన చాలా సులభతరంగా ఉంటుంది. ఎక్కువగా కష్టపడ కుండానే యతిమైత్రి చేయవచ్చు అర్ధవంతమైన పద్య రచన చేయ వచ్చు శ్రద్ధగా నేర్చు కొనవలసినదిగా మనవి.
ఈ యతి భేదాలు క్రింది విధంగా ఉన్నాయి
1.స్వరయతులు,,,,,,,,,,,,,,7
2.వ్యంజన యతులు,,...,22
3.ఉభయ వళులు.,.,,.,..13..(మొత్తము 42)
పైన ఉదహరించిన 42 విధములుగా పద్య రచనలో యతి మైత్రి కుదురు తుందని, మన వ్యాకరణ గ్రంధ కర్తలు శలవిచ్చినారు. వాటిని గురించి విపులంగా చర్చించు కుందాము.
యతి భేదములు:-
1.స్వరయతులు,,,,
"అ" నుండి "ఔ" వరకు గల అక్షారాలను స్వరములు అంటాము ,ఈ అచ్చుల మద్య ఏ అచ్చలకు ఏ అచ్చులతో యతి చెల్లుతుందో తెలియ చేయునది కావున ఇది స్వరయతి విభాగమైనది. ఇవి 7 నామములతో పిలవ బడుచున్నవి,
a) స్వరమైత్రి వళి.....,,...,...
1.అ ఆ ఐ ఔ ...................,, వీటిలో ఇవి ఒకదానికొకటి యతి చెల్లుతాయి.
2.ఇ ఈ ఋ ౠ ఎ ఏ ..,.....వీటీలో ఇవి ఒకదానికొకటి యతి చెల్లుతాయి.
3.ఉ ఊ ఒ ఓ ,,,,,,,,,,..........వీటిలో ఇవి ఒకదానికొకటి యతి చెల్లుతాయి.
పైన చెప్పబడిన 3 వరుసలు ఏ వరుసకు ఆవరుస యతి చెల్లటం వలన వీటికి స్వరమైత్రి వళులు అనినామకరణం చేయబడినది,
ఉదా--1
"అ"బ్జ పత్రనేత్ర "ఆ"ర్తావన చరిత్ర
"ఆ"తతాయి జైత్ర "ఐం"ద్ర మిత్ర
"ఐం"దవ ప్రగోత్ర "ఔ"ర్వశేయ స్తోత్ర
పై పాదములను పరిశీలించినచో,,,,",అ---ఆ" "అ----ఐ" " ఐ ----ఔ"లు ఒక దానికొకటి మిత్రత్వము కలిగి ఉన్నందు వలన ఇది స్వరమైత్రి వళి అయింది దీనిని అప్పకవి అకార యతులు అన్నాడు,
ఉదాహరణ ,,,2...
"ఇం"దు వంశసోమ "ఈ"శ్వరీ నుత నామ
"ఈ"డి తాంగథాయి "ఋ"షభ భీమ
"ఋ"క్ష జాభిరామ "ఎ"టులైన మా భామ
"ఎ"డఁగటాక్ష ముంచి "ఏ"లుమనగా!
పై ఉదాహరణ నందు "ఇ----ఈ""ఈ..---ఋ""ఋ-----ఎ""ఎ---.ఏ" అనే అచ్చులకు ఒకదానికొకటి యతి మైత్రి చెల్లినది,వీటికి ఇత్వ వళులు అని అప్పకవి చే నామకరణం చేయబడింది.
ఉదాహరణ ,,,3
""ఉ"రగరాఙశాయి "ఊ"ర్థ్వ విష్ణుపదాయి
"ఊ"ర్జితోరు కీర్తి "ఒ"డలికార్తి
"ఒ"దవ కుండబ్రోచి "ఓ"లి దాసునిగాచి
చేరి కనక కశిపు జీరితనగ
పై పాదములలో"ఉ---ఊ""ఒ----ఓ""ఓ---ఓ" లకు ఒకదానికొకటి యతిమైత్రి చెల్లింది కనుక దీనికి ఉర్థ్విరామము అని అప్పకవి శెలవిచ్చారు,
ఉదాహరణ ,,,4.
"ఊ"రు వెడలఁగొట్టె "ఉ"ర్విత్వరతఁబెట్టు
"ఒ"డలు వడలిపోయె "ఓ"ర్మిపోయె
"ఉ"సురుసురని జీవి "ఊ"రులు నిగిడించె
"ఊ"తమీయ రావ "ఓ" మహేశ!
పై పద్యము నందు "ఉ---ఊ ""ఒ---ఓ" ఊ,,,ఓ లనడుమయతి చెల్లింది..,......
2).స్వర ప్రధాన వళి,,,,,,,,,,,
సవర్ణదీర్ఘ సంధి,గుణ సంధి వంటి అచ్ సంధులందు పరపదాది అచ్చుకు యతి చెల్లుట స్వర ప్రధానవళి. అనగా పద్యపాదములోని మొదటక్షరమైన అచ్చక్షరమునకు సవర్ణదీర్ఘ సంధి,గుణసంధి వంటి సంధులలో వచ్చెడి పరపదములోని మొదటక్షరమైన అచ్చులతో యతిచెల్లటాన్ని స్వరప్రధానవళి అంటారు.
ఉదా..,,..
"అ"తుల గుణదామ భాను వం"శా"బ్ధి సోమ
"ఇ"న తనూభవ మిత్ర లం"కే"శ జైత్ర
"ఉ"రుగుణ కలాప శకలీకృ"తో"గ్రచాప
నాగ నిట్లు స్వర ప్రదాన వళు లొప్పు!
మొదటి పాదము ..అ----వంశ+అబ్ది(వంశాబ్ధి ) అని విడదీసిన పర పదములోని "అ"కారానాకి
రెండవ పాదము...ఇ----లంక+ఈశ( లంకేశ) అని విడదీసిన పర పదములోని "ఇ"కారానికి
మూడవ పాదము.,.ఉ----కృత+ఉగ్ర ( కృతోగ్ర)అని విడదీసిన పర పదములోని "ఉ"కారానికీ యతి చెల్లింది.,ఇలా సంధి జరిగినప్పుడు పరపదము లో ఉన్న మొదటి అక్షరమైన అచ్చుకు సంబదించిన యతి గనుక ఇందు అచ్చే ప్రధానము గనుక ఇదిస్వర ప్రదాన వళి అయింది,
3)లుప్త విసర్గ వళులు...,,
ఇది విసర్గ సంధికి సంబందించిన యతి విశేషణము.....,,అస్ అంతములో ఉండు హ్రస్వమైన అకారము పరమైన ఎడల ఆరెండింటి స్థానములో ఓకారము ఆదేశముగా వచ్చును.
ఉదాహరణ ,,,,,
అంబుదశ్యామ తమ కింకరోహ మనగ(కింకరః+అహమ్)
యామినీ చర గర్వ తమోర్కయనగ (తమః+అర్క)
హరి సుతుండును నీవు నన్యోన్య మిత్ర (అన్యః+అన్య)
లయ ప్రవర్తింతు రనగ లక్ష్యంబులయ్యెఱె
పై పాదములు పరిశీలించినచో
1."అ" అనే అక్షారానికి "రో"లో ఉండే "ఓ"కారం తోను,
2."యా" అనే అక్షరానికి "మో" లో,ఉండే "ఓ"కారంతోను.
3."హ" అనే అక్షరానికి "న్యో" ఉండే "ఓ"కారంతోను
యతి చెల్లింది.కావున ఇది లుప్త విసర్గవళి,విసర్గ లోపించు చున్నది కావున ఇది లుప్తవిసర్గవళి అయినది.
4)వృద్దివళి.........
అకారానికి ఏ ఐ లు పరమైనచో "ఐ "కారం ఓ ఔ లు పరమయినచో "ఔ" కారం ఆదేశముగా వస్తే అది వృద్దిసంధి
వృద్దిసంధి జరిగి నప్పుడు పర స్వరాలైన " ఏ.. ఓ"లకుగాని ఆదేశాలయిన ఐ,,,,ఔ లకుగాని యతి వేయవచ్చును.
ఉదా;
ఇభభయ విదార సర్వలో"కై"క వీర
అఖిల భువన ప్రశస్త జి"తై"ణ హస్త
ఉదథీశ్రితవక్ష భ"క్తౌ"ఘ రక్ష
హత పరానీక నందప్ర"జౌ"క యనగ!
పై ఉదాహరణములో వరుసగా ఇ కారమునకు లోకైకలోని" కై"లోని లోక+ఏక పరపదములోని ఏకారంతో యతి చెల్లినది
అ కారానికి జితైణ లోని" తై "అనేదానిలో జిత్త+ఐణ పరపదములోని ! ఐ అనే అచ్చుకు
ఉ కారమునకు భక్తౌఘ లోని భక్త+ఓఘ అనే పరపదములోని ఓ అనే అచ్చుకు
హకారమునకు వజ్రౌక లోని "జౌ" అనేదానిలో వజ్ర+ఓక పర పదములోని ఓ అనే అచ్చుకు ఆదేశమయిన "ఔ" కారానికి
యతి చెల్లింది.వృద్దులనబడే అక్షరాల యతి చెల్లింది కావున "వృద్ధివళి" అయినది
ఉదా...,,,,
",,,,,,,,...........,,,,.......బి
డౌజా రవితేజ గుత్తియప్పలరాజా "
పై ఉదాహరణలో ,,( బిడ+ఓజా** బిడౌజా) ఔ అనేది ఆదేశంగా వచ్చి అది (గుత్తి+అప్పల**గుత్తియప్పల) అప్పల అనే పదమందలి
అ అక్షరముతో యతి చెల్లినది...కావున వృద్ధివళి అయినది,
5. ఋ వళి.,..,,....
రి రీ రె రే అనే అక్షరాలకు "ఋ"కారముతో యతి పొసగుటను ఋవళి అంటారు,అలాగే క కారము మొదలైన హల్లులతో ఋకారము(వటృసుడి) కూడి ఉన్నప్పటికీ(కృ గృ డృ టృ తృ నృ)రి రీ రె రే లతో యతి చెల్లుట ఈ యతి ప్రత్యేకత
ఉదాహరణ ,,,..,,.
"రతి వల్లభ జనక విని
ర్లిత కనక విలోచనాక్య ఋగ్విజరాది"
పైన రెండవ పాదములోని మొదటి అక్షరమైన "రి" కి యతి స్థానంలోని "ఋ" కి యతి చెల్లినది.
6.ఋత్వసంబంధవళులు..,...
ఋత్వవము అనగా "ఋ" అనే అక్షరము,దానితో సంబందించిన అక్షరాలతో యతి జరగటం ఋత్వసంబంద వళి అవుతుంది.
క మొదలైన హల్లుమీద నిలచిన ఋకారానికి(వటృసుడికి) (కృ.,,మృ,,,వృ.,నృ..) ఋ కారము తోను దీని మిత్రాక్షరాలైన ఇ ఈ ౠ ఎ ఏ లతోను యతి చెల్లును. అలాగే ఇ కారముతో కూడిన య హ అనే అక్షరాలకు యి యీ యృ యె యే హి హీ హృ హౄ హె హే లకు కూడ ఋ కారముతో యతి చెల్లు తుంది.
ఉదాహరణకు
"ఇనతనూభవుండు వృషదశ్వ సుతునేసె
ఋభునదీ సుతుండు కృష్ణునేసె
నేమి చెప్పునపుడు దృడశక్తి శల్యుండు
హీన బలుని చేసె వృఫ్టి కులుని "
పైన పద్యము గమనించినచో "ఇ.,వృ" "ఋ..కృ" "నే...,,దృ" "హీ.,,వృ" లకు(ఋ కారానికి ) యతి చెల్లినది, కావున ఇది ఋత్వసంబంద వళి అయినది.
7.ఋతుసామ్య వళులు ........
"ఋ "కారముతో సామ్యము కలిగి ఉన్నచో చాలు అనగా ఋకారముతో ఏహల్లు కూడినప్పటికీ అవి పరస్పరము చెల్లే యతులౌతాయి, హల్లాక్షరములకు పరస్పరమైత్రి అవసరంలేదు.
"వృష్టి వంశాబ్ది సోముడై పృధిని బట్టి
మృతుని గావిఁచె గంసుని గృష్ణుడనఁగ"
పై ఉదాహరణ పరిశీలించిన " వృ....,పృ". "మృ.,,,గృ " లకు యతి చెల్లినది.కేవలము ఋ కారముతో( వటృసుడి తో)ఏర్పడిన యతులు కావున ఇవి ఋత్వసామ్యవళులైనవి,,
ఇంతటితో స్వరయతులు అనగా అచ్చుసంబంధిత యతులు,,,ఏఏ అచ్చుల మద్య ఏఏ రూపాలలో యతి మైత్రి కలదో వాటి గురించి పూర్తి విషయము మనము చర్చించటం జరిగినది ,,,,రేపటి నుండి వ్యంజన యతులు (హల్లులు) అనగా అక్షర మాల లోని ఏఏ హల్లుల మద్య యతి మైత్రి ఏఏ రూపాలలో కుదురు తుందో తెలుసు కుందాము.,,,
2.వ్యంజనయతులు .........
అక్షరమాలలోని "క" మొదలు "క్ష" వరకు గల అక్షరాలకు వ్యంజనములని, హల్లులని,ప్రాణులని పేర్లు కలవని మనకు తెలుసు ,వీటిలొ ఏ హల్లక్షరముతో ఏఏ హల్లక్షరాలకు యతి చెల్లుతుందో తెలియ చేయు విభాగమే ఈ వ్యంజనయతుల విభాగము .ఇవి మొత్తము 21 గా కలవని అప్ప కవిచే శలవీయబడినది,
1)ప్రాణివిరామము,.,.,,,,.,
అచ్చులకు ప్రాణములు అనెడి నామకరణం కూడ కలదని మనకు తెలుసుహల్లులకు ప్రాణులు అనిపేరు.....,(ప్రాణములు,,,ప్రాణులు వ్యత్యాసము గమనించ గలరు) అయితే హల్లుకు యతి వేయునప్పుడు ఆ హల్లుకే కాక ఆ హల్లు పైనున్న అచ్చుకు కూడ యతి వేయటాన్ని ప్రాణి విరామము అంటారు.
అ,,,,ఆ.,,,ఐ,.,ఔ,,.ఒక విభాగము గను
ఇ,,,,ఈ..,ఋ,,,,ౠ.,,,ఎ.,,,ఏ,,లను ఒక విభాగము గను
ఉ,,.,ఊ,,,ఒ.,,ఓ లను ఒక విభాగము గను మనము స్వరయతులందునే గుర్తించితిమి.
ఉదాహరణకు ఒక హల్లక్షరం ఇక్కడ నేను చూపెదను మిగిలినవి మీరు సాదన చేయ గలరు.
గ,,గా,,గై.,గౌ,,(అ...ఆ...ఐ...ఔ ఇది ఒక బృందము )
గి,,,గీ.,,గృ.,,గౄ,,గె..,గే (ఇ.,ఈ.,ఋ,,ౠ.,ఎ..ఏ ఇది ఒక బృందము)
గు.,,,గూ.,,గొ.,,గో,,,(ఉ....ఊ,,,ఒ..,ఓ..ఇది ఒక బృందము)
ఈవిదముగా క మొదలు క్ష వరకు గల ఏ హల్లు అక్షరమైనా పైనుదహరించిన మూడు బృందముల అచ్చులతో కలసి ఏ బృందమునకాబృందము మూడు విభాగాలుగా ఉండి యతి వేయటానినే ప్రాణి విరామము అంటారు
ఉదాహరణ ..,,.,,,,,,
గట్టి వానితో స్నేహము గట్టి కొనుము
గేలి చేసెడి వారు సిగ్గిల్లు నట్లు
గొల్ల దేవుని కొల్వగా గూడు మనుచు
చెప్పె రాణి సుబుద్దుల చిత్తరీతి
గమనించినచో..",గ..,,,,గ" "గే,,,,,గి " "గొ.,,గూ " "చె....చి" లకు స్వరమైత్రి గల హల్లులతో యతి చెల్లుచునున్నది. మూడు విభాగములైన అచ్చులు(ప్రాణములు ) తో చెల్లిన యతి కావున ప్రాణవిరామమైనది,
2) వర్గజయతులు......
క చ ట త ప అనేవి వర్గములని ఒక్కొక్క వర్గములోను 5 అక్షరములని మొత్తము 25 అక్షారాలు అని మనం అక్షరమాలలో నేర్చుకొని ఉన్నాము ,ఇప్పుడు ఆ అయిదు వర్గాలలోని చివరి అనునాసికము లైన "ఙా ఞ ణ న మ "లను వదలి వేసి ప్రతి వర్గములోని మొదటి నాలుగు అక్షాలను తీసుకొనిన యెడల .,,,,,
క వర్గము,.,..,, క ఖ గ ఘ
చ వర్గము ,.., చ ఛ జ ఝ
ట వర్గము ,,,,,,,ట ఠ డ ఢ
త వర్గము .....త థ ద ధ
ప వర్గము ,,,,,,,ప ఫ బ భ ఇలా ఉంటాయి కదా....
ఏ వర్గమునకు ఆ వర్గములోని నాలుగు అక్షరములు ఒకదానితో ఒకటి యతి చెల్లును..,,,,సంధి వచ్చినను యతి చెల్లును.కావున ఇవి వర్గజయతులైనాయి.
ఏ వర్గమునకు ఆవర్గములోని అక్షరములతో మాత్రమే యతిచెల్లును.,,,,కావున వీటికి వర్గజ యతి అవి నామకరణం జరిగినది. ఒక వర్గాక్షరముతొ మరియొక వర్గాక్షరము యతి చెల్లనేరదు.
"కం"డి మద్య గేహ "ఖం"డితారి సమూహ
"ఖం"జ నాభ దేహ "గా"న మోహ
"గ"రుడ పక్షి వాహ "ఘ"న వాహజస్నేహ
భర్గ వినుత యనిన వర్గ యతులు
ఇది కవర్గములో ఒక అక్షరముతో మరొక అక్షరము యతి చెల్లుట.,..
చ వర్గ ఉదాహరణ ,,,,
"చ"వితి చంద్రుని చూచియు "జం"కు వలదు
"చి"త్తజుని తండ్రి కొలువంగ "చిం"త తొలగుఁ
"జ"క్రదరువేడ శంకలు "జా"రిపోవుఁ
"జ"ల్లచల్లన గుండియు "ఝ"ల్లునగున
పై విదముగా చ వర్గము లోని అక్షరములు ఒకదానితో ఒకటి యతి చెల్లినది....
3)బిందు యతులు....,..,..,
అన్ని వర్గములలోని పంచమాక్షరములైన ఙ ఞ ణ న మ అనెడి అనునాసికాక్షరములకు అదే వర్గములోని మిగిలిన నాలుగు అక్షరములు పూర్వబిందువుతో ఉన్నప్పుడు యతి చెల్లుటనే బిందుయతులు అంటారు.పూర్వబిందువు అనగా ఒక అక్షరమునకు ముందు బిందువు(సున్నా)కలిగిఉండుట
ఙ---ంక ంఖ ంగ ంఘ
ఞ---ంచ ంఛ ంజ ంఝ
ణ---ంట ంఠ ండ ంఢ
న---ంత ంథ ంద ంధ
మ---ంప ంఫ ంబ ంభ
పై విదముగా అనునాసికాక్షరములకు అదే వర్గములోని పూర్వబిందు అక్షరములు యతి చెల్లును,కావున ఇవి బిందు యతులు.,అయినాయి
తే.గీ
ఙ్ఞాన వేద్యాయ తప్త కాం"చ"న విభూష
ణాయ మేచక వర్ణ కం"ఠ" ప్రియాయ
నగధరాయ నమోస్తు సౌం"ద"ర్య విజిత
మనసి జాతాయ గోప డిం"భా"య యనఁగ
( ఙ్ఞా.,,,,ంచ )(ణా,,,,,,ంఠ) (న.,,,,, ంద)(.మ,,,,ంభా ) యతి చెల్లినది.,,,
4)తద్బవ వ్యాజ విశ్రమములు.,...
తత్+భవం--తత్బవం..సంస్కృతమునుండి వచ్చినది."ఙ"అనెడి కవర్గ పంచమాక్షరం సంస్కృతములో ఉన్న యెడల అది తెలుగులోకి వచ్చు నప్పటికి నకారముగా మారును.న,,,,ణ అనునవి యతి మైత్రి కలవి కావున ఇవి "ఙ" అక్షరముతో యతి చెల్లును.
విఙానము,,,,,,,,,,,విన్నాణము
విఙాపనము,,,,,,,,విన్నపము
యఙము........జన్నము
ఆఙప్తి...........ఆనతి
పైవాటి యందు పదమద్యమమున కల "ఙ" అనే అక్షరము న గామారినది,
సంఙ,,,,.సన్న
ఆఙ..,,,,ఆన
వాని యందు పదాంతములో ఉన్న "ఙ" అనే కవర్గ పంచమాక్షరము న కారముగా మారినది,
ఉదాహరణ ,,,,,,,
ఙాని చేతంబుజాత శోణకరయనగ
ఙాతి విద్వేషి నృపనాశక కరయనగ
"ఙా,,,,,ణ" "ఙా,,,న" యతి చెల్లినది,
5)విశేష వళులు.........
క ఖ గ ఘ అనే నాలుగు అక్షరాలకు" ఙ" అనెడి అక్షరంతో యతి చెల్లటం విషేషవళులు
ఉదాహరణకు ,,,,,
"ఙానికి నుపదేశ విధి ప్రకారము సేయున్"
ఙా,,,,,,,,,కా యతి చెల్లినది
ఇక్కడ "ఙ " అనే కవర్గ పంచమాక్షరానికి బిందు పూర్వకంకాని కవర్గములోని క ఖ గ ఘ అనెడి అక్షరాలుకూడా యతి చెల్లుట విశేషము కావున ఇది విశేషవళులు అయినది,
6)అనుస్వార సంబంధ యతులు.....
ంట ంఠ ండ ంఢ అనే "ట" వర్గ బిందు పూర్వాక్షరాలు ంత ంథ ంద ంధ అనే "త" వర్గ బిందు పూర్వకాక్షరాలతో యతి చెల్లటాన్ని అను స్వార సంబంధయతులు అంటాము అనుసారము అనగా బిందువు(నిండు సున్నా). ఉదాహరణ ,,,,
--------------------------చం
దాలంబడు నొకప్పుడుందరుగఁధింటం బాడియుంబంటమున్
ం"దా" అనెడి అక్షరానికి " ంట "అనెడి అక్షారానికి యతి చెల్లినది.కావున ఇది అనుస్వార సంబంధ యతి కుదాహరణగా నిలిచినది,,
7)అను నాసికాక్షరయతులు.,,,,,,,,,......
అను నాసికాక్షరాలైన ఙ ఞ ణ న మ,,,,లలోనుండి న.,ణ అనే అక్షరాలకు సంబందిచి వివరము తెలుపునది.
బిందు పూర్వకాలైన ంట ంఠ ండ ంఢ అనే టవర్గములోని నాలుగు అక్షరములు "న" అనే అక్షరముతోను.,,,బిందు పూర్వకాలైన ంత ంథ ంద ంధ అనే నాలుగు అక్షరములు "ణ" అనే అక్షరముతో యతి చెల్లటాన్ని అనునాసికాక్షరయతులు అందురు.
ఉదాహరణ ,,,,,,,,..
మనుసంతతి మండన భం
డన నిర్జిత కార్తవీర్య నరనాయక ఖం
డన పంక్తి సందన నం
దన చందన శక్రవారణల సత్కీర్తీ
పైన తెలిపిన ఉదాహరములో రెండవ పాదము లోని "ం డ" అనెడి బిందు పూర్వాక్షరము నకారముతోను ,నాల్గవ పాదములోని" ంద" అనెడి తవర్గములోని బిందు పూర్వాక్షరము ణ కారముతోను యతి చెల్లినది,
8)మువిభక్తియతి.,....,.,.,,.
డు,,,ము,,,,వు,,,లు,,ప్రదమా విభక్తి అని మనకు తెలుసు విటిలోని "ము" అనే విభక్తి అక్షరానికి "పు పూ ఫు ఫూ బు భూ పొ ఫో బొ భో" అనే అక్షరాలతో యతి చెల్లటాన్ని ము విభక్తి యతి అంటారు
ఉదాహరణ .,..,
"పు"ష్కరము సూక్ష్మమద్యమ"ము"గ ననొనర్చె
"పు"ల్లపంకేరుహము వక్ర"ము"గ నొనర్చె
"బొం"డుమల్లెలు దరహాస"ము"గ నొనర్చె
"భో"జన్నపనందనకు నిక్క"ము"గ నంజండు
పు పు బొ భో యనెడి నాలుగు పాదములలోని నాలుగు ప్రదమాక్షరాలకు యతిస్థానములోని ము అనెడి విభక్తి అక్షరానికి యతి చెల్లినది కావున ఇది ము విభక్తి యతిగా పేర్కొన బడినది.
9)ముకారయతి
విభక్తిగా వచ్చిన ముకారమునకే కాక స్వతః సిద్దముగాఉండెడి ముకారమునకు కూడ పు పూ ఫు ఫూ బు భూ పొ ఫో బొ భో లు యతి చెల్లటం ముకార యతి
ఉదాహరణ ,,,,,,,,
"ముందు మీరెరిగిన భూతళాదుశు "
"ముం" ......భూ.,..,లకు యతిచెల్లినది.
ముత్తెపు ఝల్లురల తోడి బుఱ్ఱట కొమ్మల్
పైన "ము"....కు "బు"తో యతి చెల్లినది,,,,కాని ము విభక్తి ము కాదు. ఇది ముకారము కావున ఇది ముకారయతి కి ఉదాహరణములైనవి..,
10)మవర్గవిరామము,..,,,,
పూర్వబిందువు తో(నిండు సున్న ముందున్న అక్షరాలు) కూడిన య ర ల శ ష స హ( ంయ ంర ంల ంశ ంష ంస ంహ )అనే అక్షరాలు మ కారముతో యతి చెల్లుటను మవర్గ యతి అందురు,
ఉదాహరణ ,,,
"మా"రుతాత్మజ డరిది స"ంయ"మి యనంగ
"మ"దన జనకుడు దనుజ స" ంహా"రుడనఁగ
"మ"---" ంయ" లకు.,,,,,,,,,,,"మ------ంహా "లకు యతి చెల్లినది,,కావున ఇది మవర్గ విరామము...
11)ఋజు యతులు,,..........
"అ " "య" "హ" ఇవి మూడును పరస్పరం యతి చెల్లటానినే ఋజుయతి అందురు,
ఉదాహరణ ...
"య"తులగు నపారశూర సం"హా"రయనగ
"హ"రముఖార్చిత పాదతో"య"జయనంగ
"య" కు " హ" తోను,........".హ " కు "య " తోను యతి చెల్లినది కావున ఋజుయతి అయినది,
12)ప్రత్యేకయతులు.........
సమాసమునందు (అది ,అవి) శబ్దములలోని అత్తునకు వృత్తిని లోపం బహుళముగా వచ్చుచున్నది.(వృత్తి అనగా సమాసము) సంధి జరిగినప్పుడు యడాగమము వచ్చు చున్నది అలా వచ్చిన యడాగమమునకు యతిచెల్లుటచే ఇవి ప్రత్యేకయతులైనాయి
ఉదాహరణ .,......
"అ"రయుశార్దంబు హరిచేతి"య"దియునాగ
"ది"వ్య చాపంబు శూలి చే"తి"ది యనంగ
మొదటి పాదం లో" అ "అనే మొదటి అక్షరానికి యతిస్థానములోని(చేతి+అది..చేతియది) "య" అనే అక్షరానికి యతి చెల్లినది,(చేతియది యడాగమము వచ్చిన రూపము) రెండవ పాదములో "ది" కి "తి" తోయతి చెల్లినది(సంధి జరిగిన రూపము).
13)భిన్నయతులు,.,,,,,,,,,,,,,,.
ధాతువులకు ఇంచుక్ అనే ఆగమం ఏర్పడినప్పుడు ధరించు, ధరియించు అనే రెండు రూపాలు ఏర్పడతాయి,అలా ఏర్పడినప్పుడు ధరియించులోని యికారానికి దాని మిత్రాక్షరాలతో అనగా ఇకార సవర్ణ అచ్చులతో యతి వేయడం భిన్నయతి అవుతుంది,అలాకాక "రి" అనే హల్లుకు యతి వేయటం పెఱయతి అవుతుంది.
ఉదాహరణ ........,,
"ఎ"దను లచ్చిని హరి ధరి"యి"ంచెననగ
"రి"పులనెల్లనుఁబోర హ"రి"ంచె ననగ
మొదటి పాదములో(ఎ,,,,,యి) యడాగమము వచ్చి భిన్నయతి అయినది.,,,రెండవ పాదమందు "రి" లమద్యన యతి చెల్లి పెఱయతి అయినది,
14)ఏకతరయతులు,..,,....,........
"ర" "ఱ" అనే అక్షరాలు తమలో తామే యతి చెల్లుతాయి,"ర"ని లఘు రేఫం అనియు "ఱ"ని(బండిరా) అలఘురేఫమనియు అందురు.
ఉదాహరణ .,,,,,,.,.
"రా"రబాలకృష్ణ "ర"చ్చలగమిగూడి
"ఱా"గయనుచు నిన్ను "ఱ"వ్వబెట్ట
ర,.... ర లకు ఱ .,...ఱ లకు మాత్రమే యతి చెల్లినది. కావున ఏకతరయతులైనవి.
15)అభేధయతులు,,,,,,,..........
వకారానికి బకారముతోను......లకారానికి ళ తోను,,,ల డ లు పరస్పరం యతి చెల్లటాన్ని అభేద యతి అంటారు.
ఉదాహరణ .,,,,,.,......
"వ"సుమతీ కళత్ర "బ"కజైత్ర గానక
"లా"లసత్కలాప"డం"బగోప
"ల"లిత దేహ పింగ"ళ"పుర దక్షిణ గేహ
యనన భేద విరతులప్రమేయ
పై ఉదాహరము నందు వ కు బ తోను,,,,ల కు ళ తోను,,,,,లా కు డా తోను యతి చెల్లినది.
16)అభేదవర్గయతులు,,,,,........
వ,,,,, బ లకు పరస్పరం యతి చెల్లటమే కాక ప వర్గ అక్షరాలైన ప ఫ బ భ లకు కూడ యతి మైత్రి చెల్లటం అభేదవర్గ యతి,
ఉదాహరణ ......
"పా"రతోపోయుక్తులైన "వా"రికి బడయన్
ప .... వ లకు యతి చెల్లినది ,
17)ఊష్మవిశ్రాంతులు,.,,,,,,,,,,,,
శ ష స హ అనెడి నాలుగు అక్షరములు ఊష్మములు కాని "హ" వీటిలో కలవదు. మిగిన శ ష స అనే 3అక్షరాలు ఒక దానితో ఒకటి యతి చెల్లును. కావున దీనిని "ఊష్మ విశ్రాతులు" అంటారు,
ఉదాహరణ ,,,,,,
"శ"తమఖోపల భూపాను "షం"గ యనగ
"ష"డ్జయుత వేణునాద ప్ర"సం"గ యనగ
పైన శ,,,ష లకు, ష,,,స..లకు యతి చెల్లినది,
18) సరసవళులు............
అ-య-హ ఒకదానితో ఒకటి,,,,,
శ-ష-స లకు చ-ఛ-జ-ఝ లతోను
న,,.,.ణ లు ఒకదానితో ఓకటి యతి చెల్లటాన్ని సరస వళి అంటారు.
ఉదాహరణ ,,,,,
"ణనలు చెల్లుకమల"నా"భయొండొంటికి
"అ"యహలమరియుండు "హ"స్తి వరద
"శ"షసలొందునండ్రు "చ"ఛజఝంబులతోడ
"స"రస యతులనంగ "జ"లదిశయన
పై ఉదాహరణము పరిశీలించినచో,,,,ణ -అ -శ- స అనే నాలుగు పాదములలోని మొదటి అక్షరాలకు నాలుగు పాదములలోను యతిస్థానములలోగల నా -హ -చ -జ అనెడి నాలుగు అక్షరములతో యతి చెల్లి సరస యతి అయినది,,.
19..సంయుక్త విశ్రామము
సంయుక్తాక్షరం యతి స్థానములో ఉన్న యెడల ఆ సంయుక్తాక్షరం లోని ఏ అక్షరానికి అయిన యతి వేయటమే సంయుక్త విశ్రామము.,,
ఉదా,,,,,,,,,
"క్ష్మానాయక నీవు నన్నుగైకొని"
క్ష్మా అనే సంయుక్తాక్షరం లో క ష మ లున్నవి ఈ మూటిలో దేనికో ఒక దానికీ అదే అక్షరం కాని వాటి మిత్రాక్షరములకు గాని యతి చెల్ల వలెను.
క అనేదానికి దాని మిత్రాక్షరమైన గై తో యతి చెల్లినది,
20.బహుయతినియతి
స్రగ్దరాది(రగడలు మొదలైనవి )పాదాలలో ఒకటికన్నా ఎక్కువ చోట్ల యతి ని నిలుపవలసి వస్తుంది. అప్పుడు సంయుక్తాక్షరం లోని ఏ అక్షరం తో యతి ప్రారంభం చేస్తామో మిగిలిన అన్ని చోట్ల అదే అక్షరంగాని దాని మిత్రాక్షరములుగాని యతిగా వాడవలెను వేరొక అక్షరం వాడరాదు.
ఉదా,,
క్ష్మాపుత్రికాలోల "క"మనీయ గుణ జాల "ఘ"ననీలయని చెప్ప"గా" బహు విరతులొప్పు(ఈ పద్యపాదము విజయభద్ర రగడ పద్యపాదము కావున ఇందు మూడుచోట్ల యతి మైత్రి వేయబడినది
పై పాదము గమనించినచో,,,,క్ష్మా లోని క ష మ లలోని క ని యతిమైత్రి గా గైకొని,, ,,,క ,,,,,ఘ.,,,,గా అనే వర్గజ యతి వేయ బడినది. గమనించినచో ఘ..,గా లు క కు మిత్రాక్షరములు. ( ఒకవేళ మొదటిగా క్ష్మా లోని షకారమును గైకొనియున్నచో షకారముయొక్క మిత్రాక్షరములనే రెండు మూడు స్థానములలో కూడా వాడవలసి ఉండెడిది అటులనే మకారమైననూ.)
III,,,,,ఉభయ వళులు.,
ఇక్కడ "ఉభయ" అనే పదానికి రెండు అని అర్థం ,,మనము యతులను గురించి తెలుసు కొనుట ప్రారంభం చేసినపుడు,
స్వరయతులు,,,కేవలం అచ్చులకు సంభందించిన యతులని
వ్యంజనయతులు,.,,కేవలం హల్లులకు సంబంధించిన యతులని తెలుసు కున్నాము. ఇప్పుడు అచ్చులకు హల్లులకు యతులు చెల్లించే పద్దతి చూద్దాము,,ఇలాంటి యతులనే ఉభయవళులు అంటారు ఇవి,,12 రకాలు.,
1.యుష్మదస్మఛ్ఛబ్దయతి
2.పరరూపయతి
3.ప్రాది యతి
4.నిత్య సమాస విశ్రాంతి
5.దేశ్యనిత్యసమాసయతి
6.నిత్యయతి
7.రాగమసంధివళి
8.విభాగవళి
9.నామాఖండమిశ్రమం
10.పంచమీ విభక్తి విరామము
11.కాకుస్వరవళి
12.ప్లుతయుగ విశ్రామము,
1.యుష్మదస్మచ్ఛబ్దయతి,,,,,,
యుష్మద్,,,అస్మద్ మొ; శబ్దాలకు అచ్చుపరమై సంధి జరిగినచో ఆ సంధి అక్షరములోనని అచ్చుకు లేదా హల్లుకు గాని యతివేయటం యుష్మదస్మచ్ఛబ్దయతి .యుష్మత్+ఆననం**యుష్మదాననం
అస్మత్+ ఆఙ్ఞ**అస్మదాఙ్ఞ,
పై రెండింటి యందును దా అనే హల్లు నకు గాని విడదిసినపుడుండే అచ్చుకు గాని యతి వేయవచ్చు,
2...పర రూప విరతులు.,....
శకందు మొదలైన శబ్దాలకు పరరూపసంధి జరుగుతుంది ,,అలాంటివి యతిస్థానంలో వచ్చినపుడు ఉబయ యతి చెల్లును అనగా అచ్చుకు లేదా హల్లుకు యతి చెల్లును
శక+అందుః******శకందుః
సీమ+అంతం*****సీమంతః
వేద+అండ******వేదండ
మార్త+అండ*****మార్తండ
సార+అంగః*****సారంగః
మనస్+ఈషా****మనీషా
పైన చూసినచో,,,సవర్ణధీర్ఘ,గుణ సంధులు పోగొట్టబడి పరరూపసంధి జరిగింది ఇలా జరిగిన చో అచ్చుకు లేదా హల్లుకు యతి వేయవచ్చు,,
" .,,,,,,,,,,,,,,,,.,,.........,,,,,,,,,,,వే
దండ దండవిదారి ఘోరతరాసి భాసిభూజార్గళా"
వేద+అండ..వేదండ... ద"కారము లోని అకారానికి తరాసి(తర+అసి)లోని రకారము మీది అకారానికి యతి చెల్లినది,,,,,
3.ప్రాది యతులు.,,,,,,
ప్ర మొదలైన ఉపసర్గలకు అచ్చు పరమై సంధి జరిగితే అప్పుడచ్చుతోగాని హల్లుతోగాని యతి చెల్లడం ప్రాది యతి అవుతుంది,
ప్రాదులు,,,,ప్ర ,,,,,,ప్రతి,,పరి,,,అతి,,,అధి,,అభి.,అవ,,,అను.,ఉప,,,సమ్,,సు,,,అప,,,ని,,,వి,,,దుర్,,,ఉత్,,, ఇవి ప్రాదులనబడే ఉపసర్గలు,,
ప్రాణ బాంధవుడైన యప్పక్షి విభుడు ""
పై ఉదాహరణ లో ప+అన* ప్రాణ లోని ప కు పక్షిలోని ప కు యతి వేయబడింది
"ప్రాణ సంకటమైన పుణ్యాంగనలకు ""
ప్ర+అణ,,,ప్రాణ లోని అ కు పుణ్య+అంగన లోని అకు యతి వేయబడి ప్రాదియతి అయినది
4.నిత్యసమాస విశ్రాతులు,.,,,
నిత్యసమాసాలలో రెండు శబ్దాలకు సంధి జరిగినా ఆశబ్దాలు వేరు వేరుగా కాక ఒకే శబ్దంలా ఉంటాయి ఆ సందర్భంలో ఆ సంధి అక్షరానికి కి ఉభయ యతి చెల్లును.
కర్ణ+అట**కర్ణాట,.,,,,,,,న+అస్తి*నాస్తి.,,,,వన+ఓక*ఓనౌక,,,, పద+అర్ద*పదార్ద,,,,,,,ద్వి+ఈప*ద్వీప,,,,,,,,,,,అన్య+అన్య*అన్యోన్య.....జన+ అర్దన* జనార్దన,,,న+ఆక*నాక
పై శబ్దాలలో సంధి జరుగగా అచ్చుకు లేదా హల్లు కు యతి చెల్లటం నిత్యసమాస విశ్రాంతి లేదా అఖండ యతి అంటారు,
5.దేశ్యనిత్యసమాస విశ్రాతులు,,,,
దేశ్యమనగా కేవలం తెలుగు పదాలు.,,
రూప+అఱ**రూపఱ,,,,పెంపు+అఱ**పెంపఱ......పెల్లు+అఱ***పెల్లఱ.,,ఏపు+అఱచుట***ఏపఱచుట,,,,,,క్రిక్కు+ఇఱియుట**క్రిక్కిఱియుట
ఇలా విడదీయబడతాయి,,,,,ఇలా విడదీసినప్పుడు వచ్చిన హల్లు తోగాని అచ్చు తోగాని ఉభయ యతి చెల్లుట దేశ్యనిత్యసమాసవిశ్రాంతి.,,
6.నిత్యయతులు......
"ఏని " అనే పదము రెండవ పదముగా ఉండి పూర్వ పదముతో సంధి జరుగుతూ ఉన్నయెడల అక్కడ అచ్చుతో గాని హల్లుతో గాని ఉభయ యతి చెల్లటం నిత్య యతి
"ఎట్టి మహా కౄర కర్ముడేనియుఁదుదకు
నెట్టన హరితలపుగలిగెనేని మహాత్మా "
మొదటి పాదంలో ఎ కి (కర్ముడు+ఏని) ఏ తో స్వర యతి
రెండవ పాదములో,,,నె కి (కలిగెను+ఏని) నే అనే హల్లు తో వ్యంజన యతి చెల్లింది,,
7.రాగమసంధి వళులు,,,,,
కర్మదారాయ సమాసంలో ఆలు శబ్దం పరమైతే వచ్చే"రు""గామమానికి అచ్చుతో హల్లుతో యతి వేయడం,,,రాగమ సంధి వళి,,(రు+ఆగమం*రాగమం)
"అతని జవరాలు బాలెంతరాలు ముద్ద
రాలు ధర్మాత్ము పాలనరాక్షసారి"
మొదటి పాదం మొదటి అక్షరం అ కు (బాలెంత+ఆలు**బాలెంత+రు+ఆలు**బాలెంతరాలు) రా అనే ఆగమ హల్లు లోని అ అనే అచ్చుతోను యతి చెల్లినది.
రెండవ పాదం(ముద్ద+ఆలు) మొదటి అక్షరం రా అనే హల్లుకు యతిస్థానములోని రా అనే హల్లుతో వ్యంజన యతి కుదిరి రాగమ సంధి వళి అయినది.
8.విభాగ వళులు..,,,
తెలుగులో సంఖ్యావాచకాలకు,పరిమాణాన్ని తెలిపే దోసెడు మోపెడు,,,,,విభాగార్ధాన్ని తెలిపే ఏసి, ఏడు అనే ప్రత్యాయాలు చేరినప్పుడు అచ్చుకు.,,హల్లు కు ఉభయ యతి చెల్లుతుంది,,,
"కృష్ణుడిచ్చె నాలుగేసి చీరలు కూర్మి
నింతులకును నాలుగేసి మణులు
ఠీవితోడ దోసిడేసి మాడలుకడు
నింపెసంగ గంపెడేసి సొమ్ము""
పై ఉదాహరణ మనం అరిశీలించినచో
1..."కృ",,,(నాలుగు+ఏసి** నాలుగేసి)"గే" వ్యంజన యతి
2.....నిలోని" ఇ" అనే అచ్చుకు (నాలుగు+ఏసి**నాలుగేసి)గే లోని "ఏ " అనే అచ్చుతో స్వరయతి
3....."ఠీ" అనే హల్లు కు,,(దోసెడు+ఏసి**దోసెడేసి)"డే" అనే హల్లుకు వ్యంజన యతి,,
4......నిలోని "ఇ" అనే అచ్చుకు,,(గంపెడు+ఏసి**గంపెడేసి) డేలోని" ఏ" తో స్వర యతి చెల్లినది,,
9.నామాఖండ విశ్రమములు
ప్రాతిపదిక అంటె నామం,,,,,నామం అంటే పేరు నామం చివర అప్ప, అయ్య, అన్న, అవ్వ, అమ్మ. ఆయి,,మొదలైనవి చివర చేరి నిత్యసంధిని పొందుతున్నాయి .,అప్పుడు అచ్చుతోను హల్లుతోను యతి చెల్లటాన్ని నామా కండవిశ్రమము అంటారు.,,
వెంక+అప్ప--వెంకప్ప.....రామ+అయ్య--రామయ్య.,,,తిమ్మ+అన్న--తిమ్మన్న.,,,ముత్త+అవ్వ--ముత్తవ్వ,,,,,రామ+అక్క--రామక్క.,,,సిత+ఆయి--సీతాయి.,,,,,,ఇలాంటి సంధులలో.,,,అచ్చులకు హల్లులకు యతి చెల్లటాన్ని నామఖండ విశ్రమములు అందురు.,,,
10.పంచమీ విభక్తివిరామము.,,,
కన్నన్.,,కంటెన్.,,అనే పంచమీ విభక్తి ప్రత్యయాలు పేర్లకు తరువాత చేరితే అవి రెండు కలసిపోయి సంధిగా ఏర్పడే అచ్చుకు హల్లుకు ఉభయ యతి చెల్లటం పంచమీ విభక్తి విరామము.,
""నిన్నుఁజెఱగొన్న హైహము
కన్నన్ దోర్వీర్య మొక్కుడగు భార్గవులీ
లన్నిర్జించిన రాముని
కన్నను శూరుండు ముజ్జగంబులఁగలడే""
(హైహయుకు+అన్నన్**హైహయుకన్నన్.,) కన్నన్ లోని క నందుగల అకారానికి.,,(ఏక్కడు+అగు**మొక్కుడగు) డలోని అకార రూప అచ్చుకు,,
(రామునికి+అన్నన్**రామునికన్నన్) కన్నన్ పంచమీ విభక్తి లోని" క" కు " గ" కు వ్యంజన యతి చెల్లినది,,,,,,,
11.కాకు స్వర వళి...,
శోక భయాదులచే కలుగు వికారాన్ని కాకువు అంటారు.ఈ కాకుస్వర ధీర్ఘానికి ప్లూతోచ్చారణ ఉంటుంది,మూడుమాత్రలుగల ఉచ్చారణ ప్లూతం అనబడుతుంది.
భీతి(భయం)శోక(ఏడుపు)తర్క(వాదన)గీత(పాట)దూరాహ్వానం(దూరంగా ఉన్నవారిని పిలిచేటప్పుడు) సంశయార్ధాలు(అనుమానం ఉన్న చోట) ఉండే స్వరానికి ప్లుతం అనే పేరు పెట్ట వచ్చు.,
నామశోభితగోప కృష్ణా !యనంగ
నమరవందిత గోప కృష్ణా !యనంగ
గోపకృష్ణా అనేది సంభోదన.,,,సంభోదనలో ప్లుత స్వరం వినిపిస్తుంది ,,,
నా అనే హల్లుకు కృష్ణా,,,,లోని ణ కు యతి చెల్లినది.,
12...ప్లుతయుగ విశ్రామము.,,,
హల్లు అక్షరములకు యతి మైత్రి లేక పోయినా పాదము మొదటి లోను యతిస్థానమునందున రెండును ప్లుత స్వరముతో ఉన్నహల్లులైనచో ప్లుతం సామ్యము వలనపరస్పరం యతి చెల్లటాన్ని ప్లుతయుగ విశ్రామం అందురు.
,,,,,,,,,,,................,...........నీ
వేగతి కావవే రఘుపతీ శరణాగత వజ్రపంజరా!
నీవు+ఏ*నీవే..,వే లో ఉన్న ఏ అనే ప్లుత స్వరముకు,,,రఘుపతీ లోని తీ.లోని ఈ,,,,అనే ప్లుత స్వరముకూ యతి కుదిరినది (రెండు ప్లుతాలకు)కావున ప్లుత యుగవిశ్రామాము అయినది,,,
ప్రాసయతి
యతి ప్రాసలతో పాటు ప్రాసయతి అని మరొకటి ఉన్నది. ఏదేని పద్య పాదములో ఉన్న మొదటిదైన యతి అక్షరమును గాని దాని మిత్రాక్షరమును గాని తిరిగి యతిస్థానంలో యతిమైత్రిగా వ్రాయటానికి అవకాశం లేనప్పుడు ప్రాసగా రెండవ స్థానంలో ఉన్న ప్రాసాక్షరాన్ని తిరిగి యతిస్థానానికి ప్రక్కన వ్రాయటాన్ని ప్రాసయతి అటారు. ఈ ప్రాసాయతికి ఖచ్చితంగా మనం గుర్తుంచుకో వలసిన నియమం ఒకటి ఉన్నది, ప్రతి పాదానికి మొదటి అక్షరం యతి అని రెండవ అక్షరం ప్రాస అని మనకు తెలుసు కదా అయితె ప్రాసకు ముందున్న అక్షరం హ్రస్వం అయితే ప్రాసయతికి ముందున్న స్థానంలో కూడ హ్రస్వమేవాడాలి. ప్రాసకు ముందున్న అక్షరం దీర్ఘం అయితే ప్రాసయతికి ముందున్న స్థానంలో కూడ దీర్ఘం మాత్రమే వాడాలి. అంతే కాని ప్రాస పూర్వాక్షారం హ్రస్వంగాను ప్రాసయతి పూర్వాక్షరం దీర్ఘం గాను ఉండ కూడదు. ఈడు- జోడు...... ఆట - పాట ఇలాగే ఉండాలి. అంతేకాని ప్రాస పూర్వాక్షరం దీర్ఘంగాను ప్రాసయతి లోపూర్వాక్షారం హ్రస్వంగాను ఉండరాదు .
"బోటి" యెకటి పెండ్లి "పాట" పాడగఁ జొచ్చె
"నాప" రాని విరహ "తాప" మునను"
పై ఉదాహరణ మనం గమనించిన యెడల రెండు పాదాల లోను 5 గణములు కలవు,మొదటి పాదం లోని మొదటి అక్షరం అయిన "బో" యతి అక్షరం దీనికి యతిస్థానం 4 వ గణము లోని మొదటి అక్షరం బు....బూ..బొ బో భూ భూ భొ భో పొ పో పు పూ ము మూ మొ మో.,వంటి అక్షారాలు ఉండాలి. అలా కుదర నప్పుడు పద్యం తప్పు అవుతుంది. ఆ పరిస్తితి వచ్చినప్పుడు ప్రాసాక్షరం అని పిలవ బడే రెండవ అక్షరమును యతి స్థానం ప్రక్కన నిలుపుతాము. దీనినే ప్రాస యతి అంటాము. "బోటి-పాట" మొదటి పాదము లోను" నాప-తాప " రెండవ పాదము లోను వచ్చి ప్రాసయతి కుదిరింది.
ఆ.వె
దేవకీ కుమార గోవర్ధనోద్ధార
తోయజాక్ష పాండవేయ పక్ష
ఘనవినీలగాత్ర మునిజన స్తుతి పాత్ర
యదు కులాబ్ది సోమ కదనభీమ
1 వ పాదం గమనించినచో దేవ-గోవ
2 వ పాదం గమనించినచో తోయ-వేయ
3 వ పాదం గమనించినచో ఘన-ముని
4 వ పాదం గమనించినచో యదు-కద
ఇలా ప్రాసయతి వాడ బడింది 1-2 పాదాలలో ప్రాస పూర్వాక్షరం యతిస్థానములో పున్న ప్రాసయతి పూర్వాక్షరం ధీర్ఘాలు గా వున్నాయి. 3-4 పాదాలలోని ప్రాస పూర్వాక్షరాలు, యతిస్థానాక్షరాలు కూడా హ్రస్వాలుగా ఉన్నాయి గమనించండి.
అయితే ఒకోసారి కవులు చమత్కారం చూపుతారు ఎలా అంటే యతికి యతిమైత్రి కలుపుతూనే చాకచక్యంగా ప్రాసయతి కూడ వేస్తారు.
తే.గీ
పెళ్ళి కళ వచ్చెనంచుఁబందిళ్ళువేసి
బాసికముగట్టి నునుపైన గాసె కట్టి
పాదకమలాల కింపులు పాదుకొనగ
రాణి కాళ్ళకు నిడిరి పారాణి నపుడు!
పైన ఉదాహరణలో,,
1వ పాదం గమనించినచో పెళ్ళి-దిళ్ళు
2వ పాదం గమనించినచో బాసి- కాసె
3వ పాదం గమనించినచో పాద-పాదు
4వ పాదం గమనించినచో రాణి-రాణి
ప్రాస యతి వేయ బడింది,
అయితే 3-4...పాదాలు యతి మైత్రి కుదిరింది అయిననూ ప్రాసయతి కూడా వేయబడింది గమనించండి.
ప్రాసయతి వాడునప్పుడు ఈ క్రింది నియమములు తప్పక ళపాటించాలి.
1.ప్రాస పూర్వాక్షరం దీర్ఘమైతే ప్రాసయతికి ముందున్న యతిస్థానాక్షరం దీర్ఘమే కావాలి అలాగే హ్రస్వమైతే హ్రస్వమే కావాలి.
2.ప్రాస పూర్వాక్షరం గురువైతే ప్రాసయతికి ముందున్న యతిస్థానాక్షరం గురువే కావాలి, అలాగే లఘువైతే లఘువే కావాలి.
3.ప్రాసాక్షరము ద్విత్వాక్షరంగాని,సంయుక్తాక్షరంగాని, బిందు పూర్వకంగాని, విసర్గపూర్వకం గాని అయితే ప్రాసయతిగా వాడే యతిస్థానాక్షరం తరువాత వేసే ప్రాసయతక్షరం కూడా అలాగే ఉండాలి.
4.ప్రాసయతిలో ప్రాసాక్షరంలోని హల్లు సామ్యమేకాని అచ్చు సామ్యం పాటించ బడదు.
ఈ విధముగా ప్రాసయతి నియమములననుసరించి పద్య రచన చేయవలెను. అయితే ఈ ప్రాసయతి అన్ని పద్యరీతులలోనూ చెల్లుబాటు కాదు. ఆటవెలది, తేటగీతి, సీసము మొదలగు పద్యములలోనే ప్రాసయతి చెల్లుతుంది. కందము వంటి జాతులలోను, ఉత్పల మాల,చంపకమాల, శార్ధూల,మత్తేభ విక్రీడితములు, మత్తకోకిల తరళము మున్నగు వృత్తపద్యములలో ప్రాసయతి చెల్లుబాటుకాదు.
ప్రాస
పద్యానికి సహజంగా 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదములోని రెండవ అక్షరాన్ని ప్రాస అంటారు. పాదంలోని మొదటి అక్షరం యతి అయితే దాని ప్రక్కనే ఉన్న రెండవ అక్షరం ప్రాస అవుతుంది. ఇది ప్రతి పాదంలోను తప్పనిసరిగా కొన్ని పద్యాలలో ఉంటుంది. ఈ ప్రాసాక్షరం ఒకే రూపంలో ఉండాలి. అంటే ఒకే అచ్చుతో కలసి ఉండాలి అనే నియమం లేదు. ఒక హల్లు ఏ అచ్చు తోనైనా కలసి వ్రాయబడ వచ్చు. ఉదాహరణకు మొదటి పాదంలో "త" అనే అక్షరం ప్రాసాక్షరముగా వస్తే 2..3..4..పాదాలలో,త..తా.,తి,,తీ.....తృ..,తౄ,,తు ...తూ..తె.తే....తొ..తో....తై...తౌ..తం.అనే అక్షారాలు రావచ్చు ,అంటే ఒక హల్లు ఏ అచ్చుతో అయిన కూడుకొని ఉండవచ్చు.
ఉదాహరణము,,,,
"అత్తరి విట నాగరికులుచి
త్తమున వసంతకేళి చిగురొత్తంగా
మొత్తములు గట్టి తెచ్చిరి
ముత్తెపు ఝల్లురులతోడి బుఱ్రట కొమ్ముల్"
పై పద్యాన్ని గమంచినచో ప్రతి పాదములోని రెండవ అక్షారాలు "త్త,,,,త్త....త్త,,,,త్తె " అనునవి ప్రాసాక్షరములుగా మనకు గోచరిస్తాయి.అంటే త అనే హల్లు ఏ అచ్చుతోనైన కలసి ప్రాసాక్షరంగా మిగిలిన మూడు పాదాలలో వ్రాయ వచ్చునన్న మాట. ప్రాసమునకు ప్రా అని కూడ మరొక పేరు కలదు,దీనికి బహువచన రూపం..,,,ప్రాలు,,,
ప్రాస పూర్వాక్షర రూపాలు..(ప్రాస సాదారణ నియమాలు)
1.మొదటి పాదం ప్రాస పూర్వాక్షరం గురువైతే మిగిన అన్నిపాదాల మొదటక్షరం గురువే ఉండాలి లఘువైతే లఘువే ఉండాలి.
2.ప్రాసాక్షరమునకు ముందు అర్ధ బిందువున్నా(అరసున్నా)లేదా పూర్ణ బిఁదువున్నా (సున్నా) మిగిలిన అన్ని పాదాలలొను అలాగే ఉండాలి. ఖండాఖండ ప్రాసం దీనికి విశేష నియమం.
3.ప్రాసాక్షరమునకు ముందు విసర్గ ఉన్నచో మిగిలిన అన్ని పాదాలలొను అలాగే విసర్గ ఉండాలి.
4.ప్రాస పూర్వాక్షరం ధీర్ఘమైతే మిగిలినవి ధీర్ఘం ఉండాలనేది నిజమే కాని అక్కడ గురువు అక్షరం తప్పకుండా ఉండాలి అంటే ప్రాసాక్షరం సంయుక్తాక్షరం లేదా ద్విత్వాక్షరం అయి ఉండాలి ,అలాకానిచో ప్రాస పూర్వాక్షరం ధీర్ఘం అయితే ధీర్ఘం హ్రస్వం అయితే హ్రస్వం తప్పనిసరిగా ఉండాలి.
కం//
అక్షిగతుడు విజయుడట ని
రీక్షణ సేయక నతండు రివ్వున నపుడే
రక్షణ నొసంగ సైన్యము
తీక్షణ యుద్దము జరుపగ తేరును దిప్పెన్ !
పై పద్యము గమనించినచో " క్ష" అనే సంయుక్తాక్షరము ప్రాసాక్షరముగా గైకొనబడినది. కాని 1---3 పాదములలో ప్రాస పూర్వాక్షరయులైన అ-ర లు జన్మతః లఘువులు కానిసంయుక్తాక్షరమునకు ముందున్నందున గురువులైనాయి.
2--4 పాదములలోని ప్రాస పూర్వాక్షరములైన రీ-తీ లు దీర్ఘాక్షరములు అయినందున జన్మతః గురువులు. సంయుక్తాక్షరమునకు ముందున్నందున కూడా గురువులైనాయి. వెరసి నాలుగు పాదములందున ప్రాస పూర్వాక్షర నియతి గురువులుగా పాటించ బడినది. ఈ వ్యత్యాసమునుకూడా గమనించ వలసినదిగా కోరుచున్నాను.
5.ప్రాసాక్షరం హల్లు ప్రధానంగా కలది కాని అచ్చు ప్రధానంగా కలది కాదు,
6.ఋ అనేది అచ్చు ఇది వత్తులలో వ్రాసే సమయంలో దీని రూపం వట్రువ అంటాము. ప్రాసలో ఇది కూడిన హల్లు(కృ,,,మృ,,,గృ ,,తృ.,,నృ) ఉన్నపుడు అక్కడ మరొక అచ్చు ఉండ వచ్చు.
7.హల్లు ప్రధానమైన ప్రాసలో స్వరసంధి వచ్చినప్పటికీ హల్లే ప్రధానంగా ఉండాలి. ఉభయ యతులలాగా అచ్చు హల్లుల ప్రాసములు కూడదు.
కం//
ఆనలు నెట్టిన నిలువక
తానూరకయలిగి యాసుదంతను జేరెన్
దానవ సంహరుడే క్రియ
చేనిక జనుదెంచునాకు జెప్పవెయనంగన్
1--3..పాదాలలొ సహజ సిద్దమైన నకారము
2--4 పాదాలలో సంధి జరిగిన నకారముతో ప్రాస వేయబడింది
ప్రాస నియమాలిలా ఉన్నప్పటికి అప్పకవిచే ఇంకా 17 ప్రాస బేదాలు చెప్పబడినవి.అవి చూద్దాము
ప్రాస బేదాలు,,,,,
1.అర్దబిందుసమప్రాసము,,
2.పూర్ణబిందుసమప్రాసము,,,
3ఖండాఖండప్రాసము,,
4.సంయుతాక్షర ప్రాసము,,
5.సంయుతాసంయుత ప్రాసము,,,
6.రేఫయుత ప్రాసము,,
7.లఘుద్విత్వ ప్రాసము,,
8.వికల్ప ప్రాసము.,,,
9.ఉభయ ప్రాసము,,,
10.అనునాసిక ప్రాసము,,,
11.ప్రాస మైత్రి ప్రాసము,,,
12.ప్రాసవైరము,,,
13.స్వవర్గజ ప్రాసము,,,,
14.ఋ ప్రాసము,,,,
15.లఘుయకార ప్రాసము,,,
16.అభేద ప్రాసము,,,
17.సంధిగత ప్రాసము,,,
ఈ 17.ప్రాసభేదాలు అప్పకవిచే అప్పకవీయములో చూచించ బడినాయి. వాటి వివరణ పరిశీలిద్దాం...
1.అర్ధబిందు సమ ప్రాసము.,,,,,
పద్యం మొదటి పాదములో ప్రాసాక్షరమునకు పూర్వము అరసున్నా ఉన్నచో అన్ని పాదాలలో అరసున్నా రావాలి.
"వీఁక పంక్తిముఖుని దాఁకి కోసల వల్ల
భుఁడు బలాసురాంత కుఁడు సెలంగ"
ప్రాస...ప్రాసయతి అక్షరములకు ముందు అర సున్నా గమనించ గలరు.....
2.పూర్ణ బిందు(సమ)ప్రాసము
పద్య మొదటి పాదములో ప్రాసాక్షరం ముందు బిందువు(నిండు సున్నా) ఉన్నచో మిగిలిన అన్ని పాదాలలో అలాగే ఉండాలి .
పొందింపవలయు నెల్లడ
బృందావనచారి పూర్ణబిందు ప్రాసం
బిందీవరాక్షి భీష్మక
నందనఁ జేకొనియెషనంద నందనుడనగన్
అన్ని పాదాలలోను ద కారము ప్రాసాక్షరంగా గైకొని పూర్వాక్షరం బిందుపూర్వకమూ, హ్రస్వాక్షరమై, బిందువుతో కలిసి గురువు లైనాయి కావున సమబిందు ప్రాసమైనది,
3.ఖండాఖండప్రాసము,,,,,
పద్యపాదములోని మొదటి అక్షరం దీర్ఘమైంయుడి అరసున్నాతో కూడి ఉన్నప్పుడు ,,,క చ ట త ప అనే ఫరుషాక్షారాలలో దేనినైనా ప్రాసాక్షరముగా ఎంచుకున్నచో అరసున్నా లేని క చ ట త ప లనుకూడా ప్రాసాక్షరముగా వేయ వచ్చు,,,,(అర్ధ బిందు సమ ప్రాసకు ఇది వ్యతిరేకము)
కం//
వీఁకఁబఱతెంచి నల్లడ
దాఁకిన గడునలిగి ఘోర తర శరశరహతి న
మ్మూకలువిరియగ నర్జనుఁ
డాఁకరమున నేసె నుగ్రుడైరణ భూమిన్
3.వ పాదములో అరసున్నా లేని ప్రాస పూర్వాక్షరాలు దీర్ఘాలై ఉన్నవి (క కారము ప్రాసాక్షరముగా వాడ బడినది )మిగిలినవి మూడు పాదాలలొను అరసున్నాతో కూడిన దీర్ఘాక్షరాలు కలవు,.,,గమనించ గలరు.,,
4.సంయుక్తాక్షర ప్రాసము,,,,,,
ప్రాస స్థానములోని హల్లులు ఏ క్రమంగా ఉన్నాయో అన్ని పాదాలలోను అలానే ఉంటే అది సంయుక్తాక్షర ప్రాస అవుతుంది,,,,,
పాళ్ళు మనుజులెక్క నూళ్ళుగాదొడగెన
య్యూళ్ళు మిగుల బలిసె ఁబ్రోళ్ళు గాగ
మొదటి పాదములో "పాళ్ళు.,,ఊళ్ళ"
రెండవ పాదములో "ఊళ్ళు.,,ప్రోళ్ళు" అని ళ కార ద్విత్వము,ప్రాసగా(ప్రాస యతిగా)వాడబడినది.,,
5..సంయుతాసంయుత ప్రాసము,,,,,
ర.,ల ,,అనే అక్షరాలు వత్తులు కూడిన అక్షరాలు,,,అలాగే వత్తులు కూడని అక్షరాలు ప్రాసగా వాడినచో అది సంయుతాసంయుత ప్రాసము అవుతుంది,,,ర.,,,ల,,,,అన్నే అక్షారాలు"కర్ర,,,,కర.,,,చర్ల చర" అనే రీతిగా సంయుక్తాక్షరాలు గా చేరితే అవి సంయుతాలు అలా చేరకున్నచో అసంయుతాలు.,,,
ఉదా.,
శ్రీ కర చక్రాంకితులగు
లోకులు శుద్దులును బుణ్యులును నగుదురునా
రీక్రియలు లేక యుండిన
ప్రాకృతులనఁబతితులనగ బడుదురు జగతిన్
3 వ పాదం రేఫ సంయుతం 1,2,4 రేఫ సంయుతాలుకావు
పాఁడిఁ ద్రచ్చగ నిమ్ము నా తండ్రి కృష్ణ
వేడుకొనియద నందాకఁ బండ్లు దినుము
దుండగపు చేష్టలులును నోటి గాండ్ర తనము
మెండుగా జొచ్చె నీకు నై దేండ్ల కనఁగ
1 వ పాదము..పాఁడి,,,,తండ్రి
2 వ పాదము వేడు,,,బండ్లు,, ఈ రెండు ఖండాకండ ప్రాసకు సంయుతాసంయుత ప్రాసకు కూడా ఉదాహరణగా నిలచినవి.
3 వ పాదము దుండు,,,గాండ్రు,,,4వ పాదము.మెండు,,దేండ్లు
ఈ విధముగా సంయుతాసంయుత ప్రాసము(ప్రాస యతి) గా వాడబడినది.
6..రేఫయుత ప్రాసము,,,,
వట్రుసుడితో కూడిన హల్లులు (కృ,,,గృ,,,తృ,,పృ మృ)రేఫముతో కూడిన హల్లులు( క్రుమ్మురు ..క్రూరము,,,మొ) ఇవి సమానమైనఉచ్చారణ కలిగి ఉన్నవి,,ఉచ్చారణాలో సామ్యమున్నప్పటికి వ్రాయుటయందు భేదమున్నందున వీటి మద్య ప్రాస పొసగదు ర (రేఫ) వత్తుకు క్రావడి అనే పేరున్నది,ఇది ప్రాసగానున్నచో దాని ముందక్షరం గురువై ఉండ వలెను.
ఈక్రారపలుకునకు మొద
లై క్రాలుచుఁదేలి ప్రాసమగుఁదనతనకే
శ్రీ క్రొమ్ముడి సౌందర్యము
వాక్రువ్హందరమె యురగ వరునకునైనన్
రేఫతో కూడిన క ప్రాసాక్షరం గావాడబడింది ఎక్కడ కృ తీసుకొనలేదు,,,ప్రాసకుముందన్ని గురువులే వాడబడినవి
7.లఘుద్విత్వ ప్రాసము,,,,,,
అద్రుచు,,,కద్రువ ,,, విద్రుచు ఇలాంటి పదాలలో ఉన్న రేఫ తేల్చి పలకబడుతుంది ప్రాసాక్షరముగా ఇలా రేఫతో కూడి ఉన్న అక్షరం వాడితే అది లఘుద్విత్వ ప్రాస అవుతుంది
""విద్రుచె వినతాత్మజుడు దిక్కులద్రువననగ ""
పైన ద్రు అనే ప్రాసాక్షరం ద్రు అనే ప్రాసయతిగా వాడ బడినది,
పూర్వ హ్రస్వాన్ని గురువుగా మార్చలేని తేలికగా పలకబడే ద్విత్వాక్షరం ఇది. సంయుక్తాక్షరములకు ద్విక్త్వాక్షరములకు ముందున్న అక్షరాలు గురువులు అని మనం నేర్చుకున్నాము. కాని ఇక్కడ కాలేదు కారణం తేలికగా పలకబడటం. ఇది గమనించినచో మనకు లఘుద్విత్వ ప్రాసము అర్ధం అవుతుంది,
8.వికల్పప్రాసము,,,,,,
క చ ట త ప అనే అయిదు అక్షరాలకు అనునాసికాక్షారాలు పరమైతే ఒక్కొసారి పంచమాక్షారాలు (ఙా ఞ ణ న మ) ఒక్కోసారితృతీయాక్షరాలు (గ జ డ ద బ) ఆదేశంగా వస్తాయి. అలా ఆదేశంగా వచ్చిన అనునాసికాక్షారాలు వర్గ తృతీయాక్షరాలు పరస్పరం ప్రాసచెల్లటమే వికల్ప ప్రాసము.,
పద్మాసమానమగు మన
పద్మావతిఁజూచి ధరణి పాల సుతుండు
ద్యన్మోదంబునఁదనముఖ
పద్మము నలరించెననుచుఁబరిజనులలరన్
పై ఉదా హరణలో,,1..2..4..పాదాలు ద్మ అనే ప్రాసతోను,,,3 వ పాదము అనునాసికం ఆదేశముగా వచ్చిన న్మ అనే అక్షరం తో ప్రాస వేయ బడినది
(ఉద్యత్+మోదము=ఉద్యన్మోదము) వికల్పప్రాసము
9..ఉభయ ప్రాసము,,,,
స కార న కారాలు సంస్కృత వ్యాకరణ సూత్రములచే ష కార ణ కారములుగా మారుచున్నవి అలా మారిన ష కార ణ కారములు సహజ స కార న కారములతో ప్రాసచెల్లటం ఉభయ ప్రాస మైనది.,,,
విసరాంబుజ మిత్రునకు
న్విషమ శిలీముఖ సహస్ర నిభాగాత్రునికిన్
పైన విస లోని సహజ స కు
న్విష లోని ఆదేశ ష కు ప్రాస కుదిరి ఉభయ ప్రాసమైనది.
వినుమతి గుహ్యమునారా
యణ కవచము భక్త వాంచితార్ధ ప్రదమున్
(నార+అయన=నారాయణ)
పైన సహజ న కారం ఆదేశ ణ కారముతో ప్రాస చెల్లినది. ఈతీరుగ ఉభయ ప్రాసము లైనవి.,,
10..అను నాసిక ప్రాసము
ద్విత్వా లైన న కార మ కారాలు(న్న,,,మ్మ)క్రమముగా పూర్ణబిందు పూర్వకాలైన న కార మ కారాలతో (ంన.,,,,ంమ) ప్రాస కుదరటం అనునాసిక ప్రాసము.
ద్విత్వ నకారమునకుదాహరణ.,,,
కం//
కన్నీరు గార్చయరి పం
తం నాపడు యుద్ధమందు దలపడు దయనే
తిన్నగ యుద్ధము జరిపం
తంనెరపంగ వలయునుగ ధక్షత తోడన్
పై ఉదాహరణలో ద్విత్వ నకారమైన న్నీ...న్న ల తో,,పూర్ణ బిందు పూర్వకమైన న కారం " ంనా,,,ంనె" లతో ప్రాస కుదిరి అనునాసిక ప్రాసమైనది.,
ద్విత్వ మ కారమునకుదాహరణ
కం.
కమ్మగ ఛందము నేర్చి మ
నం మిక్కిలి సంతసంబున నలువ రాణిన్
నెమ్మికతో గొలువక్షర
పుం మాలలు పద్యరూపము నొసగరె కవుల్
పై ఉదాహరణలో ద్విత్వ మ కారమైన " మ్మ...మ్మి" ల తో,,పూర్ణ బిందు పూర్వకమైన మ కారం "ంమి..,,,ంమా" లతో ప్రాస కుదిరి అనునాసిక ప్రాసమైనది.,
11.ప్రాస మైత్రి ప్రాసము.,,,
పూర్ణ బిందు పూర్వకాలైన బ కారమునకు(ంబ) ద్విత్వ మ కారముతో ప్రాస చెల్లటమే ప్రాసమైత్రి ప్రాసము.,,,
కమ్మనైనది ఛందము యంబుజాక్షి
డంబమేమాత్ర మెరుగని దమ్మ చూడ
నమ్మి వ్రాయుము పద్యము నంబ నీవు
కంబమైనీవు జగమున పెమ్మి గొనుము
పైన చూచినచో ద్విత్వ మ కారము "మ్మ....మ్మి " లకు పూర్ణబిందు బ కారము " ంబ" నకు ప్రాస ప్రాసయతి కూడ వేయ బడినది,
12...ప్రాసవైరము,,,,,
ప్రాస కుదరని వాటికి ప్రాసవేయడం ప్రాసవైరము,,,ర అనగా సాదురేఫకు ఱ అనగా శకట రేఫకు ప్రాస వేయరాదు,,
రేఫకు,,,,రేఫ తోను శకట రేఫకు శకట రేఫతో మాత్రమే ప్రాస వేయ వలెను,,,,
13 స్వవర్గజ ప్రాస.....
"థ-ధ " లకు "ద-ధ " లకు"ట-డ" లకు ప్రాస వేయుటను స్వవర్గజ ప్రాస అందురు.
థ,,,ధ,,,లకుదాహరణ
గంధవాహ సుతుడు గవయుగ
మంథరగతి నెవ్వ్వడాగు మనయోదులలోన్.,
పైన థ.,,ధ.,,లకు ప్రాస కుదిరినది,,
ఎండకు వానకోర్చి తన యిల్లు ప్రవాసపు జోటునాకయా
కొంటి నలంగి తిన్న దురకుందఱి దప్పెను దప్పిపుట్టెనో
ండ కు ంట కు ప్రాస చెల్లినది.,,
14.ఋప్రాసము
ఋ అనే అక్షరం రేఫతో (ర తో) ప్రాస కుదరటమే ఋప్రాసము,,,,
యణాదేశ సంధిలో ఋ అనే అక్షారము ర గా మారుతుంది,,, అలా.,ర.,,కు,,,,ఋ,,,కు ప్రాసపొసుగుటనే ఋప్రాసము అందురు.,
ఉదాహరణకు ,,,.,,
గారాబుసొగబుల యువతి
నారాధించి,తరియించఁగారాజెలమిన్
యారాణినిఁబెండ్లాడియు
తా ఋషి ధర్మంబుతోడ తరుణింగూడెన్.
పై ఉదా హరణలో 1 2 3 పాదాలలో రేఫ యు.,,4 వ పాదములో ఋ కారము ప్రాసాక్షారము గా వాడబడి ఋ ప్రాసమునకుదాహరణ అయినది.,,
15..లఘుయకార ప్రాసము
సహజమైన యకారానికి అలఘు య కారమని, సంధి జరిగిన చోట వచ్చిన య కారాన్ని.లఘు య కారమని అందురు. ఈ అలఘు లఘు యకారాలతో ప్రాస కూర్చటమే లఘుయకార ప్రాసము
నాయన వద్దనో పిలచి నాయనురాగసుధాబ్ధి పొంగరా
ణీయితనిన్వరింపనుచు నెమ్మిని రాజుకు నిచ్చి పంపునో
మొదటి పాదములోని య సహజ సిద్ద అలఘు యకారము
రెండవ పాదములో రాణీ+ఇతనిన్**రాణీయితనిన్ యడాగమముగా వచ్చిన లఘు య కారము ఈ రెంటికి ప్రాస కుదిరి లఘుయకార ప్రాసమైనది.
16..అభేదప్రాసము,,,,,,
ల ళ డ,,,,,, లుమూడును భేదము లేనివని చెప్పబడినది ( ల డయోరబేదహాః ) యతి మైత్రినందుకూడ చెప్పు కున్నాము. అలాగే ప్రాస మైత్రినందుకూడ ల ళ డ అనే ఈ మూడు అక్షరములకు ప్రాస మైత్రి కలదు కావున ఇది అభేద ప్రాసము అయినది.
ఏలమని రాజు తననిక నేల మనుచు
వేడె రాణిని మనసార వేడ్కతోడ
బాలచంద్రు వరించు మాంచాల రీతి
కోడె రాజును వరియించెఁగూర్మిరాణి
ల,,,,డ.,,,,అనే అక్షరాల మద్య ప్రాస పాటింపబడి ఇది అభేద ప్రాసమైనది,,,,,,
కొడుకులు దానును గుఱ్ఱపు
దళములు కరిఘటలు భటరధవ్రా తములున్
డ.,,ళ కు ప్రాస పాటించ బడినది.,,
17.. సంధిగతప్రాసము.,,,,,
సంధి జరిగే సమయంలో ఉన్న హల్లుకు బదులుగా వేరొక హల్లు ఆదేశంగా వస్తే., ఆదేశంగా వచ్చిన హల్లుకు సహజమైన హల్లుతో ప్రాస కుదరటం సంధిగతప్రాసము అగును.,,,
దివిజులాశ్చర్యమంద శౌరివడవైచె
జెంగి పోనీకమధురలో నంగరినన
పై ఉదా హరణందు,,మొదటి పాదము లోని "దివి" అనెడి దానిలోని వకార ప్రాసాక్షరానికి ప్రాసయతి స్థానములోని(శౌరి+పడ**శౌరివడ,,గ స డ ద వాదేశ సంధి ("వైరి+పడ=వైరివడ)...ప స్థానములో వచ్చిన వ తో ప్రాస యతి చెల్లినది. ఇలా ప్రాస ఏర్పడటానినే సంధి గత ప్రాసమమనందురు.
అయితే,,,ఈ 17 రకాలైన ప్రాస భేదాలే కాకుండా,,,,శబ్దాలంకార ప్రాసములు అని మరికొన్ని అప్పకవి చే చెప్ప బడినవి, అవి శబ్దాలంకార ప్రాసములు. సాధారణముగా ప్రతి పద్య పాదములోని రెండవ అక్షాన్ని ప్రాస అంటారని మనల్ని నిద్ర లేపడిగినా చెబుతాము. కాని ప్రతి పాదములోని రెండవ అక్షరమే కాకుండా 3......4......5.....అక్షారాలను కూడ నాలుగు పాదాలలోను సమంగా నిలుపు కుంటూ వ్రాసే విధానానినే అప్పకవి శబ్దాలంకార ప్రాసములు అని నామ కరణం చేసినారు. ఇది అప్పకవి చే చెప్పబడిన క్రొత్తకళ.
ఈ శబ్దాలంకార ప్రాసములు 7 రకములు
1..సుకర ప్రాసము,,,
2.,దుష్కర ప్రాసము
3..ద్వంద్వప్రాసము
4..త్ర్యక్షరప్రాసము
5..చతుష్ప్రాసము
6..అంత్యప్రాసము
7..అను ప్రాసము...
1.సుకర ప్రాసము.,,,,,
ఏ మాత్రము కష్టము లేకుండా ప్రాసాక్షరమును కూర్చు కోవటము సుకర ప్రాసము, తేలిక ప్రాసగా భావించ తగును
రాణీ నినుగని వినుమని
వాణీ విలసితమని నవ వాఙ్మణి మయమౌ
బాణీలుగట్టి కృతిపా
రాణీలనుఁబెట్టి రాజు రసమయ సతికిన్
పైన ణ కారముతో చాల సునాయాసనముగా ప్రాస కూర్చ బడినది కావున ఇది సుకర ప్రాస అయినది.
2.దుష్కరప్రాసము..,
సుకరముగా కాకుండా,,,,విసర్గ పూర్వకంగా కాని సంయుక్తాక్షరాలు లేదా ద్విత్వాక్షరాలు గాని ప్రయత్నముగా వాడి ప్రాస కూర్చుకొనుటను దుష్కర ప్రాస అందురు...
ఏక్షణమైనను నిన్ర్బ
త్యక్షం బుగజూడకున్న యమితనిరాశన్
జక్షూ దరిద్రతను రా
జాక్షణమున మునుగు. దుఃఖ శరధిని రాణీ
పై ఉదాహరణలో క ష ల సంయోగాక్షరము సాఫీగా సాగేది కాదు..,దుష్కర మైనది.అందువలన ఇది దుష్కరప్రాసమునకు ఉదాహరణ అయినది.,
3..ద్వంద్వప్రాసము,,,,,,
ప్రతిపాదములోని రెండవ అక్షరం ప్రాసాక్షరం కదా దానితో పాటుగా 3 వ అక్షరాల్ని కూడ ఒకటిగా వేయటం ద్వంద్వ ప్రాసమనబడును,,,
ఉదాహరణకు
కంజనయన భవభీతి వి
భంజన శుకశౌనకాది బహుముని చేతో
రంజన ద్వంద్వప్రాసము
నంజన నిప్పాటఁబల్కినం గృతులందున్
పై ఉదాహరణలో "జన" అనే రెండక్షరాలు ప్రతి పాదములోను 2....3...అక్షరాలగా వాడబడి ద్వంద్వ ప్రాసమునకుదాహరణ మైనది.
4.త్ర్యక్షరప్రాసము,,,,,
అటులనే ప్రతి పాదమునందు 2.....3....4...స్థానములలోని అక్షరాలు ఒకేరీతిగా వాడిన యెడల అది త్ర్యక్షర ప్రాసము అగును
ఉదా//
రాణిని గనినారటే రే
రాణి నిగనిగలు గలట్టి రమణీమణి యా
రాణిని గనినట్టి కనులు
వాణిని గన్నట్టి కనులు వాక్రువ్వంగన్
పై ఉదాహరణ చూచినచో.,,,,," ణీ న గ " అనే మూడక్షరాలు ప్రతి పాదములోను,,,2....3....4..స్థానాలలో వ్రాయబడి త్ర్యక్షర ప్రాసమునకు ఉదాహరణ అయినది.,
5..చతుష్ప్రాసము,,,,
పద్యము నందుగల నాలుగు పాదాలలోను ,,2...3...4...5...స్థానాలలో గల అక్షరాలు ఒకే రీతిగా వ్రాయబడటం చతుష్ప్రాసము అగును.
ఉదా;
వారణ వరద నిశాట వి
దారణ వీరావతార ధరణీవలయో
ద్దారణ విరచిత సత్యవ
ధూరణ విజయయనఁదగి చతుష్ప్రాసమగున్,
(అనంతుడు ఛందోదర్పణము)
పై ఉదాహరణ గమనించినజో, మొదటి మూడు పాదములలో,,2 3 4 5 స్థానములలో గల అక్షారాలు గమనించినచో ,,,"రణవర,,,,రణవీర,,,రణవిర,,,,అనే అక్షరాలు వాడ బడి చతుష్ప్రాసము నకు ఉదా హరణమైనది.
6..అంత్యప్రాసము,,,,
పద్యములోని అన్నిపాదాలు,,,,2 వ అక్షారం ప్రాసాక్షరం అని తెలుసు మనకు,,,,అది కూర్చుకుంటూ,,,4 పాదాల చివరన కూడ ఒకే అక్షరాల్ని వాడటం అంత్య ప్రాస అవుతుంది.
ఉదా;
నందాంగనాకుమారా!
మందరగిరిధీర దనుజమదన సంహారా
బృందా గహన విహారా!
కందర్పాకార రాధికా శ్రీ జారా
పై ఉదాహరణ లో గమనించినచో,,మారా,,,,హారా...హారా,,,జారా.,,అనే అక్షరాలు వాడబడినాయి,,,,రా,,,అనే అక్షరం చివర వాడబడినది అలాగే దాని పూర్వాక్షరాలన్నీ గురువులే అయినాయి.,,గమనించగలరు.,
దినికి గల నియమాలు:-
1.అత్యప్రాస పూర్వాక్షరం అన్నింట గురువు గాని,,,లఘువు గాని ఏదో ఒకటే అయి ఉండాలి.
2...అత్యప్రాసకు పూర్వాక్షరం గురువు అయితే ఒక అక్షరానికి లఘువు అయితే రెండక్షరాలకు స్వర భేదము లేకుండా ఉండాలి.
7...అనుప్రాసము
ప్రాసాక్షరం అయిన పాదములోని రెండవ అక్షరం పద్యములో పదేపదే అనేక పర్యాయములు వచ్చినచో అది అనుప్రాసము అగును.
ఉదాహరణకు
విప్రప్రకరముని ప్రీ
తిప్రద సుప్రభవ యప్రతిమధోః ప్రభవా
విప్రనుత సుప్రసన్నయ
నుప్రాస ప్రణ మిదిమను ప్రియ చరాతా !
(ఛందోదర్పణము అనంతామాత్యుడు)
పై ఉదాహరణ గమనించినచో ,,, ప్ర,,,,అనే ప్రాసాక్షరం పద్యం మొత్తములో 12 సార్లు వాడబడినది,,
ఈ విదముగా ప్రాసాక్షరం పద్యములో అనేక పర్యాయములు వాడ బడుటను అను ప్రాసము అందురు దీనినే "వృత్యనుప్రాస శబ్దాలంకారము" గా కూడ గుర్తించినారు.
ఇంత వరకు మనము పద్య రచన చేయటానికి అవసరమైన అన్ని విషయాలు,,,అనగా గురు లఘువుల నిర్ణయం, గణాలు, గణ విభజన, అందలిరకాలు, యతులు యతిభేదాలు, ప్రాసయతి, ప్రాస, ప్రాసభేదాలు తెలుసుకున్నాం, ఇదంతా ముడిసరుకైతే ఇప్పుడు మనం ఈ ముడిసరుకుతో అద్భుతమైన రూపం తయారు చేయాలి అంటే పద్యాలు వ్రాయాలి అవి వ్రాయటం ఎలా? పద్యాలందలి బేధాలు ఎలా ఉంటాయి? ఏపద్యరచనకు ఏఏ గణాలు వాడాలి ఏ పద్యమునకు యతి స్థానమేమిటి అనేది తరువాత పాఠాలలో తెలుసు కుందాము.
గణ యతుల సక్షిప్త సమాచారము
పద్య రచనలోకి అడుగిడ బోయే ముందు గణములు మరియు యతుల సంక్షిప్త సమాచారము ఒకసారి మననం చేసుకుందాము.
మీరందరు తేలికగా గుర్తుంచు కొనే విదముగా,,,ముఖ్యమైన గణముల సమాచారం పొందు పరచాను చూడండి.
1..ఏకాక్షర గణములు (పదములు).....2.
a) గురువు,,,U---శ్రీ
b) లఘువు . I---పొ
2..ద్వియక్షర గణాలు(పదములు).,,,,,,,4
a)-గల(హగణం)1గురువు 1లఘువు ,,,,,,U I.,రామ
b)-లగ(వగణం)1లఘువు 1గురువు,,,,,,,,,I U..రమా
c)-గగ (గా) రెండు గురువులు ,,,.........,,,U U,,రామా
d)-లల (లా) రెండు లఘువులు.,,,,,,,,,,,,,,,,I I .,రమ
3-త్ర్యక్షర (మూడు అక్షరముల)గణములు,8..(భ జ స మ య ర త న)
A.గురువు ప్రధానముగా ఏర్పడే 4 గణములు (భ జ స మ)
a).భ గణము,,ఆది గురువు....,U I I,,,రాముడు
b).జ గణము,,మద్య గురువు,.,I U I,,మురారి
c).స గణము,,అంత్య గురువు,,I I U,,శివుడా
d).మ గణము,,అన్నీ గురువులు..UUU..రారాజా
B.లఘువు ప్రధానముగా ఏర్పడే 4 గణములు.(య ర త న)
e).య గణము ఆది లఘువు ,,I U U, సితారా
f).ర గణము,,మద్య లఘువు,. U I U,, మాధవా
g).త గణము,,అంత్య లఘువు. ,U U I, కోనేరు
h).న గణము,,అన్నీ లఘువులు..I I I,, విమల
(భ జ స మ-య ర త న,,,ఇలా గుర్తుంచు కోవచ్చు)
వీటికి "గణాష్టకము" అని పేరు. ముఖ్యంగా గుర్తుంచు కోవలసిన విషయం ఏవరుసలో చెబితే అదేవరుస వ్రాయాలి పలకాలి వరుస తప్పకూడదు, ఒక గురువు రెండు లఘువులు అన్నారనుకుందాము అప్పుడు U I I ఇలానే వ్రాయాలి గుర్తించాలి, I U I ఇలా వ్రాయ రాదు గుర్తించ రాదు, ఇది తప్పు రావలసిన గణం రాదు వేరొక గణం వస్తుంది.
4.చతురక్షర గణాలు.4 అక్షరాల గణాలు ,,,,16
వీటిలో 3 మాత్రమే ప్రధానమైనవి మిగిలినవి ఊహాత్మకాలు.,
a)నల.,.నగణము+లఘువు ,,I I I I.,.తిరుపతి
b)నగ.,,నగణము+గురువు,,,,I I I U.,,నరవరా
c)సల,.,సగణము+గురువు.,,,I I U I..సురరాజు
5..సూర్య గణములు .,.,,రెండు
a) గల.,U I.,రామ(హగణం అన్నా ఇదే)
b) నగణం,,,,I I I.,,,(శివుడు)
6-ఇంద్ర గణములు.,,,,6
నల,,......,.....,I I I I.., ,మరిమరి
నగ......,,... .,.,I I I U... భరతుడా
సల.,......,.,,,.,I I U I...సురరాజు
భ,,,భ గణం,,,,U I I....నారద
ర,,ర గణం,,,,,,U I U...పార్వతీ
త..త గణం.,,,,U U I,..రారాజు
(ఈ ఆరును ఇంద్ర గణములు )
కం//
"నల నగ సల భ ర త లునా
నెలమిని నీయారు గణంబు లింద్ర గణంబుల్!
గల నగణము లీరెండును
జలజాప్త గణంబులయ్యె జగదాధారా! " (జలజాప్తుడనగా సూర్యుడు)
పద్య రచన గురించి పద్యాల రకాలను గురించి తెలుసుకోవటానిముందు ఉపయుక్తముగా ఉంటుందని ఓసారి మననం చేసు కున్నాము కాని ఇంతకు పూర్వమే కూలంకషంగా,,ఈ గణాలు ఏర్పడే విధానము గురించి మనం చర్చించుట జరిగినది.
అలాగే యతులను గురించి కూడ సంక్షిప్తముగా తెలుసుకొని పద్య రచనలోకి అడుగిడదాము.
కం//
భీమన పది చెప్పె ననం
తా మాత్యుడుచేసె వెనుక యతులిరువది నా
ల్గా మీదఁ గొందఱు కవి
గ్రామణు లిరువదియు నేడు గావించి రొకన్ (అప్పకవి అప్పకవీయం)
పద్యానికి యతి, ప్రాస, హృద్యం, ప్రాణం, అందం ఇవి ఏదోవిధంగా పెట్టడం కాదు. సరిగా ఉండాలి. తిక్కన సోమయాజి తన నిర్వచనోత్తర రామాయణం లో (1-7)... యతి ప్రాసల గురించి ఇలా చెప్పాడు.
కం//
తెలుగు కవిత్వము చెప్పం
దలచిన కవి యర్ధమునకు దగియుండెడు మా
టలు గొని వళులం బ్రాసం
బులు నిలుపక యొగిని బులిమి పుచ్చుట చదురే!
తిక్కన ఎంత చక్కగా చెప్పడో చూడండి. .
పులమొద్దు అంటున్నాడు. కనుక యతి ప్రాసలు ఏవో వేసేసి పద్యాన్ని లాగించెయ్యడం సరి కాదు. అర్ధవంతంగా ఉండాలి. అలాగే వేరొక చోట
"ప్రాసము ప్రకారం వేరగు నక్షరంబులన్ శృత్య రూప మంచు నిడ"
అన్నాడుదాని అర్ధం ఏమిటంటె.. బండి "ఱ" మామూలు "ర" పలకడానికి వొకే విధంగా ఉన్నయి కదా అని ప్రాస లో వాడడం సరి కాదు అని సున్నితం గా ప్రభోదించాడు. అలాగే పెద్దలు వాడారు కదా అని మనం వాడడం కూడ సబబు కాదు అని పరవస్తు చిన్నయ సూరి గారిలాఅంటున్నారు.
"ఆర్య వ్యవహారంబులు దౌష్త్యంబులు గ్రాహ్యంబునగు" అన్నాడు.
క గుణింతం తీసుకుంటే....( యతి మైత్రి )
క, కా, కై, కౌ ల మధ్యన యతి మైత్రి ఉంది.(అ..ఆ.,,ఐ..,ఔ)
కి, కీ, కె, కే కృ కౄ ల మధ్యనా.మైత్రి చెల్లును..(ఇ,,,ఈ..ఎ.,ఏ..ఋ..ౠ)
కు, కూ, కొ, కో. ల మధ్యనా మైత్రి చెల్లును.(ఉ..,ఊ...ఒ...ఓ)
(ఇదే రీతిగా మిగిలిన అన్ని హల్లులకు యతి మైత్రి చెల్లును)
యతి మైత్రిచెల్లునట్టి అచ్చుల, హల్లుల బృందములను గమనించండి.
యతిమైత్రి చెల్లునట్టి అచ్చుల బృందములు
1. అ, ఆ, ఐ, ఔ, (ఒక బృందము)
2.ఇ, ఈ, ఎ, ఏ, ఋ, ౠ (ఒక బృందము)
3. ఉ, ఊ, ఒ, ఓ... (ఒక బృందము)
ఏ బృందమునకాబృందములోని అక్షరముల నడుమ మాత్రమే యతి చెల్లును. ఈ అచ్చులు హల్లులతో కలపి వ్రాసినప్పుడుకూడా ఇదే క్రమములో మిత్రత్వము కలిగి ఉంటాయి)
యతిమైత్రి చెల్లునట్టి హల్లుల బృందములు
4. క, ఖ, గ, ఘ (ఒక బృందము)
5.చ,ఛ,జ,ఝ,శ, ష, స. (ఒక బృందము)
6. ట, ఠ, డ ,ఢ (ఒక బృందము)
7, ప, ఫ,బ, భ, వ. (ఒక బృందము)
8.త, థ, ద, ధ (ఒక బృందము)
9-న,,,ణ. (ఒక బృందము)
10, ల, డ .,, ల..ళ .. (ఒక బృందము)
11.అ య హ .. (ఒక బృందము)
ఏబృందమున కాబృందములోని అక్షరముల నడుమ మాత్రమే యతి చెల్లును.
ఏబృందమున కాబృందములో ఉన్న ఈ హల్లులకు పైన చెప్పబడిన ఏబృందమున కాబృందములో ఉన్న అచ్చులను కలుపుకుంటూ యతిమైత్రిని వేయవలసి ఉంటుంది. అనగా హల్లుల మిత్రత్వముతో పాటు అచ్చుల మిత్రత్వమును కూడా పరిగణనలోనికి తీసుకొని యతిమైత్రి చెల్లించవలెను. పైన ఉదహరించినవి కొన్ని ప్రధానమైన,సరళమైన యతి మైత్రి చెల్లించదగు అక్షరములు
పద్యరచన దశదోషములు
ఏ పద్యములు ఎలా వ్రాయాలో తెలుసుకోవడానికి ముందు పద్య రచన చేసేసమయంలో చేయకూడని పది దోషములు తెలుసుకుందాము. పద్య రచన యందు సహజముగా వచ్చు దోషాలు 10 గుర్తించారు మన పూర్వులు. అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి.
1--గణ భంగము:
గురువు వ్రాయ వలసిన స్థానంలో లఘువు వ్రాసినా.. లఘువు బదులు గురువు వ్రాసినా ఈ గణ భంగమనే దోషం వస్తుంది.
2--యతి భంగము:
యతి స్థానము నందు యతి మైత్రికి సరిపోయే అక్షరం లేకపొయినా..యతికి యతిమైత్రి సరిపోక పోయిన..యతి స్థానం మారినా.... అది యతి భంగముగా గుర్తించ వలెను.
3--సంశయము:
పద్య పాదాలలో అర్ధం సరిగ్గా చెప్పలేకపొయినా.. అర్ధం లో సంశయమున్నా.. సంశయ దోషము అంటారు
4--విసంధి:
సంధి చేయవలసిన చోట.. సంధి చేయకపోతే అది విసంధి దోషము అవుతుంది..తప్పనిసరిగా సంధి చేయవలెను. పద్యరచనలో ఇది అవశ్యము.
( సందర్భాను సారముగా ఇక్కడ మనమో విషయం చర్చించు కుందాము సహజంగా పద్యపాదముల నడుమ అచ్చులు వ్రాయకూడదు అంటారు. ఇదే కారణము...సంధి చేయవలసిన చోట తప్పనిసరిగా సంధి చేయాలి..సంధి పొసగని యెడల యడాగమ సంధినైనా చేయవలెను. కావున పద్యరచనకు సంధుల పరిచ్ఛేదనములో కూడా కొంతమేరకైనా అవగాహన కలిగి ఉండాలి. ఉత్వ సంధి వంటి నిత్య సంధిని అసలు విస్మరించ రాదు)
5--పునరుక్తము:
ఒక శబ్ధాన్ని మరల మరల ప్రయోగించడం, ఒకే అర్ధం వచ్చే విధముగా ప్రయోగించకూడదు.
6--అపశబ్దము:
వ్యాకరణంతో సంబంధము లేకుండా...కుసంధులు, దుస్సంధి వైరి సమాసాలు ఉపయోగించరాదు.
7. వ్యర్ధము:
అనుగుణముగా లేని కూడని మాటలు వాడిన.. "వ్యర్ధము" అనే దోషము కలుగుతుంది
8-- అపక్రమము:
వరుస తప్పడమే అపక్రమము.
ఉదా: బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు.. అంటూ.. లక్ష్మీ దేవి, సరస్వతీ దేవి, పార్వతీ దేవి అన రాదు...సరస్వతీ దేవి, లక్ష్మీ దేవి, పార్వతీ దేవి అని అనాలి.
9-- అపార్ధము:
సరి అయిన అర్ధము లేకుండా.. ప్రాస కోసమో.. యతి కోసమో శూన్య పదాలు వాడ రాదు వాడిన ఎడల అపార్ధ దోషమంటారు.
10. విరోధము: .
ప్రకృతి విరుద్ధంగా వర్ణించ రాదు, భౌగోళికాంశములకు విరుద్ధంగా రచనలు చేయరాదు.
ఉదా:
ఆ.వె
అమిత భక్తితోడ యానందముప్పొంగ
విప్రుడొకండు జేరి విజయవాడ
గౌతమందు మునిగి కనకదుర్గఁ గొలిచి
సేదదీరెనతడు చెట్టుక్రింద
"భక్తి విశ్వాసములు మెండుగాగల ఒక బ్రాహ్మణుడు విజయవాడ చేరి కనక దుర్గమ్మ పాదాల చెంత గౌతమీ నదిలో స్నానమాచరించి కనకదుర్గతల్లి దర్శనం చేసుకున్న పిదప చెట్టుక్రింద సేద తీరినాడని కదా ఈ పద్యభావము " కాని అక్కడ విజయవాడలో కనకదుర్గమ్మ తల్లి పాదాలచెంత ప్రవహించేది కృష్ణమ్మ తల్లి కదా కావున పై పద్యము ప్రకృతి విరుద్ధంగా ఉందని తెలుసుకోవాలి.
నిషిద్ధ గణము వాడుట: కంద పద్యం లో.. జ గణం బేసి గణము గా వాడ రాదు కదా..... 6 వగణము తప్పనిసరిగా జ గణము,,లేదా నల గణము వ్రాయలికదా, ఆవిధంగా వాడకుంటే అది నిషిద్ద గణం అవుతుంది.
పదచ్చేద భంగము: ద్విపద, మంజరీ ద్విపద లలో ఏ పాదమునకు ఆపాదము విడి విడివిడిగా వ్రాయలి రెండు పాదములు కలుప రాదు
కొన్ని ముఖ్య మైన పద్యాలను,,,వాటి నియమాలను చూద్దాము
పద్యాలు.,,,,వివరణ.........రకములు
పద్యాలు మన పెద్దలు 3విధాలుగా చెప్పారు.
1వృత్తములు ----అంటే చంపకమాల, ఉత్పలమాల, శార్దూలము, మత్తేభము, మత్తకోకిల మొదలైనవి.
2- జాతులు అంటే కందము, ద్విపద మొదలైనవి.
3- ఉప జాతులు..తేటగీతి, ఆటవెలది, సీసము.మొదలైనవి..,.తరవాత పాఠములో,,,,కొన్ని ముఖ్యమైన పద్యాలు,,,,వాటి గణాలు.,,,,నియమ నిబంధనలను గురించి తెలుసు కుందాము.,,
మీ చందోశాస్త్ర పరిచయానికి మా హృదయపూర్వక దన్యవాదాలు
ReplyDeleteధన్యవాదాలు
ReplyDeleteHai
ReplyDeleteధన్యవాదాలు
ReplyDeleteఅద్భుతమైన వివరణ ఇచ్చారు గురువు గారు
ReplyDelete